ప్రాథమిక విద్య ఏ భాషలో ఉండాలి?.
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ పాఠశాలల్లో తెలుగు మాధ్యమ బోధన తీసివేసి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే చదువు కొనసాగాలని ఒక ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చింది. జీ.వో.332 తీసుకు వచ్చి అన్ని మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేసి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టారు. దానికి విద్యాశాఖా మంత్రిగారు ఇచ్చిన వివరణ " ఎంసెట్ ఎంట్రెన్స్ లో సబ్జెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. అవి ఇంటర్మీడియేట్ బుక్స్ లో ఉండవు. ఆ అప్లికేషన్స్ చదవాలంటే రకరకాల బుక్స్ చదవాలి. అవన్నీ ఇంగ్లీషులో ఉంటాయి కాబట్టి పిల్లలకు ఒకటో తరగతినుండి పదవతరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన జరగాలి" అని. అంత పెద్ద నిర్ణయానికి ఈ చిన్న సమర్థన అది కూడా ఏ మాత్రం పొసగని సమర్థన ఎందుకో అర్థం కాలేదు. పైగా రాష్ట్రంలోని మేధావి వర్గంలో ఈ నిర్ణయంపై పెద్దగా వ్యతిరేకత వచ్చినట్టు కూడా కనబడలేదు. ఒకటి రెండు రోజులు ఉపాధ్యాయ సంఘాల నిరసనలు తప్ప, మరే కోణం నుంచీ అభ్యంతరాలూ రాలేదనిపించింది. దీనిపై మేధావి వర్గాల చర్చలు గానీ, పునస్సమీక్షలుగానీ అటు మీడియాలో ఇటు ప్రజలల్లో కనిపించలేదు. చర్చలు ఎలాగూ అసెంబ్లీలో జరగవు, ఈ విషయం మీద మాట్లాడాలని ప్రతిపక్షాలు నోరు తెరిచినట్టు కూడా అనిపించలేదు. చర్చలు జరగకపోవటం ప్రజాస్వామ్యంలో ఏక పక్ష నిర్ణయాన్ని ఆమోదించటం ప్రజల రాజకీయ సామాజిక చైతన్య రాహిత్యాన్ని సూచిస్తూ ఉంటుంది.
ఒక వైపున తెలుగు మీడియం అనవసరం, ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాభ్యాసం జరగాలి అనే వాదన బలంగా, అర్థవంతంగా కూడా ఉంది. డబ్బున్న వారు వారి పిల్లలను ఇంగ్లీషు మీడియం లలో చదివించడం వలన హయ్యర్ ఎడ్యుకేషన్ లో సులువుగా రాణించగలుగుతున్నారనీ, అదే బీదవారి పిల్లలు తెలుగు మీడియం చదివి, హయ్యర్ ఎడ్యుకేషన్ లో చతికిల పడుతున్నారనీ, ఇంగ్లీషును డిమాండ్ చేసే ప్రైవేటు సంస్థలలో ప్రవేశం పొందలేకపోతున్నారనీ అందువలన గవర్నమెంటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరగటం స్వాగతించ వలసిన అంశమనీ వారంటారు. మనదేశంలో ధనిక పేద అంతరాలకు కులాల వెనుకబాటుతనాలూ జోడై ఉంటాయి కనుక, కొన్ని కులాల వారికీ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ అందని ద్రాక్షే అయిందన్నది వాస్తవం. సామాజిక అంతరాలను అడ్రస్ చేసే ఇటువంటి వాదన పూర్తి సమర్థనీయమైనది. పైగా మాతృభాష పరిరక్షించాలని అందుకు విద్యా బోధన మాతృభాషలోనే సాగాలని స్లోగన్లు ఇచ్చేవారు, వారి పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తూండటంతో మాతృభాష పరిరక్షణ కేవలం పేద విద్యార్థులేదేనా అనే సంశయమూ మొదలవుతుంది. అటువంటి వారి హిపోక్రసీనీ దాని వెనుక ఒక మెజారిటీ సెక్షన్ వారిని చదువుల పోటీకి దూరంగా ఉంచే కుట్రనీ ఈ వాదన గుర్తిస్తుంది. అందువలన సర్కారీ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన సమాజంలో సమానత్వాన్ని పెంచుతుందనే ఉద్దేశంతో ఈ మార్పును ఈ వాదన స్వాగతిస్తుంది.
అయితే దీనికి వ్యతిరేకంగా, ఏ మాధ్యమంలో చదవాలన్నది గవర్నమెంటు శాసించటమేమిటని ఇంకో వాదన. విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ తమకు తోచిన మాధ్యమంలో చదువుకునే వెసులుబాటు ఉండాలి తప్ప మొత్తం ఒకటే మాధ్యమం ఉండాలనేది సరైనది కాదు. ఇది బలం లేని వాదనలా అనిపించినా మూలాలకు పోయినపుడు ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాథమిక విద్య ఎందులో జరగాలి అనే అంశం మీద రీసెర్చ్ కూడా జరిగింది. రీసెర్చ్ లో తేలిన అంశాలు క్రమానుగుణంగా ఎలా మార్పు చెందాయో కూడా గమనించవలసి ఉంది.
సాధారణంగా చిన్న పిల్లలకు విద్య ఇంటి వద్దే మొదలవుతుంది. పాఠశాల అనేది ఆ విధంగా మొదలైన విద్యను ముందుకు తీసుకెళ్ళే ప్రక్రియలాగా ఉండాలి. విద్య నెరపడం వారి ఆటలో భాగం కావాలే తప్ప చిన్నారుల లేత మనసుల మీద అది భరింపరాని భారం కాకూడదు. ప్రపంచంలో ఈ రోజు రెండు బిలియన్ల (రెండువందల కోట్లు) చిన్నారులున్నారు (పదిహేనేల్ల లోపు). వీరు మొత్తం ప్రపంచ జనాభాలో ఇరవై ఏడు శాతం. వీరిలో అట్టడుగు వర్గాలకు చెంది, కనీసం చదువు అందుబాటులో కూడా లేని పిల్లలు దాదాపు ఎనిమిది కోట్లు. అంటే వీరు ఎటువంటి విద్యా సంస్థలల్లో ఇప్పటి వరకు ప్రవేశం పొందని వారు. ఇక స్కూలు లో ప్రవేశం పొంది చదువు పూర్తి చేయని వారి శాతం( డ్రాపవుట్స్) ప్రపంచ వ్యాప్త డేటా తెలీదుగానీ, ప్రపంచంలో సౌత్ ఏషియా ముప్పై మూడు శాతం డ్రాపవుట్స్ తో ప్రథమ స్థానంలో ఉంది. ఇందులో పాకిస్థాన్ అత్యధికంగా ముప్పై ఎనిమిది శాతం కాగా, కేవలం బాలికల డ్రాపవుట్ శాతం ఆ దేశంలో అత్యధికంగా నలభై ఒక్క శాతంగా వుంది. మన దేశంలో పరిస్థితి కూడా ఈ డ్రాపవుట్ ఇంచుమించు ముప్పై శాతం మీదే ఉంది. ముఖ్యంగా డ్రాపవుట్స్ రెండవ తరగతి లోపలే ఎక్కవగా ఉంటున్నాయంటే ఆలోచించవలసిన అవసరం ఉంది. యునెస్కో అంచనా ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో జరగకపోవటమే దీనికి కారణం. అందుకే 1953 నుంచి యునెస్కో పిల్లలను మాతృ భాషలో చదవించటమే ఉత్తమమని నొక్కి వక్కాణించింది. మాతృభాషలో విద్య నెరపటం వలన విద్యాలయాల్లో చేరే అవకాశమూ, చదువులో విజయావకాశమూ పెరుగుతాయి అని యునెస్కో రీసెర్చి చెబుతోంది. ఎందుకంటే చిన్నారులకు మాతృభాషలో విద్య నేర్పడం కేవలం వారి సాంస్కృతిక మూలాంశాన్ని అందించడమే కాక, ఎదగబోయే మనిషిగా విద్య ఒక ఆనందకరమైన అంశంగా తయారవుతుంది. చిన్నలేలేత వయసులో అర్థం కాని తెలియని భాష, దానిని అందుకోలేని అశక్తతా వారిలో తెలియని డిప్రెషన్ ని స్ట్రెస్ నీ కలిగిస్తాయి. అంతే కాకుండా ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు కూడా ఆ చిన్నారుల చదువులో పాత్ర వహించే అవకాశము పెరగటంతో "ఇల్లు- స్కూలు -విద్యార్థి ట్రయాంగిల్" సమర్థవంతంగా పనిచేయడం మొదలవుతుంది. అటువంటి తల్లిదండ్రులు స్కూలులోని గురువులతో సరిగా మాట్లాడగలుగుతున్నారని కూడా ఈ స్టడీ చెబుతోంది. యునెస్కో ఉద్దేశాలలో పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్థులను ఎన్రోల్ చేయించటమే కాదు, వారి చదువును కొనసాగించడం కూడా.
ఇక ఇంగ్లీషులో చదివితే కాంపిటీటివ్ ఎక్జామ్స్ లో సీటు వచ్చేస్తుంది అనుకునే వారు గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషలో కాకుండా డామినెంటు భాషలో విద్యను అందించాలని ఉవ్విల్లూరుతున్నారు. వారి సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మధ్య జరిగిన యునెస్కో కాన్ఫరెన్సు గత ముప్పై యేండ్లుగా చేసిన రీసెర్చిని బయటపెట్టింది. భాష నేర్చుకోవడానికి ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న సూత్రాలను అందించింది. అవేంటో ఇపుడు చూద్దాం.
* "సాధారణంగా ఒక విద్యార్థికి మాతృ భాషలో పట్టు సాధించడానికి పన్నెండేళ్ళు పడుతుంది. పన్నెండేళ్ళ లోపు ఒకవేళ ఆ పిల్లలు మాతృభాష కాక వేరే భాష చదవాలనుకుంటే, మాతృభాషలో విద్యను మాత్రం ఆపేయకూడదు. కొత్తగా నేర్చుకుంటున్న భాష కేవలం అదనపు భాషగా ఉండాలే తప్ప మాతృభాషలోనే చదువు సాగాలి". ఉదాహరణకు తెలుగు మీడియంలో చదివే పిల్లవాడు ఇంగ్లీషును అదనపు బాషగా నేర్చుకుంటాడు. సామాన్య, సాంఘీక, గణిత శాస్త్రాలను తెలుగులోనే నేర్చుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు తెలుగులో చదవటం వలన ఆ భాషమీద పట్టు ఏర్పడుతుంది.
*"శాస్త్ర విషయాలను మాతృ భాషలో కాక వేరే భాషలో కూలంకషంగా అవగాహన చేసుకోవడానికి ఆ కొత్త భాషను పిల్లలు దాదాపు ఏడు సంవత్సరాలు చదివ వలసి ఉంటుంది". ఇంతకు ముందు ఉదాహరణే తీసుకుంటే తెలుగు మాధ్యమంలోనే గణితాది శాస్త్రాలకు సంబంధించిన పరిజ్ఞానం పెంచుకోవడం వలన పిల్ల వాడి మీద అదనపు భారం పడదు. ఇపుడు అతడు కొత్తగా ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడం వలన, పైన చెప్పిన రీసెర్చి ప్రకారం ఇంగ్లీషు భాషలోని పదాలనూ, అర్థాలనూ, పలికే విధానాన్నీ అవగాహన చేసుకోవడం అదనపు భారం కావడం, ఏడు సంవత్సరాలు కేవలం భాషను అవగతం చేసుకోవడంలోనే గడిచిపోవడం వలన గణితాది శాస్త్రాల మీది అవగాహన పైపైనే ఉండిపోతుంది తప్ప, లోతైన సంపూర్ణావగాహన ఉండదు.
*"మాతృభాష మీద పట్టు సాధించిన వారు, చాలా సులువుగా రెండవ భాషను నేర్చుకోగలుగుతున్నారని ప్రపంచ వ్యాప్త స్టడీలు చెబుతున్నాయి. ట్రాన్స్లేషన్, ట్రాన్సిషన్ అనే విషయాలను ఈ సందర్భంగా గుర్తించాలి". చిన్నప్పటి నుండి తెలియని భాషలో చదువే విద్యార్థి ప్రతీ పదాన్నీ, ప్రతీ విషయాన్నీ తన భాషలోకి అనువాదం( ట్రాన్స్లేషన్) చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సమర్థవంతంగా చేసుకోలేని విద్యార్థుల విషయావగాహన నామ మాత్రంగానే ఉంటుంది. కానీ అలాకాక మాతృభాషలో చదువుకోవడం వలన విషయావగాహన విస్తృతంగా పెంచుకోగలిగిన విద్యార్థి ఇంకో భాషలోకి అదే విషయాన్ని చాలా సులువుగా (ట్రాన్సిషన్) మార్చుకోగలుగుతాడు. ట్రాన్సిషన్ ట్రాన్స్లేషన్ అనే ఈ రెండు విషయాలనూ అవగతం చేసుకోకపోవడం వలన ఎప్పుడో పెద్దగయ్యాక ఇంగ్లీషు మీడియంలోకి మారటం కష్టమేమో అనే అనవసర భయం సృష్టించబడింది. మొన్న విద్యాశాఖా మంత్రిగారి మాటలు దాదాపు ఈ భయాన్ని పిల్లలలో తల్లిదండ్రులలో కలిగించేదిగా వున్నాయి.
*"కేవలం ఒక భాషలోనే విద్య గరిపేవారికన్నా..మాతృ భాషలో విద్య నేర్చుకుంటూ ఇతర భాషలను అదనంగా నేర్చుకునే పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తుందని గ్రహించడం జరిగింది".
ప్రపంచ వ్యాప్తంగా జర్మనీ జపాన్ ఫ్రాన్స్ బ్రిటన్ వంటి దేశాలనుంచే ఎక్కువగా మేధావులు శాస్త్రజ్ఞులు ఉదయించారు. వారి మాతృభాషలోనే వారి శాస్త్రావగాహన ఉండటమందుకు కారణం. పిల్లలను భవిష్యత్తు ఉద్యోగాల కోసం తయారు చేయడమా లేక వారిని శాస్త్రాది విషయావగాహన గల పరిపూర్ణ మానవులుగా చూడగలగటమా అన్నది మనం ఆలోచించాలి. ఏరకంగా చూసినా మాతృభాషలో విద్య దాని గొప్పదనమూ నిరూపితం అవుతూనే ఉన్నాయన్నది వాస్తవం.
28/3/17
Virinchi virivinti

No comments:
Post a Comment