అల్ అబౌట్ టాయిలెట్
Shit can also serve as a stuff for thought అన్నారు పెద్దలు. అందుకే టాయిలెట్ ని కూడా ఫలవంతంగా ఉపయోగించుకోవాలన్న స్పృహనేమో అప్పట్లో న్యూస్ పేపర్లు కూడా టాయిలెట్లలోకి దూరి పోయేవి. ఇపుడు సెల్ ఫోన్స్ వచ్చేశాక ఉదయం పూట ఏకంగా వాట్సప్ అండ్ ఫేస్బుక్ కూడా టాయిలెట్ల నుండే ప్రపంచాన్ని పలకరిస్తూ ఉంటాయి. ఎంత ఫేస్బుక్ లో ఫేసు పెట్టినా, సెల్ఫీ వీరులకు ఆ సమయంలో సెల్ఫీ తీసుకోవాలనే ఆలోచన కలగకపోవడం ముదావహం. కొద్దిరోజుల్లో ఆ ముదనష్టాన్ని కూడా చూడక తప్పదేమో అని బాధ కూడా. సెల్ఫీ దిగేటపుడు ముఖం ముక్కినట్టుగా ఎలాగూ పెడుతుంటారు కదా, సిట్యుయేషన్ లేకున్నా. ఇదొక్క సెల్ఫీ కూడా దిగేస్తే...పెట్టిన ముఖకవళికకూ కింది కదలికకూ పొంతన చేకూర్చిన వారౌతారు. సామాజిక కట్టుబాట్లను టాయిలెట్ల నుండే ఛేదించాలంటాడు తన సర్రియలిస్ట్ చిత్రం "ఫాంటమ్ ఆఫ్ లిబర్టీ"లో దర్శకుడు "లూయిస్ బున్యూల్". ఈ సినిమాలోని టాయిలెట్ సీన్ ని మన దేశస్థులు చూసే వీలు లేదు సెన్సార్ పరిధుల వలన. డైనింగ్ టేబుల్ చుట్టూ పది మంది కూర్చుని మాట్లాడుకుంటూ తింటూన్నట్టుగా పది మంది చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ మలవిసర్జన చేయటం చూపిస్తాడీ సినిమాలో. అంతే కాకుండా తిండి తినడానికి ఇంటి వెనుక ఉన్న చిన్న గదిలోకి పోయి ఒంటరిగా కూచుని తినటం చూస్తాం ఇదే సినిమాలో. అంటే టాయిలెట్ల విషయంలో మనమేర్పరచుకున్న దృక్పథాలు సామాజిక నిబంధనల వలన ఏర్పడినవే, వాటిని ఛేదించాలంటాడు దర్శకుడు. ఇన్ని రోజుల తర్వాత స్వచ్ఛ భారత్ పుణ్యమా అని మనం మొదటిసారయినా టాయిలెట్ల గురించి ఆలోచించగలుగుతున్నాం, చర్చించగలుగుతున్నాం. టాయిలెట్లనుండే ఆదునిక భారతంలో విప్లవం మొదలవటం శుభపరిణామం.
ఈ మధ్య నగరీకరణల వలన మన ఇండియన్ టాయిలెట్లు కనుమరుగై ప్రతీ చోట వెస్టర్న్ టాయిలెట్లు ప్రత్యక్షమౌతున్నాయి. ఇండియన్ స్టైల్ అలవాటయిన వారికి ఒక పట్టాన ఈ వెస్టర్న్ టాయిలెట్స్ అర్థం కావు. "పని ముగియకముందూ, ముగిసిన తరువాత వెయిట్ చెక్ చేసుకుంటే ఎలాంటి మార్పూ ఉండి చావట్లేదోయ్" అన్నాడు అప్పట్లో ఊరి నుండి వచ్చిన బంధువు. ఒకానొక పెండ్లి విడిదిలో వెస్టర్న్ టాయిలెట్స్ ఉన్న గదులు ఏర్పాటు చేశారని మగ పెండ్లి వారు అలక పానుపేశారట. అప్పటికప్పుడు ఇండియన్ టాయిలెట్స్ ఉన్న హోటల్ లో గదులు ఇప్పించాల్సి వచ్చిందట. ఇట్ హాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా. కానీ పబ్లిక్ టాయిలెట్లలో ఇండియన్ స్టైల్ ని అనుసరించటం వెస్టర్న్ టియిలెట్స్ కి అలవాటుపడిన నగరవాసులకు మహా ఇబ్బందిగా మారింది. ఒక పెద్దాయన పబ్లిక్ టాయిలెట్లను ఏకంగా పెళ్ళితో పోల్చేశాడు. బయటనున్న వారు ఎపుడెపుడు లోపలికెల్దామా అని తొందరపడుతుంటే, లోపలున్న వారు ఎపుడెపుడు బయటికొచ్చేద్దామా అని తొందరపడతారట. మోకాళ్ళను మడచి ఎక్కువసేపు కూర్చోలేక కావచ్చు. అసెంబ్లీలో ఇండియన్ టాయిలెట్లలో ఉండే పాదపు గుర్తులను చూచి దేవుడి పాదాలనుకుని మొక్కి వచ్చారట అప్పటి పల్లెటూరినుండి ఎంపికైన ఎంఎల్ఏలు. అది గుర్తుంచుకునే నేమో ఈ మధ్య జైరాం రమేశ్ టాయిలెట్స్ గుళ్ళ కంటే పవిత్రమైనవన్నాడు. గుళ్ళ కంటే కూడా టాయిలెట్స్ లోనే తక్షణ మోక్షం లభిస్తుందని చమత్కరించాడు. మనలో మనమాట, రాజకీయనాయకులు టాయిలెట్ కుండ మీద కూర్చున్నంత స్థిరంగా ఇంకెక్కడా కూర్చోలేరని ప్రతీతి.
టాయిలెట్ ఎక్కడున్నా ఫ్లష్ ఎంత ముఖ్యమో వెంటిలేటర్ కూడా అంతే ముఖ్యం. అలా అని చెప్పి విమానాల టాయిలెట్లలో వెంటిలేటర్లను ఆశించకూడదు మరి. ప్రైవసీ తక్కువున్న ప్రదేశాల్లో నీళ్ళ కంటే నీళ్ళ శబ్దం చాలా అవసరం. ఆ మధ్య అత్యవసరంగా పొట్టపట్టుకుని ఇంటికొచ్చిన మిత్రుడు లోపలంతా బక్కెట్టు జరిపిన శబ్దమే అని కవరింగ్ ఇవ్వ ప్రయత్నించాడు. నవ్వకుండా నమ్ముతున్నట్టు నటించడం కష్టమైంది మరి. తెనాలి రామకృష్ణుడు బంగారు వరి గింజలు నాటితే బంగారం వరి పంట వస్తుందని చెప్పాడట. కానీ నాటేవారు ఇప్పటిదాకా కిందినుండి గాలి వదలని వారై ఉంటేనే సాధ్యమౌతుందని మెలిక పెట్టాడట. కృష్ణదేవరాయరంతటి వాడు ఆ ఆఫర్ ని తిరస్కరించాడట. ఎంతవారలకైనా తప్పని గాలి కదా. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అన్నట్టు, ఎంతటివాడైనా టాయిలెట్ కి పోక తప్పదు. నేను అవతార పురుషుడిని నేను పోను అంటే కుదరదు. విజ్ఞానం పెరిగి టాయిలెట్లు ఈ మధ్య మన దేశంలో దర్శనమిస్తున్నాయిగానీ మనవారంతా ప్రకృతి సౌందర్యారాధకులే ఒకప్పుడు. ఎటొచ్చీ ఆడవారికి టాయిలెట్లు రావడమనేది గొప్ప సామాజిక పరిణామం మనదేశంలో. ఇంతకాలం ఆడవారికి కూడా టాయిలెట్ల అవసరం ఉంటుందని మగవారు గుర్తించకపోవటం దారుణమైన విషయమే. వరల్డ్ మెన్స్ డే (world men's day) నీ వరల్డ్ టాయిలెట్స్ డే (world toilets day) నీ ఒకే రోజు (నవంబర్ 19) జరుపుకోవడంలో అసలు మతలబు బహుశా టాయిలెట్ల అవసరాన్ని మగవారికి చెప్పడం కోసమేనేమో. ఇప్పటికీ గ్రామాలు నిప్పులతో ఉదయిస్తూండటం స్వచ్ఛభారత్ పనితీరును తెలుపుతూ ఉంటుంది. నిప్పులు లేని భారత దేశం కోసం పనిచేయాల్సిన అవసరాన్ని లోక కల్యాణం దృష్ట్యా మనం, అంటే భారతీయులం గుర్తించాల్సి వుంది.
టాయిలెట్ కుండల ఆకారాలు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. వారి వారి శారీరక అవసరాలను బట్టి ఈ ఆకారాలుంటాయనుకోవడం అర్ధ సత్యమే ఔతుంది. ఈ ఆకారాలకూ ఆ దేశ రాజకీయ దృక్కోణానికీ సంబంధం ఉందంటాడు జిజెక్. సెకండ్ వేవ్ ఫెమినిజంలో కీలక పాత్ర పోషించిన "ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్" నవలలో రచయిత్రి "ఎరికా జంగ్" జర్మన్ టాయిలెట్ల గురించి ఉటంకిస్తుంది. థర్డ్ రీచ్ లోని భయానక దృశ్యాలకూ టాయిలెట్ల ఆకారాలకూ లింక్ పెడుతుందావిడ. "ఇటువంటి టాయిలెట్లను రూపకల్పన చేసిన ప్రజలు ఎంతకైనా తెగిస్తారని" నాజీ జర్మన్లను గురించి చెబుతుంది. అంతగా జర్మన్ టాయిలెట్ల గురించి భయపడవలసిన అవసరం ఏముందని అడగవచ్చు. వుంది. భయపడవలసిన అవసరమే ఉంది. ఎందుకంటే జర్మన్ టాయిలెట్లలో మలం వెనుకకి పోకుండా ప్యాన్ మీద ముందుకు వస్తుంది. ప్యాన్ ముందు భాగంలో ఒక షెల్ఫ్ ఉంటుంది. అందులో పడిన మలాన్ని పరీక్షించండనీ, అందులో ఏమైనా నులి పురుగులూ, రక్తపు మరకలూ ఉన్నచో డాక్టరుని సంప్రదించాలనీ జర్మన్లు ఆ విధంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకుంటారు. ప్యాన్ లోఉన్న మలం ఫ్లష్ చేస్తేగానీ కదలదట. ఇది జర్మనులు పురాతన కాలం నుంచీ అనుసరిస్తూ వస్తున్న ఆరోగ్య సూత్రమట. వీరి ఆరోగ్య కాంక్ష ఏమోగానీ వినడానికే జుగుప్స కలిగించేలా ఉంటుందీ పరిస్థితి. అందుకేనేమో ఈ అమెరికన్ రచయిత్రికి థర్డ్ రీచ్ నాటి మారణ హోమానికి జర్మనుల ఈ ఆకాంక్షాపరత్వమే కారణమనిపించి ఉంటుంది. జర్మన్ల టాయిలెట్స్ పరిస్తితి ఇలా ఉంటే ఇందుకు పూర్తి భిన్నంగా, ఫ్రెంచి టాయిలెట్లు వెనుక దూరంగా రంధ్రాన్ని కలిగి ఉంటాయట. ప్యాన్ మీద నుండి మలం వెనువెంటనే దూరంగా కనిపించకుండా జారిపోతుందట. ఫ్లష్ చేయనవసరం లేకుండానే ఇటువంటి వేగవంతమైన పనిని అవి చేస్తాయట. ఇక అమెరికన్ టాయిలెట్ల తీరు ఇంకో రకం. వీటిలో నీరు ఎప్పటికీ పైకి కనిపిస్తూ ఉండటం వలన, ఫ్లష్ చేయనంతవరకూ నీరూ, మలమూ ప్యాన్ మీద తేలుతూ ఉంటాయట.
ఈ మూడు దేశాలకు సంబంధించిన టాయిలెట్ల రూపానికీ ఆ దేశాల వైఖరులకూ సంబధం ఉందంటాడు జిజెక్. నిజానికి ఈ మూడు దేశాల భౌగోళిక అస్తిత్వ వైఖరులను మొదటగా అర్థం చేసుకున్న వాడు హెగెల్. జర్మనుల ప్రతిఫలనాత్మక పరిపక్వత(reflective thoroughness, )ఫ్రెంచి వారి విప్లవాత్మక తొందరపాటు( revolutionary hastiness), అమెరికన్ల ఆధునిక ప్రయోజనాత్మక ప్రాగ్మాటిజం( modern utilitarian pragmatism) వలన అవి తమ అస్తిత్వ వైఖరులను వేరు వేరుగా కలిగి ఉన్నాయంటాడు హెగెల్. జిజెక్ ఇంకో అడుగు ముందుకేసి ఆయా దేశాల వైఖరులకు టాయిలెట్ల నిర్మాణాలకూ సంబంధం చూపిస్తాడు. జర్మనులు తమదగ్గరున్న అసహ్యకరమైన విషయం పట్ల సందిగ్ధతతో కూడిన ఆలోచనలను కలిగి ఉంటారట. ఫ్రెంచి వారు అసహ్యకరమైన విషయాన్ని వీలైనంత తొందరగా వదిలించుకోవాలని అనుకుంటారట. అమెరికన్లు ఆ విషయాన్ని ఒక సాధారణ విషయంగా పరిగణించి సరైన పద్దతిలో ప్రయోజనకరంగా దానిని తొలగించుకుంటారట. ఇటువంటి వైఖరే సామాజికంగా జర్మనీలో మెటా ఫిజిక్స్, కవిత్వమూ ఉదయించడానికీ, ఫ్రెంచ్ లో ఫ్రెంచి తరహా రాజకీయాలకూ, యూరోపులో ఇంగ్లీషు ఎకానమీ రావడానికి కారణమంటాడు. రాజకీయంగా కూడా జర్మనుల సాంప్రదాయ వాదం ( conservatism), ఫ్రెంచి వారి విప్లవాత్మక ఉగ్రవాదం (revolutionary terrorism) , అమెరికనుల ఆధునిక ఉదారవాదాల( modern liberalism) ను వారి టాయిలెట్ల నమూనాలతోనే అర్థం చేసుకోవచ్చంటాడు. ఈ లెక్కన మనదేశంలో నిన్న మొన్నటి వరకూ టాయిలెట్లు లేవు కాబట్టి మన ప్రబంధ కవుల సందర్భానుచిత ప్రకృతి వర్ణనలకు కారణం లేకపోలేదనుకోవాలి.
కీ హోల్ లాగా ఉండే మన ఇండియన్ టాయిలెట్ల ఆధారంగా ప్రస్తుత మనదేశ అస్తిత్వ వైఖరిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. పైగా గ్లోబలైజేషన్ పుణ్యమా అని మనమూ వెస్టర్న్ టాయిలెట్లను ఉపయోగించటం మొదలెట్టేశాం. మన బానిస వైఖరి వలననే ఇదంతా కావచ్చు. మన సాంప్రదాయం అని చెప్పి బహిరంగ విసర్జనను సమర్థిస్తూ జల్లికట్టులాంటి ఉద్యమాలూ పొడచూపొచ్చు. కడుపు పట్టుకుని లోపలికి పోయి, చేతులూపుకుంటూ బయటకి వచ్చి..."రిఫ్లెక్ట్స్ మై స్టైల్" అని సోనమ్ కపూర్ చెప్పినట్టు మనం కూడా అవసరం తీరిన తరువాత బోడి మల్లన్న అంటూంటాం. మనదేశంలో ప్రజాస్వామ్యం ఓటరు ఓటేసేంత వరకే..ఓటేశాక రాజకీయనాయకులు ఐదేల్లు చేతులూపుకుంటూ గడిపేయడమే చేస్తుంటారు. మన పబ్లిక్ టాయిలెట్ల ప్యాన్ లు తెల్లగా తళ తళ మెరిసినపుడు మన దేశానికి నిజంగా స్వచ్ఛ భారత్ ఒచ్చినట్టు. టాయిలెట్ రూంలలో అసలు వాసనతో పాటు, సిగరెట్, పాన్ మసాలా వాసనలు అదనం. తలుపుల మీద పెన్నుతో గీసిన బూతు బొమ్మలు ఉచితం. ఆ విధంగా చూచినపుడు ప్రపంచంలో మన టాయిలెట్లు చివరినుండి అత్యత్తమ స్థానాన్ని సాధిస్తాయేమో. "ప్రపంచంలోనే నంబర్ వన్ స్థాయి" అని కలలుగానే హైటెక్ ముఖ్యమంత్రిగారు సీసీ కెమెరాలతో టాయిలెట్ల పనితీరును పునరుద్ధరిస్తానని అనుకోవడం బహుశా గతం తాలూకు "వాసనలే" కావచ్చు. ప్రపంచంలోకే అత్యుత్తమ టాయిలెట్లు జపాన్ సొంతమట. జపాన్ తరహాలో బుల్లెట్ ప్రూఫ్ ట్రైనులు మనకొద్దులేగానీ, ఏలిన వారు జపాన్ తరహాలో టాయిలెట్లు అభివృద్ధయ్యేలా చూస్తారని కోరుకుందాం. ప్రజలు చైతన్యవంతులై తమ నిత్యావసరాల విషయంలో పోరాడకపోతే కుర్చీలెక్కే ఏలినవారు తమ కుర్చీల కింద రంధ్రాలు చేసుకుని మరీ కూర్చుంటారనేది సత్యం. అయిదు నిమిషాల కంపు స్థానే అయిదేండ్ల కంపును భరించకతప్పని పరిస్థితి రాకుండా చూసుకుందాం.
6/4/17
Virinchi virivinti

No comments:
Post a Comment