పిల్లలాట
----------------
సాధారణంగా పిల్లలు ఏదైనా విషయాన్ని పోటీ పడి తోటి పిల్లలతో చెబుతూ వుంటారు. నా దగ్గర పది చాక్లెట్లున్నాయి తెల్సా అని ఒకడంటే, నా దగ్గర పదకొండున్నాయి తెలుసా అంటాడింకొకడు. మా ఇంట్లో మూడు కుక్కలున్నాయ్ అంటే..మా ఇంట్లో నాలుగున్నాయ్ అంటాడు. ఏది చెప్పినా దానికింకొకటి కలిపి చెప్పడం, ఆ విధంగా అవతలివాడికంటే తామే గొప్ప అని చెప్పాలనుకోవడం పిల్లల అలవాటు. అది పిల్లలకు ఒక ఆట. దీనిని బ్రాగ్గింగ్ అంటారు. పిల్లలు అభివృద్ధి చెందే దశల్లో ఇదీ ఒకటి. పిల్లలు సోషియలైజ్ అయ్యే దశలో ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఇదే పరిస్థితి పెద్దగ అయ్యాక కూడా దాపురించిందంటే అది అసాధారణ మానసిక రోగమని చెప్పాలి. ఈ ఉప ఎన్నికలలో జరిగిన ప్రచార తంతు కావచ్చు, ఆ తరువాత జరిగిన రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఈ చిన్న పిల్లలాటను గుర్తు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం ప్రజల మేధావిత్వాన్నీ, ఆక్టివ్ పార్టిసిపేషన్ నీ మాత్రమే కాక హుందాతనాన్నీ కోరుకుంటుంది. రాహుల్ గాంధీ లో వీడని బాల్యం, ప్రధాన మంత్రి అయిన మోడీలో కూడా బాల్యాన్ని నిద్రలేపిందేమో....మరీ దిగజారుడు స్థాయిలో ప్రచారాలు జరిగాయి. నారియల్ పానీ, నారియల్ జ్యూస్ వంటి చిల్లర జోక్ లూ ప్రధాన మంత్రి ఉపన్యాసాల్లోకి వచ్చి చేరాయి. గతంలో ప్రధానమంత్రులెవరూ ఇలా మాట్లాడిన దాఖలాలు లేవు. తానేంచేయబోతున్నాడో..తన గవర్నమెంటు పథకాలేంటో, సాధించిహ విజయాలేంటో ప్రతిభావంతంగా ప్రజలముందు పెట్టి, ఎంతో హుందాగా ఓట్లను అడిగేవారు. చురకలు విజ్ఞతతో కూడుకుని ఉండేవి. చమత్కారంగా సాగేవి. అవన్నీ ఇపుడు పోయి, పిల్లలాటగా మారిందనిపించేలా ఉపన్యాసాలు సాగాయి.
ఎన్నికల తరువాత కూడా..గోవా మణిపూర్ లలో ఒక్కొక్కసీటును లెక్కపెట్టుకుంటూ, నేను గొప్పంటే నేనే గొప్ప అని అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం పడుతున్న పాట్లు చూస్తుంటే, ఈ చిన్న పిల్లలాటే గుర్తుకొస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో కూర్చోవటం నామోషీ ఏమీ కాదు. ప్రజల కష్టాలని అర్థం చేసుకోవడానికి, పరిపాలనలో ఊహలకూ వాస్తవానికీ ఉన్న అంతరాల్ని అవగతం చేసుకోవడానికీ తద్వారా మెరుగైన సమాజాన్ని తయారు చేసుకోవడానికీ ప్రతిపక్షం పాత్ర దోహదపడుతుంది. అధికార పక్షానికి ఎప్పటికప్పుడు చేసే తప్పులను గుర్తుకు చేయడం సరి చేసుకోవడానికి అవకాశం కల్పించడం వంటి బాధ్యతల ద్వారా, ఇంకా మెరుగైన పాలన అందించడానికి ప్రతిపక్షం దోహదం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ఓడిపోవడమూ, అధికార పక్షంలో ఉంటే గెలవడమూ అనే స్పృహ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రజలు ఈ సారికి ఆ పక్షానికి అధికారమిచ్చారు అంతే తప్ప అదేదో శాశ్వత విజయం కాదు. కానీ పరిస్థితులు చూస్తుంటే కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాకలుదీరిన రాజకీయ పార్టీలు ప్రవర్తించడం, హుందాగా వ్యవహరించవలసిన చోట చిన్నపిల్లల్లా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విషయం. గోవా మణిపూర్ లలో హుందాగా కాంగ్రేసుకు అధికారమిచ్చి తాను ప్రతిపక్షంలో కూర్చుని ఉంటే, బీజేపి వంటి అనుభవమున్న పార్టీమీద గౌరవం పెరిగేది. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులను కలుపుకొని, బహుశా కొని, అధికారం కోసం అర్రులు చాచటం పిల్లల పది పిప్పరమెంట్ల ఆటనే గుర్తుకు తెస్తోంది.
మన సమాజం మోడెస్టీని ఇష్టపడే సమాజం. సాధుశీలతనూ, వినయాన్నీ, త్యాగాన్నీ ఆదర్శాలుగా చెప్పుకునే సమాజం. అతిగా గొప్పలు చెప్పుకుని తమ ప్రతాపం చూపించుకోవాలి అనుకునే వారిని ఈసడించుకునే సమాజం. ఇటువంటి దేశంలో ప్రజాస్వామ్యం వాస్తవానికి దాని స్వచ్ఛతను బయటపెట్టేదిలా ఉండాల్సింది పోయి, దాని లొసుగులతో పబ్బం గడుపుకునే వారిని తయారు చేయడం భయానకమైన విషయం. బహశా మన దేశంలో ఉండే బానిస మనస్తత్వం ఇటువంటి పోకడలను ప్రోత్సహిస్తుందేమో. ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇంకో పార్టీకి ఇచ్చాక కూడా, తిమ్మిని బమ్మిని చేసి రాజ్యాధికారం కోసం అంగలార్చడం ఏ విధంగా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో వారే చెప్పాలి.
15/3/17
Virinchi Virivinti

No comments:
Post a Comment