ఈనాటికైనా మనం అసలులమా? నీడలమా?.
..............................................................
అభ్యుదయ కవితోద్యమాన్ని భావ కవిత్వపు ఫ్రేం ఆఫ్ రిఫరెన్సు ద్వారా చూసి, అటు ఆధునికతకూ, ఇటు భావ కవిత్వానికీ వారధిలా నిలిచాడు తిలక్. వస్తువు అభ్యుదయ కవిత వలె కొత్తది. శైలి భావ కవిత వలె రమ్యమైనది. ఆంగ్ల మోడర్నిస్ట్ కవులు కళాకారులుగా మిగిలిపోయారు. తోటి కళాకారుల కోసం రాసుకున్నారు. క్యూబిజం, డడాయిజం, సర్రియలిజం అంటూ కళ లో కవితలో ప్రయోగాలు చేశారు. తద్వారా సంక్లిష్టమైన సాహిత్యాన్ని అందించారు. కానీ అభ్యుదయ కవులు ప్రయోగాలు చేస్తూ ప్రజల వైపే నిలబడ్డారు. ప్రజల్లో తామూ ఒకరిగా నిలబడ్డారు. వెస్టర్న్ కవుల రొమాంటిసిజం పంతొమ్మిదవ శతాబ్దం మొత్తం సాగినా, తెలుగులో ఇరవైయవ శతాబ్దపు తొలి రెండు మూడు దశాబ్దాలకు పరిమితమైంది. అంతరించి పోతున్న భావ కవిత్వపు ఛాయల్లో నిలబడి అభ్యుదయ కవితను పలికించిన వాడు తిలక్. అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం లో 'నీడలు' అనే కవిత లో తిలక్ మనల్నందరినీ దగ్గరగా చూడటమే కాక మనలో ఒకడిగా కనిపిస్తాడు. రాత్రి పడుకునే ముందు ఆశల్నీ ఆశయాలనీ నెమరు వేసుకుని, ఉదయం నిద్రలేచాక అంతా మామూలే మనకు. యథాతథం.
నీడకూ, ప్రతిబింబానికీ తేడా ఉంటుంది. రెంటికీ ఒకానొక వస్తువే ఆలంబన. కానీ ప్రతిబింబం వస్తువుకి డిస్టార్టెడ్ వర్షన్ కాదు. వస్తువుకి కాపీ. కుడి ఎడమలే మార్పు. అద్దం ముందు నిలబడితే తెలిసిపోతుంది. కానీ, నీడ వస్తువుని పోలి లేదు. కురచది. వక్రమైనది. నీడ— అనే పదాన్ని ఎన్నో రకాల అర్థాల్లో వాడవచ్చు. ఈ కవితలో 'హిపోక్రసీ' అనే అర్థం స్పురిస్తుంది. ఎవరికి హిపోక్రసీ?. హిపోక్రసీ ఆఫ్ ఎ కామన్ మాన్. తిలక్ 'నీడలు' కవితలో ఈ కామన్ మాన్ మధ్యతరగతి మనిషి గా కనిపిస్తాడు. ఒక వ్యక్తి సంపాదన ఆధారంగా ఉన్నత, మధ్య, బీద తరగతికి చెందిన వాడనే విభజన ఉంది. మధ్య తరగతిలో మళ్ళీ అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అని విభజన. ఈమధ్యటి లెక్కల ప్రకారం భారత దేశంలో మిడిల్ క్లాస్ 3 శాతం మాత్రమే. దాదాపుగా మిగిలిన వారందరూ బిలో మిడిల్ క్లాస్ వారేనట. బీదరికం నుంచి బయట పడి, వారంతా బిలో మిడిల్ క్లాస్ వారిగా మారిపోయారే తప్ప, మిడిల్ క్లాస్ వారిగా ఇంకా మారలేదట. ఆ సంగతి అటుంచితే, మేము మధ్యతరగతి మనుష్యులమని తమకు తాము చెప్పుకునే వారే ఈ ప్రపంచంలో ఎక్కువట. అంటే, మనుషులకి సంబంధించినంత వరకు ఈ 'మధ్య తరగతి' అనేది ఒక మానసిక స్థితికి సంబంధించినదే కానీ, ఎకనామికల్ డెఫినిషన్స్ కి సంబంధించినది కాదన్నది స్పష్టం. ఎకనామిస్ట్ ల డెఫినిషన్స్ తో మనకు సంబంధం లేదిక. మనమంతా మధ్య తరగతి మనుష్యులమే. ఇది అమెరికా లో అయినా, ఆస్ట్రేలియాలో అయినా అంతే. తమకు తాము మధ్య తరగతి వారిమని అనుకోవటం లో ఒక తృప్తి ఉంటుంది. రిడక్షన్ ఆఫ్ కాగ్నిటివ్ డిస్సోనాన్స్ అన్నమాట. హిపోక్రసీలో ఉండే గోపి (గోడమీద పిల్లి) తత్వం మనకు కలిసొస్తుందన్నమాట.
తనకు అనుకూలంగా ఉన్న వ్యవస్థలో ఉన్నది ఉన్నట్టుగా ఉండాలనుకునే వాడు వ్యవస్థను పరిపాలిస్తూ ఉంటాడు. తనకు అననుకూలంగా ఉన్న వ్యవస్థలో సమూలంగా మార్పు రావాలని కోరుకునే పీడితుడు తిరుగుబాటు చేస్తాడు. కానీ వ్యవస్థ తనకు అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో తెలియక, తెలుసుకోలేక, దేన్ని ఔననాలో దేన్ని కాదనలో అర్థం కాక, ఊగిసలాడుతూ ఉండేవాడు కామన్ మాన్. మధ్య తరగతి మనిషి. అందుకే తనతో పాటు భారమైన హిపోక్రసీని కూడా మోసుకు తిరుగుతాడు. భూస్వామ్య వ్యవస్థ పతనమై పెట్టుబడిదారీ వ్యవస్థ కుదురుకుంటున్న సమయంలో సమాజంలోకి అకస్మాత్తుగా పుట్టుకొచ్చాడు ఈ మధ్యతరగతి మనుష్యుడు. అపుడే ఈ మధ్యతరగతి మానసికావస్థ కూడా పుట్టి వుండాలి. అదే సమయంలో వెస్టర్న్ రొమాంటిసిజం ద్వారా సాహిత్యంలోకి అడుగుపెట్టిన అతడు, రొమాంటిక్ పీరియడ్ లో దేవుడిని సైతం పక్కకు నెట్టి తానే 'ప్రొటాగొనిస్ట్' గా మారిపోయాడు. ఇరవైయవ శతాబ్దపు భారతదేశంలోకి శరత్ సాహిత్యం ద్వారా చొచ్చుకొని వచ్చాడు. పుట్టినప్పటి నుంచి ప్రపంచం మొత్తాన్నీ తన హిపోక్రసీతో నెట్టుకొచ్చాడు. ఇప్పటికీ పెద్దగా మార్పేమీ లేదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ తమకు తాము మధ్యతరగతి మనుష్యులమని అనుకునేవారే. అస్తవ్యస్థ వ్యవస్థలో రిడక్షన్ ఆఫ్ కాగ్నిటివ్ డిస్సోనాన్స్ తో తమకు తాము సమాధాన పరచుకునే వారే.
ఈ కవిత శీర్షిక నీడలు. ఈ మనుష్యులు - "గతించిన కాలపు నీడలు" అంటాడు ఒకచోట. ఈ వాక్యంలోని 'నీడలు' పదాన్ని శీర్శిక లాగా వాడాడేమో అనిపించినా, నీడలు పదాన్ని హిపోక్రసీ తో నిండిన మధ్యతరగతి మనుషులు అనే అర్థంలో వాడి ఉండింటాడనిపిస్తుంది. కవిత మొత్తంలో ఒక మనిషిలో హిపోక్రసీని చూపిస్తాడు. తన చిన్నమ్మ కు మనుషుల గురించి తాను చెబుతున్నట్టు ఉంటుంది కవిత. ఆ చిన్నమ్మ శరత్ నవల్లోని ఒక స్త్రీ అయుండవచ్చని నా ఊహ. ఊహ మాత్రమే. ఆధారాలు లేవు. కవితలో "మనుషల స్వభావం ఇలాగే ఉంటుంది క్షమించేసెయ్ , ఓ.చిన్నమ్మా..!" అని అడుగుతున్నట్టు ఉంటుంది. "చిన్నమ్మా! వీల్లందరూ మధ్యతరగతి మనుషులు" అని ఒక చోట చెప్పి, వారి స్వభావాలూ, దైనందిన జీవితాలూ తెలుపుతాడు. కవితలో సగటు మనిషిని మనం దాదాపుగా చూడగలుగుతాం. డెఫినిషన్ అండ్ బేసిక్ కారక్టరిస్టిక్స్ ఆఫ్ కామన్ మాన్ ని మనం ఈ కవితలో నుంచి తీసుకోవచ్చు. ఒక పార్టీని నడిపించటం కోసం ఇంకో పార్టీని పెట్టుకుని హిపోక్రసీని ప్రదర్శించిన పవన్ కళ్యాణ్, ఫైవ్ స్టార్ హోటల్ లో కామన్ మాన్ కోసం పార్టీ పెట్టి హిపోక్రసీని బట్టయబలు చేసిన పవన్ కళ్యాణ్, మనుషుల హిపోక్రసీ ని వర్ణించే ఈ కవితను తన పార్టీ ఓపెనింగ్ స్పీచ్ లో వాడుకోవటం, పీక్స్ ఆఫ్ ది హిపోక్రసీ.
చిన్నమ్మా వీళ్ళందరూ, సగం సగం మనుష్యులు,
మరోసగం మరుగున పడిన భయస్థులు/బాధాగ్రస్థులు. ( అంటే అననుకూల ఆలోచనలే చేయలేని వారు)
భారతం భాగవతం చదువుతారు.( అంటే ఎస్కేపిస్టులు)
పాపం పుణ్యం కేటాయిస్తారు. (మేథో అసంబద్ధత తగ్గించుకోవటం కోసం)
డైలీ పేపరు తిరగేస్తారు/ జాలీగా ఉన్నట్టు నటిస్తారు. (ఈ కాలంలో అయితే బిజీగా ఉన్నట్టు నటిస్తారు అనుకోవాలి).
"వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ/దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ"...గ్లోరిఫికేషన్ ఆఫ్ పావర్టీ ప్రతీ మతం లోనూ కనిపించే విషయం. మతాలకి ఆలంబన మధ్యతరగతి ప్రజలే. మతం వారి కాగ్నిటివ్ డిసోనాన్స్ ని రెడ్యూస్ చేసే అద్భుతమైన మందు . "ధైర్యంలేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ"...ప్రతీ ధర్మమూ పీడితుల్ని పీడకులకు గులాం కమ్మంటుంది. అందరికన్నా పెద్ద పీడకుడు దేవుడు. ఆ తరువాత రాజు, ఆ తరువాత పూజారి. నీవు భరించు, ఇవన్నీ పరీక్షలు. ఆ తరువాతే మోక్షం. నారు పోసిన వాడు నీరు కూడా పోస్తాడు. అదే ధర్మం.
మౌఢ్యం వల్ల బలాఢ్యులు
అవివేకం వల్ల అవినాశులు
వీల్లందరూ మధ్య తరగతి మనుష్యులు. (ఇంతకన్నా డెఫినిషన్ ఏం కావాలి. అయినా ఇంకా పొడిగించి నిర్వచిస్తే..)
సంఘపు కట్టు బాట్లకి రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్ఛావర్తనకి నైతిక భాష్యకారుల
శిథిలాలయాలకు పూజారులు.
కవితలో దాదాపు ఈ మధ్యతరగతి వాల ని నిర్వచించి, వివరించి చివరిలో ఈ పరిస్థితి మారాలి అంటాడు. ఇలాంటి వారి మధ్య డైనమైట్ లు పేలాలి, డైనమోలు తిరగాలి. ఈ కవిత చెప్పిన కాలమంతా ఒకానొక సాయంకాల మనుకుంటే, ఈ రాత్రికంతా ఏదో జరిగి, రేపు ఉదయానికల్లా మార్పురావాలి అంటాడు. "కాళరాత్రిలో కంకాళాలు చెప్పే రహస్యం తెలియాలి/ దారిపక్కన మోడు చెట్ల బాధలు వినాలి/పచ్చికలో దాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి". ఈ పంక్తుల్లో ఈ రాత్రికల్లా అభ్యుదయం జరిగిపోవాలి అనే సూచన కన్పిస్తుంది. "రేపటి ఉదయానికల్లా ఈ వేళ వెలుగుల్ని సమకూర్చూకోవాలి". సంఘ సంస్కారమే వెలుగులనుకోవాలి. కవి చిన్నమ్మతో ఈ హిపోక్రసీని క్షమించమంటాడు. ఆడదానికి సాహసం పనికి రాదనే వీళ్ళని, ఈ సాంప్రదాయకులను విడిచి వెళ్ళొద్దనీ, వీళ్ళంతా నీ బిడ్డలనీ అంటాడు. కవిత చివరలో ఆ పని తానే చేయపూనుకున్నట్టు కనిపిస్తాడు కవి. ఇదిగో చిన్నమ్మా..! చీకటి పడుతోంది. దారంతా గోతులు. ఇల్లేమో దూరం. . చేతిలో దీపం లేదు. ధైర్యం ఒకటే కవచం.
కవితలో చెప్పినట్టు, ఈ మధ్య తరగతి వారి మధ్య, ఏ డైనమైటూ పేలలేదు. ఏ డైనమోలూ తిరగలేదు. కాళరాత్రి కంకాళాలూ ఏ రహస్యాల్నీ చెప్పలేదు, మోడు చెట్ల ఏ బాధల్నీ మనం అనువదించుకోలేదు, పాముల్ని బుట్టలోకి పట్టలేదు, మనం ఏ వెలుగులూ సమకూర్చుకోలేదు. మధ్య తరగతి స్థానం నుండి ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు. ఇది మన సేఫ్ జోన్. అందుకే మనం నీడలం. అసలులం కాదు.
చిన్నమ్మా
వీళ్ళ మీద కోపగించకు
వీళ్ళనసహ్యించుకోకు
నిన్నెన్నెన్నో అన్నారు. అవమానాల పాల్చేశారు
అవినీతి అంటగట్టారు
ఆడదానికి సాహసం పనికిరాదన్నారు
చిన్నమ్మా వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు
రేపటి గురించి భయం, సంఘ భయం
అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం
గతంలో కూరుకుపోయిన మనుష్యులు
గతించిన కాలపు నీడలు
చిన్నమ్మా
వీళ్ళందరూ తోకలు తెగిన ఎలకలు
కలుగుల్లోంచి బయటకి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
మౌఢ్యంవల్ల బలాఢ్యులు
అవివేకం వల్ల అవినాశులు
వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు
సంఘపు కట్టుబాట్లకి రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్ఛా వర్తనానికి నైతిక భాష్యకారులు
శిథిలాలయాలకు పూజారులు
చిన్నమ్మా వీళ్ళందరూ సగం సగం మనుషులు
మరోసగం మరుగున పడిన భయస్తులు, బాధాగ్రస్తులు
భారతం భాగవతం చదువుతారు
పాపం పుణ్యం కేటాయిస్తారు
డైలీ పేపరు తిరగేస్తారు
జాలీగా ఉన్నట్లు నటిస్తారు
చప్పబడిన నిన్నటి మాటల్నే మాట్లాడుతుంటారు
కప్పబడిన నిన్నటి కలల్నే తలుచుకుంటారు
సన్నంగా పళ్ళ సందున నవ్వుకుంటారు
హఠాత్తుగా జడుసుకుంటారు
నిటారుగా నిలబడలేరు
వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు
చెల్లా చెదురైన మూగ సత్యాలు
కల్లాకపటం తెలియని కబోది గుంపులు
తమని తాము మోసగించుకునే విద్యాధికులు, విదూషకులు
తమ చెట్టుని తామే నరుక్కునే అమాయకులు
సంప్రదాయకులు
చిన్నమ్మా వీళ్ళ ని విడిచి వెళ్ళిపోకు
వీళ్ళందరూ నీ బిడ్డలు
ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు
వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ
దరిద్రంలో హరిద్రా శోభల్ని గుర్తిస్తూ
ఓపికలేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ
ధైర్యంలేని తమ స్వభావాల్ని ధర్మమని పిలుస్తూ
బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య
డైనమైట్ పేలాలి
డైనమోలు తిరగాలి
కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి
దారి పక్క నిల్చిన మోడు చెట్ల బాధని అనువదించాలి.
పచ్చికలో దాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి
రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి.
చిన్నమ్మా
నేను వెళ్ళొస్తాను
చీకటి పడుతోంది
చిటారు కొమ్మల్లో నక్షత్రం చిక్కుకుంది
శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది
దారంతా గోతులు, యిల్లేమో దూరం
చేతిలో దీపం లేదు, ధైర్యమే కవచం.
9/12/15

No comments:
Post a Comment