విరించి ll కాలం పేటిక ll
పగలూ రాత్రులమధ్య
మనమంతా నడిచే సమాధులం
కాలపు కొక్కానికి వేలాడే సజీవ శవాలం
సృష్టంటే దేవుడికి ఎంతటి అసహ్యం
అన్నీ భిక్ష పాత్రలేనా..
భిక్షగాల్ల బొచ్చెల్లో ఎన్ని చిల్లర చూపులు...
కాలానికెపుడో తెలుసు
మరణానంతర రహస్యాలు
నడిచే దారిలో వెలుగు నీడలకి
వేలాడే చెట్లే కారణం కాదు
నడినెత్తిన మండే సూర్యుడు కూడా
కాలాలు ఎంతటి వ్యవసాయం చేసుంటే
ఇన్ని పిచ్చుక గూల్లు పుట్టుంటాయి..?
ఎంతటి ఖర్మ కాకుంటే ఈ పాపం చేసుంటుంది..?
వసంతాలకి ఎంత గర్వం కాకుంటే
ఇన్ని సెలవులు తీసుకుంటాయి
సముద్రంలో అలలకి
నిదురలో కలలకి
వెన్నెల గాలం వేసిందెవ్వరు...
కాలంలో గతాన్ని తవ్వుకునే మనిషికి
మనసులో ఎన్ని గునపాలు చేతులెత్తుతాయో
కొన్ని కన్నీటి చుక్కలకోసం అంతటి తపనెందుకు..?
11/11/14
పగలూ రాత్రులమధ్య
మనమంతా నడిచే సమాధులం
కాలపు కొక్కానికి వేలాడే సజీవ శవాలం
సృష్టంటే దేవుడికి ఎంతటి అసహ్యం
అన్నీ భిక్ష పాత్రలేనా..
భిక్షగాల్ల బొచ్చెల్లో ఎన్ని చిల్లర చూపులు...
కాలానికెపుడో తెలుసు
మరణానంతర రహస్యాలు
నడిచే దారిలో వెలుగు నీడలకి
వేలాడే చెట్లే కారణం కాదు
నడినెత్తిన మండే సూర్యుడు కూడా
కాలాలు ఎంతటి వ్యవసాయం చేసుంటే
ఇన్ని పిచ్చుక గూల్లు పుట్టుంటాయి..?
ఎంతటి ఖర్మ కాకుంటే ఈ పాపం చేసుంటుంది..?
వసంతాలకి ఎంత గర్వం కాకుంటే
ఇన్ని సెలవులు తీసుకుంటాయి
సముద్రంలో అలలకి
నిదురలో కలలకి
వెన్నెల గాలం వేసిందెవ్వరు...
కాలంలో గతాన్ని తవ్వుకునే మనిషికి
మనసులో ఎన్ని గునపాలు చేతులెత్తుతాయో
కొన్ని కన్నీటి చుక్కలకోసం అంతటి తపనెందుకు..?
11/11/14
No comments:
Post a Comment