సాములోరి ఆధ్యాత్మిక ఉచిత సలహాల మీద....
"ఆకలి, అజ్ఞానంతో అలమటిస్తున్న కోట్లాది ప్రజలు ఒకవైపుండగా, వారి శ్రమను ఆధారం చేసుకుని విద్యావంతులైన ప్రతీవాడూ నేరగాడే, ఇటువంటి ఉన్నత వర్గ విద్యావంతులందరూ పది వేల సంవత్సరాలనాటి మమ్మీలే"..అన్నాడు వివేకానందుడు. అటువంటి మమ్మీ ఇపుడు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' పేరుతో కలియతిరుగుతూ, రైతుల ఆత్మ హత్యలకు ఆధ్యాత్మిక లోపం కూడా ఒక కారణం అంటోందిపుడు. ప్రసంగాలు చేస్తూ కడుపులు నింపుకుంటున్న ఈ బుద్ధావతారాలకు తిన్నది సరిపోలేదేమో ఇపుడు రైతుల మీద పడి దోచుకునే పనిలో పడ్డారు. "ఆకలితో ఉన్న వాడికి గీతా బోధనలు కూడదన్నాడు" వివేకానందుడు. శ్రీ రవి శంకర్ ఇపుడు ఏకంగా యోగా ధ్యానాదులు నేర్పిస్తానంటాడు. సమస్యల పట్ల అవగాహనా లేమితనంతో ఈ స్వాములంగారు వాక్రుచ్చే సూచనలు వారి సామాజిక స్పృహలోని లోతులేనితనాన్ని తెలపటమే కాకుండా, వారిని నవ్వులపాలు కూడా చేస్తూ ఉంటుంది. అసలు భారతదేశంలో యోగా అభివృద్ధి చెందడానికి ఇక్కడి పేదరికమే కారణం అనేది పాశ్చాత్యుల అవగాహన. తినడానికి తిండిలేని అర్భకులు యోగా పేరుతో కఠిన నియమాలు పాటిస్తూ, రోజుకు ఒక పూటనే తింటూ, పస్తులను 'పవిత్ర ఉపవాసాలు'గా మలుచుకునేవారనీ, ఆ విధంగా ఆకలి బాధలను అధిగమించే వారు కాబట్టే ఎండమిక్ గా ఉన్న క్షుద్భాధ ఈ దేశంలో యోగా వ్యాప్తి చెందటానికి ఉపయోగ పడిందన్నది వారి అవగాహన. బహుశా అందుకేనేమో "ఒక పూట తినే వాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి" వంటి నానుడులు పుట్టి వుంటాయి. ఈ రోజుటికీ ప్రతీ రోజు రాత్రికి పస్తులు పడుకుంటున్న భారతీయుల సంఖ్య ఇరవై కోట్లు. వీరినందరినీ తన శిష్యులుగా మలుచుకుంటే..వీరందరికీ యోగా నేర్పిస్తే..అనే క్షుద్ర ఆలోచన వచ్చిన శ్రీ రవి శంకర్ నిజంగా ధన్య జీవనే చెప్పాలి. బతికుండగా మమ్మీ కావడం బహు అరుదైన విషయం కాబట్టి.
గమనిస్తే యోగా మెడిటేషన్ వంటి సంప్రదాయాలు ప్రాక్ పశ్చిమ దేశాలలోని ఆశ్రమాలనుండి వచ్చినట్టుగా ఉంటుంది. మనదేశంలో ఎన్నో ఆశ్రమాలుండేవి, అందులో వందల సంఖ్యల్లో జనులూ ఉండేవారు. (ముఖ్యంగా మన దేశంలో బౌద్ధం ప్రబలిన తరువాత బౌద్ధారామాలు, కాషాయ వస్త్ర ధారణలూ పెరిగిపోయాయి. ప్రతీ ఒక్కరూ సన్యాసం తీసుకోవడం ఆ రోజుల్లో ఒక కల్ట్ ఫ్యాషన్ గా మారేసరికి వేలలో ఆశ్రమాలూ మొదలయాయి. నేటికీ పాశ్చాత్యులు యోగా ధ్యానాదులు టిబెటియన్ బౌద్ధానికి సంబంధించినవే అనుకుంటారు తప్ప భారత హిందువులకు సంబంధించినది అనుకోరు. ఇపుడు ఏలినవారు యోగా అనగానే టిబెట్ కాకుండా ఇండియా గుర్తుకు వచ్చేలా ప్రయత్నాలూ ముమ్మరం చేశారు.) ప్రతీ ఒక్కరికీ ఆకలి తప్పని పరిస్థితి అనుకుంటే ఇంత మందికి ఆహారం పెట్టగలగటం ఆశ్రమ నిర్వాహకులకు పెద్ద పరీక్షే. ఆశ్రమ పెద్దయినటువంటి గురువుగారికి చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే. అరకొర సౌకర్యాలూ, ఈతిబాధలూ ఎలాగూ ఉండేవి. ఇంత మందిలో కొంత మంది ముఖ్యంగా పిల్లలు మాత్రమే తిని మిగితా వారంతా ఏదో ఒక వ్యాపకంలో పడి ఆకలిని మరచి పోవాలంటే ఏమి చేస్తే బాగుంటుందనేది ఆశ్రమ నిర్వాహకుల ప్రధాన సమస్య. ఇంకా పుస్తకాలూ, ఫేస్బుక్ లూ, ఈడియట్ బాక్సులూ లేని కాలంలో, ఇంత మందిని ఏదో ఒక ఆకలి కానివ్వని వ్యాపకంలో పెట్టడం తప్పనిసరైంది. పని చేయించుకుని తగిన ఆహారం ఇవ్వక పోతే ఆశ్రమ వాసులు గోల చేస్తారు. బయటి ఏ శారీరక పనైనా ఆకలిని పెంచక తప్పదు. అందుకే ఓ మూలకు ముక్కు మూసుకుని మాట్లాడకుండా, అన్నం పెట్టడం లేదేంటని గోల చేయకుండా ఉంచాలంటే ఏం చెయాలి అని ఆలోచించినపుడు ప్రాణాయామం, ధ్యానం వంటి కూర్చుని ఆపసోపాలు పడే టెక్నిక్ లు కనుగోబడ్డాయి. యోగి అనిపించుకోవాలంటే వీలయినంత తక్కువ తినాలి. బేసిక్ మెటబాలిక్ రేటు తగ్గాలంటే శ్వాసను వీలయినంత మెల్లగా పీల్చి వదులుతుండాలి. భగవంతుడి మీదనో శ్వాస మీదనో ధ్యాసను మరలించాలి. ఎంత ఎక్కువ సేపు ధ్యానాదులు చేస్తే అంతెక్కువ శక్తి వస్తుందనీ నమ్మించాలి. ఈ విధంగా ఆశ్రమ నిర్వాహకులు ఖర్చులు తగ్గించుకుని సమర్థవంతంగా ఆశ్రమాలు,నడపగలిగేసరికీ రోజు రోజుకీ ఆశ్రమ వాసులు పెరిగిపోయేవారు. వారి తాకిడిని తగ్గించడానికి ఆశ్రమాల్లో,యోగా మెడిటేషన్ చుట్టూ కఠినాతి కఠినమైన నియమాలూ ఏర్పడటం మొదలైంది. బ్రహ్మచర్యాది యమనియమాదులూ ఇత్యాదివి. లావు మనుషులు అతిగా తినకుండా ఉండాలంటే వారిని ఆశ్రమం లో నుండి బయటకి ఉరికించేలా చేయాలంటే అష్ట వంకరలుగా తిరిగి, తలకిందులైపోయే ఆసనాలు వేయించాలి. బీదరికంతో కునారిల్లే ఆశ్రమాలలో పరిస్థితులు మరోలా ఉండెవి. ఆశ్రమ వాసులు ప్రాణాయామంతో హైపర్ వెంటిలేట్ చేయడం వలన, పూరక రేచక కుంభకాల్లో కుంభకానికి అతి ప్రాధాన్యం ఇవ్వడం వలనా రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి ఒకరకమైన ఉన్మత్త స్థితికి జారిపోయేవారు. రక్తంలో ఒకటి నుండి ఎనిమిది శాతం వరకూ చేరిన కార్బన్ డై ఆక్సైడ్ వివిధ రకాల ఉన్మత్తాలకు గురిచేసేది. ఎనిమిది శాతం దాటిన వారిలో మెదడు పూర్తిగా స్పృహ కోల్పోయే పరిస్థితి ఉండేది. అదే అలౌకికానందం అనుకున్నారు. కొంత సమయం గడిచిన తరువాత కార్బన్ డై ఆక్సైడ్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చేశాక తిరిగి మామూలు స్థితికి చేరుకునే వారు. (బహుశా ఇటువంటి చెడు ప్రభావాలు గమనించేమో తరువాతి యోగా స్కూల్సు కుంభకాన్ని అవసరం లేదన్నాయి, రేచకానికి అధిక ప్రాధాన్యత కలిగించాయి. దీనివలన కూడా ప్రమాదం లేకపోలేదు, అతిగా కార్బన్ డై ఆక్సైడ్ వాషవుట్ అవడం శ్వాస ప్రక్రియనే అకస్మాత్తుగా ఆపేయనూ గలదు. కానీ సహజంగానే ఎవ్వరైనాగానీ, రేచక ప్రక్రియ ఎక్కవ సేపు కొనసాగించలేరు గనుక ఒక విధంగా అంత ప్రమాద భరితం కాదనే చెప్పాలి). ధ్యానంలో కూర్చుని ఊపిరి బిగబడితే మొదట వచ్చే నిద్రకు కారణం తక్కువ మోతాదులో కార్బన్ డై ఆక్సైడ్ రక్తంలో చేరడం. ఈ కునుకుతీత అసలు నిద్రలోని ఆర్.ఈ.ఎమ్. స్టేజి నిద్రతో సరితూగుతుంది కాబట్టి ఒక రకమైన స్వప్నావస్థను కలిగిస్తుంది. ఆర్. ఈ. ఎమ్ నిద్రలోనే మనకు స్వప్నాలు వస్తాయి. వీటిని సాధకులు మెడిటేషన్ వలన కలిగిన దివ్యానుభూతులని సంబరపడిపోవడం జరుగుతూ ఉంటుంది. మెడిటేషన్ కి ముందే దైవ సంబంధ విషయాలపై ట్యూన్ అయి వుంటారు కాబట్టి అది ప్రీ హిప్నోటిక్ స్టేజ్ గా పని చేసి, ఈ స్వప్నావస్థలో దైవ సంబంధమైన విషయాలు కనిపించేస్తూ ఉంటాయి. ఇక సాధకులు మెడిటేషన్ లో తమకు దైవ దర్శనం కలిగిందనీ, దైవ సందేశం వినిపించిందనీ ఆనందపడిపోవటమూ చూస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ ఆ ఆశ్రమం లోని గురువర్యుల చలవగా ఆశీర్వాద ఫలంగా తపశ్శక్తిగా కీర్తించ బడుతూ ఉంటుంది. అది ఆ ఆశ్రమంలో తక్కువ ఖర్చుతో జీవితం వెళ్ళబుచ్చటానికి అవసరమైన భూమికను కలగజేస్తుంటుంది. ఈ విధంగా ఆశ్రమ మేనేజ్మెంటు వారు ఖర్చులు తగ్గించుకోవడానికి కనిపెట్టిన కొత్త రూల్సుతో ఆశ్రమాలు చక్కగా నడిచేవని చెప్పాలి.
ఇపుడు శ్రీ రవి శంకర్ ఆధ్యాత్మిక గురువవుతాడా లేక యోగా గురువవుతాడా చెప్పడం కష్టమేమీకాదు. ఆయన ఆధ్యాత్మికనంతా యోగా ధ్యానాదులకే అపాదించేస్తాడు. ఆయనే కాదు ఆధ్యాత్మికత అంటే యోగా,యోగా అంటే ఆధ్యాత్మికత అనేది దాదాపు సో కాల్డ్ గురువర్యుల చింతన ప్రస్తుతానికి. అంతే కాకుండా ఒకప్పటిలా ఆశ్రమ వాసుల ఆకలికి ప్రత్యామనాయంగా కనుగొనబడిన యోగా, ఇపుడు ఆశ్రమ నిర్వాహకుల ధనాకలికి అనుగుణంగా వాడుకోబడుతుంది. యోగా ధ్యానాదులతో ప్రయోజనాలు లేవా అంటే ఉన్నాయి. శరీరాన్ని పలు విధాలుగా వంచగల, మౌనంగా కాసేపు ఆలోచించగల ఏ విషయమైనా యోగా ధ్యానంలవలె మనిషికి మంచే చేస్తుంది. అనవసర ఆలోచనలతో స్ట్రెస్ తో సతమతమయ్యే సగటు మానవునికి యమాది కఠిన నియమాలు కొంత వరకు ఉపశమనాన్ని కలిగించగలవు. లేటెస్ట్ గా యమాది నియమాలు కుదరవు కాబట్టి, పది ఆసనాలు, ఐదు రకాల ప్రాణాయామాలు, కొంత సేపు ధ్యానమూ వంటి ప్యాకేజీలూ ముందుకొచ్చేశాయి. అయితే జీవితంలోని అసలు సమస్యలు వదిలేసి ఈ యోగాది కార్యక్రమాలలోకి పలాయనం చెంది జీవించే వారూ లేకపోలేదు. ప్రతీ సమస్యకూ యోగాలో దివ్యమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పేవారూ పెరిగిపోయారు. ఎయిడ్స్ కాన్సరు వంటి భయానక జబ్బులకూ ఈ జబ్బును పాకించారు. అంతే కాకుండా రజినీష్, మహేశ్ యోగీ, దీపక్ మహతా, యోగానంద వంటి వారి పుణ్యమాని "న్యూ ఏజ్ రిలీజియస్ కల్చర్" పాశ్చాత్య దేశాల్లో వేళ్ళూనుకుంటుండటంతో, రవిశంకర్ వంటి యోగా గురువులకూ అక్కడ గిరాకీ పెరిగింది. ఏ యోగా గురువు దెగ్గర చూసినా ముందు వరసల్లో వందల సంఖ్యలో ఫారీనర్స్ దర్శనమిస్తూంటారు. "ఆయనంటే ఏమనుకున్నావు..ఎంత మంది ఫారినర్స్ ఆయన దగ్గరికి వస్తుంటారు తెలుసా, ఏం వాళ్ళంతా పిచ్చోళ్ళా..?" అని పరమ భక్తులు మనమెపుడయినా ఆయన్ని శంకిస్తే వాపోతూంటారు. ఫారినర్స్ ముందు వరసలో ఉన్నారంటే ఆ గురువు పరమ ఉత్కృష్టమైన గురువనే నికృష్ట భావనలూ అధికమయ్యాయి. ఈ మెడిటేషన్ కునుకులల్లో వచ్చే పిచ్చి కలలను గొప్ప దివ్యానుభూతులని నమ్మేస్తూ, అవి కనిపించటం వెనుక ఉన్న అంతరార్థమేమిటని పిచ్చి భక్తులు అడుగుతుండగా, ఆకుకు అతకక పోకకు పొసగకా గురువర్యులం గారు సమాధానాలూ ఇస్తుంటారు. అదంతా భగవంతుడి కృపకంటే ఆ గురువర్యుని కృపే అనుకోవడమూ కద్దు. వారి వస్త్రాల మీద, ఇండ్లల్లో భగవంతుడి ఫోటోలకంటే ఈ గురువర్యుల ఫోటోలే ఎక్కువగా ఉంటాయనంలో సందేహమూ లేదు.
శ్రీ రవి శంకర్ వంటి యోగా గురువులు ప్రభుత్వ వేదికల మీద కనబడటంలో ఏలుతున్న వారి పాత్ర కంటే గత కాలపు మౌలిక రాజకీయ శక్తుల ఫెయిల్యూర్ ని సూచిస్తుంది. మొదటి సహస్రాబ్దిలో రోమ్ లో రాజకీయ శక్తులు బలహీన పడి విచ్ఛిన్నం చెందటం వలననే రోమన్ కాథలిక్ మత శక్తులు బలం పుంజుకున్నాయనేది నిష్ఠుర సత్యం. క్రూసేడులూ ఇటువంటి మత, రాజకీయ శక్తుల పరస్పర బలాల బేరీజుల్లోనే జరిగిపోయాయి. ఇపుడు శ్రీ రవి శంకర్ వంటి వారి వేదికా వైభవాలకు కుటుంబ రాజకీయ వ్యవస్థల వైఫల్యమే ప్రధాన కారణమనీ చెప్పవచ్చు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో ఇపుడు శ్రీ రవిశంకర్ అసంబద్ధ సూచనలను కేవలం ఒక రాజకీయ వర్గపు బలాఢ్యతగా మాత్రమే పరిగణ చేసి లెక్కించడం, మరొక రాజకీయ వర్గపు బలహీనతను చూడకపోవడమే అవుతుంది. రైతు ఆత్మహత్యల వంటి సీరియస్ సమస్యకు ఆధ్యాత్మికం వంటి పైపై పరిష్కారాలు చెప్పడం బహుశా మన రాజకీయాల "ఆల్ ఈజ్ వెల్" ధోరణిని చూపిస్తుంది. అంతా బాగుంది గానీ అల్లుని నోట్లో శని ఉంది కాబట్టే ఇలా జరిగింది కనుక శని గ్రహ శాంతి చేస్తే సరిపోతుందన్నట్టు, సమస్య మూలాలను వదిలి పూజా పునస్కారాలు చేసుకుంటే ఆత్మహత్యలు తగ్గుతాయని చెప్పడం చాలా దారుణమైన విషయం. ఒక వేళ ఈ స్వాములం వారు చెప్పినట్లు ఈ పొర్లు దండాలు ఆత్మహత్యలను నిజంగా ఆపేసేవే అనుకున్నా, అది కేవలం పాలకులకు వారి నిష్క్రియా పరత్వాన్ని తేలికచేసి, మొత్తానికే తప్పుదారి పట్టించి సమస్య తీవ్రతను ఇంకా పెంచేదిగా మాత్రమే మారుతుంది తప్ప మరోటి కాదు. నిజంగానే యోగాది కార్యక్రమాలకు మనిషిలో మార్పు తీసుకు రాగల శక్తే ఉంటే, మైకుల ముందు కోట్ల సంఖ్యలో ఉన్న రైతులకు ఉచిత సలహాలు ఇచ్చే బదులు వందల సంఖ్యలో ఉన్న రాజకీయ దురంధరులకు సలహాలిచ్చి రైతు సమస్యలపట్ల చిత్తశుద్ధి కలిగుండేలా వారి బుద్ధులను మార్చమని శ్రీ రవి శంకర్ సాములోరికి మా ప్రార్థన.
విరించి విరివింటి
1/5/17

No comments:
Post a Comment