యుద్ధానికి ప్రజాస్వామ్యానికీ సంబంధం లేదు. ప్రజలందరి ఆమోదంతోటి యుద్ధమెవరూ చేయరు. కొంతమంది తలతింగరి పెద్దలు కలిసి ఒక రూంలో కూర్చుని పలానా నగరం మీద అణుబాంబు యేసేద్దాం అని అనుకుని యేసేస్తారు.
ఒకదేశంపై యుద్ధం చేయాలంటే ఐక్యరాజ్య సమితి పర్మిషన్ లు గట్రా ఏమీ ఉండవు. అంతా ఐపోయాక పప్పు బెల్లాలు పంచడానికి వచ్చేదే ఐక్యరాజ్య సమితి. ఒకదేశంపై మరోదేశ అధినేత యుద్ధం మొదలెట్టగానే ప్రతి తలకుమాసిన దేశ అధినేత ఫోన్ చేసి మాట్లాడతారు. "ఆ ఏంటయ్యా...! యుద్ధం ఆపవచ్చుకదా...యుద్ధం పాపం కదా..ప్రజలు కదా.. చచ్చిపోతారు కదా..!" వంటి సినిమా క్లాసులు పీకడం లాంటివేమీ ఉండవక్కడ. "నేను నాశనం చేయబోయే దేశం యొక్క దేశ పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టు మీకే ఇస్తాను!!" అని ఆ అధినేతే భరోసా ఇస్తాడు.
యుద్ధం ఆగిపోవాలని కోరుకునేకంటే ఎంత ఎక్కువ డామేజైతే మనకంత కాంట్రాక్టు వస్తుందని వీళ్ళంతా ఉవ్విళ్ళూరుతుంటారు.
అమెరికా ఇరాక్ విషయమై ఇలాగే ప్రపంచదేశాలను ఒప్పించిందంట. ఇండియా కూడా సైసై అంది. శాంతి అహింస సుహృద్భావము సహకారము వంటివి యుద్ధం విషయంలో కుదరవు. Everything is right incase of war. యుక్రెయిన్ రష్యా యుద్ధమైనా, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధమైనా ఓకే భయ్. ఇందులో మాకేంది మీకేంది.
ఎలక్షన్లైనా అంతే. ఈ మధ్య ప్రజాస్వామికంగా హుందాగా జరగవలసిన ఎలక్షన్లను యుద్ధాలతో పోలుస్తున్నారు. పెద్ద కంపెనీలకు మీడియా సంస్థలకు మంచి కాంట్రాక్టులు ఎవరు ఆఫర్ చేస్తారో వాళ్ళదే విజయం. నాయకుడు చేయవలసినది ఒకటే. తన స్పీచుల్లో ఎంత దమ్ముందా లేదా నిజాయితీ ఉందా లేదా అనేది విషయంకాదు. అదంతా కామన్ మ్యాన్లకోసం వేసే బిస్కెట్లు. అసలైన విషయం పెద్ద పెద్ద వాళ్ళను కాంట్రాక్టుల విషయమై ఎంతవరకు నమ్మించగలిగామన్నదే విషయం. ఐనా యుద్ధంలో వలే కాకుండా ఎలక్షన్లలో మాత్రం ప్రజలే చివరికి దేవుళ్ళు. దేవుడు రెండు కళ్ళిచ్చి ఒక నోరిచ్చారని రెండు చెవులిచ్చారనీ కాకుండా రెండు చెవుల మజ్జన కొంత డొప్ప ఇచ్చి అందులో కాస్త గుజ్జు కూడా ఇచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి.
No comments:
Post a Comment