ఖడ్గం (2002)vs వీర్ జారా(2004)
"ఊరికొక్క అంజాద్ భాయ్ ఉండింటే ఈ దేశం ఎపుడో బాగు పడేది".
ఇది ఖడ్గం సినిమాలో ముస్లిం పాత్ర వేసిన ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశించి బ్రహ్మాజీ చెప్పే డైలాగ్. గుజరాత్ లో మారణకాండ జరిగిందని ఇక్కడి లోకల్ ముస్లింలు తిరుపతి నుండి బస్సులో తిరిగివస్తున్న హిందువులను కత్తులతో నరకడానికి ఒస్తున్నట్టుగా ఒక అభూత కల్పన కలిగిస్తాడు దర్శకుడు. దానిని ముస్లిం అయిన ప్రకాశ్ రాజ్ అడ్డుకుని, హిందూ ముస్లింల మధ్య ప్రేమను కలిగిస్తాడన్నమాట. చాలా నాటకీయంగా సాగే ఈ సన్నివేశంలో దర్శకుడు ఏమి చెప్పదలచుకున్నాడనేది విదితమే. ఊరికొక్క అజాంద్ భాయ్ లేడనీ, అందుకే ఈ దేశం ఇలా ఉందనీ చెప్పడంలో దర్శకుడి ఉద్దేశం ఏమిటి?. ఊర్లలో ఉండే ప్రతీ ముస్లీమూ హిందూ వ్యతిరేకి అని చెప్పదలచుకున్నాడా?. ఇది ఖచ్ఛితంగా ప్రశాంతంగా జీవిస్తున్న మన ముస్లిము సోదరులను తక్కువ చేసి మాట్లాడటమే. సగటు హిందువు ముస్లిం అంటేనే పాకిస్థాన్ కి చెందిన వాడు అని అనుకునే ఒక స్టీరియోటైప్ మనస్తత్వంతో శ్రీకాంత్ పాత్ర మనకు కనిపిస్తుంది. సిగరెట్ కాలుస్తూ ఎదురుగా ముషారఫ్ నూ, బిన్ లాడెన్ ఫోటోలను కోపంగా చూస్తూ..సగటు ముస్లిం పాకిస్థానీయుడే అనే అర్థం వచ్చేలా, సగటు ముస్లీం తీవ్రవాదే అని అర్థం వచ్చేలాగా, మేము (అంటే హిందువులు )సెక్యులర్ గా ఉండటం వలననే మీరు ఈ దేశంలో ఉండగలుగుతున్నారని శ్రీకాంత్ పాత్ర ద్వారా చెప్పించడం అసంబద్ధంగా తోస్తుంది. కానీ దానికి విరుగుడుగా ప్రతీ మాటకూ తన దేశభక్తిని నిరూపించుకోవలసి రావడం, తనది ఈ దేశమే అని అరిచి చెప్పుకోవాల్సిన అవసరం ప్రకాశ్ రాజ్ పాత్రలోని అంజాద్ భాయ్ కి మల్లీ మల్లీ కలగడం, చూసినపుడు సగటు ముస్లిం పడే బాధ మనకు కనిపిస్తూంటుంది. ఆ సినిమాలోని శ్రీకాంత్ పాత్రధారి కలిగున్న భావజాలమే మనలో చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీనినే ఇస్లామోఫోబియా అంటున్నాం. ఈ సినిమా మొత్తం ఇటువంటి ఇస్లామో ఫోబియాను పెంచి పోషించేలా ఉంది. ఇపుడు సినిమా చూసిన సగటు మానవుడు హాలు నుండి బయటకు వెల్లేటపుడు ఏ భావజాలంతో పోతాడనేది ముఖ్యం. వాడి మనసులో హిందువులను కాపాడిన అంజాద్ భాయ్ ఉంటాడా, హిందువులపై కత్తులతో దాడి చేసిన ముస్లిములు ఉంటారా?. పైగా సినిమాలో అంజాద్ భాయ్ లాంటివాడు ఊరికొకరుకూడా లేడంటాడు కదా..
ఇక, హిందూ ముస్లిం పాత్రల ఆహారయంలో స్టీరియో టైపింగ్ ఈ సన్నివేశంలో దారుణంగా ఉంటుంది. ప్రతీ ముస్లిం పైజామాతో , టోపీతో, కల్లకింద కాటుకతో, గడ్డంతో కనిపిస్తాడు. ఇక తిరుపతి నుండి వచ్చే బస్సులో గుండు కొట్టించుకోని, తిరునామం పెట్టుకోని హిందువంటూ ఉండడన్నమాట.
ఆహార్యానికి సంబంధించిన ఇటువంటి స్టీరియో టైపులు దాదాపు ప్రతీ సినిమాలోనూ కనిపిస్తాయి.
ఈ సినిమా మొదటిసారి చూసినపుడు చాలా అసహ్యంగా అనిపించింది. కార్గిల్ వార్ జరిగి ప్రజలందరూ పాకిస్థాన్ మీద కోపంగా ఉన్న తరుణంలో అదే కోపాన్ని మంచి బిజినెస్ లాగా మలచుకున్నాడు కృష్ణవంశీ. చివరి క్లైమాక్స్ సీన్ లో ఆంటాగోనిస్ట్ తో జిహాద్ అని భయంకరంగా అరిపించడం దగ్గరినుంచి బాంబుని డీ ఫ్యూజ్ చేసే వరకు చిన్న పిల్లల ఆట లాగా అనిపిస్తుంది. ఇండియాలో ఉంటూ ఐఎస్ఐ ఉగ్రవాదిగా ఒక ముస్లిం యువకుడు శిక్షణ పొంది ఇక్కడ అరాచకాలు సృష్టిస్తుంటే, ఇక్కడి దేశభక్తులైన పోలీసులు, సినిమా వేశాలకోసం తిరిగే ఒక జూనియర్ ఆర్టిస్టు, అతడి ముస్లిం మిత్రుడు కలిసి, అతడిని చంపటం, ఆ యువకుడు ఈ ముస్లిం మిత్రుడి సొంత తమ్ముడే అయుండటం బేసిక్ గా సినిమా కథ. ఇంకో ఐఎస్ఐ ఉగ్రవాదిని చెరనుంచి విడిపించటం కోసం బాంబుబ్లాస్ట్ లు చేయడం వంటి నాటకీయతో సినిమా కథ నడుస్తుంది. ఈ సినిమాలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ముస్లిముల దేశభక్తిని గురించి పదే పదే సినిమాలో చెప్పించడం. వారిని పదే పదే శంకించడం. రెండోది, పాకిస్థాన్ దేశాన్నే కాకుండా సగటు పాకిస్థానీయుడు కూడా శత్రువుగా చూపటం. పాకిస్థాన్ లో ఉన్న వారంతా తీవ్రవాదులే అనేలాగా చూపించడం. ఒక సీన్ లో పాకిస్థానీయులను, అంటే అందరినీ, బద్మాషులనీ, కిరాయి సాలేగాండ్లనీ ప్రకాశ్ రాజ్ తో అనిపించటం ద్వారా, సగటు పాకీస్థానీయులందరినీ అసహ్యించుకునేలా చేస్తాడు దర్శకుడు. కార్గిల్ సమయంలో సగటు భారతీయుడిలో ఉండే ఎమోషన్ ను బాగానే క్యాష్ చేసుకున్నాడు కృష్ణవంశీ. అసలు భారతదేశానికి దేనితో శతృత్వం ఉంది అని మనం ప్రశ్నించుకోవాలి. పాకిస్థాన్ ప్రభుత్వం తోనా లేక పాకిస్థాన్ ఫారిన్ పాలసీతోనా, కాశ్మీరు విషయంలో పాకిస్థాన్ పాలకుల వైఖరితోనా, పాకిస్థాన్ లో ఉన్న భారత వ్యతిరేక శక్తులతోనా లేక పాకిస్థాన్ లోని సామాన్య ప్రజలతోనా లేక పాకిస్థాన్ అనే పదంతోనా, లేక మొత్తంగా పాకిస్థాన్ అనే దేశంతోనా?. పాకిస్థాన్ లో ఉండే సగటు పౌరునికి, పాకిస్థాన్ ని పాలించే నియంతలు చేసే ఆగడాలకు ఏమిటి సంబంధం?. ఎలాంటి సంబంధమూ ఉండదు, అని తెలిసినా, ప్రతీ పాకిస్థానీయుడిని, అక్కడుండే చిన్నారులనూ కూడా వదలకుండా ద్వేషించడమంటే, శత్రువుగా చూడటమంటే చాలా దారుణమైన విషయమే. ఇండియాలో ఉండే సగటు ముస్లిం పౌరుడికి పాకిస్థాన్ లోని భారత వ్యతిరేక శక్తులకూ ఏమిటి సంబంధం?. నిజానికి ఏమీ ఉండదు. కానీ ప్రతీ సాధారణ ముస్లీముకి పాకిస్థాన్ లోని తీవ్రవాదులతో సంబంధం ఉంటుందనుకోవడం పూర్తిగా మూర్ఖత్వం, అజ్ఞానం.
దాదాపు ఇదే సమయంలో యాష్ చోప్రా తీసిన వీర్ జారా అనే బాలీవుడ్ సినిమా వచ్చింది. ఈ సినిమా పాకిస్థానీయులు కూడా మనలాగా మనుషులే అని చూపించే ప్రయత్నం చేసినట్టనిపిస్తుంది. ఒక భారతీయ ఖైదీని విముక్తం చేయడానికోసం అక్కడి యంగ్ లాయర్ పడే తపన మనకు కనిపిస్తుంది. పాకిస్థాన్ అంటేనే బూచి అని చూపించిన ఖడ్గం సినిమాకూ ఒక పాకిస్థానీ ముస్లిం అమ్మాయికీ భారత హిందూ అబ్బాయికీ మధ్య ప్రేమకథను చూపించే వీర్ జారాకు సంబంధమే లేదు. మనుషులలో ఉండే మానవీయ కోణాన్ని తట్టిలేపే ఇటువంటి సినిమా ముందు చిన్నపిల్లల ఆటలాగా ఉండే ఖడ్గం సినిమా వెలవెల పోతుంది. ఈ సినిమా చివరిలో ఒక కవితను చదువుతాడు షారుఖ్ ఖాన్.
వారంటారు ఈ దేశం నాది కాదని
మరెందుకని ఈ దేశం నా దేశంలా అనిపిస్తుంది.
వారంటారు నేను వారిలాగా లేనని
మరెందుకు నాకు వారంతా నాలాగే కనిపిస్తున్నారు.
(అదే కవితలో ఆ యంగ్ లాయర్ గురించి చెబుతూ..)
ఆమె అంటుంది నేను తనకేమీ కాను అని
మరెందుకు నాకోసం తను ప్రపంచంతో పోరాడుతోంది
ఆమె అంటుంది నేను ఆమెలాగా లేనని
మరెందుకు ఆమె నాకు నాలాగే అనిపిస్తుంది...
ఇలా సాగే కవిత మనలో మానవత్వాన్ని రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక ఏకత్వాన్నీ చూపుతుంది. ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో జోహారులు అందుకున్న ఈ సినిమా, జర్మన్ ఫ్రెంచి భాషల్లోకి కూడా అనువదించబడి అక్కడ కూడా ఘన విజయాల్ని సాధించిన ఈ సినిమా, బాలీవుడ్ ఒక మైలురాయి అని చెబుతారు. పాకిస్థాన్ లో కూడా ఘన విజయం సాధించిన ఈ సినిమా, పాకిస్థాన్ పట్ల అక్కడి ప్రజల పట్ల ఒక సానుకూల భావన ఏర్పడటానికి ఇటువంటి సినిమాలు దోహదం చేస్తాయి.
30/7/17

No comments:
Post a Comment