రక్త మాంసాలతో తిరిగే యంత్రం
-------------------------------------------
Most dangerous man after Jesus Christ ఎవరు అంటే కార్ల్ మార్క్స్ అనే చెప్పాలి. ఒకరికొకరు సైద్ధాంతిక వ్యతిరేకులే. "ఏమి తినాలి? ఏమి తాగాలి? ఏమి కట్టుకోవాలి అనే విషయమై భయపడకండి. దేవుని సామ్రాజ్యాన్ని ఆతడి నైతికతని కోరుకోండి" అంటాడు జీసస్. (మాథ్యూ 6: 31-33). కానీ ఎంగెల్స్ ప్రకారం మార్క్స్ దృక్కోణం దీనికి పూర్తిగా విరుద్ధమైనది. "మతమూ, శాస్త్రీయ పరిజ్ఞానానమూ, కళ, రాజకీయమూ ఇత్యాది అన్నింటికంటే ముందు మనిషి తినాలి, తాగాలి, బట్ట కట్టాలి, ఒక ఇంట్లో నివసించాలి" అంటాడు మార్క్స్. మతం స్వర్గాన్ని ప్రతిపాదిస్తుంది, దాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడంటుంది. మార్క్స్ దేవుడి స్వర్గాన్ని పగలగొట్టి యుటోపియన్ సమాజాన్ని కడతానంటాడు. దేవుడిచ్చేదేంది, దాన్ని మనిషే సాధించుకోవాలంటాడు. ఎక్కడినుంచొచ్చాడీ మార్క్స్?. భూస్వామ్య వ్యవస్థలోని రైతు కూలీలు అనబడే కుళ్ళిన కళేబరాలు, ఒకానొక స్వేచ్ఛా స్వాతంత్యాల ఎరలో పారిశ్రామిక వ్యవస్థలోకి మారి..రైతు కూలీల నుండి ఫ్యాక్టరీ కూలీలుగా వేషం కట్టి, ఆలోచన చేయటం అనే అలవాటే మరచిపోయిన సమాంజంలోంచి ఒక ఆలోచనగా పుట్టుకొచ్చాడు. అందుకనేమో "ఒక వ్యక్తియొక్క సాంఘిక జీవితమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది" అంటాడు మార్క్స్. అది యూరోప్. అక్కడ ఫ్యాక్టరీ పొగగొట్టం లోంచి తన్నుకొచ్చే పొగ, చిమ్మ చీకటిలా, గతకాలపు చరిత్రలా, స్వార్థపరుల్లా చుట్టలు చుట్టుకుంటూ..పలుచనై పటాపంచలౌతూ నే వున్న తరుణం. 1775 సం నుండి 1850 సం మధ్యన వచ్చిన ఈ మార్పే పారిశ్రామిక విప్లవం. కాల్పనికమో, నిజమో, సాతాను అనేవాడు ఒకడు ఉన్నందుకు జీసస్ అనేవాడు ఉన్నాడు. కానీ కళ్ళ ముందు వాస్తవంగా, వికృతంగా, భయంకరంగా ఫ్యాక్టరీ నిలబడి ఉన్నందుకు కారల్ మార్క్స్ అనే వాడూ ఉన్నాడు. ఆ ఫ్యాక్టరీ ఉన్న చోటు నుండి ప్రజల జీవితం లోకి పాకింది. మార్క్స్ పాకలేక పోయాడు. ఫ్యాక్టరీ ప్రజల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసేసింది. మార్క్స్ బాగు చేయలేక పోయాడు. కానీ ఆలోచనాపరుల, కవుల మెదళ్ళ లోకి పాకాడు. బాహ్య జీవితపు వాస్తవికతనూ, అంతర జీవితపు అవసరాన్ని గుర్తించే చైతన్యాన్ని రగిలించడానికి కాల్పనిక భ్రమలు తొలగించటానికి కవితలై కూడా దూకేశాడు. అలా మార్క్స్ ను ఒక వాహికగా చేసుకున్న వాడు ఆవంత్స సోమసుందర్.
భారత దేశం సాధించుకున్న స్వాతంత్యం పారిశ్రామిక విప్లవాన్ని కూడా తీసుకువచ్చింది. యూరోప్ కంటే వంద సంవత్సరాలు వెనుకబడినా ఆ అవలక్షణాలన్నిటినీ పుణికి పుచ్చుకుని అక్కడున్నట్టుగానే ఇక్కడికీ వచ్చింది. అదే ధన మదం, అదే నీతిమాలినతనం. అదే నిర్దయనీ, అదే ఆకలినీ, అదే ప్రేత కళనీ తీసుకుని వచ్చింది అణువంతయినా తేడా లేకుండా. దేవుడు కూడా అక్కడి లాగే ఇక్కడా మౌనంగానే ఉండి పోయాడు. దేవుడు చచ్చిపోయాడన్న నీషే అరుపులు ఇక్కడి దాకా బహుశా వినపడి వుండవు. పైగా ఎప్పటిలాగానే ధనస్వాములు చచ్చి పోయిన దేవుడు బతికున్నాడని నమ్మించగలిగారు. దేవుడ్ని బతికించారు కూడా . అలా బతికొచ్చిన దేవుడు పెట్టుబడీ దారుడి నమ్మిన బంటై కూర్చున్నాడు. తనని బతికించారన్న కృతజ్ఞత దేవుడితో పొంగి పొరలి వుంటుంది. ఇక పేదల అన్నార్తుల దీనారవాలని వినే ఓపికెందుకుంటుంది?. ఓపిక ఉన్నా ధనస్వామి విననీయడు. ఎందుకంటే కరిగించిన సీసం అన్నార్తుల నోట్లల్లో కాదు దేవుడి చెవుల్లో కదా పోయబడింది!.
అంచాతనే దేవుడు
ధనస్వామి నమ్మిన బంటై
పేదల అన్నార్తుల దీనారవముల
శ్రవణాలకు చేరువ కానీయడు
దేవుని శ్రవణ పుటమ్ముల
కరగించిన సీసం
పోశాడట ధనస్వామి
సందేహం దేనికి
స్నేహితుడా! యిది సత్యం.
అమాయకుడయిన డేవుడి చేతులూ కట్టివేయబడ్డాయి. సుకుమారులనూ, సోమరి పోతులనూ మాత్రమే సృష్టించడం మొదలు పెట్టాడు దేవుడు. ఆ సోమరి పోతులు తమకు సౌఖ్యాలు చేకూర్చేందుకు తమకు తామే కొత్త దేవుళ్ళయ్యారు. పెట్టుబడి దారులయ్యారు. దీనులనూ అన్నార్తులనూ సృష్టించి, సరికొత్త సృష్టికర్తలయ్యారు. సంపదని తామే సృష్టిస్తున్నాం అన్నారు. సంపదలేని వారిని తమ దాసులుగా చేసుకున్నారు. వారి శ్రమని దోచుకున్నారు. ఆర్థిక స్వేచ్ఛనీ స్వాతంత్యాన్నీ ఎరగా వేసి, విశ్వామిత్రుడి త్రిశంకు స్వర్గాన్ని మించి, దేవేంద్రుడి దేవలోక స్వర్గాన్ని మించి, ఒక అధునాతన స్వర్గాన్ని మలిచారు. దాని పేరే ఫ్యాక్టరీ. ఈ అన్నార్థులంతా అందులో బానిసలయ్యారు. వారంతా అక్కడొక కొత్త జాతిలా తయారయ్యారు. తద్వారా మానవ చరిత్రలో మునుపెన్నడూ లేని కొత్త మానవుడు, ఒకానొక సోమరిపోతు తనకోసం సృష్టించుకున్న మానవుడు, ఒకడు పుట్టుకొచ్చాడు. వాడి పేరు శ్రామికుడు. దినసరి కూలీ కోసం జీవితాన్ని అంకితం చేసుకునే అభాగ్యుడు. దద్దరిల్లే పేగులతో..రక్తం లాంటి స్వేదంతో..సున్నమైన ఎముకలతో దీనంగా నిస్తబ్దతగా, భయ భ్రాంతులతో, జీవకళా రహితంగా, యంత్ర ప్రాయంగా, చివరికి తానే ఫ్యాక్టరీ యంత్రంలో ఒక భాగంగా మారిన నవీన మానవుడే ఈ శ్రామికుడు అనబడే వాడు. అలా సోమరి పోతు పెట్టుబడి దారుడయ్యాడు. కష్ట పడి పని చేసే వాడు శ్రామికుడయ్యాడు. సృష్టి కర్త అనేవాడొకడుంటే, వాడు ధనవంతులకు దేవుడయ్యాడు, ధనవంతుడు శ్రామికుడికి దేవుడయ్యాడు. శ్రామికుడు యంత్రంలో ఒక భాగమయ్యాడు. ఫ్యాక్టరీ దేవాలయమయ్యింది. పెట్టుబడీదారి వ్యవస్థ మతమయ్యింది. అదంతా మనముందు ఈ కవితలా మారింది.
శ్రామికుడు తింటాడు, ఫ్యాక్టరీలో పని చేయటం కోసం. పడుకుంటాడు, పొద్దున్నే ఫ్యాక్టరీ సైరన్ వినటం కోసం . విశ్రమిస్తాడు ఫ్యాక్టరీలో సరిగా పని చేయటం కోసం. ఆదివారం సినిమాకు పోతాడు, సోమవారం నుంచి శని వారం దాకా ఫ్యాక్టరీలో ఉండటం కోసం. భార్యా పిల్లలతో కాసేపు గడుపుతాడు మనసులో పని భారాన్ని తగ్గించుకోవటం కోసం. పనిలో నిపుణత పెంచుకుంటాడు, ఫ్యాక్టరీలో మంచి పేరు తెచ్చుకోవటం కోసం. ట్రైనింగ్ సెంటర్ లలో ట్రైనింగ్ తీసుకుని స్కిల్ నేర్చుకుంటాడు, ఫ్యాక్టరీలో ఉద్యోగం ఊడకుండా ఉండటం కోసం. కానీ అందుకు ప్రతిగా ఫ్యాక్టరీ ఏదీ వాడికి మిగలనీయదు. కాళ్ళ నూ గోళ్ళనూ నల్ల బరుస్తుంది. బొబ్బలెక్కిస్తుంది. చార్లీ చాప్లిన్ మోడరన్ టైమ్స్ (Modern Times) లో చూపించినట్టు నరాలు పగిలిపోతాయి (Nervous Brakedown). ఊపిరి తిత్తుల్లో రంధ్రాలు పడతాయి (pnemoconiosis). ఫ్యాక్టరీ దగ్గునీ, ఉబ్బసాన్నీ క్షయ (TB) వ్యాధినీ అదనపు కానుకగా ఇస్తుంది. వాడి జీవితంలో ప్రతీ విషయాన్నీ factory ప్రభావితం చేస్తుంది. పెట్టుబడి దారుడు మాత్రం శ్రామికుడి శ్రమ శక్తిని 'అదనపు విలువ'గా మార్చుకుని లాభాలు గడిస్తాడు. అవైలబుల్ డాటా ప్రకారం, 1950-60 దశకంలో తూ ర్పు యూరోప్ దేశాల్లో యంత్ర సామాగ్రి ఉత్పత్తి సగటున 500 శాతం పెరిగితే, 30 శాతం మరణాలు కేవలం పారిశ్రామికికరణ వల్లనే పెరిగాయట.
అదిగో అది ఫ్యాక్టరీ
శక్తిలేని హీనస్వరమున
అలసిన పెనుభూతంలా
బెబ్బులిలా
గర్జిస్తున్నది ఫ్యాక్టరీ
స్పృహ తప్పిన భుజంగం వలె
భుగభుగమని
పొగలెగజిమ్ముతోంది చిమ్నీ
పారిశ్రామికీకరణ శ్రామిక జీవితాల్నే కాదు. ప్రజలందరి జీవితాల్నీ ప్రభావితం చేస్తుంది. కొత్త నగరాలు ఏర్పడతాయి. పనికోసం గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరుగుతాయి. ఓవర్ క్రౌడింగ్ ఉంటుంది. కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఫ్యాక్టరీ వేస్ట్స్ పారే నదులల్లో, చెరువుల్లో కలుస్తాయి. నదులు మూసీ కాలువలవుతాయి. చెరువులు హుసేన్ సాగర్లవుతాయి. నిశ్శబ్ద౦గా తెలియకుండానే లెడ్ వంటి విష పదార్థాలు ఆ చుట్టు పక్కల నివసించే వారి రక్తంలో ప్రవహిస్తాయి. అర్థం కాని జబ్బులొస్తాయి. ఆకు కూరల్లో, కూరగాయల్లో, తాగే నీటిలో ఉండాల్సిన దానికన్నా అధిక పీపీఎమ్ ల లోహాలు వచ్చి చేరుతాయి. అంతా సవ్యంగా జరుగుతున్నట్టు, జీడీపీ, పర్ కాపిటా ఇన్కమ్ పెరిగిపోతున్నట్టూ భ్రమలు అల్లుకుంటాయి. స్ట్రెస్ తో, జబ్బులతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ (Quality of Life) మాత్రం భయంకరంగా తయారవుతుంది.
కానీ ఈ కవితలో కవికి ఒక నమ్మకం ఉంటుంది. ఈ శ్రామికులంతా ఏకమై ధన్స్వామ్య దోపిడీ దుర్గాన్ని కూలగొట్టేస్తారని. "ప్రపంచ కార్మికులరా ఏకం కండి- పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప" అని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లో చివరి సారిగా అరిచిన మార్క్స్ ఒక నమ్మకాన్ని కవిలో కలిగించాడేమో. ఆ శుభ సమయం ఒచ్చేస్తున్నట్టు కలగంటాడు ఈ కవి. "మనం ఉరి తీయాల్సిన చివరి కాపిటలిస్ట్ ఆ ఉరి తాడును మనకి అమ్మినవాడే అయ్యుంటాడు" అని అమాయకంగా మార్క్స్ అనుకున్నట్టు 1949 లో కవి రాసుకుంటాడు. ఆ అభ్యుదయ సమయం లో తెలుగునేలను తడిపిన హేతువాద దృక్పథం, ప్రజా సన్నితత్వం, వాస్తవిక చిత్రణ, సమస్యల విశ్లేషణలో మార్క్స్ సిద్ధాంతల సమన్వయము అన్ని కలగలిసిన "వజ్రాయుధం" లా కవి కనిపిస్తాడు. యూరోప్ లోని అనుభవాలు మనకూ ఎదురు కాకూడదని మనదేశ౦లో పారిశ్రామికీకరణ మొదలైన ఆ సమయంలోనే కార్మికుడిగా భారతీయుడు అవతరించిన తోలి దశ లొనే ఆ వ్యవస్థ డొల్లతనాన్ని మన ముందు కవితల పరుస్తాడు.
ఫ్యాక్టరీ (excerpts only)
.....................
అదిగో అది ఫ్యాక్టరీ
ధనమదాంద అధికారుల
కనికర రహిత గర్వం
ఆకృతియై
నిలిచిన ఫ్యాక్టరీ
అహంకార ధికృతిగా
భువి పేగులు దద్దరిల్ల
నీతిమాలి గర్జిస్తుందదిగో
చూస్తున్నావా
మానవులేనని పొరబడుతున్నావా?
రెండు కాళ్ళ పై కదిలే
యంత్రాంతర్భాగమ్ముల దేహమ్ములు
ప్రతీ స్వేదబిందువులో
రక్తం వాహినిగా ధారవోసి
తేనెను సమీకరించేందుకు మాత్రం
పుట్టిన కూలీలవి
చూస్తున్నావా?
వారా? మానవులా??
సత్స్వరూప వారసులా?
రక్తమాంసములు కలిగిన
యంత్రాంతర్భాగమ్ములు
అదిగో అది ఫ్యాక్టరీ
శక్తిలేని హీన స్వరమున
అలసిన పెనుభూతంలా
బెబ్బులిలా
గర్జిస్తున్నది ఫ్యాక్టరీ
నెత్తురు కక్కుతున్న
తూట్లు పడ్ద ఊపిరితిత్తులవలె
నల్లని పొగ చిమ్ముతోంది చిమ్నీ
స్నేహితుడా చూస్తున్నావా
అనితర సాధ్యమ్మగు
ప్రజాశక్తి సైన్యాలై
విలయకాల రౌద్రంతో
విప్లవ చైతన్యంతో
పురోగమిస్తున్నారదిగో
కార్మిక కోపాగ్నిచ్ఛటలకు
తాల లేని శలభంవలె
ధనస్వామి తపతపమని
పాదాంతం వణికిపోయి
విప్లవ శక్తికి
పాదాక్రాంతుడయే
శుభసమయమ్మిదే
ఆసన్నం అవుతున్నది
ఆరంభించిందపుడే
15/3/16
(కవిత్వ సందర్భం12)

No comments:
Post a Comment