విరించి ll నిన్న ఈ రోజు రేపు ll
...............................................
ఈ రోజు కూడా నిన్నటిలానే మొదలైంది
రివాజులా సాగే గాయాల కవాతుతో
జీవించే ఒక ఆశకు శాల్యూట్ చేస్తూ..
కల్మషం లేని ఒంటరి ఆకాశంవైపు
నల్లటి కెరటాల్లా చేతులు చాస్తూ..
నిన్న కూడా ఇక్కడే నివసించినట్టు గుర్తు
కలల బిడారు లోకి వేళ్ళ ను జొనిపి
ఒక్కొక్కటిగా బయటకి తీస్తూ
చుట్టూ వల పేనుకుంటూ పోతూ న్న నాన్న.
రెక్కల మీద రంగులు గీస్తూ
బొగ్గుల కుంపటిలా కాగే జీవితంలోకి
పొగ గొట్టం తో మంట రేపుతూ అమ్మ.
పట్టాలెక్కిన గూడ్స్ బండి తూ ముల్లోకి
పలుచని కందెన వంపుతూ నేను.
ఈ నది ఒడ్డున పక్షులు
రెక్కలార్చుకునే సమయాన
ఈ డెడ్ ఎండ్ రస్తాలో ఎలాగైనా
కుడికో ఎడమకో తిరగక తప్పని సమయాన
రోజులెంత విచిత్రంగా ముగుస్తాయో చూశావా..!
ఆశ్చర్యంగా యూ టర్న్ తీసుకుని
ఎంతగా మొహం మొత్తుతాయో చూశావా..!
నాకెపుడో తెలుసు..
రేపు కూడా నిన్నటిలాగానే ముగుస్తుందని.
5/3/15
...............................................
ఈ రోజు కూడా నిన్నటిలానే మొదలైంది
రివాజులా సాగే గాయాల కవాతుతో
జీవించే ఒక ఆశకు శాల్యూట్ చేస్తూ..
కల్మషం లేని ఒంటరి ఆకాశంవైపు
నల్లటి కెరటాల్లా చేతులు చాస్తూ..
నిన్న కూడా ఇక్కడే నివసించినట్టు గుర్తు
కలల బిడారు లోకి వేళ్ళ ను జొనిపి
ఒక్కొక్కటిగా బయటకి తీస్తూ
చుట్టూ వల పేనుకుంటూ పోతూ న్న నాన్న.
రెక్కల మీద రంగులు గీస్తూ
బొగ్గుల కుంపటిలా కాగే జీవితంలోకి
పొగ గొట్టం తో మంట రేపుతూ అమ్మ.
పట్టాలెక్కిన గూడ్స్ బండి తూ ముల్లోకి
పలుచని కందెన వంపుతూ నేను.
ఈ నది ఒడ్డున పక్షులు
రెక్కలార్చుకునే సమయాన
ఈ డెడ్ ఎండ్ రస్తాలో ఎలాగైనా
కుడికో ఎడమకో తిరగక తప్పని సమయాన
రోజులెంత విచిత్రంగా ముగుస్తాయో చూశావా..!
ఆశ్చర్యంగా యూ టర్న్ తీసుకుని
ఎంతగా మొహం మొత్తుతాయో చూశావా..!
నాకెపుడో తెలుసు..
రేపు కూడా నిన్నటిలాగానే ముగుస్తుందని.
5/3/15
No comments:
Post a Comment