హిట్లర్ రక్త దానం చేశాడు
..................................
మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకంలో షైలాక్ ఒక మాట అంటాడు." మీరు సూదులతో గుచ్చితే మాకు రక్తం రాదా? మీరు చక్కిలి గింతలు పెడితే మాకు నవ్వు రాదా? మీరు విషం పెడితే మేము చచ్చిపోమా? మీరు మమ్మల్ని బాధిస్తే మేము పగ తీర్చుకోమా?" అని. యూదు జాతీయుడైన షైలాక్ క్రిస్టియన్ అయిన ఆంటోనియో ని అడుగుతాడు. ఈ నాటకంలో షైలాక్ విలన్. ఆంటోనియో హీరో. కానీ కేవలం యూదు జాతీయుడైనందుకే ఆంటోనియో షైలాక్ ని అసహ్యించుకుంటుంటాడు. అపుడు షైలాక్ పై మాటలడుగుతాడు. ఆంటోనియోలో గూడుకట్టుకున్న 'ఎథ్నోసెంట్రిసిటీ' ని ప్రశ్నించి, సంస్కృతులు వేరయినా మనుషులంతా ఒక్కటే అని చెప్పే ప్రయత్నం షైలాక్ చేసినా..,హిట్లర్ కి షైలాక్ మాటలు నెత్తికెక్కలేదు. నాజీలు షేక్స్పియర్ ని 'జెర్మానిక్ రైటర్' అని చెప్పుకున్నారు. మర్చంట్ ఆఫ్ వెనిస్ ని యూదుల వ్యతిరేక భావజాలంగా వాడుకున్నారు. తరువాత జరిగిన మారణ హోమం తెలియనిది కాదు. హిట్లర్ హామ్లెట్ ని 'ఆర్యన్ జర్మన్ సోల్జర్' గా భావిస్తే, స్టాలిన్ ఈ నాటకం కల్చర్ ని భ్రష్టు పట్టించేలా ఉందని రష్యాలో నిషేధించేసాడు. తమకంటే...తమ దేశం కంటే, తమ మతం కంటే, తమ సంస్కృతికంటే, తమ ప్రాంతం కంటే ఇంకేదీ గొప్ప కాదు. తామే గొప్ప, మిగితావంతా నీచాతినీచమైనవి, అనాగరికమైనవీ అని అనుకోవటం, చెప్పుకోవటం, అలా ప్రవర్తించటం ఎథ్నో సెంట్రిసిటీ అనిపించుకుంటుంది. యురోపియన్ ఇంపీరియలిజం పదహారవ శతాబ్దం నుంచి దీనిని ఉపయోగించి ఎన్ని దేశాల్ని, వాటి సంస్కృతుల్ని నీచాతినీచమైనవిగా చూపించి ప్రచారం చేసుకుందో మనకు తెలియనిదేం కాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమనీ, సంపన్న దేశమనీ, ప్రపంచ దేశాలన్నింటికీ అండ అనీ అమెరికా చెప్పుకుంటూ చేసే గోబెల్ ప్రచారానికి కూడా ఎథ్నోసెంట్రిసిజమే కారణం.
మామతం గొప్పది, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడే అసలైన దేవుడు, మా మత గ్రంథమే అసలైన దేవుని వాక్యం, మా మతమే ముక్తికి ఏకైక మార్గం అని మనం ప్రతి రోజూ ఏదో ఒక మతం, ఏదో ఒక మూలన గగ్గోలు పెడుతూ ఉండటం చూస్తూనే వుంటాం. మత ప్రచారకులే కాకుండా మతాన్ని అవలంబించేవారు కూడా తమ దారే రహదారనీ, మిగతా దారులన్నీ దొడ్డిదారులే అని నమ్మటం చూస్తున్నపుడు, ఈ ఎక్సక్లూసివ్ థింకింగ్ కి రాజకీయ, సామాజిక కారణాలే కాక వైయుక్తిక కారణాలు కూడా ఏమైనా ఉండింటాయా అని అనిపిస్తుంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ "న్యూరోసిస్ మతము రెండూ కూడా మనిషి మనసులో పుట్టినవే " అంటాడు. యూదు జాతీయుడిగా విపరీతమైన యాంటీ సెమెటిక్ వివక్ష కు గురయినవాడు ఫ్రాయిడ్. "యూదుడినైనందుకు నాకు నేను తక్కువగా, పరాయిగా భావించేవాడినని" చెప్పుకున్నాడు. 'ఆలోచనల సర్వస్వమే' మనసనుకున్నా, మానవుని మెదడు నిర్మాణంలో మనసనేది ఎక్కడా భౌతికంగా కానరాదు. మనసనేది ఉందని అనడం కూడా ఒక మానసిక భావనగానే మిగిలిపోయింది. ఇది ఎలాగున్నా, మానవుడికి మతమనే భావన ఒక సహజ గుణం అనిపిస్తుంటుంది. ఈ గుణమే తమ మతమే గొప్పదనే భావనకు నాంది అనిపిస్తుంటుంది.
మనిషి ఒంటరిగా ఉన్నపుడు, తన మతమే గొప్ప అనో అనుకోవటానికి వీలు లేదు. ఇది సమిష్టిగా కొందరు కూర్చుని అనుకుంటే తప్ప సాధ్యం కాదు. మనిషి ఒక గ్రూపులో ఉన్నపుడే ఇలాంటి భావనలతో నిండి ఉంటాడు. గ్రూపు మనిషికి కొంత ఊరటనిస్తుంది. ఫలానా వారి గ్రూపు కంటే మా గ్రూపు గొప్పది అని గ్రూపు సభ్యులందరూ కలిసి అనుకోవటంలో చర్చ చేసుకోవటంలో ఉండే కిక్కే వేరప్పా.. అని చెప్పక తప్పదు. ఇతర గ్రూపుల విషయంలో విపరీతమైన ద్వేషాన్ని కలిగి ఉండటం, ఈ గ్రూపు వ్యక్తులకు మాంచి ఉత్సాహాన్ని కిక్కునూ ప్రసాదిస్తూ ఉంటుంది. గ్రూపులో సభ్యుడైన వ్యక్తులు మాత్రమే, ఒకరు చెప్పిన విషయం పట్ల సముఖతను వ్యక్తం చేస్తారు. గ్రూపు సభ్యుడు కాని వాడు చెప్పిన విషయం పట్ల విముఖతను ప్రదర్శించడు అని చెప్పటానికి వీలు లేదు కాబట్టి, గ్రూపులో సభ్యులు తమలో తాము సంభాషించుకున్నపుడు ఒక రకమైన దగ్గరితనాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు.
'ఎంపథీ' అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇతరుల విషయం పట్ల సానుభూతో, సమభావమో కలిగి ఉండటం. ఒకరికి ఒక కష్టం వచ్చినపుడు, లేదా సంతోషం కలిగినపుడు దానిని పంచుకోవటానికి, ఇంకొకరు కావాలి. ఆ ఇంకొకరు కూడా అదే గ్రూపులోని వ్యక్తులు అయివుంటే ఎంపథీ పొంగి పొరలుతుంది అనేది వాస్తవం. అయితే ఎంపథీ కి మనిషి మెదడులో నుండి ఉత్పత్తయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోనుకీ సంబంధం ఉంటుంది. తమ గ్రూపు గొప్ప దనాన్ని పదే పదే చెప్పుకోవటం ద్వారానో...లేదా ఇతర గ్రూపుల మూర్ఖత్వాన్ని తలుచుకుంటూ ఆవేశంతో ఊగిపోవటం వల్లనో..లేదా ఇతర గ్రూపుల వలన తమకు కలిగిన కష్టాల్ని ఆడిపోసుకోవటం వల్లనో..లేదా తమ గ్రూపు ఇతర గ్రూపుల మీద సాధించిన విజయాల్ని ఏకరువు పెట్టడం వల్లనో...ఇలాంటి విషయాల్ని ఒక గ్రూపు సభ్యులందరూ ఒక చోట కూర్చుని ఎంపథైజ్ అయినపుడు వారి వారి రక్తంలో ఆక్సిటోసిన్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోవటాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఇది మత గ్రూపులకే వర్తిస్తుందనుకోవాల్సిన పని లేదు. ఏ గ్రూపుకైనా వర్తిస్తుంది. అథీస్టులందరూ ఒక చోట కూర్చుని మథీస్టులమీద దుమ్మెత్తి పోసుకుంటే ఆక్సిటోసిన్ ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. అందుకే ప్రాచీన మత సంస్థలన్నీ గ్రూపు వాతావరణాన్ని ఏర్పరుచుకోటానికి ప్రయత్నించాయి. తయారు చేసుకున్న నమ్మకాల్నీ, విధుల్ని తూ చా తప్పకుండా సభ్యులందరూ పాటించాలని నియమాల్ని చేసుకున్నాయి. పాటించని వారినీ, నమ్మనివారినీ వెలేసాయి, అవసరం అనుకుంటే చంపేశాయి.
ఆక్సిటోసిన్ రక్తంలో ఉండాల్సినంత ఉంటే ఏ ఇబ్బందీ లేదు. దీనిని 'కడ్లింగ్ హార్మోన్' అంటారు. ప్రేమను బంధాన్ని పెంపోదించే హార్మోన్ ఇది. డబ్బూ, మార్కెట్టూ, ఇదే ప్రపంచం అనుకునే వెస్టర్న్ సివిలైజేషన్ మనిషిని విరీతమైన స్ట్రెస్ లోకి నెట్టివేస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెదడు లోని హైపోథలామస్ నుంచి ఆక్సిటోసిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. అటువంటి సందర్భాల్లో ప్రేమ బంధమూ బంధుత్వమూ మరచి మనిషి ప్రవర్తిస్తుండటం మనం గమనిస్తుంటాం. మనిషి మతం వైపుకు మరలటానికి అధిక ఒత్తిడి కలిగించే సమాజాలు ఏర్పడటానికీ సంబంధం ఉంటుంది. ఈ అధిక ఒత్తిడినుండి దూరంగా మరలటానికి మతం, తద్వారా మతం కలిగించే గ్రూపు భావన, తద్వారా అది కలిగించే ఆక్సిటోసిన్ సమతౌల్యత వంటివన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి వుంటాయి. వెస్టర్న్ సివిలైజేషన్ మీది విముఖత, ఇస్లామిక్ దేశాల్లో ఇస్లాం బలపడటానికి కారణమంటారు సోషియాలజిస్ట్ లు. స్ట్రెస్ ని తొలగించి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని కలిగించే మత భావన ని వదులుకుని, విపరీతమైన ఒత్తిడిని విసిరి కొట్టడమే ఇది. అయితే ఈ హార్మోన్ మనుషులందరిలో ఉంటే మనుషులందరూ ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ ఉంటారు కదా అని మీరు అడగవచ్చు. కానీ ఈ హార్మోన్ అటువంటి యూనివర్సల్ భావనని కలిగించదట. అంటే 'విశ్వ మానవుడు' అనేది కేవలం ఒక మిథ్య మాత్రమే. ఈ హార్మోన్ కేవలం గ్రూపు భావననే పెంపొందిస్తుందట. తమ గ్రూపు మీద ప్రేమనూ, నమ్మకాన్నీ కలిగిస్తుందట. అంతే కాకుండా ఒక గ్రూపునే అట్టి పెట్టుకునేలా, వేరే గ్రూపులవైపు కన్నెత్తి కూడా చూడనీయకుండా కూడా చేస్తుందట. తద్వారా తయారు చేసుకున్న నియమాలని పాటించేలా, నీతి నిజాయితీ కలిగి ఉండేలా చూస్తుందట. పురాతన నాగరికతల్లో ఈ ఆక్సిటోసిన్ మనుషులు గ్రూపులుగా ఉండటానికి తద్వారా ప్రకృతినుంచి, క్రూర జంతువుల నుంచి సురక్షితంగా ఉండటానికి తోడ్పడిందట.
నూతన సైంటిఫిక్ రీసెర్చ్ ల ప్రకారం, ఆక్సిటోసిన్ మానవ అభివృద్ధిలో కీలకమైన పరిణామాత్మక పాత్రనే పోషించింది. గ్రూపు సభ్యుల మధ్య మైత్రినీ సఖ్యతనూ పెంచటం ద్వారా మానవ సమాజాలు ముందుకి కదిలేలా చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా, ఒక వ్యక్తికి ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇచ్చి అతని ఇష్టాల్ని పరిశీలించినపుడు, అతడు తన మతం లేదా తన దేశం వారినే ఇష్ట పడినట్లు తెలుస్తోంది. అంతే కాక అనవసరం అయిన పరిస్థితుల్లో కూడా అవసరం ఉన్నట్టు భ్రమ కల్పిస్తూ తమ మతం లేదా దేశం వారిని కాక ఇతర మతం లేదా దేశం వారిని చంపటానికి కూడా వెనుకాడబోమని ఆక్సిటోసిన్ ఇంజక్షన్ పుచ్చుకున్న వ్యక్తులు చెప్పటం జరిగింది. ఇది నార్సిస్సిజంని సూచిస్తోంది. కాబట్టి ఆక్సిటోసిన్ హార్మోన్ కి రూపాయి కాయిన్ లాగా రెండు ముఖాలుంటాయి. ఎపుడూ బొమ్మనే పడుతుందనుకోటానికి వీలు లేదు. బొరుసు పడ్డప్పుడు మతం కాస్త మత్తుగా మారి, మత తీవ్రవాదానికి దారితీస్తుంది. ఇలా ఆక్సిటోసిన్ ఎక్కువ మోతాదులో కలిగి ఉన్న వ్యక్తుల మాటలూ, ప్రవర్తనా మనం ఈ మధ్య చాలానే చూస్తున్నాం. కనీసం అటువంటి వారెవరైనా కనపడ్డప్పుడు, వేరే మతాలు నీచాతి నీచమైనవనీ తమ మతమే గొప్పదనీ, వేరే రాజకీయ పార్టీలు నీచాతి నీచమైనవనీ, తమ పార్టీయే గొప్పదనీ ఎవరు బీరాలు పోతున్నా, ఒకసారి రక్తంలో ఆక్సిటోసిన్ చెక్ చేసుకోమని చెబుదాం. లేదా హిట్లర్ రక్తమో..ఆంటోనియో రక్తమో ఏమైనా ఎక్కించుకున్నాడేమో అడుగుదాం.
9/5/16

No comments:
Post a Comment