ఓల్గా నుంచి గంగ వరకు
--------------------------------
ప్రతీ వ్యక్తికీ 'సెల్ఫ్ ఇమేజ్' అనేది ఒకటి వుంటుంది. తను సంపాదించన జ్ఞానం, తను బ్రతుకుతున్న సమాజం, ఈ సెల్ఫ్ ఇమేజ్ ని ఏర్పరచటంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. సమాజాలు ఒక రోల్ మోడల్ ని తయారు చేసి మనుషుల సెల్ఫ్ ఇమేజ్ని ప్రభావితం చేయ చూస్తాయి. ఒకప్పటి రాముడూ, సీత అయినా, ఇప్పటి సిక్స్ ప్యాక్ హీరో లేదా జీరో సైజ్ బార్బీ గర్ల్ అయినా, సమాజం తయారు చేసే నమూనాలు. వీటిల్లోకి స్త్రీ పురుషులు ఇమిడిపోయేలా సమాజాలు వాటి వాటి మతాల్నీ, సంస్థలనీ నిర్మించుకుంటాయి. మగవాని విషయంలో ఎలాగా ఉన్నా, ఆడవారి విషయంలో మాత్రం ప్రాచీన కాలం నుండీ వివిధ సమాజాలు దాదాపు ఒకేరకమైన నమూనాల్ని బలపరుస్తూ వచ్చాయి. నేటికీ బలపరుస్తూనే ఉన్నాయి. స్త్రీని ఒక మాతృ మూర్తిగా, ఇంటికి దేవతగా, త్యాగశీలిగా మాత్రమే కాకుండా పురుషుడి ఆధ్యాత్మిక చింతనకు అడ్డంకిగా, ముముక్షువులు త్యజించవలసిన వస్తువుగా, అనైతికత ప్రబలడానికి కేంద్ర బిందువుగా, యుద్ధాలు జరగటానికి కారకులుగా సమాజాలు నమూనాలు తయారు చేసి ఉంచాయి. ఇవి స్త్రీలను వంటింటి కుందేలుగా మార్చి ఒక వ్యక్తిత్వంలేని స్వేచ్ఛలేని బానిసగా మలిచాయి.
కానీ ఫ్రెంచ్ రష్యన్ విప్లవాలు, పారిశ్రామికీకరణ స్త్రీలలో ఆలోచనల్ని రేకెత్తించాయి. పరిశ్రమలు రాక పూర్వం ఒక ఇంటికి కావలసిన వస్తువులను ఒక మగవాడు సంపాదించగలిగితే, పరిశ్రమలు, మగవాడి సంపాదనకు ఆడవారి సంపాదనను కూడా అత్యావశ్యక్యం చేశాయి. సమాజం ఏర్పరిచిన సంస్థలు ఆడవారికి విద్య ఉద్యోగం అందించటమే ఎంపవర్మెంటని నినదించాయి. కానీ లోగుట్టు మాత్రం స్త్రీ రూపంలో ఒక కొత్త బానిస కావలసిన అవసరాన్ని దాచిపెట్టాయి. తక్కువ జీతాలకు దొరకే కొత్త బానిసత్వాన్ని 'స్త్రీ- శ్రమ శక్తి' రూపంలో పరిశ్రమలు దోచుకోవటం మొదలైంది. ఒక స్టడీ ప్రకారం స్త్రీలు, ప్రపంచ మొత్తం పనిలో 66 శాతాన్ని, 50 శాతం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు, అయినా ప్రపంచ మొత్తం సంపాదనలో కేవలం 10 శాతాన్ని, సొంత ఆస్తిలో కేవలం 1 శాతాన్ని కలిగివున్నారుట. పారిశ్రమికీకరణ ఇత్యాది పరిస్థితులు, స్త్రీపురుషుల సమాన హక్కుల ప్రస్తావనని తీసుకునివచ్చింది. స్త్రీలు సమాజంలోనూ, ఇంటిలోనూ, పనిలోనూ తాము అణచివేతకూ దోపిడికీ గురౌతున్నామని అపుడపుడే గుర్తించటం మొదలయింది. పాశ్చాత్య దేశాలలో స్త్రీ హక్కుల పోరాటాలు భారత దేశంకన్నా రెండువందల యేండ్ల ముందే మొదలయ్యాయి. కానీ 1960 తరువాతే స్త్రీ విముక్తి బృందాలు ఏర్పడి "ఫెమినిజం"గా ముందుకు వచ్చాయి. సిమన్ డి బ్యూవర్ రాసిన "సెకండ్ సెక్స్" అనే పుస్తకం(1949) ఎంతో మంది స్త్రీలను ప్రభావితం చేసింది. అలాగే అమెరికన్ రచయిత్రి బెట్టీ ఫ్రీడన్ రాసిన "ది ఫెమినిస్ట్ మిస్టిక్" పుస్తకమూ(1966) ప్రభావాన్ని చూపింది. తెలుగులో స్త్రీవాద కవితోద్యమాన్ని ప్రభావితం చేసిన పుస్తకాల్లో దీనిని ఒకటిగా చెబుతారు. అటువంటి సమయంలోనే(1972) తెలుగులో తొలిసారిగా స్త్రీవాద కవిత్వాన్ని వినిపించారు కవయిత్రి వోల్గా.
భారత స్త్రీ విషయంలో భారత సమాజం ఒక పకడ్బందీ నమూనాను తయారు చేసింది. స్త్రీ వాద ఉద్యమం మొదటిసారి ఈ పవిత్ర కార్యాల వెనుక, దాస్యాల వెనుక దాగి ఉన్న అణచివేతను గుర్తించగలిగింది. మొదటి సారి స్త్రీ తన జీవితాన్ని తాను తప్ప ఎందరో ప్రభావితం చేస్తున్నారని తెలుసుకోగలిగింది. ఈ అణచివేత తమని సమాజానికి దూరంగా ఉంచగలిగలిగిందని, భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వెలివేసిందని గుర్తించగలిగింది.
ఎలా పుట్టానో ఎందుకు పెరిగానో
ఎవరికోసం జీవిస్తున్నానో
తెలియని వెర్రి తల్లిని
వెలివేయబడ్డ చీకటి బ్రతుకుని
ఇవి కవయిత్రి మాటలు. ఇవి తాత్విక భూమికను దాచుకున్న అతి సాధారణ వైయుక్తికోద్వేగాన్ని తెలిపే మాటలు. కానీ ఈ పదాల్లో భావన కానీ, తాత్వికతకానీ వైయుక్తికం కావు, ఇవి సామూహికం. ఇటువంటి కవిత్వం ప్రధానంగా స్త్రీ వాద కవిత్వంలో కనిపిస్తుంటుంది. కవయిత్రి ఓల్గా ఈ తత్వాన్ని ఇమడ్చుకుని సామూహిక గొంతుకను వైయుక్తికంగా వినిపించే ప్రయత్నం చేస్తారు. పురుషాధిపత్య సాహిత్యం, కుటుంబ హింస,అణచివేతకు గురైన సామాజిక జీవితం ఇవన్నీ చివరికి తన మీద తనకి ఒక సెల్ఫ్ ఇమేజ్ ని పెంపొందిస్తాయి. అందులో ముఖ్యంగా శారీరక స్పృహను కలిగిస్తాయి. వేదన కలిగించే శారీరక స్పృహ ఆఖరికి స్త్రీని మాతృత్వాన్ని కూడా వద్దనుకునే పరిస్థితికి తీసుకుని పోతాయేమో అనటానికి "నేను పవిత్రామ తల్లినీ కాను" అనే వాక్యాలే నిదర్శనం.
ఈ కవితా నిర్మాణం కవయిత్రి భావనా స్పష్టతకు అద్దం పడుతుంది. కవిత మొదటి భాగంలో కవయిత్రి పురుషాధిపత్య సమాజపు నమూనాలని చర్చిస్తూ తనను తాను మార్జినలైజ్ చేయబడిన వ్యక్తిగా గుర్తిస్తుంది. ఇక్కడ వైయుక్తికంగా సాగే కవిత్వం సామూహిక చేతనను స్పురిస్తూ సాగుతుంది. రెండవ భాగంలో సమాజంలోని ఉన్నత వర్గ స్త్రీ గా, మధ్య తరగతి స్త్రీగా, కూలీ పని చేసే బీద స్త్రీగా కవయిత్రి పరకాయ ప్రవేశం చేసి సమాజంలోని మూడు తరగతుల స్త్రీల బాధ ఒకలాగే ఉంటుందనే సత్యాన్ని బోధపరుస్తుంది. చివరి భాగంలో దీన్నంతా కాదంటూ తాను పంచాది నిర్మల వారసురాలిగా తనను తాను మార్పును కోరుకునే విప్లవకారిణిలా నిర్వచించుకుంటుంది. ఎవరీ పంచాది నిర్మల అంటే మహాకవి శ్రీశ్రీ నే చెప్పాలి.
స్త్రీ దేవతలను పూజిస్తారు
పురాణ కథానాయికలను గుర్తుంచుకుంటారు
ఝాన్సీ లక్ష్మీ బాయికి కన్నీటి వందనాలు చేస్తారు
సరోజినీ దేవిని పూల మాలలతో పొగడ్తలతో ముంచెత్తుతారు
అయినా, పంచాది నిర్మల పేరు మాత్రం వారిని వణికిస్తూనే ఉంటుంది*.
అన్నాడు శ్రీశ్రీ. 1970 నుండి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటి ఆడపిల్లకీ నిర్మల పేరు పెట్టుకోవటం మొదలయ్యిందంటే ఆమె ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. "తెగింపు సంఘం" ద్వారా మొదటిసారి మహిళల అణచివేతని, మద్యపాన విక్రయాలనీ, అధిక వడ్డీ ఋణాలనీ, నకిలీ మనుషులని, నకిలీ సమాజాన్నీ ఉద్యమంలా ప్రశ్నించిన ఆమె, పీడితుల పక్షం వహించింది కాబట్టి ప్రభుత్వాలు నకిలీ యుద్ధంలో చంపివేసి ఉంటాయని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.
పంచాది నిర్మల వారసురాలిని
-----------------------------------------
అందమైన దోపిడికీ
పవిత్రమైన హింసకూ
న్యాయమైన దాస్యానికీ
బలైపోయిన నేను
భారత స్త్రీని
కొంతకాలం పతివ్రతని
కుష్టురోగుల ఎంగిళ్ళ కుక్కని
అనుమానాల అవమానాల
అగ్ని జ్వాలలకు ఆహుతిని
సహగమన జ్వాలల శలభాన్ని
కొంతకాలం ప్రబంధ కన్యని
నోరూరించే పంచదార చిలకని
రాజులకోసం రోదించిన కోయిలని
స్తనాల బరువుతో చచ్చిన శవాన్ని
మనిషిని కాను అష్టమ భోగాన్ని
ఆ పిమ్మట
పుట్టు వితంతువుని
మొగుడు చచ్చిన ముండని
ఎలా పుట్టానో ఎందుకు పెరిగానో
ఎవరికోసం జీవిస్తున్నానో
తెలియని వెర్రి తల్లిని
వెలివేయబడ్డ చీకటి బ్రతుకుని
ఇపుడో
ఒకవంక
భర్తల హోదాల అధికారాల
కార్లకూ బార్లకూ బందీని
ఫ్యాషన్ పరేడ్ పందాలలో పడి
నలిగిపోవటమేగానీ
స్వేచ్ఛ తెలియని విహంగాన్ని
ధనిక వర్గపు దరిద్రాన్ని
ఇంకోవంక
తినటం పిల్లల్ని కనటం తప్ప
మరేదీ పట్టని
పట్టించుకోడానికి తీరని
మర చక్రాన్ని
వేరొకవంక
పొద్దస్తమానం పని చేస్తే
వచ్చిన ఆడకూలీ డబ్బులతో
పిల్లలకింత గంజైనా పోద్దామంటే
తాగిన మొగుడి తన్నులనూ
ఆగని బిడ్డల ఏడుపునూ
భరించలేక
కన్నబిడ్డలకు విషం పెట్టిన
పవిత్ర మాతృ మూర్తిని
కానీ రేపు
నేను పతివ్రతామ తల్లిని కాను
ప్రబంధ కన్యను కాను
పంచదార చిలుకను కాను
ఫ్యాషన్ పెరేడ్ బొమ్మను కాను
పసిపాపల చంపే పాపిని కాను
పంచాది నిర్మల వారసురాలిని.
ఇప్పటికీ మూడు తరంగాలుగా స్త్రీ వాదం ముందుకి వొచ్చినా, వివిధ అంశాల మీద స్త్రీ వాద కవయిత్రులు ఉద్యమాలు చేస్తున్న స్త్రీల మీద ఆధిపత్యం కొనసాగుతూ నే ఉంది. స్వీయ మానసికోద్రేకాలకు లోనయ్యే ఆధునిక తెలుగు కవిత్వమైనా స్త్రీని ఈ రోజుకీ తక్కువ చేసి చూపుతూ నే వుంది. "ప్రబంధ కవిత్వానికి స్త్రీ అంటే శరీరం. భావ కవిత్వానికి స్త్రీ కేవలం హృదయం. అక్కడామెకు హృదయంలేదు ఇక్కడ ఈమెకు శరీరం లేదు" అని వేల్చేరుగారు తేల్చేసినా, మగవారి ఆధునికి కవిత్వం అంతకుమించి గొప్పగా సాగింది లేదు. అయినా కవయిత్రులు ఓల్గా నుంచి గంగ వరకు మనదేశంలో స్వచ్ఛంగా స్వచ్ఛందంగా తమ గొంతుకలను సవరించుకుంటూనే ఉన్నారు.
4/5/16
(కవిత్వ సందర్భం 17)
* శ్రీ శ్రీ రాసిన ఈ పోయెమ్ నాకు ఇంగ్లీషులో దొరికింది- ఇది నా తెలుగు స్వేచ్చానువాదం

No comments:
Post a Comment