Hi
This is Sridevi
ఫ్రెండ్స్...!
టఫ్ టైం వచ్చినప్పుడు
మగవాళ్ళు ఆడవాళ్ళు వేరే వేరేగా ప్రవర్తిస్తుంటారు అనే విషయం మీకు తెలుసా..
టఫ్ టైం వచ్చినప్పుడు మగవాళ్ళేమో కేవ్ బిహేవియర్ ని చూపిస్తారు. ఆడవాళ్ళు టాకింగ్ బిహేవియర్ నుంచి చూపిస్తారు.
అంటే మగవాళ్ళు టఫ్ టైంలో ఒక గుహలో కూర్చున్నట్టు అన్నీ షట్ డౌన్ చేసుకుని, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడుపుతూ ఆలోచిస్తూ ఉంటారు.
అదే ఆడవాళ్ళు టఫ్ టైంలో పదిమందితో మాట్లాడుతూ బాండింగ్ పెంచుకోవాలని చూస్తుంటారు.
అందుకే ఇంట్లో ఏదైనా issue వచ్చినపుడు...ఎందుకు ఈయన నాతో మాట్లాడడు అని ఆమె..
ఎందుకు ఈమె నన్ను వొంటరిగా వదిలేయకుండా సతాయిస్తుంది అని అతడూ అనుకోవడం చూస్తుంటాం కదూ!!
హహహ. ఇదే విషయం మీద గొడవలు కూడా ఐపోతుంటాయి.
కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే...ఇది men and women తత్త్వం లోనే తేడా ఉంటుందని.
Men సైలెంట్ గా ఉండటం avoid చేయడం కాదు. స్ట్రాటజీ. తన కష్టం నుండి అధిగమించేందుకు ఒక స్ట్రాటజీ.
Women మాట్లాడటం, అర్థం చేసుకోక విసిగించడం కాదు. పంచుకోవడం..తద్వారా ఏర్పడే బంధం వలన వచ్చే సెక్యూర్ ఫీలింగ్.
చూశారా ఇద్దరూ ఒకే పని చేస్తున్నారు. ఆ కష్టం నుండి బయటపడే ప్రయత్నం. దారులు వేరు అంతే. ఇది అర్థం చేసుకుంటే...అసలు గొడవలెందుకొస్తాయి???
కదూ!!
No comments:
Post a Comment