విరించి ll అకస్మాత్తుగా..ll
.............................................
అకస్మాత్తుగా..వెలిగే బల్బులు పేలిపోతాయి
అకస్మాత్తుగా వసంతాల్ని గ్రీష్మాలు మింగేస్తాయి
అకస్మాత్తుగా రోజుకి కొన్నివేల చుక్కలు రాలుతుంటాయి
అక్కడెక్కడో దూరంగా
నాకు తెలియకుండా..
నీ చేతుల మీదుగా
నాకు తెలియని నీ మనుషులెవరో..
నిన్నొదిలి రాలిపోతుంటారు
అకస్మాత్తుగా మేఘం కురియకుండా కరిగిపోతుంది
అకస్మాత్తుగా వరదగుడి తేలిపోతుంది
అకస్మాత్తుగా గిటార్ తీగ తెగిపోతుంది
లేలెమ్మని కుదుపుతున్న నీ చేతులు
అయ్యో అని తల బాదుకుంటాయి
నా నిశ్శబ్దాల్ని కొల్లగొడుతూ
దూరంగా ఒక వాహనపు రొద
నా రాత్రల్ని భగ్న పరుస్తూ
కొన్ని క్షణాల ముందటి మీ ఇద్దరి ఆనంద హేళ
సగం సున్నం వేసిన పాత గోడలుంటాయి
డెడ్ ఎండ్ తో ముగిసే వీధులుంటాయి
ఫుల్ స్టాప్ పెట్టాలో కామా పెట్టాలో తెలియని
ఒకటో తరగతి పసిమొగ్గలుంటాయి.
బాటిల్ నెక్ రోడ్లమీద ట్రాఫిక్ జాంలుంటాయి
నీ ఆలోచనల దారుల్లో మంచు తుఫాన్లుంటాయి
గోడలకు తగిలించిన ఫోటోలకు దండలు వేలాడుతాయి
రివర్స్ గేర్ లో వెనుకకు తిప్పుకునే దౌర్భాగ్యాలుంటాయి
పదే పదే చూపిస్తూ హింసించే న్యూస్ ఛానల్స్ ఉంటాయి
ప్రశ్నార్థకాలు నీ ముఖం మీద ముద్రించుకు తిరుగుతాయి
నీలో బాధ నీకొక శాశ్వత ఉద్వేగం.
చంద్రునిలో మచ్చ
సూర్యునిలో వేడి
నాలో అలజడి నాకొక తాత్కాలిక ఉపశమనం
చంద్రుడికి ప్రతీ అమావాస్య సెలవు
సూర్యుడికి గ్రహణం రోజున సెలవు
మెల్లిగా ఒక పండగ ముగుస్తుంది.
మెల్లిగా ఒక పుష్కరం ముగుస్తుంది.
మెల్లిగా ఒక జీవితం ముగుస్తుంది.
ఒక ఆనందం అకస్మాత్తుగా కనుమరుగవుతుంది.
18/7/15
పుష్కరాల్లో చనిపోయిన భార్యను కుదుపుతూ తల బాదుకుంటున్న బాధితుడిని చూసాక రాసిన కవిత ఇది. అతడికి ఇది శాశ్వత నష్టం. నాకు కాసేపు కాల క్షేపం. ఎంత తేడా మా ఇద్దరిలో..అదే కవితగా రాశాను.

No comments:
Post a Comment