Brain drain returns without heart
---------------------------------------------------------------------------------
ఒక ప్రపంచ పటాన్ని తీసుకుని చేతిలో నలిపివేస్తే, దేశాలన్నీ ముడుచుకుని దగ్గరయినట్టుగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి ఒక సింబాలిక్ ఇమేజ్. దేశాల మధ్య భౌతిక దూరాలే తరిగాయి. ప్రాక్ పశ్చిమ దేశాలుగా విడిపోవటమన్నది పొరలు పొరలుగా బహురూపాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో మార్పు ఊహించనంత వేగంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ వేగానికి తట్టుకుని తమ తమ జీవిత విధానాల్ని, మానవ సంబంధాల్నీ మార్చుకుంటూ బతక నేర్చిన వారు ఒక వైపూ, మార్చుకోలేక, లేదా మార్పును అందుకోలేక వెనుకబడిపోయే వారు ఇంకోవైపూ కనిపిస్తూ ఉంటారు. మార్పు అనే పద్ధతి ద్వారా మనకు తెలియని భవిష్యత్తు మన జీవితాల్ని నిర్ధాక్షిణ్యంగా తొలిచేస్తూనే ఉంటుంది. "కాలం గడిచేకొద్దీ, సామూహికత్వం నుండి వ్యక్తివాదం వైపుకు పశ్చిమ దేశాలు స్వయం ప్రేరణతో సహజంగానే నడిస్తే, ఎలాంటి స్వయం ప్రేరణా లేక కేవలం పశ్చిమ దేశాలతో ఏర్పడిన పరిచయ ప్రభావం చేత మాత్రమే తూ ర్పు దేశాలు వ్యక్తివాదం (individualism) వైపు నడిచాయంటారు" శ్రీ అరవిందులు. భారత దేశంలో ఆధునిక టెక్నాలజీని అందుకుని, విదేశీ చదువులు చదివిన వారు, విదేశాల్లో నివసిస్తున్నవారు, ఆ పశ్చిమ సమాజాల పరిచయ ప్రభావానికి లోనైనపుడు, తీవ్రమైన ప్రవర్తనా మార్పులకు లోనవటం సహజం. వాళ్ల ప్రవర్తనల్లో వచ్చిన మార్పు, వ్యక్తిగతంగా వాళ్లు గుర్తించలేక పోవచ్చు. కానీ స్వంత దేశానికి తిరిగి వచ్చినపుడు, తోటి బంధువులూ స్నేహితులూ, వ్యక్తి వాదాన్ని మోసుకొచ్చిన ఈ కొత్త మనిషిని అర్థం చేసుకోవటానికి ఇబ్బంది పడతారు. వ్యక్తి వాదంలోంచి పుట్టుకొచ్చిన కొత్త మానవ విలువలనీ, మానవ సంబంధాలనీ చూసి, ఏది నిజమనే అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతారు. డెట్రాయిట్ నుండి సొంత ఊరికి తిరిగి వచ్చిన తమ్ముడిని, ఆ సందర్భాన్నీ కవిత్వం చేస్తూ, ఎన్నో ఆసక్తికర విషయాల్ని చర్చిస్తారీ కవితలో కవయిత్రి కొండేపూడి నిర్మల. ఇదొక చారిత్రక సందర్భానిది. విదేశాల్లో కొడుకు లేదా కూతురున్నారని గొప్పగా చెప్పుకునే 'ఐటీ బూమ్' పెచ్చరిల్లుతున్న సందర్భం. ఆ సందర్భంలోని ఒకానొక కుటుంబం అందులోని అనుబంధాలూ, మానసిక ఘర్షణలూ అన్నీ ఈ కవితలో ఇమిడిపోయి కనిపిస్తాయి.
కుటుంబం, విద్య, మతం, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం అని సమాజంలో ఐదు ప్రాథమిక వ్యవస్థలుంటాయి (primary institutions of society). ఇవన్నీ కూడా మనిషి మనసుకీ అతని అవసరాలకీ, చుట్టూ ఏర్పడిన పరిస్థితులకీ అనుగుణంగా మార్పులు చెందుతూ నే ఉంటాయి. ఈ శతాబ్దపు ఆధునిక జీవితం, ఆర్థిక వ్యవస్థనీ, ప్రభుత్వాలపై విపరీతంగా ప్రభావితం చేసింది. మతం గానీ, విద్య గానీ అందుకు అనుగుణంగా మలచబడ్డాయి. చివరకు కుటుంబం కూడా ఈ ఆధునిక పోకడలను అందిపుచ్చుకోవడానికి విచ్ఛిన్నం చెందటం ప్రారంభించింది. కుటుంబం చుట్టూ ఉన్న సమాజంలో జరిగే అఘాతాలకు షాక్ అబ్సార్బర్( shock absorbers) గా పని చేయాల్సింది పోయి, ఆ కుటుంబాలే షాక్ కి గురవుతున్నాయి. ఆధునిక నగర సమాజంలో కుటుంబం నిర్వహించాల్సిన బాధ్యతలను, ఓల్డేజ్ హోం లూ, క్రష్ లూ, కౌన్సిలింగ్ సెంటర్లూ వంటి కొత్త సంస్థలు నిర్వహిస్తూ, సమాజంలో కుటుంబ పాత్రను( role of family in society) శూన్యం వైపు నడిపిస్తూన్నాయి. నగరీకరణ తెచ్చే నూతన సమాజాన్ని, వెస్ట్ భౌతికంగానూ మానసికంగానూ కూడా అర్థం చేసుకోగలిగింది. ఇండియా వంటి దేశాలు భౌతికంగా దానిని అనుసరిస్తున్నాయే తప్ప, మానసికంగా గ్రామీణ వ్యవస్థతో ఇంకా పెనవేసుకుని ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ రెండు వ్యవస్థల నడుమ వేలాడుతూ సందిగ్ధావస్థలోనే ఉన్నాయి. ఈ కవితలో కవయిత్రి నిర్మల ఆ సందిగ్ధావస్థలో కనబడతారు. కానీ అంతర్గతంగా ఈ మార్పును వ్యతిరేకిస్తూ గ్రామీణ సమాజాన్ని కోరుకున్నట్టుగా చూస్తామీ కవితలో. గ్రామీణ సామూహిక తత్వానికీ, నాగరిక వ్యక్తి వాదానికీ జరిగే ఘర్షణను అక్కా తమ్ముళ్ల పాత్రల ద్వారా ఆవిష్కరిస్తారు.
ఈ కవితలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ముందుగా కవిత రూపంలో మనకు ఆ సందర్భాన్ని చెబుతున్న అక్కగా కొండేపూడి నిర్మల. విదేశాలనుంచి తిరిగి వచ్చిన ఆమె తమ్ముడిని చూసి, మనతో మాట్లాడుతుందీ కవితలో. సూర్యోదయాన్ని తమ్ముడి కంటే పదిగంటలు ముందుగా చూడగలిగిన ఒక భౌగోలిక అద్భుతంలో ఉన్న ఆమె, తన తమ్ముడిన చూసిన తరువాత అతడికంటే ఎంతగానో వెనుకబడి ఉన్నానని గుర్తిస్తుంది. అల్విన్ టఫ్లర్ చెప్పే ఫ్యూచర్ షాక్( Future Shock) వంటిదిది. చిన్నప్పటి ప్రపంచ పటానికీ, ఇపుడు నలిగిపోయి ముడతలు పడి ఉన్న ప్రపంచ పటానికీ ఉన్న పోలికలను సింబాలిక్ గా అర్థం చేసుకుంటుంది కవయిత్రి. శత్రు వ్యూహాలూ, వ్యాపార సంబంధాలూ కొనసాగించే దేశాలు, అక్కా తమ్ముళ్ల అనుబంధాల్ని కూడా వెట్టితో, వలసలతో ప్రభావితం చేయడం చూస్తుందామె. ఖచ్ఛితంగా చిన్నప్పుడు తను చూసిన తమ్ముడైతే కాదతను. కొత్త విలువలు, కొత్త అనుబంధాలూ నేర్పే మరో ప్రపంచానికి చెందిన తమ్ముడిని చూస్తుందామె.
ఇక తండ్రి పాత్ర. రోజూ కట్టుకునే చీరల్ని కొనీయటానికి విసుక్కునే ఆ తండ్రి, తమ్ముడు విదేశాలనుండి వస్తున్నాడని తెలియగానే, ఇల్లు పీకి పందిరేసినంత హడావుడీ చేయటం. దానికై లక్షలు ఖర్చు చేయటం. కానీ తను చనిపోయిన తరువాత, అంత్య క్రియలకు కూడా ఈ కన్న కొడుకు రాడని తెలియదా తండ్రికి. ఒక మనిషితో ఇంకో మనిషికుండే అనుబంధం, మరణం వరకూ కొనసాగుతుంది. మరణం తరువాత ఆ మనిషి ఉనికే ఉండడు. చివరిసారిగా ఆ మనిషిని స్మరించుకునే అంత్య క్రియలకు కూడా రాని, రాలేని పరిస్థితి చూస్తే ఈ సమాజం మనుషులను ఎంత కఠినంగా తయారు చేసేసిందో అర్థమవుతుంది. తనను కనీ పెంచిన తల్లి తండ్రులను అవసాన దశలో దగ్గరుండి చూసుకోలేని, తోడు ఉండలేని స్థితిని ఆధునిక జీవితం, కన్వీనియంట్ గా మభ్యపెడుతుంది. తండ్రి చనిపోయినప్పుడు, ఆ అంత్యక్రియల వ్యవహారమంతా వీడియో తీసి పంపితే చూడటమో, స్కైప్ లో చూడటమో జరగటం, వ్యక్తి తన జీవితంలో కనిపించని శక్తుల మధ్య పరాయీకరణ (Alienation) చెందాడనటానికి తార్కాణం. అంతేగాక, వాటిని వీడియోల్లో చూసి కన్నీరుమున్నీరవటమన్నది ఈ సమాజంలోని, తనలోని నిస్పృహ(insensitivity)ను చూసి బోరున విలపించలేని అశక్తత తప్ప, ఇంకోటి కాదు. పైగా ఈ ఆధునిక పోకడలను సమర్థించుకోవడానికి తగినన్ని కారణాలు, పాత సెంటిమెంట్లను వదిలించుకోవడానికి వీలైనన్ని బహానాలూ ఎప్పటికీ సిద్ధంగా ఉంటాయి.
ఇక తల్లి పాత్ర. ప్రేమనే పాకంతో అరిసెలనూ, పూత రేకులనూ, సున్నుండలనూ తయారు చేసి కొడుకుచేత తినిపిస్తుంది. కానీ బిజీ బిజీగా తీరికనే లేనట్టు కనిపించే కొడుకుతో మాట్లాడటానికి, ఇంటర్వ్యూకోసం అపాయింట్మెంట్ తీసుకోవాలసిన పరిస్థితిలో ఉంటుంది. ఇక విదేశీ వస్తువుల మీద మోజు పెంచుకునే పెద్దమామయ్య, ఇంపోర్టెడ్ మొగుడికోసం ఇంపోర్టెడ్ కలలు కనే పక్కింటి పారిజాతం, విదేశాలనుండి వస్తున్నాడు అనగానే, సెంటు బాటిల్ల కోసం, గడ్డం బ్లేడుల కోసం, వాలిపోయే బంధు మిత్ర గణం. ఇవన్నీ నిజ జీవితంలో కనిపించే పాత్రలే.
ఇక తమ్ముడి పాత్ర. ఒక ఆధునిక జీవితానికి ప్రతీక. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలకంటే ఎక్కువగా చూడలేని సమాజానికి చెందిన పాత్ర. వ్యక్తి వాదం ముందు, అన్నీ సెంటిమెంట్లనూ 'ఐ మిస్స్డ్ యూ' వంటి కొన్ని తేలిక పదాలతో ప్రకటించేసి చేతులు దులుపుకునే ఒక పాత్ర. పాత చెక్క ఆట బొమ్మను జీవితాంతం కార్డ్ బోర్డ్ లో దాచుకున్న తరం నుండి, కొద్ది రోజులు ఆడుకున్న బార్బీడాల్ ను పాతగయిందని, ఎక్చేంజ్ ఆఫర్ కింద కొత్తది కొనుక్కునే తరానికి మార్పు చెందుతున్నామంటాడు అల్విన్ టోఫ్లర్. శాశ్వతత్వం నుంచి తాత్కాలికత్వానికి మన సంబంధ బాంధవ్యాలూ, అనుభూతులూ, మారిపోయినపుడు ఆ మార్పు రక్త సంబంధంతో పెనవేసుకున్న కుటుంబ సభ్యులమధ్య స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బాల్యంతో పెనవేసుకుని పోయిన ఇంటిని అపార్ట్ మెంటుకిచ్చి, కొంత డబ్బు వెనుకేసుకోవటం, నాన్న అంత్య క్రియలను వీడియో తీయమని చెప్పటం, తీయనందుకు అక్కపై అలిగి మాట్లాడక పోవటం, నాలుగేళ్ల కోసారి వచ్చినపుడు, ఐ మిస్డ్ యూ అని కౌగిలించుకుంటే సరిపోతుందనుకోవటం, ప్రేమతో వండి చేసిన వంటలు తింటే ఆరోగ్యమేమవుతుందోనని డాక్టరు దగ్గర వాపోవటం వంటివన్నీ ఇప్పటికీ విదేశాల్లో కొడుకులుంటున్న ప్రతీ ఇంటిలో ఉండేవే. సెంటిమెంట్స్ లేని ఇన్సెన్సివిటీనే ఆధునిక ట్రెండ్ అయినపుడు బ్రెయిన్ డ్రెయిన్ హార్ట్ లెస్ గా తిరిగొస్తుంటుందనటానికి ఈ కవిత ఒక ఉదాహరణ.
ఊపిరాడ్డంలేదు
కొండేపూడి నిర్మల
--------------------------------------
ఎంత పండగ పొద్దయినా
ఇండియా లో పగలు పన్నెండింటికి నిద్ర లేచే నా తమ్ముడు
ఉగాది పచ్చడి కోసం డెట్రాయిట్ నగరమంతా
తవ్వి బోర్లిన్చాడ్టా
పొరుగింటి పుల్లకూర రుచే మరి
స్కూల్ కెళ్ళే వయసులో కోకాకోల నీళ్ళే
వాడి కడుపు నిండా ప్రవహించేది
మార్చురీ ఐస్ లా ధగధగ లాడే విదేశి ఉప్పుతో
ఉజ్జాయింపు తెలియక విసుక్కుంటూనే
అమ్మ ఉలవచారు కాస్తుంది
చారు కెరటాల్లో సత్యాగ్రహం చేసినవాల్లంతా
కొట్టుకుపోతున్నారు
లేబుల్స్ విప్పకుండానే మరో దేశం వస్తువులు చేతులు మార్చే
ఏజెన్సీ ఉద్యోగి మా పెదమామయ్య వాగ్ధాటికి
స్వదేశి ఆత్మ బహిష్కరణ జరుగుతూ వుంటుంది ,
వలస పోవడం కంటే భావప్రాప్తి సిద్దించే కల ఇంకొకటి తెలీని
పక్కింటి పారిజాతం ఇంపోర్టెడ్ పెళ్ళికొడుకు కోసం ఎదురుచూస్తుంది
చిన్నప్పుడు నాకూ తమ్ముడికి ఉమ్మడి ఆస్తిగా
ప్రపంచ పటం ఒకటి గోడకి వేలాడేసి వుండేది
నిట్టనిలువుగా ను౦చున్న సముద్రాలు
ఎడారుల్లోకి ఒలికి పోయినా
ఒకే సారవంతమయిన నేల ఎందుకు పుట్టదో
తరగని ఆలోచన నాకు
అప్పట్లో కూడికలంటేనే ఇష్టం మరి
వాడి దారి వేరు వాడిదంతా తీసివేతల పరిజ్ఞానం
ఎంతచిన్న నదినయినా గట్టుకొక పేరు చొప్పున విభజించాలనే
సమాచారం వాడే ముందు నాకు యిచ్చాడు
తమ్ముడు ఇంటికొస్తున్నట్టు కబురందితే చాలు
బిల్ క్లిoటనో, వాడి తాతో కరుణించినoత
భయ సంబరాలు మా కళ్ళలో
కట్టుడు చీరలు కొనడానికి నసిగే నాన్న
లక్షలాది రూపాయిలతో ఇంటికి ముస్తాబు చేయించాడు
గారడివాడో చిలుక జోస్య గాడో వచ్చినంత
సంభ్రమంగా బంధు మిత్రులు చుట్టూ మూగారు
ఏ సంచి లోంచీ ఏ అద్భుతం బయటకు తీస్తాడో అని
నరాలు తెగిపోయే౦త ఉత్కంట
గెడ్డం బేళ్ళు, సెంటుబాటిళ్ళు, వాకీ టాకీలు
ఓహ్! ఒకటేమిటి ఇల్లోక స్మగ్లింగ్ కేంద్రంగా మారుతుంది
జారిపోతున్న పాము కుబుసాల్లాంటి చీరలతో, లుంగీలతో
బొక్కబోర్లా పడుతూ గొప్పగా నడవడం
మంచి సర్కస్ లా వుంది
ఎవర్ని చూస్తున్నా పొట్లాలు విప్పుతున్న చప్పుడే
అంటుకున్న కుటీర పరిశ్రమల తాలూకు నిట్టాడ పాకల్లా
ఒకటే చిటపటలు
ఎన్నాళ్ళుoటాడో ఎప్పుడెగిరి పోతాడో తెలియక
అడిగేందుకు ఇంటర్వూ దొరక్క
ముత్యాల గర్భం వచ్చినంత సందేహం మా అమ్మకి
ప్రేమనే పాకం పట్టి డబ్బాలకెత్తిన
అరిసెల్ని , సున్నుండల్ని, పూతరేకుల్ని తినేసి
గాలి, నీళ్ళు ,మనుషులు వికటిస్తున్నారని
మా డాక్టర్ దగ్గర తమ్ముడు కంప్లయింట్ చేస్తాడు
తమ్ముడిదెప్పుడూ ఇన్నోవేటివ్ బ్రెయిన్ కదా
బాల్యానికి చిహ్నంలాంటి విశాలమయిన ఇంటిని కూల్చి
అపార్ట్ మెంట్ల కివ్వాలని ఆలోచన చేస్తాడు
తమ్ముడిదెప్పుడూ ఎమోషనల్ బ్రెయిన్ కదా
‘ ఐ మిస్సడ్ యూ ’ అంటూ నాలుగేళ్ళకొకసారి కావిలించుకొని
మేము నిజమనుకునే లోగా ఎగిరిపోతాడు
తమ్ముడిదెప్పుడూ డాక్యుమెంటింగ్ బ్రెయిన్ కదా
నాన్న అంత్య క్రియల్ని క్యాసెట్టు తీసి పంపనందుకు
అలిగి మాటలాడ్డ౦ మానేసాడు
వాడికంటే పదిగంటల ముందు సూర్యోదయాన్ని చూడగల
ఒక బౌగోళిక అద్భుతం లో వున్నా నేను
ఎక్కడో ఎందుకో వెనుకబడిపోయాను
దేశాల మధ్య శత్రు వ్యూహాల్ని
శవాలు లెక్క తేలుస్తాయి
దేశాల మధ్య వ్యాపార సంబంధాలు
అంకెలతో సహా దొరుకుతాయి
అక్కా తమ్ముళ్ళ మధ్య రక్త సంబంధం ఒక వలస
రాగ సంబంధం ఒక వెట్టి
మనుషులందరూ విండోస్ లో కిటకిటలాడ్డం మూలానో ఏమో
రోడ్ల మీద బరువు లేదు
ముడతలు పడ్డ నా చిన్నప్పటి ప్రపంచ పటం లా
దేశాలకు దేశాలే దగ్గరకు నొక్కుకుపోయాయి
ఆక్సిజన్ లోపమో.....ఇంకేమి లోపమో
ఎవరికీ ఊపిరాడ్డం లేదు
కవిత్వ సందర్భం26
14-9-16

No comments:
Post a Comment