మనిద్దరం సహజంగా ఏకమయిందెప్పుడని?
----------------------------------------------------------
"మానవుడు" అంటే ఆడ మగ శరీరాలు, లక్షణాలు సమానంగా కలిగి ఉన్నవాడే మానవుడు. మానవుడు అనే పదం ఒక జెండర్ కు మాత్రమే సంబంధించినది కాదు. ఇది స్త్రీ పురుషులిద్దరకూ సంబంధించినదే. తొలి మానవుడు ఎక్కడి నుండి పుట్టాడో ఎప్పటికీ మిస్టరీనే. జెనెసిస్ గ్రంధంలో ఆదామును నిద్ర పుచ్చి, అతడి పక్కటెముకలతో అవ్వను సృష్టించాడు దేవుడని ఉంటుంది. ఆదాము నిద్ర లేచే సరికి ఒకడు కాదు ఒకడి స్థానంలో ఇద్దరున్నారు. తొలి మానవుడు ఆ విధంగా మగ ఆడ శరీరాలుగా ఉదయించాడేమో. కానీ చెట్టుమీది నిషిద్ధ ఫలము తిన్న తరువాత తాము వేరు వేరు చైతన్యాలమని తప్పుగా గుర్తెరిగినప్పటినుంచి ఇప్పటి దాకా, వారెప్పుడూ ఒకే చైతన్యంగా కలిసైతే లేరు అన్నది వాస్తవం. మగవారు బుధ గ్రహం నుంచీ, ఆడవారు శుక్ర గ్రహం నుంచీ వచ్చారని, వారికిద్దరికీ అసలు పొసగనే పొసగదనీ మనం అర్థం చేసుకున్నాం. పుస్తకాలు కూడా రాసేసుకున్నాం( Men are from Mars, Women are from Venus ). సంక్లిష్టమైన జీవన విధానాలూ, మతాలూ, నమ్మకాలూ, రాజకీయాలూ, భ్రమలూ వంటివెన్నో మానవ సమాజం ఏర్పరచుకున్నాక ఇద్దరూ ఒకటే చైతన్యం అనే స్పృహ పూర్తిగా కోల్పోయి, అసలు సంబంధమే లేని వారిగా ఈనాడు మనం గుర్తించగలుగుతున్నాం. బాహ్యంగా దృగ్గోచరమయ్యే స్థూల శారీరక నిర్మాణ వ్యవస్థలనుంచీ, సూక్ష్మ జన్యు పదార్థాల( x and y chromosomes) వరకూ ఆడ మగ బేధాల్ని స్పష్టంగా గుర్తించగలిగాము. బాహ్య శారీరక విబేధాన్ని సులువుగా గుర్తించగలిగిన మానవుడు, ఆంతరంగిక మనో సీమల్లో మాత్రం చైతన్యపు ఏకత్వాన్ని గుర్తించే దశలో ఉండగలడని అనుకోవడానికి అవకాశమేలేదు. కవి అరణ్య కృష్ణ, ఎందుకనో ఈ బాహ్యంగా కనిపించే విబేధాల్లో ఏదైనా ఏకత్వ సూత్రం కనిపెడదామనే ప్రయత్నం చేస్తూ ప్రయాణం చేస్తాడు.
కవి నిరాశా వాదిగా ఉండకూడదనే అభిప్రాయం చాలా సార్లు తప్పని ఋజువవుతూ నే ఉంటుంది. నిరాశావాదం హెగేలియన్ డయాలెక్టికల్ పద్దతికి కావలసినంత యాంటీ థీసీస్ని సమర్పిస్తూనే ఉంటుంది. తద్వారానే ఒక సింథసిస్, ఒక రెవిలేషన్ అనేది ఉదయిస్తుంది. అతి ఆశావాదపు అవాస్తవికతను (optimistic unrealism) సమర్థవంతంగా ఎదుర్కొని సత్యాన్ని నిలబెట్టడానికి నిరాశావాదం పనికొస్తుంది. డిప్రెసివ్ రియాలిటీ కి మనిషి మేల్కోవాలంటే ముందు డిప్రెషన్ లోకి పోవాల్సి ఉంటుంది. వాస్తవ పరిస్థితులకూ ఊహలకూ దూరం పెరిగే కొద్దీ మనిషి నిరాశాపరత్వంలోకి జారిపోక తప్పదు. కానీ అది మనిషికి చేటు చేసేదేమీ కాదు. డిప్రెషన్, తద్వారా వచ్చే నిరాశా వాదం, నేటి సమాజం చెబుతున్నంత మహా పాపమేమీ కాదు. నిరాశ అంతిమంగా అందించగలిగిన వరమే వాస్తవికతలో మేలుకోగలగటం. మనకు కవి అటువంటి నిరాశాయుత స్థితిలోనుంచి వాస్తవికత వైపు పయనిస్తున్నట్టు కనిపిస్తాడీ కవితలో.
తానొక మగవాడిగా, తన జీవితంలో తనతో పలు రూపాల్లో పలు సందర్భాల్లో, దశల్లో సంబంధం కలిగి వున్న స్త్రీత్వమనే ఒక అత్యద్భుతమైన అంశాన్ని తరచి తరచి చూస్తూ ఎక్కడైనా ఎప్పుడైనా ఆ అంశంతో ఏకత్వాన్ని పొందగలిగానా లేదా అని వెతుకుతున్నట్టుగా సాగుతాడీ కవితలో. మానవ సమాజం స్త్రీ పురుషులను వేరు చేయడానికే తన మతాలని వ్యవస్థలనీ మార్చుకున్నట్టుగా కవి భావిస్తాడు, అందుకే స్త్రీ ఎప్పటికీ పురుషుడికి అర్థంకాని ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయమే. తనతో పాటు పుట్టిన ఒక జీవిని అద్భుతంగా భావన చేయటంలోనే, సమాజం స్త్రీ పురుషుల మధ్య ఎంతటి దూరాన్ని సృష్టించగలిగిందో అర్థం చేసుకోవచ్చు. బాల్యంలో తోడబుట్టినదానిగా, స్నేహితురాలిగా, యవ్వనంలో ప్రియీరాలిగా లేదా భార్యగా ఉన్నప్పటికీ ఆ స్త్రీ అతడికి అర్థంకాని ఒక విషయమే. అర్థం కాని విషయం పట్ల మోహాన్ని పెంచుకుంటాం, అర్థం అయితేనే కదా ప్రేమ అనేది సాధ్యమయ్యేది. అందుకే కవి అడుగుతాడు, నిన్ను మోహించాను తప్ప ప్రేమించిందెప్పుడు? అని. నిజమే కదా, భావ కవిత్వ సారమంతా స్త్రీని అపురూపమైనదిగా, భోగ వస్తువుగా, అందరికీ అందరానిదిగా తయారు చేస్తూ మోహింపజేసింది కదా..ఎపుడు వాస్తవాన్ని చెప్పింది కనుక.
ఈ కవితలో పూర్తిగా ధ్వంసమైన ఆధునిక జీవితముంది. జీవితం పట్ల భయంకరమైన పెస్సిమిజం ఉంది. అది అందించే పలాయనత్వం ఉంది. స్త్రీ పురుష సంబంధాలు ధ్వంసమైన జీవన పరిస్థితులనుండి పలాయనత్వం చెందటానికి ఊతమిచ్చేలాగే తయారయ్యాయి తప్ప వాటి స్వచ్ఛమైన స్థితిలో ఏకత్వాన్ని సాధించనే లేవన్న కఠోర సత్యమూ ఉంది. ఈ కవిత రాసినపుడు కవి యుక్త వయసు వాడై ఉండిండాలి, ఇంకా వార్థక్యమూ అందులోని దాంపత్య జీవితమూ వంటి అంశాలు ఈ కవితలో లేవు కాబట్టి. ఒకవేల ఉండిండింటే కవి తప్పక అందులోని డొల్లతనాన్ని బయటపెట్టేవాడేమో. అంతేకాక మోహించటం బాహ్యమైన విషయమే. కవి స్త్రీకి సంబంధించిన ప్రతీ విషయంలో మోహితుడై, ఏదీ ఎక్కడా ఏకత్వ భావనైన ప్రేమ కనిపించటం లేదేమని వెతుకుతూ పోతాడు. తన వైఫల్య పరిస్థితినీ, తనలో ఆవిరవుతున్న ఆశలనీ, తనలోని ఉద్రేకాలనీ, లోకంలో వాస్తవాలని చెప్పబడుతున్న వైరుధ్యాలనూ చూసినప్పుడల్లా స్త్రీ అనే అద్భుత అంశం పట్ల అతడు మోహితుడై, ఊరట చెందటమే తప్ప, ఎపుడూ దానితో తాదాత్మ్యం చెందని పరిస్థితిని కవి ఒక ఆంతరంగిక సత్యంలా దర్శిస్తాడు. వివిధ రూపాల్లో తన చుట్టూ పరుచుకుని ఉన్న స్త్రీ అనే అమూర్త అంశం తనకు సంబంధించినంత వరకూ వాస్తవం కాదనీ, కేవలం వ్యామోహ పరిచే అసత్యమేననీ తెలుసుకుంటాడు. అంతేకాక తన ఊహలకు భిన్నంగా ఆమె కూడా ఒక వాస్తవమనే విషయాన్ని గుర్తెరగక ఎలా తనను నిందించాడో కూడా కవి తెలుసుకుంటాడు. మోహితుడైనా, నిందించినా ఆమె కూడా ఒక వాస్తవం, కేవలం ఊహ కాదు అని తెలుసుకోలేక పోవటం వలననే కదా. స్త్రీ పురుష సంబంధాలను ఎంతో లోతుగా చర్చించిన కవిత ఇది. మన చుట్టూ ఉన్న సమాజం కూడా స్త్రీ పురుషులను వారి వారి స్వచ్ఛమైన రూపాలలో తెలుసుకునే అవకాశం ఇవ్వదు. ఊహాజనితమైన చిత్రణలతో స్త్రీ అంటే పురుషుడికీ, పురుషుడంటే స్త్రీకి వాస్తవానికి భిన్నమైన అభిప్రాయాన్నే కలుగజేస్తుంది. అటువంటి అభిప్రాయాలన్నింటినీ కొల్లగొట్టి, నిజాన్ని అన్వేషించే అన్వేషకుడిలా కనిపిస్తాడు కవి. అంతే కాక కవిత కూడా ఉద్విగ్న పరిస్థితిలో నుండి తన్నుకొచ్చిన అంతర్మధనంలా సాగటంతో, భ్రమలన్నీ పటాపంచలు అయిపోయిన క్షణంలో.. కవిత చివరి వాక్యం ఒక రివిలేషన్ లాగా బయటకు చెబుతాడీకవి. "అసలు నీ కడుపులో పిండంగా కదలాడినపుడు తప్ప, మనిద్దరం సహజంగా ఏకమయిందెప్పుడ"ని?. ఇదే కదా నిరాశావాద వాస్తవికత(pessimistic realism).
వైరుధ్యాల కత్తెర మధ్య మనిద్దరం
----------------------------------------- Aranya Krishna
నిన్ను మోహించానే తప్ప ప్రేమించిందెప్పుడు?
నిక్కర్లేసుకుని హైస్కూలుకెళ్ళే రోజుల్లోనే
నాతో కలిసి పెరిగిన అక్కగా చెల్లిగా
నాతో నిస్కల్మషంగా వీధుల్లో ఆడుకున్న స్నేహితురాలిగా
పుస్తకం నుండి నెమలికన్ను జారిపడినట్లు
నా జ్ఞాపకాల్లో ఆలోచనల్లో అంతరించిపోయావు
నా కళ్ళముందు సంచరిస్తూ
ఏవో అజ్ఞాత రహస్యాలు పొందుపరుచుకున్న అద్భుత ద్వీపానివయ్యావు
నా చేతన అచేతన అవస్థల్లో ఊహల్లో స్వప్నాల్లో
నేనో సాహసిక సముద్ర యాత్రికుణ్నయ్యాను
నీ అద్భుత రహస్యాలకై ఎంతగా అన్వేషించానని!
కాలెజీ ఎగ్గొట్టి మ్యాట్నీషోకెళ్ళిన మలయాళం సినిమాల్లో
జులపాల జల్సారాయుళ్ళు వినిపిచే విజయగాధల్లో
స్నేహితులు సరదాగా చెప్పే బూతుకబుర్లలో
ఎంతగా పరిశోధించానని!
అంతేకాదు సుమా,
జీవితంలో వైఫల్యాలు నా హృదయాన్ని
అర్ధరాత్రి స్మశానమంత నిస్తేజం చేసినప్పుడు
నిన్ను నా ఉద్రేకంగా మలుచుకున్నాను
నా చుట్టూ ఆవరించుకున్న విరుద్ధ వాస్తవాలు
రెక్కలపాములై నామీద మొహరించి భయపెట్టినప్పుడు
నా పిరికితనం నుండి నిన్నే పలాయనంగా ఎంచుకున్నాను
జీవితం మీద నా ఆశలన్నీ
సముద్రం ఒడ్డున తడి ఇసుకలో పాదముద్రలంత వేగంగా అవిరైపోయినప్పుడు
నీ రూపలావణ్యాల మీద పిచ్చుకగూళ్ళు కట్టుకున్నాను
నా మోహాన్ని ఉద్రేకాన్ని పలాయనాన్ని మంచుముద్దలా కలగలిపి
నీ చుట్టూ పేర్చుకున్న అమూర్త ప్రేమచాయలో
నీ కదలికల్లోని ఆత్మవిశ్వాసం ఆలోచనల్లో వికాసం
నీ నవ్వుల్లో సృజనాత్మక అభిరుచి
అన్నీ కనుమరుగైపోయాయి
నిన్నో వాస్తవంగా నిరాకరించి
రూపరహిత ఆకృతిగా నా అక్షరాల్లో తీర్చిదిద్ది
నేనో సున్నిత భావుకుణ్నని మురిసిపోయాను
నేను నీ గురించి బూతుగా కలలుకన్నా
భావుకంగా ఊహాలోకాల్లో విహరించినా
రెండూ ఒక్కటే... నీ అస్తిత్వం నాకు నిజంకాదు
కానీ నీకు నువ్వు వాస్తవానివే కదా
నీ ఇంద్రియసంచలనం నీకు నిజమే కదా
నీ కోరికలు నా ఊహల్ని ప్రశ్నించినప్పుడు
నీ నిబ్బరం నా ఆధిక్యాన్ని చిన్నభిన్నం చేసినప్పుడు
నువ్వు పాషాణానివని నిందిస్తాను
రకరకాల సామెతలతో అవమానిస్తాను
మనిద్దరి మనో కక్ష్యల మధ్య దూరం జీవితం కంటే పొడుగైనది
భిన్న హృదయగోళాలకు చెందిన మనిద్దరం
సంసారం సాలెగూట్లో చిక్కుపడి అసహజంగా ఏకమౌతాం
మన శరీరాలు దగ్గరవుతున్నకొద్దీ
మన ఆత్మలు దూరంగా విసిరేయబడతాయి
నా మునివేళ్ళు నీ శరీరాన్ని తాకినప్పుడు
కండరాల రాతిపూల గరుకు స్పర్శ తప్ప
సున్నితమైన ప్రేమతడి అంటదు
అసలు నేను నీ కడుపులో పిండంగా కదలాడినపుడు తప్ప
మనిద్దరం సహజంగా ఏకమైందెప్పుడని?
కవిత్వ సందర్భం 24
3/8/16

No comments:
Post a Comment