జోకులు చేసే నష్టం
"మొరిగే కుక్కలు కరువవు" అనేది సామెత. కానీ మొరిగే కుక్కలైనా కరుస్తాయేమోగానీ, హాయిగా నవ్వేసే శత్రువెపుడూ తుపాకీతో కాల్చడు అంటాడు కోనార్డ్ లోరెంజ్. రేసిస్ట్ సెక్సిస్ట్ జోక్స్ పెరిగిపోతున్న ఈ సోషల్ మీడియా కాలంలో రేసిస్ట్ సెక్సిస్ట్ జోక్ ల విషయంలో లోరెంజ్ చెప్పిన మాటలు ఎంతవరకు నిజమన్నది చర్చ చేయవలసిన అవసరం ఉంది. లోరెంజ్ ఇటువంటి రేసిస్ట్ జోక్స్ ప్రమాదభరితంగా లేనంత వరకూ ఆమోదించవచ్చు అంటాడు. మనుషుల్లో ఇతర జాతుల పట్ల ఉండే హింసాత్మక ప్రవృత్తిని కొంతవరకైనా రేసిస్ట్ జోక్స్ నిలువరిస్తాయని అతడి వాదన. మానవుడు హింసను కలిగివుండడమన్నది అతడి సహజ గుణం. ముఖ్యంగా తనకంటే ఇతర జాతుల పట్ల అతడు తప్పక ద్వేషాన్ని కలిగివుంటాడు. అది అతడి సహజ నైజం అనేది మనం అవగాహన చేసుకోకపోతే, అహింస అనే ఆదర్శాన్నీ, నిర్మిత సత్యాన్నీ పట్టుకుని వేల్లాడతాం. మనిషిలోపలుండే హింసా ప్రవృత్తి బయటపడటానికి ఏదో ఒక కవాటమనేది అవసరం. ఆ కవాటాన్ని బలవంతంగా మూసి ఉంచటం వలన అది ఏదోరోజు మనిషిని చంపేంత హింసాత్మకంగా బయటపడక తప్పదు. కానీ రేసియల్ జోక్స్ ఆ కవాటాలని ఎప్పటికప్పుడు తెరచి ఉంచుతాయి కాబట్టి ఆ అగ్రెషన్ ఎప్పికప్పుడు తగ్గుతూ ఉండి, సాటి మనిషిని చంపడానికికు బదులు జోక్ కి నవ్వడంతో ఆగిపోతుంది లేదా పలుచనపడిపోతుంది అనేది ఈ వాదం. ఈ వాదం సారం ఏమంటే, రేసిస్ట్ సెక్సిస్ట్ జోక్స్ అవసరమే అనేది.
"మనుషి ఆలోచించగల జంతువు" అన్నారు అంటే అతడూ జంతువనే కదా. జంతువుల్లో ఉండే లక్షణాలు మనిషికీ ఉండాలి. కుక్కలనే తీసుకోండి. వీధి కుక్కలు ఎపుడైనా ఒక బొచ్చుకుక్క కనబడితే వెంటనే మొరగటం మొదలు పెడతాయి. మూకుమ్మడిగా మొరిగి తమ కంటే వేరుగా కనిపించే బొచ్చుకుక్కను గేలి చేస్తాయి. మనిషికీ అదే లక్షణం వచ్చి ఉంటుంది. తనకంటే వేరేగా కనిపించే జాతివాడిమీదో, మతం వాడి మీదో, కులం వాడి మీదో మొరగకపోతే, వదురుబోతు తనాన్ని తగినంత చూపకపోతే అతడి హింసా ప్రవృత్తి తృప్తి పొందటం జరగదు. "తిట్టడం" లేదా అంతకంటే తీవ్రమైన "చంపటం" బదులు "నవ్వటం" అనే దాన్ని ప్రవేశ పెట్టడం తద్వారా జాతుల వైరం కాస్తా జాతుల స్నేహంలా మారిపోతుందనుకోవటం ఇటువంటి ఆలోచనల వచ్చిన ఉపాలోచనలు.
"పొలిటికల్ కరెక్ట్ నెస్ (political correctness)" అనే పదం భాష ద్వారాగానీ, పాలసీల ద్వారాగానీ ఇంకే విధంగానూ ఒక గ్రూపు ప్రజలకు అవమానకరంగా ఉండకూడదనే విషయాన్ని సూచిస్తుంది. మనదేశంలో ఈ పదం పెద్దగా తెలియదనే చెప్పాలి. చాగంటి వారి ప్రవచనాల్లో అదేదో సామెతది తప్పే తప్ప తమది కాదు అని చెప్పటమూ ఇటువంటి పొలిటికల్ కరెక్ట్ నెస్ యాటిట్యూడ్ లేకపోవటమే. రేసిస్ట్ సెక్సిస్ట్ జోకుల్లో కూడా పొలిటికల్ కరెక్ట్ నెస్ దృక్పథం ఉండదని చెప్పాలి. రేసిస్ట్ జోక్స్ ఖచ్ఛితంగా ఒక వర్గం వారిని కించపరుస్తాయి. వాటిలో జోక్ పేల్చేవాడూ, నవ్వేవాడు ఒకడైతే, బాధ పడేవాడు ఇంకొకడు ఉంటాడు. అయితే జోక్స్ ఎవరు ఎవరితో చెబుతున్నారు అనేది చాలా ముఖ్యమంటారు సోషియాలజిస్ట్లు. ఒకే జాతికి చెందిన వారందరూ ఒక చోట కూర్చుని ఇంకో జాతి వారి గురించి జోకులు చెప్పుకుని నవ్వుకోవడం ఒక రకం. మగవారంతా కూర్చుని ఆడవారి గురించి జోకులు వేసుకోవడం. మొగుళ్ళందరూ కూర్చుని భార్యల గురించి జోకులు వేసుకోవడము, తెల్లవాడు నల్లవాడి మీద, హెటిరో సెక్సువల్ హోమో సెక్సువల్ మీద, ఒక మతం వాడు ఇంకో మతం మీద, ఒక వర్గం వాడు ఇంకో వర్గం మీద, ఇత్యాదివి. సాధారణంగా ఆధిపత్య వర్గాల వారు అణచివేత వర్గాల వారి మీద, పీడకులు పీడితుల మీద ఇటువంటి జోకులు వేసుకుని నవ్వుకుంటారు. ఇటువంటి జోకులు చెప్పేవారు, వాటికి నవ్వేవారూ తప్పకుండా రేసిస్టులూ, సెక్సిస్టులూ అయ్యుంటారు. టార్గెటెడ్ గ్రూపువారందరూ అణచివేత వర్గానికి చెందిన వారై ఉంటారు.
రేసిస్ట్ సెక్సిస్ట్ జోకులు, సమజంలో పాతుకుపోయి ఉండే నిమ్నోన్నతాలను, వాటి చుట్టూ పేరుకుపోయి ఉన్న నమ్మకాలను, ముందే ఏర్పాటు చేసుకున్న భావనల ( prejudices)నూ స్థిరీకరిస్తాయి. ఇటువంటి జోక్స్ విభిన్న జాతుల మధ్య సఖ్యతను ఏర్పరుస్తాయని ఒక వాదన ఉంది. మన "రస్సెల్ పీటర్" లాంటి వాళ్ళు విభిన్న జాతుల వారిని ఒక చోట కూర్చోబెట్టి రకరకాల రేసిస్ట్ జోక్ లు వినిపించేస్తూ తామేదో సాదించేస్తున్నాం అనుకోవడం జరుగుతూ ఉంటుంది. విభిన్న జాతుల వారు ఒక చోట కూర్చుని కలిసి నవ్వుకోవడం వలన మేలు జరుగుతుంది, వారిలో ఉండే రేసిస్ట్ భావనలు ఆ విధంగా పలుచనపడి పోతాయనేది ఈ వాదన లోని సారం. కానీ వాస్తవాలు ఇంకో రకంగా ఉంటాయనేది వాస్తవమే. రేసిస్ట్, సెక్సిస్ట్ జోక్ లలో ఉండే సామాజిక జీవన విధానానికీ, వాస్తవ జీవితంలో ఉండే సామాజిక జీవనానికీ సంబంధం ఒక రబ్బర్ బ్యాండుతో పోల్చడం జరిగింది. ఉదాహరణకు రబ్బర్ బ్యాండు లోపల మన సమాజం ఒప్పుకునేంత మేరకు భావనలు ఉంటే, రబ్బరు బ్యాండుకు బయట ఉన్నదంతా మన సమాజం ఒప్పుకోనిదే అనుకుందాం. ఇపుడు ఈ రకమైన జోక్ లు రబ్బర్ బ్యాండును సాగదీయడం ద్వారా, సమాజంలో ఒప్పుకోని వాటిని కూడా రబ్బర్ బ్యాండు లోపలికి తీసుకువచ్చి మనతో ఒప్పిస్తాయి. ఒక మైనారిటీ వర్గం వారిని దూషించటం తప్పు అనేది సోషల్ నార్మ్ అనుకుంటే, ఈ జోకుల ద్వారా ఆ నార్మ్ తొలగించబడుతుంది. దానికి "జస్ట్ ఎ జోక్" అని పేరు పెట్టబడుతుంది.
నిజానికి చెప్పాలంటే ఇటువంటి జోక్స్ భిన్న జాతుల వారిని దగ్గర చేయడం అటుంచితే, అవి అప్పటి దాకా మనలో దాచి పెట్టబడిన ఇన్హిబిషన్స్ ని వదిలించుకునేలా చేస్తాయి. ఉదాహరణకు ఆడవారి గురించి ఒక చోట ఒకతను జోక్ లు చెబుతున్నాడనుకుందాం. అతడు చెప్పే జోకులలోని తీవ్రతను బట్టి వింటున్న వారిలో ఇన్హిబిషన్సు తొలగిపోతాయి. ఇపుడు వింటున్న వారిని కూడా అటువంటి జోక్ లు చెప్పమని అడిగినపుడు, వారు కూడా అప్పటిదాకా బయట ఎక్కడైనా చెప్పాలంటే ఏమనుకుంటారో అనుకునే విధంగా ఉండే జోక్స్ ను కూడా ఆ సమయంలో అతి సులువుగా తడుముకోకుండా చెప్పగలుగుతారు. అంటే రేసియల్ జోక్స్ వారిలోపల ఉండే ఇన్హిబిషన్ ని తొలగించేస్తాయి. ఒక వ్యక్తి గురించి గుంపులో ఎవరైనా ఒకరు నెగెటివ్ గా చెప్పినా గుంపులోని అందరూ చిలువలు పలువలుగా ఆ వ్యక్తి గురించి నెగెటివ్ గా చెబుతూ ఆనందించడం వంటిదే ఇది కూడా. ఇపుడు అలా చెప్పబడిన వ్యక్తి తారస పడినపుడు ఆ గుంపులోని వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో..రేసియల్ జోక్ లను విని ఆనందించిన వారు కూడా జోక్ విక్టిమ్స్ ఎదురు పడినపుడు అటువంటి అవగాహననే కలిగి ఉంటారు. ఉదాహరణకు ఒక గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సెక్సిస్ట్ జోక్ లు వినక ముందు కంటే విన్న తరువాత, వుమన్ ఆర్గనైజేషన్ లకు గవర్నమెంట్ ఫండింగ్ అవసరమే లేదన్నారట.
" ఆ ఏముందీ ఇవి కేవలం జోక్స్ మాత్రమే కదా" అనుకునే వారు ఈ మధ్య కాలంలో ఎక్కువ. జోకును జోకులాగా చూడాలి అనేది వీరి ఫిలాసఫీ. వీరంతా చదువుకున్న పనికిమాలిన వారు అనాల్సి ఉంటుందేమో. పైగా ఈ మధ్య సెక్సిస్ట్ జోక్ లను ఆడవారే ఎక్కువగా షేర్ చేస్తూ కనిపిస్తారు సోషల్ మీడియాలో. ఆ మధ్య ఓ సినిమా విలన్ కం హాస్య నటుడు జయ ప్రకాష్ రెడ్డి ఏవో సెక్సిస్ట్ జోక్ లు లైవ్ లో చెబుతుంటే, స్వయంగా ఆడవారే పడీ పడీ నవ్వటం మనం చూసే ఉంటాం. ఇటువంటి వారు గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. ఒక రీసెర్చిలో కొంత మంది మగవారికి న్యూట్రల్ జోక్స్ ని వినిపించినప్పటికంటే, సెక్సిస్ట్ జోక్స్ వినిపించినపుడు వారు ఆడవారిని రేప్ చేయడం తప్పేమీ కాదనే భావనని వ్యక్తపరిచారట. ఆడది ఒక సెక్స్ ఆబ్జెక్ట్ అనే భావనని ఈ సెక్సిస్ట్ జోక్స్ వారిలో స్థిరీకరించాయన్నమాట. కాబట్టి సెక్సిస్ట్ జోక్స్ షేర్ చేస్తూ తాము గొప్ప కామెడీ లవర్స్ మి అని చెప్పుకునే ఆడవారందరూ తాము షేర్ చేసిన జోక్ ఇంకో రేప్ విక్టిమ్ ని తయారు చేస్తుందని గుర్తు పెట్టుకోక తప్పదు. ఈ మధ్య జబర్దస్త్ వంటి కామెడీ షో లలో ఆడవారిని కించపరచడం సమాజం ఒప్పుకోనంత స్థాయికి చేరిపోయింది. దానికి విక్టిమ్స్ ఎటువంటి వ్యతిరేకత చూపక పోవడం వలన రాను రానూ సమాజం దానికి అలవాటు పడుతుంది. అలవాటు పడిన తరువాత వచ్చే కామెడీ అప్పటిదాకా ఉన్న స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. దాని పరిణామాలు సమాజంలో ఆడవారిని చూసే పద్దతిలో కనిపిస్తూ ఉంటుంది. పక్కింటి ఆడవారందరూ తన కోసమే కాచుకుకూర్చున్నారనుకునే మూర్ఖత్వాన్ని గ్లోరిఫై చేసే జోక్ లు వచ్చినంత కాలం, దానిని చూసి ఎంజాయ్ చేస్తున్నంతకాలం ఆడవారిని భోగవస్తువులుగా చూడటమన్నది స్థిరీకరణ చెందుతూ నే ఉంటుంది.
మన దేశంలో ఇప్పటికీ భార్యల పేరుతో ఆడవారిపై జోక్ లు వస్తూనే ఉన్నాయి. లావుగా ఉండే వారి మీదా, నల్లగా ఉండే వారి మీదా, బక్కగా ఉండే వారి మీద, ఎల్జీబీటీల మీదా జోక్ లు చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఈ మధ్య ఒక మిత్రుడు అసెంబ్లీలో థర్డ్ జండర్ కి కూడా చోటు కలిగించాలని సహృదయతతో పోస్ట్ పెడితే, ఇప్పుడున్న వారందరూ ఎవరనుకున్నారని ఒకాయన పరిహాసాలాడటం కనిపించింది. ఇది నిజంగా ఇపుడున్న మంత్రులను హేళన చేయడమా లేక థర్డ్ జండర్ ని హేళన చేయడమా?. ఇంకో ఆయన ఏకంగా ఒక జాతి మగవారి మగతనం అంటూ కీర్తిస్తాడు. మగతనం అంటే కార్య శూరత అనే అర్థంలో వాడటం బహుశా జబర్దస్త్ వంటి కామెడీ షో లు వచ్చాక పెరిగిందేమో. ఎందుకంటే ఆ జోక్ లు ఆ భావనను స్థిరీకరించేశాయి. కాబట్టి మన మాటల్లో, భాషలో, భావాల్లో పొంగి పొరలే రేసిస్ట్, సెక్సిస్ట్ భావనలకు బీజాలు వాటిని ప్రోత్సహించే జోకుల నుంచే మొదలవుతాయని మనం గుర్తించాలి. పొలిటికల్ కరెక్ట్ నెస్ భావనని పెంపొందించుకోవాలి.
17/4/17
Virinchi Virivinti.

No comments:
Post a Comment