పవన్ మళ్ళీ మోసపోయాడు
------------------
(సినిమాను సినిమాలాగా చూడాలనే పాత చింతకాయ పచ్చడి సొల్లు డైలాగులు చెప్పే గుండెపోటు గుమ్మడి క్యారెక్టర్లు ఇక్కడ కామెంట్లు చేయకండి.)
మనమెవరైనా బంధువుల ఇంటికి పోతుంటాము. అపుడపుడే ముద్దు ముద్దు మాటలు మాట్లాడే చిన్న పిల్లలు గనుక వాళ్ళ ఇంట్లో ఉండింటే, సాధారణంగా ఒక సీన్ మొదలవుతుంటుంది. వచ్చిన వారికి ఆ సదరు బుజ్జిపాపల పాండిత్య ప్రకర్షను ప్రదర్శించటానికి ఆ ఇంటి వారు పూనుకుంటారు. కొన్ని ఇంగ్లీషు పద్యాలూ, సంస్కృతం శ్లోకాలు ఆ చిన్నారితో చదివిస్తూ ఉంటారు. ఎబిసిడీలు, అఆఇఈలూ, వన్టుత్రీలు కూడా వచ్చిచేరుతుంటాయి. సిగ్గు పడుతూ నో, చెప్పమన్నారు కాబట్టి దిక్కులు చూస్తూనో, భయం భయంగానో ఆ చిన్నారి అన్నీ చెబుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఆ చిన్నారి ఏదైనా చెప్పలేక పోతేనో, మరచిపోయినట్టుగా అనిపిస్తేనో, మనం 'అబ్బే అస్సలు లాభం లేదు' అంటామేమో అనేంత ఆతృతతో వాళ్ళమ్మ అక్కడక్కడా పదాలను అందిస్తూ ఉంటుంది. పైగా తనేమీ అందివ్వలేదన్నట్టు మనవైపు చూస్తూ ఉంటుందావిడ. అయినా పాప సరిగా చెప్పలేకపోతే, ఇపుడే నిద్ర లేచింది అందుకే డల్ గా ఉందనో, మీరు కొత్త కాబట్టి సిగ్గు పడుతుందనో సరిబుచ్చుతూ ఉంటుంది. 'లేకుంటేనా అసలు..!!'అనే స్వరం ఆ సరిబుచ్చటంలో వినిపిస్తూ ఉంటుంది. వింటున్న మనకూ బాగుంటుంది. చిన్న చిన్న పెదాలతో వచ్చీరాని మాటలతో మనల్ని కట్టిపడేస్తూ ఉంటారు పిల్లలు. ఒకవేళ ఆ కార్యక్రమానికి మనమే మొదటి అంకుల్ అయుంటే పరిస్థితి ఇంకో రకంగా తయారు కాక తప్పదు. ఆ తరువాత ఫంక్షన్ కి వచ్చే ప్రతీ అంకుల్ లేదా ఆంటీల ముందర ఈ కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిలిస్టార్' మళ్ళీ మొదలవుతుంది కానీ ఈ సారి ఇంకో అంకుల్ కోసం అన్నమాట. ఇక ఆ పై వచ్చిన ప్రతీ ఆంటీ అంకుల్ దగ్గర మొదలైపోతే మొదలొచ్చిన ఆంటీ అంకుళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. పెదవుల పైన నవ్వు తగిలించుకుని వాచీల వైపు పదే పదే చూసుకుంటూ ఈ ప్రోగ్రాం ఎపుడెపుడైపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తల్లి ఆతృత, మురిపెం అపుడు మెలి మెల్లిగా 'అబ్బా..'అని విసుగుదలగా మారుతూ ఉంటుంది. ఆనందంలో ఊయలలూుతున్న ఆ తల్లికది తెలియకపోవచ్చు. కానీ వచ్చిన వారికి బలవంతంగా కూర్చోబెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. నిన్న పవన్ కళ్యాణ్ నూ, కాటమ రాయుడు సినిమానూ చూస్తున్నపుడు ఇటువంటి పరిస్థితులు గుర్తుకొచ్చాయి.
ఒక బిజినెస్ చేసే సంస్థ ఒక ఊరిలో ఏదో పరిశ్రమ కడదామనుకుంటారనుకుంటా. వాళ్ళకి అక్కడి లోకల్ లీడర్ అనబడే కాటమ రాయుడి పర్మిషన్ కావాలిట. అమరావతిలో వలె రైతుల భూములను లాక్కుని బడాబాబులు వారి వారి పరిశ్రమలను నెలకొల్పుకోవడానికి ప్రయత్నించినట్టు ఈ బడాబాబులు ఈ చిన్న ఊరిలో పరిశ్రమ నెలకొల్పడానికి ఒస్తారన్నమాట. ఎమ్ ఓ యూలు పట్టుకుని సీ.ఎం. ముందు లైనుగా నిలబడిన పారిశ్రామిక వేత్తల ఫోటోలు చూసిన మనకు, 'ఈ లోకల్ లీడర్ ఒప్పుకుంటేనే సాధ్యం' అనేది ఎట్లానో అర్థం కాదు. రైతుల భూముల్ని కాపాడటం అనే అంశంతో మనకు ఈ లోకల్ లీడర్ కనిపిస్తాడు. వచ్చిన పారిశ్రామిక వేత్తలు కూడా వారి ప్రాజెక్టేమిటి, ఎందుకు ఈ లోకల్ లీడరు అడ్డుపడుతున్నాడు అనే అంశంతో రారు. ఏకంగా ఏసేయ్యడానికే వచ్చేస్తారు. లోకల్ లీడర్ రాగానే లేచి నిలబడాలని ఏదో డిక్షనరీలో రాశారు అన్నంత బిల్డప్ సృష్టిస్తాడు డైరెక్టరు.లీడరుగారు వచ్చి కుర్చీలో కాలు మీద కాలేసుకు కూర్చుని తన అధికారాన్ని ప్రదర్శిస్తాడు. అక్కడ ప్రాజెక్ట్ చర్చలూ ఇత్యాదివేమీ ఉండవు. సంబంధం లేకుండా పశువులకు సంబంధించిన మాటల రూపంలో ఈ ప్రాజెక్టు తనకు ఇష్టం లేదని చెప్పడం అక్కడ హీరోయిజం. సభ్యత గా ప్రవర్తించడం హీరోయిజం కానంత వరకూ ఇదే హీరోయిజం అని మనకు దర్శకుడు చెప్పాలనుకుంటాడేమో. అక్కడో ఫైటు. సర్కార్ రాజ్ సినిమాలో ఇటువంటి సీన్ ఉంటుంది. కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి ఒక ఎలక్ట్రిసిటీ ప్లాంట్ నిర్మించాలని ఒక బడాబాబు ఆలోచిస్తాడు. దానికి లోకల్ లీడర్ అడ్డు . ఆ లోకల్ లీడర్ రాజకీయాలు సీ.ఎమ్. ని కూడా శాసించేలా ఉంటాయి. అపుడు ఆ పర్మిషన్ కోసం ఏకంగా సీ.ఎమ్. తో పాటు వస్తారు ఆ పారిశ్రామిక వేత్తలు. చర్చ జరుగుతుంది. ఈ ప్లాంటు ఎంత గొప్పదైనా, భవిష్య తరాలకు ఎంత ఉపయోగపడినా, వేల మంది నిర్వాసితులను ఒకేసారి వీధిపాలు చేస్తుంది కాబట్టి నేను ఒప్పుకునేది లేదని తేల్చేస్తాడు. ఎక్కువగా మాట్లాడితే సీ.ఎమ్. కుర్చీలో నీవు కూడా ఉండవు అనేంత శక్తి ఉన్న లీడర్ గా ఆ పాత్రను చూపిస్తారు. మహారాష్ట్రలో ఆ పాత్ర ఎవరిదో మనకందరకూ తెలిసినదే.
ఈ ఇంట్రడక్షన్ సీన్ తరువాత అసలీ లోకల్ లీడరెవరు అనేది మనకు అర్థం కాదు. వార్డు మెంబరా, సర్పంచా, ఉప సర్పంచా, ఎమ్పీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యేనా?...ఏమో...ఒక సీన్ కే లోకల్ లీడర్ అన్నమాట. ఆ తరువాత ఎక్కడా బహిరంగ సభల్లో మాట్లాడటమో, పార్టీ మీటింగుల్లో వాణిని వినిపించడమో, సమస్యలతో ప్రజలు అతడిని శరణుజొచ్చడమో అటువంటివేమీ లేని ఒక లోకల్ లీడర్ ని దర్శకుడు మనకు చూపిస్తాడు. అతడికి నలుగురు సోదరులు. ఏమి చదువుకున్నారో, ఏమి చేస్తున్నారో మనకు అనవసరం. కానీ వారందరూ చదుకోవడానికో వ్యవసాయం చేసుకోడానికోగానీ, హీరో అన్నం తినకుండా ఛాయ్ తాగి పెంచుతాడన్నమాట. కానీ వాళ్ళ అన్నని ఎవరైనా ఏమైనా అంటే మూకుమ్మడిగా దాడి చేసి కుటుంబ బంధాలనూ, అనుబంధాలనూ ఆ విధంగా చూపిస్తారన్నమాట. ఈ సదరు లీడరుకి ఆడవారంటే పడదు. ఎందుకో..ఏమ్మాయరోగమో అనుకునేలోపల బ్లాక్ అండ్ వైట్ లో పదేళ్ళు నిండని పసి పిల్లల మధ్య ప్రేమ భావనలున్నట్లు చూపించేస్తాడు దర్శకుడు. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలను భారంగా మోస్తాడేమో గానీ దానికీ, ఆడవారంటే పడకపోవడానికీ సంబంధం బొత్తిగా అర్థం కాదు. ఇంతలో ఎదురింటిలో దిగిన ఒక క్లాసికల్ సింగర్ కం డాన్సర్ కం, పక్కనోడు ఏ సొల్లు చెప్పినా నమ్మేసే అమాయకురాలు కం, అహింసా మార్గమంటే బీభత్సమైన నమ్మకమున్న కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి కం, పాటలల్లో లోదుస్తులు కనబడేలా ఎక్స్పోజింగ్ చేయగల సమర్థురాలు కం, అందం కోల్పోయిన అందగత్తె అయినటువంటి ఓ హీరోయిన్ వస్తుందన్నమాట. ఆ అమ్మాయిని ఈ అన్నయ్యకు తగిలించడానికి ఈ సోదరులు పడే తంటాలతో సింహభాగం మొదటి భాగం. ఆడవారంటే అన్నయ్యకు పడదంటూనే నలుగురూ ఒక్కో అమ్మాయిని ప్రేమికురాలిగా కలిగి ఉండటం మనకు అందించే కామెడీ అన్నమాట.
ఇక రెండవ భాగంలో ఆ అమ్మాయి ఇంటికి పోవడం, అక్కడొక స్కూలు విషయంలో హీరో గారి గొప్పదనం ద్వారా పని జరిగిపోవటంతో హీరోయిన్ తండ్రి కాబోయే అల్లుడు గారి శాంత స్వభావానికి ఉబ్బితబ్బిబ్బై పోవడం. ఆ సీన్ లో హీరోని ఎవడో అనామకుడు అనుకున్న ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఫోన్ కాల్ చేయడం. కాటమరాయుడి పేరు వినబడగానే ముందు కాళ్ళు మొక్కమని అవతలి వ్యక్తి ఇవతలి వ్యక్తిని పురమాయించడం, ఇతడు వెంటనే కాటమరాయుడి కాళ్ళు పట్టుకోవడం చూస్తే ఎప్పుడో అంతరించిన ఫ్యూడల్ భావజాలాన్ని ఈ ఆధునిక కాలంలో ఎందుకు పట్టుకు వేల్లాడుతున్నారో అర్థం కాదు. ఆ సదరు వ్యక్తి పేరులో గౌడ్ అని ఒక కులాన్ని సూచించేలా ఎందుకు పెట్టారో కూడా తెలియదు. వెంటనే అవతలి ఫోన్ లోని వ్యక్తి కూడా వచ్చేసి కాటమరాయుడి కాళ్ళు పట్టుకోవడం చూస్తుంటే, అసలు దర్శకుడు ఈ కాలం వాడేనా లేక ఫ్యూడల్ యుగం నాటి వాడు టైం మెషీన్ లో ఈ కాలానికి వచ్చి తిష్టవేశాడా అనిపిస్తుంది. ఇక రెండవ భాగంలో రెండవ సగమంతా, అహింసా మార్గం లో పోయే హీరోయిన్ ఫ్యామిలీ చుట్టూ అల్లుకున్న హింసాయుత వాతావరణాన్ని హీరో అండ్ అతడి సోదరులూ వారికి తెలియకుండానే తొలగిస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో హింసా మార్గంలో ఉన్నాడని తెలుసుకున్న ఆ కుటుంబం అతడిని వెలివేస్తుంది. అయినా హీరో కదా అసలు నిజాన్ని చెప్పడన్నమాట. మనసులోనే దాచుకుంటాడు. వెంకటేష్ 'రాజా' సినిమాలోలాగా సెల్ఫ్ సింపథీని హీరో ప్రదర్శించక పోవటం ఒక శుభ పరిణామం. కానీ హీరోయిన్ తండ్రి పూర్తి ఆపదలోకి రాగానే హీరో మరలా రావడం. ఆ దుండగులనందరినీ చంపేయడం. అపుడు చివరిగా "బాబూ...మాకోసం ఇదంతా చేశావా" అంటే..అవును అని ఒక ముక్కలో చెబితే బాగోదు కాబట్టి, రెండు భారీ డైలాగులతో సినిమాని ముగించటం.
ఏమి చెప్పదలుచుకున్నాడు దర్శకుడు?. ఇంకా ఈ పాత కథలు ఎందుకు రాసుకుంటున్నారు?. తెలియదు. ఈ సినిమాకు ఏకైక బలం పవన్ కళ్యాణ్. తెలుగులో అంత స్టైలిష్ హీరో లేడనే చెప్పాలి. దాసరి నారాయణ రావు కూడా గబ్బర్ సింగ్ సినిమా చూసి ఇదే మాటన్నాడు. అంతో ఇంతో సామాజిక దృక్పథం ఉన్న హీరో కూడా అతడేనేమో బహుశా. అతడికి ఈ సినిమాకూ ఎక్కడా పొసగదు. ఒక బంగారాన్ని దగ్గర పెట్టుకుని ఇత్తడి కథలు తీయడం, దానిని ఫ్యాన్స్ అనే వారు బలపరచటమూ చూసినపుడు, తెలుగు సినిమా దిశ ఎటు అనేది అడగాలనిపిస్తుంది. బాధ్యతాయుతమైన హీరోలుగా మన హీరోలు మారటం ఎంతో అవసరం అనిపిస్తూంటుంది. చిన్న పిల్లలు ఏది చేసినా బాగుంది బాగుంది అని తల్లి అంటుంది. తల్లికాబట్టి. అది అందరికీ చూపాలనుకుంటుంది. తల్లి కాబట్టి. పర్వాలేదు. కానీ పదే పదే అదే చూపాలి అనుకోవడంతో అసలు సమస్య మొదలవుతుంది. ఎంతకాలం పవన్ వంటి హీరోతో చేసిందే చేయిస్తారు అని నా ప్రశ్న. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ విన్న కథలలో ఇదే ఉత్తమ కథ అయుంటుంది. అందుకే అతడు మోసపోయాడు. ఇదే ఉత్తమ కథ అయినట్టైతే అసలు పరిశీలనకు వచ్చి రిజెక్ట్ అయిన కథల పరిస్థితి ఇంకెంత దారుణమో ఆలోచించాలి. పవన్ వంటి సామాజిక స్పృహ ఉన్న హీరో మీద సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ఫ్యాన్స్ కోసమే సినిమా తీసేట్టయితే ఇంక సినిమా తీసి రిలీజ్ చేయడమెందుకు, ఫ్యాన్స్ ని అందరినీ ఒక థియేటర్ లో కూర్చోబెట్టి ప్రదర్శస్తే సరిపోతుందిగా. పవన్ ఈ సమాజం కోసం సినిమా తీయాలి. ఆధునిక యుగంలోని సామాజిక వాస్తవిక జీవితాలకు దృశ్య రూపం ఇవ్వాలి. ప్రజలను ఆలోచింపజేసే సినిమాలు తీయాలి. పవ'నిజం' అలా మొదలుకావాలి.
26/3/17
Virinchi virivinti.

రివ్యూ అదిరింది. కానీ సామాజిక స్పృహ, మంచి కథతో పవనిజం ఇవి జరిగే పనులేనా?
ReplyDelete