ఆనందం - ఒక అన్వేషణ (part5)
--------------------------------------------
మతం ఒక పురాతన అంశం, సైన్స్ ఒక ఆధునిక అంశం. ఈ రెండింటికీ అసలు పొసగదు. మతాన్ని అనుసరించేవాడు, మానవ జాతి ఆలోచనలోని గొప్ప విషయాలనన్నింటినీ, మన పూర్వీకులే సాధించేశారు. మనం ఇపుడు కొత్తగా ఆలోచించవలసిన అవసరమేమీ లేదు, కేవలం వాళ్లు ఆలోచించి పెట్టినదాన్ని మనం అనుసరిస్తే చాలు అంటాడు. సైన్స్ ని చదివినవాడు, మానవ జాతి ఇంతకు ముందు చేసిన ఆలోచనలన్నీ ప్రాథమిక దశలో ఉండిన్నాయి, వాటినాధారం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగిపోవాలి అంటాడు. ఏ సూత్రాల మీద మతం ఆధారపడి వుందో వాటిని మార్చటానికిగానీ ఇంకాస్త ఉన్నతంగా చేయటంగానీ కూడదంటాడు మతవాది. ఏ సూత్రాలను ఆధారం చేసుకుని ఒక విషయం చెప్పబడిందో వాటిని ఇంకాస్త ముందుకు తీసుకుని పోవాలి అంటాడు సైంటిస్ట్. ఆధునిక కాలములో సైన్స్ బలపడే కొద్దీ మతము కూడా బలపడటం ఒక పారడాక్స్. మతం నమ్మకం మీద కొనసాగుతుంది. సైన్స్ నిరూపణ మీద కొనసాగుతుంది. మతాన్ని అనుసరించే వారు, అనుసరించని వారికన్నా ఎక్కవ ఆనందంగా ఉన్నారని, ఆధునిక శాస్త్రం పరిశోధన చేసి కనుగొన్న అంశం. నిరూపణ కూడా చేశారు. సైన్స్ పెరగటంతో మతానికి సంబంధించిన ఈ అంశం నిరూపణ అయ్యింది. దానివలన ఇపుడివి పరస్పరం విరుద్ధంగా కనిపించే అంశాలు కావు, పరస్పరం సహాయం చేసుకునే అంశాలు అని అనిపించటం జరుగుతోంది. మత అనుయాయులు కూడా తమ మతంలో అద్భుతమైన సైన్స్ ఉందని, ఆధునిక శాస్త్రాల సారమంతా తమ మత గ్రంధాలలో ఎపుడో చెప్పేశారని వంత పాడటమూ చూస్తుంటాం. అయితే మతమయినా, సైన్సు అయినా మనిషి మేథలోంచి పుట్టినవే కావడం వల్ల, ఇవి ఏవీ కూడా మనుషులను విడగొట్టకుండా చేయగల సత్తా ఉన్నవి కావు. మనిషి స్వతహాగానే ఇంకొక మనిషిని ఇష్టపడడు అన్నది వాస్తవం కనుక. మతమూ, సైన్సూ ఒకదానికొకటి సహాయం చేసుకునేది కూడా మనుషులను కలపడానికి అయితే కాదు. మనుషుల మధ్య రకరకాల గోడలు కట్టడానికే.
ఐతే దీనికి పారడాక్సికల్ గా కూడా మనం ఆలోచించవచ్చు. మనిషి స్వతహాగా వేరొక మనిషిని ఇష్ట పడడు. ఎపుడు ఇష్ట పడతాడు, ఆ వేరే వాడు కూడా తన వాడు, తన కుటుంబం వాడు అయివుండాలి. ఇపుడు కుటుంబంని పెద్ద చేస్తూపోతే తనసంఘం, తనకులం, తన జాతి, తన ప్రాంతం, తన రాష్ట్రం, తనదేశం, తన మతం. సాటి మనిషిని తన వాడే నని గుర్తించగలగటానికి, ఒకే మతం, లేదా ఒకే దేశంకు చెంది వుండటం అనేది, మనిషి సాధించిన అత్యంత ఏకత్వ భావన అనుకోవచ్చు. ఇపుడు మనిషి ఇంతకు మించి, అంటే తన దేశానికి మించి, తన మతానికి మించి, వీటికి ఆవల కూడా సాటి మనిషితో ఏకత్వ భావన కలిగి ఉంటాడా అనేది సమస్య. పక్కనున్న శతృ దేశం వాడిని, వీడు నా వాడు అనగలుగుతాడా?. వేరే మతం వాడిని వీడు నావాడు అని అనగలుగుతాడా?. ఇలా ఎవరినైనా అడిగి చూడండి, మనం అనగలుగుతాం సరే, అవతలి వాడుకూడా మనలాగే అనగలుగుతాడా చెప్పండి?, అని మనకు ఎదురు ప్రశ్న వస్తుంది. అంటే మనిషి ఇంక అక్కడికే ఆగిపోయాడు. ఇంతకు మించిన ఏకత్వ భావనను మనిషి సాధించనేలేడు. ఇపుడు వేరే దేశం వాడినైనా మనం ప్రేమించగలగాలి అంటే వాడు మన మతం వాడు అయివుండాలి. ఆ విధంగా దేశం కంటే కూడా మతం విస్తృత ఏకత్వ భావనని ఇస్తున్నదనుకోవచ్చు. కానీ ఆ తర్వాత, దాని ఏకత్వ పరుధులు దాటిన తర్వాత, ఇక అంతా వ్యతిరేకమే, వారందరూ ఈ మతం దృష్టిలో మనుషులే కారు, వారిని చంపవచ్చు కూడా.
సైన్స్ అయినా మనుషుల మధ్య ఏకత్వాన్ని సాధించలేదు. ఒకడు భౌతిక శాస్త్రం చదివి ఉండింటే, వాడు ఇంకొకడు భౌతిక శాస్త్రం చదివినా వాడితో ఐక్యతను సాధించలేడు. అయినా సైన్స్ ఎన్నో విభాగాలుగా విడిపోయి, విస్తృతంగా పరుచుకొని ఉంది. ఒక విభాగాన్ని అర్థం చేసుకోవటానికే ఒక జీవితకాలం సరిపడంత విస్తృతంగా తయారయ్యింది. కాబట్టి సైన్స్, జీవితం పట్ల ఒక ట్యూబ్యులార్ అవగాహననే ఇవవగలుగుతుంది తప్ప సంపూర్ణమైన అవగాహన ఇవ్వలేదు. ఈ మధ్య ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వారిని, మెకానికల్ ఇంజనీరింగ్ వారు గేలి చేయడం చూస్తుంటాం. మా సైన్స్ గొప్పదంటే మా సైన్స్ గొప్పదనీ, మేము ఎక్కువ సంపాదిస్తున్నాం అంటే మేమే ఎక్కువ సంపాదిస్తున్నామని గొడవపడటం కూడా గమనిస్తుంటాం. సైన్స్ కలిగించిన అజ్ఞానాంధకార స్వరూపం ఇది. అటు పురాతన మతమూ ఇటు ఆధునిక శాస్త్రమూ ఏదీ మనిషి ఉన్నతికి ఉపయోగపడక పోవటం. అంతేగాక సైంటిఫిక్ గా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలుగా ప్రపంచం రెండు ముక్కలుగా ఉంటోంది. సైంటిఫిక్ దేశమంటే ఆర్థికంగా అభివృద్ది చెందిన దేశమని. సైన్సు మనిషిని ఆలోచనలకంటే ఆర్థికంగా రిచ్ గా చేస్తున్నది. సైంటిఫిక్ అనే పదం ఎకనామికల్ అనే పదానికి పర్యాయపదంలా మారింది. అభివృద్ధి చెందిన దేశాల ఆగాయిత్యమంతా అభివృద్ధి చెందని దేశాల మీదే. భధ్రతామండలిలోని ఐదు దేశాలూ, సైంటిఫిక్ గా అభివృద్ధి చెందిన దేశాలే. ఒక అభివృద్ధి చెందుతున్న దేశాన్నో, ఒకబీద దేశాన్నో సభ్యత్వం కలుపుకోవాల్సిన అవసరం వాటికి లేదు, ఎందుకంటే సైంటిఫిక్ సుప్రమసీకి ఇది ఆటంకం. గొప్ప, తక్కువ అనే భావనలు సైన్స్ చదివినంత మాత్రాన పోతాయనుకోవడం వట్టి అత్యాశే అవుతుంది అని దీనివల్ల అర్థం అవుతుంది.. ఒకప్పుడు మతం సామ్రాజ్యవాదానికి ఊతమిస్తే, ఇపుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దానికి తోడయింది. ఇతర దేశాల మీద జాతుల మీద బాంబులు వేయటానికి, వాటిని ఏ విదంగానైనా సర్వ నాశనం చేయడానికి ఉపయోగపడినంతగా సైన్సు వేరే ఏ విషయానికీ ఉపయోగపడటం లేదు. కానీ మతవాదులుకాని నాస్తిక వాదులు, సైన్సు మీద చాలా పెద్ద నమ్మకం కనబరచడం, "మతాలు మాత్రమే మారణ హోమాన్ని సృష్టించాయి, సైన్సు అభివృద్ధి చెందిన ఈ కాలంలో మతమేంటి?, నమ్మకమేంటి? అంతా నాన్సెన్స్". అని కొట్టివేయడం కూడా చూస్తుంటాం. సైన్సు సృష్టించిన మారణ హోమం వారికి కనిపించకపోవటం దారుణమైన విషయమే. గ్రీకుల చరిత్రను మార్చిన పోలేపోన్నిసియన్ యుద్ధం ముఠా పోట్లాటలూ దారి దొమ్మీల కంటే పెద్దదేమీ కాదంటారు చరిత్ర కారులు. కానీ సైన్సు పెరిగిన ఈనాటి యుద్ధాలు?. ఇవి ఏకంగా మానవజాతినే సమూలంగా నాశనం చేయగల శక్తిని కలిగి ఉన్నవి. టెక్నాలజీ పెరగిన తర్వాత మత యుద్ధాల గురించి తెలిసినంతగా, పెరగకముందు తెలియదనేది వాస్తవం. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆదునిక మానవునికి ప్రసాదించిన కొత్త రోగమే హంగ్టింగ్టన్ రోగం. అంటే నాగరికతల మధ్య యుద్ధం. మెడికల్ గా హంటింగ్టన్ జబ్బు అనేది మెదడులో కణాలు చనిపోవడం వల్ల సంభవించేది. క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అని ప్రతిపాదించిన ఈ కాలపు హంగ్టింటన్ కూడా మనుషుల్లో మెదడు కణాలు చచ్చిపోయే జబ్బునే కనుగొన్నాడు అనిపిస్తుంది. రాజుల మధ్య యుద్ధాలు పోయాయి, దేశాల మధ్య యుద్ధాలు పోయాయి. ఇపుడు మనుషుల మధ్య యుద్ధాలు. ఎక్కడో ప్రపంచంలో ఏ మారుమూలలోనో ఒక మతం వాడు ఇంకో మతం వాడిని కొడితే, ఇక్కడ నిరసనలూ, యుద్ధాలూ.
మనుషుల స్వభావాల్ని మతాలు ప్రభావితం చేస్తుంటే, ఆధునిక జీవితం వాటిని ద్విగుణీకృతం చేస్తుంది. మనిషి బేసిక్ గా అసూయాపరుడు, ఆశా పరుడు, కాంక్షాపరుడు, మోసకారి, స్వార్థపరుడు. మతమైనా సైన్సు అయినా, ఆతడి ఆకాంక్షా పరత్వాన్ని, విద్వేషాన్ని బయటకు చూపించుకోవడానికి ఉపయోగపడూతుందే తప్ప ఇంకో రకంగా ఉపయోగపడటం లేదన్నది వాస్తవం. మతమూ, సైన్సూ అతడికి విద్వేషాన్ని చిమ్మటానికి పనిముట్లే తప్ప ఇంకేమీ కాదు. కానీ ఆశ్చర్యంగా ఆస్తికులు మతానికీ, నాస్తికులు సైన్సుకీ కట్టుబడి ఈ రెంటికీ ఏ సంబంధం లేదంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ, సైన్సుకు అందనిది ఎంతో మతం కనుగొందని మతవాదులూ, సైంటిఫిక్ గా ఆలోచించటమే మతానికి విరుగుడని నాస్తికులూ, వాటికి ఎనలేని ప్రాముఖ్యాన్నిస్తూ గడిపేయటం గమనిస్తుంటాం.

No comments:
Post a Comment