ఎఫ్.బీ. లో మొదటిసారి నిన్నొక సోదరుడిని బ్లాక్ చేశాను. ఇది నా స్వభావానికి పూర్తిగా భిన్నం. పోట్లటకైనా 'సై' అంటాం కానీ, పూర్తిగా బ్లాక్ చేసేసేయటం a little bit డిఫెరెంట్ గా అనిపించింది. నిన్న ఈ సదరు సోదరుడు నా వాల్ మీదకొచ్చి తిట్లదండకం మొదలెట్టాడు. ఏంటో మరి ఏం మెంటల్ డిసార్డరో తెలియదు. భలే కామిడీ గా ఉండింది కాసేపు. స్మితా సబర్వాల్ గారిని ఇష్టం వచ్చినట్లు అన్నారని నేను రాసిన ఆర్టికిల్ కింద, నేను భారత దేశాన్ని అవమానిస్తున్నానట. Mind blowing...Gingiralu tiriging kadaa.. జేపీ గారు ఓటుకు నోటు విషయం లో చెప్పిన అభిప్రాయాన్ని షేర్ చేసినందుకు, దేడ్ దిమాక్ సాలేగాడు చెప్పిన విషయాన్ని దేడ్ దిమాక్ సాలేగాడిలా షేర్ చేశానట. సరే మరి, మనకంత తెలివేడిస్తే బాగానే ఉండేదికదా. ఏ ఐయేఎస్సో ఐపీఎస్సో ఐపోతుండె. అవి లేకనే గద గిట్ల ఉన్నం. అదే ఇషయం జెప్పిన. తిట్టడమే సోదరుడి ప్రధాన ఉద్దేశం కాబట్టి 'ల' కారాలతో తిట్లందుకున్నాడు. జీవితంలో కామెడీ మిస్ అయితుందనుకున్నపుడు ఇలాంటి వాల్లు మనకు మాంచి ఎంటర్ టైన్మెంట్. కాకపోతే మన సోదరుడు ఏ సినిమా హీరోకి తగ్గనంత అందగాడు. 'ఫేస్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్' తప్పని మరో సారి రుజువు చేసేంత బలంగా ఉన్నాయ్ ఆ అందమూ..ఆ మాటలూ. సరే మరీ ఇంత భీభత్సమైన కామెడీ ఎందుకులే అని ఇంకో చిరకాల మిత్రుడు చెప్పటం వలన బ్లాక్ చేసి పడేశాను. సరే.
ఇక అప్పట్లో భీభత్సమైన ప్రాంతీయాభిమానం చూపే ఫనాటిక్ మిత్రున్ని, అన్ ఫ్రెండ్ చేశాను. కొద్ది రోజులయ్యాక ఫ్రెండ్ చేద్దామనుకునేసరికి ఆయనే నన్ను బ్లాక్ చేసి పడేశాడు, అన్ ఫ్రెండు చేశానన్న అక్కసుతో. ఆ తరువాత యథావిధిగా నన్ను తిడుతూ ఏకంగా పైత్య రస కవితలు రాసేసుకున్నాడట. కామెడీ ఇషయాలకోసం వెతుక్కునే నా స్నేహితులు చూసి తెగ నవ్వుతూ చెప్పేవారు. ఏం శాల్తీలు రా భయ్ అని.
మనం నవ్వుకోడానికి మన హాపీ అరవిందుడిలాంటి సహృదయ మితృలే గాక అపుడపుడూ సీరియస్ గా కామిడీ చేసే ఇలాటి క్రేజీ గురవిందలు కూడా పనికొస్తుంటారని ఇందు మూలముగా చెప్పొచ్చాను.

No comments:
Post a Comment