అసామాన్య వ్యవస్థలో అసామాన్య నిర్ణయాలు
---------------------------------------------------------
"మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే" అన్న మార్క్స్ మాటలను కళ్ళారా చూడటానికి ఇపుడు మనదేశంలో నెలకొని ఉన్న పరిస్థితి నిలువెత్తు సాక్షంగా నిలుస్తున్నది. ఆర్థిక శాస్త్రం అనేది పుస్తకాలను చదువుకుని ఊహించినంత, గత చరిత్రను చూసి అంచనా వేసినంత సులువుగా ఏమీ ఉండదనేది మరోసారి నిరూపణ అయ్యింది. "ఈ విధంగా చేస్తే పరిస్థితి ఈవిధంగా జరుగుతుంది, ఇవ్విధమైనటువంటి ఫలితం వచ్చేస్తుంది" అని ఊహాగానాలు చేసేంత సులువుగా ఆర్థిక విషయాలు కొనసాగకపోగా, ఊహించని మలుపులతో ఊహించని సమస్యలతో నిరంతర జాగురూకత స్థితిని డిమాండ్ చేస్తుందనేది ఇపుడు మనకు అర్థం అవుతుంది. ఈ పెద్దనోట్ల నిలుపుదల విషయం మన ప్రభుత్వం తీసుకున్న 'అనాలోచిత చర్య' అనడానికి పూర్తి అవకాశం ఉన్నా, దాని వెనుక ఆర్థిక శాఖా విభాగం చేసిన కసరత్తు ఏ మాత్రం సరిపోనిదిగా తయారయింది. దేశంలో ప్రజల జీవితాల్ని తక్షణమే ప్రభావితం చేసే ఇంత పెద్ద నిర్ణయాన్ని ఏ మాత్రం ముందస్తు కసరత్తు లేకుండా చేశారా, ఊహించని పరిణామాల్ని అసలు ఊహించనే లేదా అనేటువంటి అనుమానాల్ని కలిగిస్తున్నది.
"బడాబాబులకు అనుకూలంగా జరిగింది" అన్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. ఇది ప్రభుత్వ వ్యవహారాల్లో బడాబాబుల పెత్తనాన్ని అవమానించడమే. బూర్జువా సమాజపు ప్రభుత్వాల పనితీరుని సరిగా అంచనా వేయలేకపోవడమే. అందుకే "బడాబాబుల కనుసన్నలలో జరిగిందనడం" సముచితమేమో. ఇది ఈ ప్రభుత్వం చేసింది కనుక, ఈ ప్రభుత్వం మీద బురద చల్లడం కాదుగానీ, ఏ ప్రభుత్వం చేసినా ఇంతకు మించి వేరేగా చేయలేదన్నది సత్యం. ప్రపంచ మార్కెట్టు విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచమంతటా ఉన్న ప్రభుత్వాలన్నీ బడాబాబుల ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే కమిటీలుగా మారుతాయన్నాడు పెద్దాయన మార్క్స్. ఇంతకు మించి వేరేగా ఉండలేదు కాబట్టి, బడాబాబులకు ఇటువంటి నిర్ణయాలవలన ఏమీ అన్యాయం జరగలేదు అని బాధపడటంలో అర్థం కూడా లేదు. గత ప్రభుత్వాలే తీసుకుంటే లైసెన్స్ రాజ్ లోని లొసుగులనుండి ఎంత మంది బడాబాబులు ఉదయించారో తెలియక కాదు. లైసెన్స్ రాజ్ ల విషయంలోనే పరిస్థితి అలా ఉంటె, ఆర్థిక సవరణల యుగం లో ఇంతకు మించి వేరేగా ఉండదు. ఎలక్షన్లలో నాయకుల ప్రచారాలకు పెట్టుబడి ఎక్కడినుండి వస్తున్నదో, బడాబాబుల బడా బడా బ్యాంకు లోన్లకు ఋణమాఫీలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోలేనంత, అర్థం చేసుకోలేనంత బీరకాయ సంబంధమేంకాదీ వ్యవహారం. బడా బాబులంటే ఎవరు అంటే ఏ అంబానీనో, అగర్వాలో, థాపరో, టాటానో, బిర్లానో అనుకోవడం అంటే మనం ఇంకా పురాతన మైండ్ సెట్ తో నివసిస్తున్నట్టే. ఎనభై ఐదు శాతం మన పార్లమెంట్ సభ్యుల్ని ఈ విధంగా మనం అవమానించినట్లే. వీళ్లందరోఓ పార్లమెంటుకు ఎంపిక కావడానికిగల మినిమం క్వాలిఫికేషన్ అంతకుముందు వ్యాపారవేత్త అయుండటమే. మనమే ఎన్నుకంటాం వారిని, బాగా మాట్లాడుతున్నాడని, నిజాయితీగా పనిచేస్తాడనీ కాదు, బాగా డబ్బున్నవాడని. వీరిలో అస్మదీయులనూ తస్మదీయులనూ ఆయా ప్రభుత్వాలు గుర్తిస్తుంటాయి తప్ప, నిజానికి బడాబాబులెందరో మన దేశంలో.
మరి అటూ ఇటూ కాక ఎవరికోసమీ ఆకస్మిక నిర్ణయాలు?. ప్రభుత్వం( బడాబాబుల ప్రాథమ్యాలను పరిరక్షించే ప్రభుత్వం అని బై డీ ఫాల్ట్ గా చదువుకోవాలి) దేశంలోని నల్ల ధనాన్ని వెలికి తీయటంకోసమే అంటున్నపుడు, దేశంలోని సగంపైగా సంపద బడాబాబుల చేతిలో పోగుపడిఉండగా, ప్రభుత్వం బడాబాబుల కోసమే పని చేస్తూ ఉండగా, ఇక బ్లాక్ మనీ ఎవరి చేతిలో ఉన్నట్టు?. సామాన్యుడి చేతిలో ఉన్నట్టా..?. ఐతే ఈ దేశంలో సామాన్యుడి డెఫినిషన్ చాలా కష్టమైనది. ప్రతీ అసామాన్యుడూ తానో సామాన్యుడినే సుమా! అంటుంటాడు అనడానికి పరాకాష్ట రాజకీయ నాయకులు తమ ఆస్థి వివరాల్ని నిజాయితీగా బయటపెడుతున్నామని చెప్పుకోవడం. ఆ వివరాల్ని మనం వ్యక్తి పూజతోనో, కులం లేదా మతం పూజతోనో "అవునవును ఎంత నిజాయితీ పరుడో" అని నమ్మి సంతోషపడిపోవటం చేస్తుంటాం. ఇందులో, ఓటరు తన ఓటు నిజాయితీగల వాడికే పడిందని కొంతసేపు ఊగిపోయే ఆనందానికి లోనవడం తప్ప ఇంకోటి కనిపించదు. అంత వెర్రి వారిమి కనుకనే నిజాయితీకి మన దేశంలో అర్థాలే మారిపోతుంటాయి. పైగా నమ్మించే కార్యక్రమాలతో అనుసంధానకర్తగా ఉంటూన్న మీడియా, అవినీతి రహిత భారతదేశం కోసమే తాము పనిచేస్తుంటామని ఇంకో నమ్మకాన్ని ముందే మన మనసుల్లో నెలకొల్పుతూ ౦టుంది. ముఖ్యమంత్రాదులు సైంతం తమ ఆస్థి వివరాల్ని నిజాయితీగా తెలియజేస్తూ, అతి సామాన్యుడిలా బతికేస్తున్నాం, వాచీ లేదు, తినడానికి తిండిలేదు అని చెబుతున్నపుడు, అసలైన సామాన్యుడు "ఇంతకీ నేనెవర్నీ ..?" అని బహుబలి రేంజ్ లో అడగక తప్పదు.
మన వ్యవస్థే అసామాన్యంగా తయారైనపుడు సామాన్యుడనేవాడిని వ్యవస్థకి బయట మనం వెదకాల్సి ఉంటుంది. వ్యవస్థలో అంతగా పాలు పంచుకోని, పంచుకోలేని, పంచుకోనివ్వని మనిషినే మనం సామాన్యుడని నిర్వచించుకోవాల్సి ఉంటుంది. కూతురి వివాహానికి ఒక పూటకోసం పది కోట్ల సెట్టింగ్ వేయగలిగిన సామాన్యుడు, కొడుకు మెడికల్ కాలేజీ సీటుని కోటిన్నరకు కొనుక్కునే సామాన్యుడు, ఐసీసీయూ లో ఒక రోజుకు యాభైవేలు సమర్పించి ట్రీట్మెంటు చేసుకోగల సామాన్యుడు, పది కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుని, పది రోజుల్లో ఇరవై కోట్లకు అమ్ముకునే సామాన్యుడు, బ్యాంకు లోను మీద బెంజ్ కారు కొనుక్కుని తిరిగే సామాన్యుడు, సంవత్సరంలో సంపాదించిన కోట్ల సంపాదనని కరెక్టుగా రెండున్నర లక్షలకు అటు ఇటుగా చూపించేసి చేతులు దులుపుకునే సామాన్యుడు, హోటల్ కి వెళ్ళి ఒక పూట భోజనానికి పది వేలు ఖర్చు పెట్టి, టిప్పు ఐదువందలు వేయగలిగిన సామాన్యుడు, లైసెన్సు కోసం లైన్లో నిలబడేబదులు ఐదువేలు లంచమిచ్చి పనిగావించుకునే సామాన్యుడు, మున్నగు వారందరూ ఈ వ్యవస్థ నిర్మించిన అతి సామాన్య ప్రజలుగా మనం చెప్పుకుంటే, వీరందరికీ ఈ జీవిత విధానాన్నీ, ఆలోచననీ, కలలనీ కల్పించిన అసామాన్య వ్యవస్థను ముందుగా తయారు చేసిందెవరని ప్రశ్నించాలి. నిజానికి వీటన్నింటికీ బయట, వీటితో ఏమాత్రం సంబంధం లేకుండాగా ఉంటుంది, పూట గడవడానికి కాయా కష్టం చేసే అసలైన సామాన్యుడు, వాడి జీవితం. "నేను సామాన్యుడిన"నుకునే ప్రతీ అసామాన్యుడూ ఈ రోజు బ్యాంకు ముందు లైన్లో నిలబడి తన సామాన్యత్వాన్ని ప్రదర్శిస్తూన్నపుడు, అసలైన సామాన్యుడి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఏలిన వారు చెప్పే నల్లధనం సంగతేమోగానీ, అసలు ఉండాల్సిన ధనం లేని వాడు బ్యాంకు ముందు ఎందుకు కనిపిస్తాడు?. అంతే గుడ్డిగా రాహుల్ గాంధీ అడుగుతాడు, "ఇక్కడ లైన్లో సూటు బూటు వేసుకున్న వారెవరైనా ఉన్నారా?" అని. సామాన్యుడి వేషధారణలమీద ఎంత నమ్మకమో ఆయనకు మరి.
నల్లధనం వెలికితీత అసామాన్యమైన మన వ్యవస్థను సామాన్యంగా తయారు చేస్తుందని నమ్మే అసామాన్యులందరూ వ్యవస్థలోని లోపాల్ని గుర్తించగలుగుతారనుకోవడం పొరపాటు. ఒకే ఫ్రేం ఆఫ్ రిఫరెన్సులో ప్రభుత్వం, వ్యవస్థ సమాన వేగాలతో నడుస్తుంటాయన్న భౌతిక శాస్త్ర విషయాన్ని కొద్దిగా అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి ఈ పెద్దనోట్ల రద్దు విషయం వ్యవస్థలో నిజానికి కొంత మార్పు తేగలిగినా వ్యవస్థ మారనంతవరకూ అది నీటి మీద రాయేయడం తప్ప ఇంకేమీ కాదు.
13-11-16
విరించి విరివింటి

No comments:
Post a Comment