పక్కవాని గుండె మీద గుద్దుతాడు
ఇది కబాలీ సినిమాలో.."ఒకడే ఒకడొకడే" పాటలో వినిపించే ఒక వాక్యం. ఇంతకీ ఆ పక్క వాడు ఎవడు?. కబాలి వాడి గుండెమీద ఎందుకు గుద్దుతాడు?. అసలిదేమి పాట? ఇదేమి భావం?. ఈ సినిమాలో ఒక్క పాట కూడా హాయిగా చెవులకు ఇంపుగా లేదు. వెస్టర్న్ పాప్ స్టైల్లో ఉండే మ్యూజిక్ ట్రాక్ కి సరిపోయేలా ఏదో ఒక తెలుగు పదం పెట్టేద్దాం అనుకుంటే ఇలాగే ఉంటుంది. "పక్క వాడి గుండె మీద గుద్దుతాడు" అని రాయటంలో ఎంతో గొప్పటి సాహిత్యం ఉట్టి పడుతోంది కదూ. ఇదీ మన దౌర్భాగ్యమన్నమాట. అనంత శ్రీరామ్ ఇలా కూడా రాస్తాడా?.
"ఉగ్ర త్రినేత్రుడా" పాట ఉన్నది ఉన్నట్టుగా డాక్టర్ డ్రే, "తర రర రా"...పాటకు కాపీ. ఒక్కపాటనైనా పాడుకోవటానికి అనుకూలంగా లేదు. వెస్టర్న్ స్టైల్ రొద తప్ప, ఒక్క లిరిక్ కూడా అర్థం కాదు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు వస్తుంటుందో అర్థం కాదు. స్టేజి నాటకాల్లో పాత్రలు మాట్లాడేటపుడు ఏదో ఒక మ్యూజిక్ కొడతా ఉంటారు అక్కడ కీ బోర్డుచేతిలో ఉన్నవాడు. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. సిట్యుయేషన్ కి తగ్గట్టుగా, మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉండాలి బీజీఎమ్. దర్శకుడు వేటినైతే మాటల్లో చెప్పలేడో, అక్కడ బీజీఎమ్ చెప్పగలగాలి. ఈ సినిమాలో అటువంటిదేమీ ఉండదు. ఒక యమాహా హై ఎండ్ కీ బోర్డుంటే చాలు, ఏదొత్తినా ఏదో ఒక మ్యూజిక్ ఒచ్చేస్తుంది, దాన్ని రికార్డు చేసి బీజీఎమ్ గా పెట్టినట్టు ఉన్నాడు.
స్టోరీ ఏ మాత్రం లేని ఈ సినిమాకి, ఒక తొక్కలో మ్యూజిక్ డైరెక్టరూ, దానికో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కా అనుకుంటే, ఈ సినిమాకు సంతోష్ నారాయణ చాలా ఎక్కువ. చిన్న పిల్లలు హాలీడేస్లో దొంగా పోలీస్ ఆట ఆడుకునేప్పుడు ఇటువంటి కథలతోనే ఆడుకుంటూ ఉంటారు. ఇపుడాడుకుంటున్నారో లేదో తెల్వదుగానీ, మేము ఆడుకునే కాలంలోస్టోరీ ఇంతకంటే క్రియేటివ్ గానే ఉండేడిది. మలేషియాలో ఇరవైదేండ్లు జైలులో ఉండి బయటకి ఒచ్చిన రజినీ, బయటకి రాగానే తన ప్రత్యర్థులను కనుక్కుని చంపటం మొదలు పెడతాడు. మలేషియాలో డ్రగ్స్ ప్రాస్టిట్యూషన్ బారిన పడుతున్న భారతీయులను కాపాడటానికి ఒక సమగ్ర కార్యాచరణ ఏమీ ఉండదు. డ్రగ్స్ అమ్మే గ్యాంగ్ స్టర్ లను చంపేస్తే ఆగిపోతుందన్నమాట. మలేషియా పోలీసులకీ, ప్రభుత్వానికీ లేని బాధ మన రజినీకి ఉంటుంది. కబాలి వారి డ్రగ్స్ మాఫియాను సాగనివ్వడన్నమాట. కాబట్టి కబాలిని చంపితేగానీ వారి మాఫియా ముందుకుసాగదు. వీరి వీరి గొడవల్లో పోలీసులుగానీ, అక్కడి ప్రభుత్వంగానీ, న్యాయస్థానాలుగానీ ఏవీ పట్టించుకోవన్నమాట. అంతా చిన్న పిల్లలాటనే. సినిమా మొత్తంలో మొదటి నిముషంలో చివరి నిముషంలో మాత్రమే పోలీసులు కనిపిస్తారు. ఇక రజినీ గ్యాంగ్ నడిపే స్కూల్ ఒకటి ఉంటుంది. అందులో ఓవర్ యాక్షన్ చేయగలిగిన వారికే అడ్మిషన్ ఇచ్చేట్టుగా ఉంటుంది. ఆ చదువుకునే పిల్లలనబడే వారు అడగగానే రజనీ తన గతాన్ని అటువైపు తిరిగి చెప్పేస్తాడన్నమాట. ఆ గతం వినగానే కబాలీ ఓ మహానుభావుడని అర్థం చేసుకున్న పిల్లలు, ఓవరాక్షన్ తో ఊగిపోతారన్నట్టు. ఆ గతంలో రజనీ చైనా వారికి తగ్గట్టుగా భారతీయులకు కూడా జీతాలు పెంచాలని కోరటం, పడగొడుతున్న గుడిని పడగొట్టకుండా ఆపడం, ఈలోగా సీతారామరాజు అనే అక్కడి ఒక నేత కబాలిలో నాయకత్వ లక్షణాల్ని గమనించడం, న్యాయం ధర్మం అని సీతరామరాజుగా నటించిన నాజర్ రెండు అర్థంపర్థం లేని, సిట్యుయేషన్ కి తగని రెండు స్పీచ్లు దంచడమూ, కబాలీ సీతారామరాజును తమ నాయకుడని తృప్తిపడిపోవడమూ ఇంతలో సీతారామరాజు చనిపోవడమూ, ఆయన చనిపోయినందుకో ఏమో..మలేషియాలో ఉన్న ముసలి డాన్ ఒకాయన అందరు లోకల్ డాన్ లతో మీటింగ్ పెట్టడమూ, ఆ మీటింగ్ లో కబాలిని నాయకుడిగా ప్రకటించడం, అందరూ నోరుమూసుకుని, లోలోపల బాధపడుతున్నా పైకి ఒప్పేసుకోవడమూ, ఈలోగా సీతారామరాజుగారి కొడుకు అసూయ పడి బయట పడటమూ, దీనిని ఆసరాగా చేసుకుని డ్రగ్స్ మాఫియా నడిపే డాన్ లు కబాలీని చంపడానికి స్కెచ్ వేయడమూ, ఆ స్కెచ్ లో కబాలి భార్య అనబడుతున్న ఒకామె చనిపోవడమూ, కబాలీ జైలుకు పోవడమూ. ఈ అర్థంలేని కథలో అంతగా బాధపడిపోవాల్సింది ఏముందోగానీ అందరూ తెగబాధపడటమూ.
ఇక రెండవ సగంలో కబాలి భార్య బతికే ఉందని తెలుసుకోవడమూ, డ్రగ్స్ మాఫియాలో ని దుండగులనందరిని చంపేయ్యటమూ, దానికి మల్లీ ఆ ముసలి డాన్ వందవ పుట్టిన రోజు వేడుక వేదిక కావడము. ఇంతలో కబాలికి కూతురుందని తెలుసుకోవటమూ, ఆ కూతురు కూడా ఓ పెద్ద ఫైటర్ లా మనల్ని నమ్మించటానికి ప్రయత్నించటమూ. కబాలి భార్యగా రాధిక ఆప్టే. తిప్తికొడితే సినిమా మొత్తం మీద ఐదు ఆరు డైలాగులుంటాయామెకు.
సినిమా మొత్తంలో ఓ వంద పాత్రలుంటాయి, వారంతా మనకు కబాలీ చాలా గొప్పవాడని చెబుతున్నట్టే పని చేస్తుంటాయి. మొదటి పాటలో ఎవరు ఎందుకు ఎగురుతున్నారో అర్థం కాకుండా ఎగురుతారు. అదే పాట. "పక్కవాడి గుండె మీద గుద్దుతాడు" కబాలి అని చెప్పే పాట. ఆ పాట సరిగ్గా అర్థం అయితే సినిమా చూడనవసరం లేదు. డబ్బులు వేస్టు ఇపుడే లేచిపోండి లేకపోతే గుండెమీద గుద్దుతాడు కబాలీ అని చెప్పే పాట అది. కానీ అర్థం కాని లిరిక్స్ కదా, అర్థం కాకపోవడం వల్ల అలాగే కూచుంటాం. కథ అని డైరెక్టర్ అనుకుంటే సరిపోదని ఎవరైనా ఆయనకు చెప్పండయ్యా..ఆయన్నలా ఒదిలేయకండయ్యా..అని సినిమా అయిపోయాక మనం అనుకుంటూ బయటకు నడవాల్సిందే. ఈ సినిమా బాగా లేదని రాయటం కూడా పరమ వేస్ట్. ఏదో టైం పాస్ కాక ఈ సుత్తి. చదివి భరించండి. చూడకపోతే మాత్రం ఆశ పడకండి. అతిగా ఆశపడే ప్రేక్షకుడూ, అతిగా ఆవేశ పడే డైరెక్టరూ బాగు పడినట్టు చరిత్రలో లేదు.

No comments:
Post a Comment