స్వేచ్ఛా గాలులు రాళ్ళని విసిరిన సమయంలో..
.....................................................
"దేవదారు వృక్షాల దేహ దారుఢ్యమూ
గుల్ మొహర్ కుసుమాల కోమలత్వమూ
మంచు వలె కరిగే మనసూ
సెలయేరులా ప్రవహించే జీవితేచ్ఛ" , ఎవరికి ఉంటాయి?.
ఎవరైతే ఇలాంటి వాతావరణంలో జీవిస్తుంటారో వారికి ఉంటాయి. పరిసరాలు మనుషులను ప్రభావితం చేస్తాయి కదా. ఇలాంటి జీవితం ఉన్నవారు కాశ్మీరీ ప్రజలు. అక్కడి వాతావరణం లానే అక్కడి సంస్కృతి కూడా విభిన్నమైనది. 'పాన్ ఇస్లామిక్' సంస్థల ప్రాపంచిక దృక్పథం కూడా అక్కడి ముస్లింలను ప్రభావితం చేయలేనంతగా ఆ సంస్కృతి కాశ్మీరీ జాతీయతను అభిమానించింది. రెండు శతృ దేశాల మధ్యన పడి నలిగి పోయిన ఈ భూతల స్వర్గ సీమ స్వేచ్ఛా వాయువులను పీల్చాలని తపిస్తోంది. 1990 నుంచి ఈ స్వేచ్ఛా కాంక్ష స్వతంత్ర, ప్రజాతంత్ర కాశ్మీర్ కావాలని కోరుకుంది. భారతదేశం నుంచి విముక్తిని కోరుకుంది. విలక్షణమైన తన సంస్కృతిని నిలబెట్టుకోవాలనుకుంది. అందుకే 'కాశ్మీర్ జాతీయతా వాదం' పుట్టుకొచ్చింది. విప్లవం పిడికిలిని ఊహిస్తుంది. పిడికిలి మూసే ఉంటుంది. ఆ మూతలో ఎవరి స్వార్థాలు వారివి ఉంటాయి. కాశ్మీరీ ఆజాదీ గ్రూపులలో స్థానికులకంటే మత రాజకీయ శక్తులు, పాకిస్థానీ అఫ్ఘనిస్థానీ శక్తులు వచ్చి చేరాయి. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఇ తొబియా వంటి వారి చేతుల్లోకి స్వచ్ఛమైన వేర్పాటు వాద విప్లవం చేతులు మారింది. మతరాజకీయ రంగు పులుముకున్న ఈ మిలిటెంట్లలో స్థానిక యువకులు కేవలం ముప్పై శాతం మాత్రమే అని ఒమర్ అబ్దుల్లా ప్రకటన. ఇలాంటి సందర్భంలో కాశ్మీరీ పండిట్లను ఊచకోతలు కోసింది, కాశ్మీరీ అమాయకులయిన ముస్లిం యువకులను తీవ్రవాదులని ముద్ర వేసి చంపి వేసింది ఎవరు? అంటే చెప్పటం ఎంత సులభమో..ఈ మొత్తం వ్యవహారంలో అటు పండిత్ లయినా ఇటు ముస్లిం యువకులయినా, మొత్తానికి బలయింది గుల్ మొహర్ కుసుమాలు, కాశ్మీరీలు, అని మనం గ్రహించలేక పోవటానికి కారణాలు వెతకటం అంత కష్టం.
2010 లో రెండు సంఘటనలు జరిగాయి, ఒకటి కాశ్మీరు లోయలో, ఒకటి దక్కను పీఠభూమిలో. ఈ రెండు సంఘటనల్లో కామన్ విషయాలు ఎన్నో ఉన్నాయి. రెండిటి లక్ష్యం, ఆజాదీ. కాశ్మీరుకి ఇండియా నుంచి విముక్తి కావాలి. తెలంగాణాకు సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్తి కావాలి. కాశ్మీరుకీ ఇండియాకు చాలా విషయాల్లో పోలికలున్నాయి. కాశ్మీరు ఒక లోయ అయితే, తెలంగాణా ఒక పీఠభూమి. భారత దేశానికి స్వతంత్ర్యం వచ్చే నాటికి ఈ రెండూ కూడా భారత దేశంలో కలవనివి. ముస్లింలు ఎక్కువగా ఉండే కాశ్మీరు రాజు హరి సింగ్ ఒక హిందువు, హిందువులు అధికంగా ఉండే తెలంగాణా రాజు నిజాం ఒక ముస్లిం. కొన్ని షరతుల మీద భారత యూనియన్ లో కలిసిన ఈ రాజ్యాలు మొదటినుంచీ వివక్ష కు గురి అయ్యాయి. పాలకులు ఏ ప్రామిస్ లనీ నెరవేర్చిన పాపాన పోలేదు. అందుకే అవి రెండూ విముక్తినే కోరుకున్నాయి. అయితే కాశ్మీరుకి ఇండియా నుంచి, తెలంగాణాకి ఆంధ్రా వలస పాలకుల నుంచి.
2010 లో జూన్ మాసంలో తీవ్రవాదులనే నెపం తో ముగ్గురు కాశ్మీరీ యువకులను భారత సైన్యం కాల్చి చంపింది. వారంతా అమాయకులయిన స్థానికులని ఆ ప్రజలు తెలుసీకున్న రోజున అగ్రహోదగ్రులయ్యారు. రాళ్ళు చేతిలో పట్టుకున్నారు. ప్రభుత్వ ఆఫీసులను, వాహనాలను ధ్వంసం చేశారు. ఇనుప ముళ్ళ కంచెలను దాటుతూ కర్ఫ్యూలను, సైనికులని ఎదిరిస్తూ రాళ్లనే తమ అస్త్రాలుగా మలచుకొని స్వేచ్ఛా నినాదాన్ని వినిపించారు.' క్విట్ కాశ్మీర్' అన్నారు. కాశ్మీరులో ప్రతి ఏడుగురికీ ఒక సైనికుడు కాపలా ఎందుకని ఆక్రందించాయి. భారత సైనికులు చేసే మానభంగాల చిట్టా విప్పితే ద్రౌపది చీరంత అవుతుంది. శ్రీ కృష్ణుడు ఈ కాలంలో తిరిగి వస్తాడనే నమ్మకం లేదు కనుక అప్రస్తుతం. కానీ, ఈ unrest కి పోలిసులు పేల్చిన రబ్బరు తూ టాలకి ఎందుకనో నూటా పద్నాలుగు ప్రాణాలు గాలిలో కలిసాయి. 'ఎవరనుకున్నారు ఇట్లవునని?' కాళోజి గీతం ప్రతి మదిలో ఘోషించే ఉంటుంది, అక్కడ కాశ్మీరులో ఇక్కడ తెలంగాణాలో. అదే సంవత్సరం మే నెల ఇరవై ఎనిమిదిన మానుకోటలోకి సమైక్య శక్తులు శక్తి వంతంగా తెలంగాణ లోకి చొచ్చుకొని వద్దామనుకున్నాయి. 'కొండ'లు కాస్తా తెలంగాణా యాక్టివిస్ట్ ల మీదికి రాళ్ళను విసరాలని చూసాయి. స్వేచ్ఛను శ్వాసించే యువకులు స్టూడెంట్లూ రాళ్ళ లోకి కూడా స్వేచ్చా వాయువులను ఊదారు. శతృవు పారిపోయేదాకా తరిమారు.
ఈ స్వేచ్ఛా వాయువులని ఆఘ్రాణించి, రుచి చూసే వాడు కవి. వాటిని పది మందికి పంచే వాడు కవి. అలాంటి కవి వరవరరావు. కవి అనేవాడు ఎవడయినా స్వతహాగా విప్లవకారుడే. అయితే ఆ విప్లవం కేవలం వైయుక్తిక చైతన్యమేనా లేక సమాజపు సమిష్టి చైతన్య స్థాయిదా అనేదాన్ని బట్టి, ఆ కవియొక్క స్థాయిని మనం నిర్ణయించవచ్చు. ఇంకొక అడుగు ముందుకేసి విశ్లేషిస్తే , ఈ సామాజిక సమిష్టి చైతన్యం కవిలో, అతడి కవిత్వంలో ఒక కారణానికి కార్య రూపంలో ఉందా లేక ఒక కార్యానికి కారణమవుతుందా అనేదాన్ని బట్టి ఆ కవి ప్రాఫెట్ స్థాయికి ఎదిగాడా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవలసి వుంటుంది. తన చుట్టూ ఉన్న సమాజం కేవలం కారణం మాత్రమే అయి, కవి కవిత్వం దానిని ప్రతిబింబించే, ప్రతిస్పందిచే ఒక ఎఫెక్ట్ గా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం నుంచి బయటపడి, తన కవిత్వమే ఒక కారణమయి, సమాజ పరిస్థితుల్ని దిశా నిర్దేశం చేయగల స్థాయికి ఎవరోగానీ చేరుకోలేరు. ఈ విధంగా వైయుక్తిక చైతన్య స్థాయినుంచి సామాజిక సమిష్టి చైతన్యాన్ని ప్రతిబింబించే స్థాయికి, అటుపై తానే ఆ సామాజిక చైతన్యానికి కారణమయ్యే స్థాయికి ఎదిగే క్రమమే కవి పరిణామం. వరవర రావుగారు ఈ మూడో స్థాయికి చేరుకున్న కవిలా కనిపిస్తారు. కవి అందుకున్న స్థాయికి పాఠకుడు అందుకుని చైతన్యం పొందాడా లేదా అనేది పూర్తిగా వేరే విషయం. ప్రస్తుతానికి దానిని వదిలేద్దాం.
'There are no facts , only Interpretations ' అన్న నీషే కాలం నుంచి వచ్చిన మనం, ఏదీ లాజికల్ గా జరగదని తెలుసుకోలేక పోవటం, ఇంకా గ్రీకు తత్వ వివేచనాలయిన లాజిక్ రీజన్ లకు అనుగుణంగానే చరిత్రను అర్థం చేసుకోవాలనుకోవటం, తెలుగు వారిమంతా ఒక్కటనో..లేక భారత దేశం గొప్పదనో అందుకే కలిసి ఉండాలనే లాజిక్ లకు తలలు బాదుకోవటం విచిత్రం. ఒక ప్రాంత ప్రజల కష్టాలనీ నష్టాలనీ బేరీజు చేసే విషయంలో అక్కడి సంస్కృతూలకూ, నమ్మకాలకూ విలువనివ్వలేని లాజిక్ లు నిలబడలేవు. లాజిక్ లు ఉద్యమాలని నడపవు. స్వేచ్ఛాకాంక్ష భవిష్యత్తుమీద నమ్మకాన్నిస్తుందే కానీ, లాజిక్ ని ఇవ్వదు. రాయి చేతిలోకి తీసుకుని విసిరేవాడిని లాజిక్ నడిపించదు. ఉద్యమం, దాని మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని కలిగించే నాయకత్వం నడిపిస్తాయి. పీడిత ప్రజల ఆకాంక్షలు నడిపిస్తాయి. కాశ్మీరు లోయలో ఒక ఉద్యమం ఉంది. సెపరేట్ కాశ్మీరు అని. దక్కన్ పీఠభూమిలో ఒక ఉద్యమం ఉంది. సెపరేట్ తెలంగాణా అని. ఈ రెండింటికీ మధ్య దూరం ఎంతో ఉన్నా, దాదాపు ఒకటే రకమైన ఉద్యమ భూమిక కలిగున్నాయి. అందుకే ఈ రెంటినీ కలుపుతాడు కవి ఈ కవితలో.
కశ్మీరు లోయ - దక్కన్ పీఠభూమి
----------------------------------------
ఆ లోయ
గాయపడిన హృదయమే చూడగల
గుండె లోతుల లోయ
తల ఎత్తి పోరాడే మనుషులే తెలియగల
గుండె బలమున్న లోయ
స్వర్గ నరకాలు,తొంగి చూసాయేమో కానీ
సూర్య చంద్రులక్కడ
వెలుగు నీడలు పారాడిన
ఆకాశ కుసుమాలే
దేవదారు వృక్షాల దేహ దారుఢ్యమూ
గుల్మొహర్ కుసుమాల కోమలత్వమూ
మంచువలె కరిగే మనసు
సెలఏరు వలె ప్రవహించే జీవితేచ్ఛ
కశ్మీరు నిద్రలేని ప్రజల కల
మేలుకున్న పోరాట,శక్తుల
నెరవేరని స్వప్నం
నిలువెల్లా ఒక స్వేచ్ఛాకాంక్ష
ఇనుప ముళ్ళ కంచెలుదాటి
కర్ఫ్యూల నెదిరించి
సైనిక వలయాల్లోకి
శరీరాయుధంగా మాత్రమే చొరబడి
తుపాకి గుండ్లకు నేలకూలే
తురాయి పిట్టల గుంపవుతుంది
కన్నీటి మంచు కరిగి
నెత్తురయి ప్రవహిస్తుంది
భారత మనోమోహన శాసనాలు
అమెరికాతో అణు ఒప్పందం,చేసుకున్నాక
ఐన్ స్టీన్ భయపడినట్లు
అక్కడి మనుషులకింక
ఆత్మరక్షణకు రాళ్ళే అందివచ్చాయి.
పసి పిల్లలూ నవ యువకులూ
మహిళలంతా
నిలువెల్లా ఆజాదీ జ్వాలలయి
కశ్శీరివ్వాళ కుంకుమ పూల వనమయింది
అణువణువున స్వేచ్ఛ రగుల్కొని
చిందుతున్న రక్తాలవి
జాలి పడకండి
ప్రజలుగా వాళ్ళతో జత కట్టండి
ఇండియాలోనే విడిపోతామంటే
దేశ ద్రోహమనే ఫాసిస్టులు
ఇండియా దురాక్రమణలో ఉన్న
ప్రజల్ని ఏం చేయగలరో ఊహించండి
పోలీసు చర్య పేరుతో
సైనిక దురాక్రమణ చేసిన యూనియన్
ఏడుగురికొక్క సైనికునితో
ఎన్నేళ్ళుగా అణచేస్తున్నారో యోచించండి
కశ్మీరు లోయకూ
దక్కన్ పీఠభూమికీ శత్రువొక్కడే
వాడు ఢిల్లీలో ఉన్న
అమెరికా కీలుబొమ్మ
శ్రీనగర్ గోల్ప్ క్లబ్ లోనూ
హైదరాబాదు సచివాలయంలోను
వాని తైనాతీలున్నారు
మానుకోటలో మనం విసిరిన రాయి
కాశ్మీరులో వాళ్ళు విసిరిన రాయి
గురి చూసిన శత్రువు వాడే
వానిపై కలిసి తలపడదాం రండి
అవును కలిసి తలపడాలి. ఒక్క తెలంగాణా మాత్రమే సిద్ధించింది. అయినా స్వేచ్ఛాకాంక్ష గల మనుషులు ఇంతటితో విశ్రమించరు. కాశ్మీర్ నాదంటే నాదనే ఇరు దేశాల దౌర్జన్యాలనుంచి, హైదరాబాదు నేనే కట్టానని చెప్పుకునే తుగ్లకీలనుంచి, రెండు సంవత్సరాల్లో తెలంగాణాను మరలా కలిపేసుకుంటామనుకునే పసితనాల్లోంచి, తెలంగాణకు సంస్కృతి మేమే నేర్పించమనుకునే అధిపత్య గర్వాల్లోంచి ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటారు. స్వేచ్ఛా గాలి ఎంతటి బలమైందో ప్రతిసారీ నిరూపిస్తూనే ఉంటారు.
13/1/16

No comments:
Post a Comment