ఇద్దరు మిత్రుల రసవత్తర నాటకం.
------------------------------------------------
ఇళయరాజా, బాలు కావాలసిగానే కాపీ రైట్ విషయాన్ని తెరమీదకు తెచ్చారని నా అవగాహన. వారిద్దరూ మంచి మిత్రులన్నది అందరికీ తెలిసిన విషయమే. అటువంటపుడు కాపీ రేట్స్ మీద గొడవపడవలసిన అవసరం ఉండదనుకుంటాను. ఇక ఇళయరాజా ఒక మంచి విషయాన్ని తెరమీదకు తెచ్చాడు. కమర్షియల్ ప్రోగ్రామ్స్ లో తమ గొంతు విప్పి పాడుతున్న గాయకులు పాడే పాటలేవీ తాము స్వంతంగా స్వరపరిచినవి కావు. వాటిని సృష్టించిన సృజనకారులు సంగీత దర్శకుడూ సాహిత్య కారుడూనూ. నిజానికి వారి బుర్ర ఇందులో లేకపోతే ఈ గాయకులకు ఆ పేరు వచ్చేదే కాదు. పేరు విషయం పక్కకు పెడితే, ఎపుడో స్వరపరిచిన పాటలను నేటికీ పాడుతూ డబ్బును వెనుకేసుకుంటున్న గాయకులు, ఈ మొత్తం సంపాదనలో స్వరకర్తనూ, సాహిత్యకారుడినీ పట్టించుకోక పోవడం ముమ్మాటికీ క్షమింపరాని నేరం. ఇళయరాజా దానిని బయటకు తీసుకువచ్చి, పాట సృష్టిలో అసలైన శ్రామికులకు చెందవలసిన క్రెడిట్స్ ని నొక్కి వక్కాణించి నట్టయింది. ఇది ఇళయరాజా మాత్రమే చేయగల సాహసం.
ఇది బయటకు కాపీ రైట్స్ విషయంలా కనబడినా, లోపల ఎన్నో విషయాలను తప్పక తెరమీదకు తీసుకొస్తుంది. ఇళయరాజానే ఈ సాహసం చేయగలడని ఎందుకన్నానంటే...వేరే ఏ సంగీత దర్శకుడూ తాను స్వరపరచిన పాట పూర్తిగా తన సొంతదే అని చెప్పగలిగిన ధైర్యం ఉన్నవాడు కాదు. రెహ్మాన్ నుండి, దేవిశ్రీప్రసాద్ వరకూ ఇంగ్లీష్, స్పానిష్, అరబిక్ వంటి భాషల పాటలను కాపీ చేసి తమ సినిమాల్లో 'వాడుకున్నా'రనేది నిర్వివాదాంశం. అంతే కాక వాళ్ళు ఎక్కడా ఆ ఒరిజినల్ సంగీత కారుడికి క్రెడిట్స్ ఇచ్చినట్టుగా కనిపించకపోగా, ఇదంతా తమ 'తెలివి మహాత్యమే' అని చెప్పుకోవడమూ చూస్తున్నాం. ఇపుడు ఈ కాపీ రైట్స్ వివాదం ముదిరి ముదిరి పాకాన పడుతుంది. ఇళయరాజా మీద ప్రశ్నల వర్షం కురుస్తుంది. "తమరు నావి అని చెప్పుకుంటున్న స్వర బాణీలు ఎంతవరకు మీవి"? అనే అంశం తెరమీదకు వస్తుంది. నాకు తెలిసి ఇళయరాజాకు వేరే బాణీలను కాపీ చేసుకోవాల్సిన అవసరమూ, అవి తన సృష్టే అని అబద్ధం చెప్పుకోవాల్సిన ఆగత్యమూ ఇంతవరకూ రాలేదు. కాబట్టి అతడు పూర్తిగా సేఫ్ సైడ్. ఇపుడు ఇతర సంగీతకారులు కూడా ఇళయరాజాలాగానే తమ కాపీ రైట్స్ విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ బాణీ "సాంతమూ నాదే" అని చెప్పలేని మహా మాయగాల్లందరూ గప్చుప్ కాక తప్పదు. ఇక అసలు దొంగలను బయట పెట్టే కార్యక్రమం కోసమే ఇద్దరు మిత్రులు కలిసి వేసిన పాచిక అని నాకనిపిస్తుంది.

No comments:
Post a Comment