విరించి ll శత్రువు ll కథ
లంకంత ఇల్లు. ఇంటి మధ్యలో పెద్ద ఊయల. ఊయల ఊగుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు పాండురంగయ్య. గుర్రాన్ని జరపాలా...ఒంటెను ఎరగా వేసి మంత్రిని చంపాలా అని. అటువైపు నర్సయ్య. పాండురంగయ్యకు కుడి భుజం...వీరాభిమాని...పాండురంగయ్య అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. కానీ ఒక్క చెస్ విషయంలో పాండురంగయ్య కోటని బద్దలు కొట్టాలని చూస్తుంటాడు. పాండురంగయ్యని ఎందులోనూ ఎవరూ ఓడించలేరు..చదరంగంలోనైనా..రాజకీయంలోనైనా...రణరంగంలోనైనా. ఆయనకి సమ ఉజ్జీ ఒక్కడే...ఆయన ప్రథ్యర్థి రఘురామయ్య . ఒంటెని ఎరగా వేసాడు పాండురంగయ్య. మంత్రికోసం. మీసం మెలేసి నర్సయ్యని గర్వంతో చూసాడు. నర్సయ్య తన యజమానిని ఓడించగల మేధావంతుడే..కానీ ఆయన మేథ, భయంలోనే సగం ఎగిరిపోతుంది. హోరుమనే వర్షంలో తడుస్తూ ఆబగా ఒచ్చాడు భీముడు. "అయ్యా...రఘురామయ్యని మనోల్లు యేసేశారయ్యా..." కిర్రు కిర్రుమని ఊగే ఊయల ఆగింది. తల ఎత్తి చూసాడు పాండురంగయ్య 'నిజమా' అన్నట్టు. నర్సయ్య దిగ్గున ఊయలమీంచి లేచి నిలబడ్డాడు. ఆనందంతో గట్టిగా అరవాలనుకున్నాడు. "జొన్న చేనుకాడ మనోల్లు కాపుకాసి ఆయన్ని ఏసేసారయ్యా..." . ఒక్కసారి తలుపు దగ్గర బాంబులు చుడుతున్న వీరయ్యని చూసాడు పాండురంగయ్య. వాడు ఇవేవీ వినిపించుకున్నట్టు లేడు. చుడుతూనే ఉన్నాడు. నర్సయ్య ని కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. నర్సయ్య కూర్చున్నాడు. ఊయల కిర్రు కిర్రు శబ్దం మళ్ళీ మొదలైంది. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా చదరంగం బోర్డులోకి చూస్తున్నాడు. నిజానికి పాండురంగయ్య అప్పటికే ఎత్తు వేసేశాడు. ఇపుడు ఆలోచించాల్సింది..ఆడాల్సింది నర్సయ్య. నర్సయ్యలో అయోమయం. ఎగిరి గంతులేయాల్సిన తరుణంలో ఈ నిశ్శబ్దాన్ని భరించలేకున్నాడు. ఆటమీద ధ్యాస లేదు. సమాచారం తెచ్చిన భీముడు కూడా పాండురంగయ్య మౌనానికి కారణాన్ని నర్సయ్య కళ్ళలో వెతుకుతున్నాడు. అదే అయోమయంలో ఎరగా వేసిన ఒంటెని మంత్రితో మింగేశాడు నర్సయ్య. ఫలితంగా ఇపుడు నర్సయ్య మంత్రి పాండురంగయ్య గుర్రం చెరలో ఉంది. ఇక చంపడమే తరువాయి. ఆటని శాసించే ప్రత్యర్థి మంత్రి చేతికి చిక్కాక కూడా, ఆలోచన అవసరం లేని చోట కూడా, ఆలోచిస్తున్నాడు పాండురంగయ్య...లోపల కిర్రు కిర్రు మని ఊయల శబ్దం..బయట బోరుమని ఏడుస్తున్నట్టుగా వాన.
"ఏమోయ్ బామ్మర్దీ...మా చెల్లెమ్మ చేసిన ఇనుప సున్నుండలు తిని చెదరంగంలో ఎత్తులు వేయడం కాదు...నిజ జీవితంలో కూడా వేయడం నేర్చుకోవాలి". రఘురామయ్య మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. "చూడు పాండూ...ఈ వెధవ సన్నాసులు నన్ను చంపలేరులేగానీ...ఇదుగో చెక్..." . ఇదే ఊయల మీద రఘురామయ్యతో వేల సార్లు చదరంగం ఆడాడు. ఎత్తులకి పై యెత్తులు వేయడంలో ఇద్దరికి ఇద్దరే..."చూసావా నీ రాజు పని అయిపోయిందిగా....!! అది సరే..రేపు పట్నం వెల్తున్నావంటగదా కార్లో!? ....జాగ్రత్త...!! నిన్ను లేపేయడానికి దారెంబడి బాంబులు పెట్టిచ్చినా... ఎక్కడో ఓ చోట మావాళ్ళు నిన్ను లేపేస్తారు...మొగోడివైతే పట్నం పోయి తిరిగి రా...మా చెల్లెమ్మ వీర తిలకం దిద్దుతది....లేకపోతే తిలకం తీసేస్తది....ఏమ్మా విశాలాక్షీ...! మీ ఆయన జాగ్రత్త , అసలే ఊరికి సర్పంచి..రేపు కష్టమే...సిటీనుండి బాంబుల ఎక్స్పర్ట్ తో దారెంబడి పెట్టిచ్చినా...". మీసం మెలేస్తూ...రాచ ఠీవితో వెల్లిన రఘురామయ్య గుర్తుకొచ్చాడు...ఈరోజు శవమయ్యాడా...పరధ్యానంగానే నర్సయ్య మంత్రిని తన గుర్రంతో తినేశాడు. పాండురంగయ్య చేయి వణకడం నర్సయ్య గమనించాడు. "వాహ్.. మంత్రి ఖతం" అరిచాడొకడు. తలెత్తి చూస్తే ముగ్గురు నలుగురు తమ ఊయల చుట్టూ చేరి ఆట చూస్తుండటం గమనించాడు పాండురంగయ్య. విషయం తెలిసి, ఒక్కొక్కల్లూ పాండు రంగయ్య ఇంటికి చేరుతున్నారు. కానీ నిశ్శబ్దంగా సాగే పాండురంగయ్య చదరంగం ముందు అందరూ పావులే..అందుకే ఎవరూ నోరు మెదపడం లేదు. వచ్చిన వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఊయల చుట్టూ చేరుతున్నారు.
ఈసారి సిపాయిలను అదిలించాడు నర్సయ్య. రఘురామయ్య కూడా సిపాయిలను ఉపయోగించి కోటని కట్టడంలో దిట్ట. చాలా సార్లు సిపాయిలతోటే రాజుకి చెక్ పెడతాడు. "చెక్ పెడితే పెట్టావ్లే వోయ్ ..గొప్ప...రేపు బయటకి కదలకు....వేట కొడవళ్ళతో దాడి చేపిస్తున్న. ఆడంగిలా ఇంట్ల కూర్చో...మా చెల్లెమ్మ పార్వతమ్మ తో కాసేపు ముచ్చట్లాడుకో...అర్థమయ్యిందా....ఆ పొలం పన్లు జీతగాండ్లకు పురమాయించు..ఎద్దుల్లాగా మేపావుగా నాయాండ్లని...నీవు ఇంటీకాన్నే వుండు..." అప్పట్లో ఇరవయ్యేళ్ళ క్రితం రఘురామయ్యకిచ్చిన వార్నింగ్ గుర్తుకొచ్చింది. గత ముప్పయేల్లుగా ఇలా ఎన్ని సార్లు ఒకరిమీద ఒకరు దాడులు చేసుకున్నారో...భూములకోసం ..సర్పంచి పదవుల కోసం...చేసిన హత్యలకి ప్రతిహత్యలకోసం...కానీ రాను రానూ పగ పెరిగిపోయింది...ఒకరికొకరు చూసుకునే పరిస్థితుల్లేవు...చివరి సారిగా తన భార్య విశాలాక్షి జబ్బుచేసి చనిపోతే సర్పంచిగా చూడ్డానికి వచ్చాడు రఘురామయ్య. ఆమె కూర్చునే అరుగు మీద కూర్చుని కాసేపు మౌనంగా రోదించాడు...పాండురంగయ్య చేతుల్ని ఒక్కసారి గట్టిగా వొత్తి వెళ్ళి పోయాడు..అప్పుడు చూసిందే రఘురామయ్యని. ఆ చేతుల్ని మళ్ళీ నర్సయ్య పట్టుకుని తన ఒక్క చేత్తో వత్తుతున్నాడు..."అయ్యా..మీదే ఆట" అని. నర్సయ్య ఇంకో చేతిని రఘురామయ్యనే నరికేసాడు. పాండురంగయ్య చూపులు చదరంగం బోర్డుమీద..ఆలోచనలు రఘురామయ్యమీద.
ఈ సారి రఘు రామయ్యకి ఇష్టమైన ఎత్తుగడతో నర్సయ్య మీదికి పావులు కదిలించాడు పాండురంగయ్య. "అయ్యా.. ఇది ఆ సచ్చినోడికి ఇష్టమైన ఎత్తు...ఆడే సచ్చినాక ఆడి ఎత్తు ఏం పార్తది". అనేశాడు నర్సయ్య. కోపంగా తల ఎత్తి చూసాడు 'ముందు మాటలాపి.., ఆడు' అన్నట్టు. అప్పుడు గమనించాడు తన చుట్టూ చాలామందే చేరారని. వాల్లంతా తనవాళ్ళు. తన నీడ కింద బ్రతికే వాళ్ళు. ఎన్నికల్లో రిగ్గింగ్ లు చేసి తనని చాలా సార్లు సర్పంచిగా గెలిపించిన వాళ్ళు. తాను సర్పంచిగా వుండి చేసిన మంచి పనులకూ చెడ్డ పనులకూ అండగా నిలిచిన వాళ్ళు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో కథ. వాళ్ళందరికీ ఈరోజు పండగ. తల ఎత్తి చూసిన సర్పంచ్ ని అందరూ దండాలు పెట్టి నవ్వుతూ పలకరిస్తున్నారు. ఇంతకు ముందులా వాళ్ళ నవ్వుల్లో భయం లేదు. ఉత్సాహం కనిపిస్తోంది. ఇంతకాలం వాళ్ళలో తన పట్ల కనిపించే భయానికి కారణం తనేనా...లేక రఘురామయ్యనా..ఇపుడు రఘురామయ్య చనిపోతే తనకు బయపడేదెవరు. ఇంకో వైపు మంత్రి పోయి ఏమి ఆడాలో తెలియక తికమక పడుతున్నాడు నర్సయ్య. ఏవో సిపాయి పావుల్ని కదిలిస్తున్నాడు. ప్రత్యర్థి మంత్రిని చంపేశాక ఆట ఇక ఏక పక్షమే..నిర్భయంగా తన రాజుని బయటకి తెచ్చి తిప్పుతున్నాడు పాండురంగయ్య. ప్రత్యర్థి మంత్రి చనిపోతే..తన రాజుకీ, రాచరికానికీ విలువే లేదన్నట్టుగా..
ఎలా చంపేశారు రఘురామయ్యని...ఆలోచనలో పడ్డాడు పాండురంగయ్య. బాంబుల వీరయ్యకి ఏమయింది ఈ సారి..? తన దగ్గర పని చేస్తున్న రఘురామయ్య మనిషికదా...వీడు ఈ దాడికి సంబంధించిన సమాచారాన్ని ఈసారి ఎందుకు రఘురామయ్యకి తెలపలేకపోయాడు..? ఈ మధ్య వాడికి చెవుడు వచ్చింది. మొన్న మేమంతా వేసుకున్న జొన్న చేను లో వేట కొడవళ్ళ ప్లాన్ వాడికి వినబడలేదేమో..అందుకే ఈ విషయాన్ని అక్కడ చెప్పలేకపోయాడేమో...చివరికి వాడి చెవుడే రఘురామయ్యని చంపిందా..అయ్యో....ఒకసారి వీరయ్య వైపు చూసాడు. వాడు,ఏమీ తెలియనట్టు బాంబులు చుడుతూనే ఉన్నాడు. ఈ బాంబులు ఎవడికోసం చుడుతున్నాడు వాడు...మరో రఘురామయ్య ఎపుడు పుడతాడు..? కుడివైపు ఏనుగుతో 'కాసిలింగ్' చేసుకున్నాడు నర్సయ్య...పేరుకే కాసిలింగ్. అది అధికార బదిలీ...రాచరికాన్ని నడిపే ఏనుగు. అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు నవ్వుతున్నాడు నర్సయ్య. వాడి నవ్వులో కూడా భయం లేదు. ఊయలకి ఒక మూలగా కూర్చునేవాడు ఇపుడు మీదకి ఒక కాలు పెట్టి మరీ కూర్చున్నాడు కొత్తగా. వీడేనా కాబోయే 'కాసిలింగ్ ఏనుగు..'? తననిక మూలకి కూర్చోబెట్టి వీడే నడపబోతాడా రాచరికం. రఘురామయ్యని బూచిగా చూపించి తాను ఎదిగాడు..రఘురామయ్యకి పోటీగా ఊరికి మంచి పనులు చేసి పెట్టాడు. రఘురామయ్యని దయ్యంగా చిత్రించి ఊరిలోని వివిధ వర్గాలవారినీ ఒక్కటి చేయగలిగాడు. పాకిస్థాన్ లేకపోతే ఇండియాలో ఎన్ని మత ఘర్షణలు జరిగేవో...ఎన్ని వర్గ పోరాటాలు తెరలేచేవో...పాలస్థీనా లేకపోతే ఇజ్రాయిల్ లో ఎన్ని జాతులు కుమ్ములాడేవో..ఎన్ని తలలు గుమ్మాలకు వేళ్ళాడేవో...అందుకేనా శ్రీ కృష్ణుడు యుద్ధం చేయమంది. అజాత శత్రువైన ధర్మరాజుకి సైతం శత్రువులుండేలా చేసింది.
బోర్డు మీద పావులు కొన్నే మిగిలాయి. నర్సయ్యకు ఒకే ఒక్క రాజు మిగిలాడు. పదహారు స్టెప్పుల్లో ఆట ముగించాలి. పాండురంగయ్య తలుచుకుంటే మూడు స్టెప్పుల్లో ముగించగలడు. ఆయన దగ్గర మంత్రి వుంది. రెండేనుగులున్నాయ్..మూడు సిపాయిలున్నాయ్...కానీ ఈ ఆట ముగించాలని లేదు తనకి. డ్రా వైపు పావులు కదుపుతున్నాడు. పోలీసులు కూడా తన యింటికి చేరుకుంటున్నారు. శత్రువు లేని తన ఆటలో పస తగ్గింది. తన చేతిలో ఓడి పోవాల్సిన నర్సయ్య తనకు సమ వర్తిగా కాబోతున్నాడు. ఆట డ్రా గా ముగిసింది. నర్సయ్య కళ్ళు ఆనందంతో మెరిసాయి. పాండురంగయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
06//12//14.

No comments:
Post a Comment