స్త్రీ భాష కావాలిపుడు
-------------------------------
భాష ఒక సంస్కృతి మోసే విలువలను సమర్థవంతంగా ప్రతిఫలిస్తుంది. ముఖ్యంగా "జెండర్ స్టీరియోటైప్స్" ని సృష్టించటంలో తరాల తరబడి ఆ విలువలు మార్పు కాకుండా చూడటంలో భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. పితృస్వామ్య సమాజంలో స్త్రీ పురుష స్థానాలను నిర్వచిస్తూ, వాటిని సుస్థిర పరచటంలో తద్వారా స్త్రీకి కూడా తెలియకుండా స్త్రీ ఒక పద్దతి ప్రకారం దోపిడికి గురవటమూ ఉంటుంది. పితృస్వామ్య సమాజమంటే ఇపుడు మనం నివసిస్తున్న సమాజమే. మాతృస్వామ్య సమాజమనేదేదీ "అమేజాన్" వంటి కల్పిత గ్రీకు ద్వీప కథల్లో తప్ప ఇలలో ఉండటమనేది జరగనేలేదంటారు సామాజిక మానవ శాస్త్రజ్ఞులు (anthropologists). స్త్రీ, పురుషుడి పక్కటెముక నుండి సృష్టించబడటానికి కారణం, అతడి పక్కనే నిలబడటానికనీ, అతడి భుజం కింద రక్షణ పొందటానికనీ, అతడి హృదయానికి దగ్గరగా ఉండటానికనీ అంటాడు బైబిల్ భాష్యకారుడు హెన్రీ మ్యాథ్యూ. మతమేదైనా పురుషుడి దృక్కోణంలోనిదే. మతగ్రంధమేదైనా పురుషుల చేత రాయబడ్డదే. చివరకు దేవుడు కూడా పురుషుడే. పురుషుడిని సాధారణ (norm) మనిషిగా, స్త్రీని వేరే (other) వ్యక్తిగా చిత్రించిన సమాజంలో భాష అనేక రూపాలలో పురుషుడి భాషగానే ఉంటుంది. ఈరోజు స్త్రీ రాసే భాషంతా పురుషుడిదే. ముందు పురుషుడు సృష్టించిన భాషను నాశనం చేయకపోతే, దానిని మార్చకపోతే స్త్రీ పురుష లింగబేధాలు తగ్గవనేది లాకానియన్ ఫెమినిస్టుల (Lacanian feminists) వాదన. రాడికల్ ఫెమినిస్టుగా పితృస్వామ్య స్త్రీ పురుష సంబంధాలను అర్థం చేసుకుంటూ లాకానియన్ పద్దతిలో వాటి మూలలు భాషలో దాగి ఉన్నాయనే స్పహను కవయిత్రి శిలాలోలిత గుర్తించినట్టు అనిపిస్తుంది.
ఇల్లాల్ని చూసి ఇల్లు చూడు, గృహ లక్ష్మి, దొడ్డ ఇల్లాలు, గొడ్రాలు, పని మనిషి, కార్యేషు దాసి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, బరితెంగింపు, ధర్మ పత్ని ఇటువంటి పదాలన్నీ పురుష సృష్టినే. ఉదాహరణకు 'పని మనిషి' అనే పదం వినగానే, ఇంట్లో అంట్లుతోముతూనో, బట్టలుతుకుతూనో ఉండే ఒక స్త్రీ రూపం స్పురణకు వస్తుంది కానీ ఒక పురుషుడి రూపం స్ఫురించదు.. అలాగే 'గొడ్రాలు' అనే పదం. సంతాన అయోగ్యత అనే అంశం ఒక బయోలాజికల్ అంశం ఐనప్పటికీ, దానిని ఒక సామాజిక అంశంగా తయారు చేసినపుడు, స్త్రీలోని సంతాన అయోగ్యతనే 'గొడ్రాలు' అనే పదం ద్వారా హేళన చేయడం జరిగింది. ఈ విషయంలో పురుషుడికి ఏ పేరూ లేదు. ఇటువంటి అన్ని పదాల వెనుక దాగి వున్న వివక్షనూ,పురుషహంకారాన్నీ, దోపిడీని కవయిత్రి మనకు ఈ కవితలో తెలపటం ద్వారా, భాషలో తీసుకు రావలసిన మార్పును సూచించడం జరిగిందనుకోవాలి. పురుష భాష నుండి తటస్థ భాషకు, అంటే ఏ జెండర్ నీ సూచించని భాషకు మరలడం అన్నది ప్రస్తుత స్త్రీ వాదుల ప్రధాన ప్రాముఖ్యతాంశం. కానీ అంతకు ముందు, పురుష భాషా పదజాలాన్ని తూ ర్పాపబట్టడం తప్పక జరగాలి. ఈ కవితలో శిలాలోలిత గారు అదే చేశారు.
జెండర్ ఆధారిత భాష నుండి తటస్థ భాష వైపు జరిగాల్సిన మార్పును కవయిత్రి ఈ కవితలో స్పష్టంగా సూచించదు. కానీ కవిత మొదటి వాక్యంలోనే "మాదయిన భాష కోసం పరితపించాము" అని అంటుంది. తద్వారా కవితలో చెప్పే ఈ పురుషహంకార పదాల ఔచిత్యాన్ని వ్యంగ్యంగా ఉటంకిస్తుంది. అంతే కాకుండా కవితలో పురుష సమాజంలోని స్త్రీ మూర్తిని వివిధ రూపాల్లో నిర్మాణం చేస్తుంది. ఒక కవితలో ఒక అంశాన్ని తీసుకుని కవిత్వం చేయవచ్చు. కానీ అదెప్పటికీ పూర్తి అవగాహనా రూపాన్నీయదు. ఆసిడ్ దాడిలో ముఖం కాలిపోయిన స్త్రీ దృక్కోణం లోంచీ, లేదా రేప్ చేయబడిన స్త్రీ దుృక్కోణంలోంచి సమాజాన్ని సబ్జెక్టివ్ గా వివరించినపుడు, ఆ కొంత మాత్రమే అవగతమౌతుంది. కానీ మొత్తంగా , ఈ రోజు పితృస్వామ్య సమాజంలో స్త్రీ అంటే ఏమిటి?. అని అడిగినపుడు, ఆబ్జెక్టివ్ గా ఆమె వివిధ రూపాలను దర్శింపజేయాల్సి వుంటుంది. అప్పుడే ఆమె ఏ విధంగా objectify అయిందో అర్థం అవుతుంది. ఈ కవితలో శిలాలోలిత గారు సమాజం తయారు చేసిన స్త్రీ వాస్తవ రూపాన్ని ఆబ్జెక్టివ్ గా చూపటానికి ప్రయత్నం చేశారు. ఆ వాస్తవ రూపంలో అడుగడుగునా పురుషాధిక్యత ప్రతిఫలించే భాషా రూపాలే కనిపిస్తాయి. అంతే కాకుండా కవిత అడ్రస్ చేసేది కూడా పురుషులనే. ఇది స్త్రీ సాహిత్యపు ప్రస్తుత పరిస్థితి. స్త్రీలు తమ కోసం రాసుకునే స్థితి ఇంకా రాలేదనడానికి సాక్ష్యం. పురుషహంకారానికి వ్యతిరేకంగా చేసే యుద్ధ దశలోనే ఈనాటికీ స్త్రీసాహిత్యం ఉండిపోయినపుడు, స్త్రీత్వపు సొంత పదాలు లేదా తటస్థ పదాలూ సాహిత్యంలో ఇపుడిపుడే కనిపిస్తాయనుకోలేం.
కవిత ముగింపు ఆధునిక శాస్త్రమైన జెనెటిక్స్ మీద నమ్మకాన్ని కనబరుస్తుంది. రాడికల్ ఫెమినిష్టుగా కవయిత్రి ఆశించిన నిజమైన ముగింపు ఇది కాదేమో. కానీ సాంప్రదాయ సమాజపు వైఖరులను ఆధునిక విజ్ఞాన శాస్త్రాల వైపు తిప్పాలనే బాధ్యతతో ఇటువంటి ముగింపు ఇచ్చిందనుకుంటాను. నిజానికి జీవకణ మూలాల్లో దాగిన జన్యువులు ఎటువంటి లింగ బేధాన్నీ పాటించవు. సమాజం నిజంగా అంతటి సూక్ష్మదృష్టి వైపు మరలగలిగినపుడు, స్థూల దృష్టిని మలిన పరిచే స్త్రీ పురుష వ్యత్యాసాలు అంతరిస్తాయేమో. కానీ కవితంతా సమాజ స్త్రీ విశ్వరూపాన్ని వివరిస్తూ అకస్మాత్తుగా జన్యువులో సమాధానం కనుగోవటంతో ముగియటం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎక్కడ కోల్పోతామో అక్కడే వెతుక్కోవాల్సిన అవసరం ఉందేమో...ఎందుకంటే పూర్తి సాంప్రదాయక సమాజానికి ఆధునిక సైన్సుకూ కూడా బద్ద శతృత్వమే ఉంది. సమాజం ఏర్పరిచిన స్త్రీ రూపాన్నీ, పురుషాధిక్య భాషనూ వ్యతిరేకించటానికి జన్యు శాస్త్రం సరయిన అస్త్రం కాదేమో..ఇక్కడ కవయిత్రి సున్నితమైన మనసు పురుషహంకారాన్ని బాధ పెట్టడానికి ఇష్టపడలేదనుకోవాలో..లేక ఆధునిక సైన్సు మీద ఆమెకు ఉన్న నమ్మకం అనుకోవాలో తెలియదుకానీ, స్త్రీ వాదం తనదైన పదాల్ని సృష్టించుకోవలసిన అవసరాన్ని కూడా ఈ ముగింపు మనకు గుర్తుచేస్తుంది.
ఐనవాళ్ళ౦
----------------------
శిలాలోలిత( Shilalolitha Kavi)
మాదయిన భాష కోసం తపించాము
నాలుగ్గోడల మధ్యకు విసిరితే
దేహాత్మలేని వాళ్ళలా లోపల్లోపలే దుఃఖించాము
ఎప్పటికీ వీడని కప్పెట్టిన
మేలిముసుగుల మధ్యన జీవచ్చవాలమయ్యాము
అంగాంగాల కొలతల మద్య కోరికలమధ్య
దేహమొక్కటే మిగిలిన వాంఛలమయ్యాము
అమ్మ నుంచి అమ్మమ్మదాకా సాగిన ప్రయాణాల్లో
నకిలీ పరిపూర్ణత్వాల్ని పులుముకున్న
“ ఇల్లాల్ని చూసి ఇల్లుచూడు “ లాంటి సామెతలమయ్యాము
బిగపట్టిన పోత్తికడుపుల్తో
కాలకృత్యాలు తీర్చుకోలేని ఆశక్తలతో
అందరిలోనూ వినమ్రంగా మెలిగే గృహలక్ష్ములమయ్యాము
పునరుత్పత్తి చంక్రమణాల్లో
పదినెలలు మోసి , కనిపెంచిన
దొడ్డ ఇల్లాల్లమయ్యాము
లోపమే లేకున్నా తనువుల్తో
కడుపుపండని గొడ్రాళ్ళమయ్యాము
పాలిచ్చి పెంచిన సంతానం
లాభనష్టాల లెక్కల్తో వదిలేస్తే
వృద్ధాశ్రమాలకు చేరే తల్లులమయ్యాము
మనసులే లేనితనాన అంగడిలో
చితికిన దేహాల సరుకులమయ్యాము
నల్లటి పరదాలమాటున ఎగుమతి అయ్యే
చిన్నారి లేత యౌవ్వనాల మయ్యాము
‘ తాలిబన్ల ’ క్రూరశాసనాల మద్య
సెకనుకో అవమానాల చిట్లిన బుడగల మయ్యాము
పిల్లల్ని ఎత్తుకునే బాల్యమే లేని యంత్రాల మయ్యాము
ఎంగిళ్ళు కడిగి , ఇళ్ళను అద్దంలా మెరిపించే
పనిమనుషులమయ్యాము
టీజింగ్ కి గురయ్యి చితికిన మనుషుల మయ్యాము
ప్రేమనంగీకరించని నేరానికి కాలిన మొఖాల మయ్యాం
ఎవరికీ కోపమొచ్చినా
దెబ్బలు తినే కమిలిన దేహాలమయ్యాము
శయనేసురంభ , భోజ్యేషుమాతా , కార్యేషుదాసిగా
వివరించిన బాధ్యతల్లో మునిగితేలిన ఇరుసుల మయ్యాము
కలివిడిగా మాట్లాడి
లోకం దృష్టిలో బరితెగించిన వాల్లమయ్యాము
నీతి సూత్రాల కొలబద్దలమయ్యాము
అమ్ముకునే సరుకుల్ని ప్రచారం చేసే అర్ధనగ్న ప్రకటనలమయ్యాము
కదులుతున్న ప్రచార , ప్రసార సాధనాల్లో
మొఖంలేని దేహపటాలమయ్యాము
వెక్కిరింతల ఎగతాళుల నిరసనల మధ్య
ఇలా ఎదిగిన వాల్లమయ్యాము
గడియారపు ముళ్ళలా అన్నీ సమకూర్చి పెట్టి
తిరిగి అలసి పోయినా
చెరగని నవ్వుల మయ్యాము
ఆస్తి హక్కుల్ని ,మహిళా బిల్లుల్ని కోరి
అపహాస్యం చేయబడే ఆకాశంలో సగాలమయ్యాము
నేతల్ని గెలిపించే ఓటర్లమయ్యాము
నరకాన్ని అనుభవించి
సుఖాలిచ్చిన ధర్మపత్నులమయ్యాము
కనిపెంచిన సంతాన జననపట్టికలో
‘మదర్ ఆఫ్’ అని లేని అనామక తల్లులమయినాము
సంఘర్షణల్లో అవిశ్రాంత తీరాల మయ్యాము
జన్యు సందేశం కదిపిన వేర్లలోకి మళ్ళీ వెళదాం
ఎరుపు ,తెలుపు ,నలుపు
జాతి, మతం, కులం లేని అసలు జ్ఞానంలోకి చొరబడదాం
ఆమె , అతడు పరిభ్రమించిన
ఆదిక్యతల వలయాల్లో
విరిగిన శోక ఆకాశాలు, శోకించిన నేల
ఉప్పొంగిన సముద్రాల వైపుకు మళ్లి దృష్టిని మరల్చుదాం.
కవిత్వ సందర్భ౦ 30
3-1-17

No comments:
Post a Comment