We the Indians
---------------------------
ఊపిరి అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో హీరోకి ఒక యాక్షిడెంట్ జరిగి, కాళ్లూ చేతులు చచ్చుబడి ఉంటాయి. అయినా గానీ పారిస్ లో తన అసిస్టెంట్ ని కార్ వేగంగా పోనీయమని పురిగొల్పుతాడు. తద్వారా ఒక కార్ రేస్ లో గెలుస్తాడన్నమాట. అది మన హీరోయిజం. సివిక్ సెన్స్ ఏ మాత్రం లేని హీరోయిజం. వేగంగా పోవటం, రేసుల్లో గెలవటం ఇంతకు మించిన హీరోయిజం మనకు తెలియదేమో. మనకు అంటే భారతీయులకు. ప్రపంచంలో అతి తక్కువ సివిక్ సెన్స్ ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. తాగి డ్రైవ్ చేయకండి అని చెబితే "మరి ప్రభుత్వం మందెందుకు అమ్ముతుందట?" అని అడిగే తెంపరితనం బహుశా మనకే సొంతం.
సివిక్ సెన్స్ అంటే సభ్యత. సామాజిక సభ్యత. సభ్యత లేని సంస్కారం మనలేదంటాడు సంజీవ్ దేవ్. సభ్యతలో బాధ్యత ఒక అంశం మాత్రమే. సమాజంలోని అందరి విలువలనూ గౌరవించడం, అందరి ఇబ్బందులనూ గుర్తించడం అన్నది సభ్యత. సమాజంలో నేనేవిధంగా ఒక సభ్యుడినో, నా తోటి వారందరూ కూడా సభ్యులే, నాకెటువంటి ఇబ్బందులు, సమస్యలుంటాయో, తోటి వారికి కూడా అలాంటివే ఉంటాయనే స్పృహ సభ్యత కలిగిస్తుంది. సంస్కారం మానసికమైనది. సభ్యత భౌతికమైనది. గొప్ప సంస్కారం ఉండిండవచ్చు. కానీ సభ్యత లేకపోతే ఆ సంస్కారానికి అర్థం లేదు. ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్త ఉన్నాడనుకుందాం. అందరినీ సమ దృష్టితో చూడగల గౌరవించగల సంస్కారం ఉండిండొచ్చు. కానీ అతడు నగ్నంగా ఉండిపోతాను అని అందరికీ ఇబ్బంది కరంగా తయారైతే?? సభ్యత లేనట్టే. గాంధీజీకి కూడా సంస్కారం ఉంది తప్ప, సభ్యత లేదంటాడు సంజీవ్ దేవ్. పది మందిలో ఉన్నపుడు నోరంతా తెరిచి ఒక రకమైన శబ్దంతో ఆవులించడమూ, మీదనే దగ్గడమూ వంటివి మహామహులనుకున్నవారు కూడా చేస్తూ ఉంటారు. వాడు మహామహుడైనందుకు వాడి నోటి కంపును మనలాంటి అల్పులు భరించాలన్నట్టు ఉంటుంది. హోటళ్లలో చేతులు కడుక్కుందామని పోయామంటే..తప్పని సరిగా ఎవరో ఒకరు నోట్లో నీళ్ళు పోసుకుని పక్కవాడికి తుంపర్లు వచ్చి పడేలా తుపుక్కున ఉమ్మడమో, లేక గట్టిగా చీదటమో చూస్తుంటాం. ఇక బయట పెట్టే ఛాయ్ బండ్ల దగ్గర ఛాయ్ తాగుతూ తాగుతూ పక్కనే ఉమ్మేస్తుంటారు. అపార్ట్మెంట్లలోకి నడిచి పోయారంటే తెలుస్తుంది, మనదేశం ఎన్ని కిల్లీల్ని అమ్ముతుందో. ఇటువంటి చర్యలు ఎంత జుగుప్సాకరంగా ఇబ్బందికరంగా ఉంటాయో కనీసం అవగాహన కూడా లేనివారు మనదేశంలోనే ఉంటారు.
మన సామాజిక జీవితం లో ఉండవలసిన నాణ్యత పతనస్థాయికి చేరింది. ఒక రాజకీయ నాయకుడి విలువలూ, ఒక పోలీసు ఆఫీసర్ విలువలూ, ఒక క్రిమినల్ విలువలూ, ఒక కామన్ మ్యాన్ విలువలూ అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి. రోడ్లమీద పసి పిల్లలకు పెద్ద పెద్ద బైకుల్నిచ్చి పంపే తల్లిదండ్రులున్నారు. ఇరుకుగా ఉండే రోడ్డు మీద కూడా హీరోయిజం చూపి, అందరికంటే ముందు వెళ్ళిపోవాలనే తెలివి తక్కువ పెద్దవారూ ఉన్నారు. ఇరుకు సందుల్లో ఒక నిముషం పక్కకు ఆపుకుని నిలబడితే ఎవరికీ ఇబ్బంది లేకుండా వాహనాన్ని ముందుకు తీసుకుని పోవచ్చు. కానీ అప్పటికప్పుడు తమ ఆధిపత్యం చూపించాల్సిందే. ట్రిపుల్ రైండింగ్ ఎందుకు చేస్తున్నారని అడిగిన పాపానికి ఎమ్మెల్యే మనిషినే అడుగుతావా అని పోలీసులనే చేయి చేసుకుంటున్నారంటే, మనలో సివిక్ సెన్స్ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవాలి. బయటి దేశాలనుంచి వచ్చే అతిథులకు రోడ్ల మీద మన పోకడలు భలే విచిత్రంగా అన్యాయంగా తోస్తాయిట. సింగపూర్లో సెటిలయిన ఒక మిత్రుడు ఈ మధ్య కలవడానికని ఫోన్చేశాడు. ఐదు నిముషాల్లో వస్తానన్నవాడు అర్దగంట తరువాత వచ్చాడు. చేతులకు, ముఖానికి రక్తం అంటి వుంది. వివరాలడిగితే రోడ్డు మీద అకారణంగా అతడిని కొట్టారుట. ఎడమ వైపుపద్దతిగా అతడు కార్లో వస్తుంటే, సడన్గా, ఇండికేటర్ లేకుండా తిరిగిన ఇంకో బడా బాబు కారును కంట్రోల్ కాక గుద్దేశాడట. చిన్న డామేజ్ మాత్రమే అయింది. కానీ మూల్యం మాత్రం- ఇతడి కాలర్ పట్టుకుని, అమ్మనా బూతులూ తిట్టి, దవడ పగలగొట్టి, నానా హంగామా చేసి పంపించారట. అతడు చాలా సేపటి వరకూ షాక్ నుండి కోలుకోలేకపోయాడు. అతడి తప్పేమీ లేదని అందరికీ తెలుసు. ఆ గొడవ చేసిన వ్యక్తి కూడా "హై లీ ఎడ్యుకేటెడ్" లాగే ఉన్నాడట, సూటూ బూటూ వేసుకుని 'ఆడీ' కారులో. కానీ ప్రవర్తన?. ఇదే సింగపూర్లో అయితే ఏమి జరిగేదని నేను అడిగాను అతణ్ణి.
" ఇలా ఖచ్చితంగా జరగదు బాస్. అక్కడ సివిక్ సెన్స్ ఎక్కువ. అసలలాగా అడ్డందిడ్డంగా రోడ్డు మీద నడపడం ఏమీ ఉండదు. వేగం లిమిట్ దాటితే, వెంటనే పోలీస్లు వెంటపడి పట్టుకుంటారు. ఒక వేళ యాక్సిడెంటు జరిగితే ఐదు నిముషాల్లో పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. ఆక్సిడెంటు చేసిన, చేయబడిన వారు ఇక్కడిలాగా తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలూ ఉండవు" అంటూ చెప్పాడు. ఆక్సిడెంట్ చేసిన వాడే వెంటనే కారు దిగి 'అయాం రియల్లీ సారీ...ఐ కుడ్ నాట్ కంట్రోల్ ది స్పీడ్ ఇన్ టైం' అని చెప్పేస్తాడట. అవతలి వ్యక్తి కూడా, "తప్పలు చేయటం మానవ సహజం కదా" అన్నట్టు వ్యవహరిస్తాడట. యాక్సిడెంటులో ఇంకో వ్యక్తి చనిపోయినాగానీ, మనుషుల పట్ల ఇలా పగ పట్టడాలూ, దురుసుగా ప్రవర్తించడాలూ ఉండవట. ఒకరినొకరు గౌరవించుకోవటం, అర్థం చేసుకోవటం అక్కడి సమాజంలో అంతర్భాగమై ఉంది. ఇక్కడ-, మనం మాత్రమే రాజులం, తక్కిన వారందరూ మూర్ఖులే.
ఇపుడు స్వచ్ఛ భారత్ అని గవర్నమెంటు చేస్తున్న హడావుడిలో ఈ సామజిక సభ్యత అంశం మచ్చుకు కూడా కనిపించదు. ఎలా ఉపయోగించాలో తెలియని ప్రజలకు రోడ్లను ఎంత శుభ్రంగా ఉంచినా ఏమీ ప్రయోజనముండదు. అటు ప్రభుత్వం కానీ, ఇటు మీడియా మేధావులు కానీ, ప్రజలలో సివిక్ సెన్స్ పెంచే ప్రయత్నం ఏమీ కనిపించదు. యాక్సిడెంటయితే, పోలీసులకంటే ముందు, ఆంబులెన్స్ కంటే ముందు, మీడియా అక్కడ ఉంటుంది. నెత్తురోడుతున్న బాధితులముందు మైక్ పట్టుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటుంది. అది బ్రేకింగ్ న్యూస్ లాగా చూడటంలో మనకు సివిక్ సెన్సు ఎంతుందో చెప్పవచ్చు. నోబెల్ బహుమతి గ్రహీత, నేచురలిస్ట్, కోనార్డ్ లోరెంజ్ అంటాడు " I believe, I have found the missing link between animals and civilized man- it is We" అని. నిజానికి మనం తెలుసుకోవాస్సింది, ఇట్ ఈజ్ వుయ్, ద ఇండియన్స్ అని.
30-12-16

This comment has been removed by a blog administrator.
ReplyDelete