భాను మూర్తి గారూ...నన్ను ఇరికించారా..?
మా ఇంట్లో మీరూ, హెచ్చార్కే గారూ, నేనూ ఎదురెదురుగా కూర్చుని ఒక అందమైన సాయంత్రాన్ని మన మాటలతో నింపేసిన రోజు గుర్తుకొస్తోందిప్పుడు. హెచ్చార్కే గారు రాసిన ఈ పోస్ట్, కల్యాణీ గారు రాసిన 'పిపీలక సోదరులారా' అనే వ్యాసం లోనిది. అందులో ఆమె మధ్యతరగతి మేధావులు రాజ్యం చేస్తున్న దౌర్జన్యాన్ని ఖండించాలని పిలుపునిచ్చింది. రాజ్య దౌర్జన్యాన్ని శతృవుగా, పాముగా, మధ్యతరగతి వారందరూ చీమలుగా రాశారు. మొత్తానికి కల్యాణి గారి వ్యాసము కూడా ఇంకేదో వ్యాసానికి వ్యంగ్య సమాధానమనేది హెచ్చార్కే గారి సమాధానం చదివాక అర్థం అయింది. అసలును వదిలేసి మనం సమాధానాలు చదువుతూ పోయాము కాబట్టి, అసలు ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో చూచాయగా తప్ప వివరంగా అర్థంకాలేదు.
అయితే హెచ్చార్కే గారి సమాధానం సడన్ గా మహాభారతమూ, బ్రాహ్మణులూ, శూద్రులూ ఎందుకొచ్చారో అర్థంకాలేదు. అసలు మొత్తానికీ ఏమీ అర్థం సరిగా కావటం లేదు కాబట్టి, ఈజీగా అర్థం అయిన ఈ ముక్క అందర్నీ ఆకర్షించింది. ప్రతీ పది పద్యాలకొకసారి బ్రాహ్మణులను పూజించాలని చెప్పిన ఆ మహాభారత పుస్తకమేదో, ఆ గ్రంధకర్త ఎవరో మనకు తెలియదు. ఆయన కూడా రిఫరెన్స్ ఇవ్వలేదు. మహా భారతం రాసిన వేద వ్యాసుడు పడవనడిపేవాడి కూతురైన సత్యవతికీ, పరాశరుడికీ కలిగిన కుమారుడు. జన్మ రీత్యా బ్రాహ్మణుడు అనటానికి లేదు. అయితే ఇక్కడ రెండే విషయాలు చెప్పదలచాను. ద్వాపర యుగం లో జరిగిన మహాభారత కథని, ఇపుడు ఈ సమాజానికి ఆపాదించి మాట్లాడుకోవటం విడ్డూరం. ఆ సమాజమే వేరు కదా. ఎంతో మార్పు వచ్చింది. గతి తార్కిక భౌతిక వాదం ప్రకారం ఆ మార్పు ఎక్కడినుంచో ఊడిపడదు. ఆ వస్తువు లోపలే ఉంటుంది. ద్వాపర యుగం నుంచి ఇప్పటి దాకా అసలు మార్పే జరగలేదంటే అది రీజన్ కి అతకదు. మహాభారతం ఒకప్పటి సాహిత్యంగా పరిగణిస్తే, నికరంగా చరిత్ర తెలియని సాహిత్యాన్ని కూడా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శ చేయటం ఒక దోషమని వేల్చేరు నారాయణ రావుగారి అభిప్రాయం. ఆ విషయాన్ని అటు వదిలేస్తే...
మహభారత కాలంలో వర్ణాశ్రమ ధర్మం ఉండేది, కుల వ్యవస్థ కాదు. ఆ కాలంలో ప్రతీ నాలుగు సంవత్సరాలకొకసారి వర్ణాశ్రమ ధర్మం మార్చుకునే అవకాశం ఉండేదని బొజ్జాతారకం గారి ఒక పుస్తకంలో చదివినట్టు గుర్తు. రిఫెరెన్స్ తప్పక తరువాత ఇస్తాను. గీతలో కూడా శ్రీకృష్ణుడు 'చాతుర్వర్ణం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశః' అన్నాడు. గుణాన్ని బట్టి, కర్మని బట్టే ఆ కాలంలో వారి వారి వర్ణాన్ని నిర్ధారణ చేసేవారనేది స్పష్టం. రాధేయుడి ఉదంతమే ఇందుకు ఉదాహరణ. క్షాత్రమున్న వాడే క్షత్రియుడని, కర్ణుని క్షాత్ర పరిక్ష కు గురి చేసి, అతడు ఆ పరీక్షలో నెగ్గాకనే క్షత్రియుడయ్యి అంగ రాజ్యాధిపతి అయ్యాడు తప్ప, ఇప్పటి సమాజంలా క్షత్రియ కుమారుడు కాబట్టి క్షత్రియుడు కాలేదు. ఇక హెచ్చార్కే గారు, 'గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు' అనే అంశాన్ని ఉటంకించి ఇలా ప్రతీ పది పద్యాలకూ....అనే ఆరోపణ చేసినట్టైతే..ఆ సమాజంలో మేధావులనేవారు ఎవరైనా బ్రాహ్మణులనబడుతున్నారని అర్థం అవుతున్నది. అంటే మేథావులపై రాజ్య హింస ఉండేది కాదనేది కూడా స్పష్టం. గోవులు వ్యవసాయానికీ, ఎద్దులను కనటానికీ, తద్వారా రైతులకూ లాభం చేకూర్చుతాయి కాబట్టి, అవి శుభంగా ఉండాలి అని అంటే..కష్టజీవుల మీద కూడా రాజ్య దౌర్జన్యం లేదనేది స్పష్టం. మొత్తానికి మహాభారతం వర్గ పోరాటం కాదు. రాజ్యంకోసం ఒక రాజకుటుంబంలోని అన్నదమ్ముల మధ్య పోరాటం.
కాబట్టి హెచ్చార్కే గారు ఉటంకించిన ఈ ఉదాహరణ సందర్భానికి అతకదు. అయితే తరువాతి కాలంలో బ్రాహ్మణులు శూదృలమీద చేసిన దాష్టీకాలు ఖండించవలసిందే. దానికి మహాభారతాన్ని బూచిగా చూపటమంటే ఇంకా గతంలో, ద్వాపర యుగంలో జీవించటమే. హెచ్చార్కే గారు ఒకరు సేఫ్ పొజిషన్ లో కూర్చుని ఇంకొకరిని పోరాటం చేయండని పురమాయించటమేమిటని ప్రశ్నించారు. అంత వరకు బాగుంది. ఆ కాంటెక్స్ట్ల్ లో ఈ మహాభారత బ్రాహ్మణ ఉదాహరణ పొరపాటున ఒక రకంగా తొందరపాటున ఉటంకించి ఉంటారని నా అవగాహన. ఘటుగా రెస్పాండు అయ్యారు కాబట్టి ఇలాంటి తొందరపాటు పొరపాటు దొర్లి ఉంటుందని నా అవగాహన. అయితే "మిమ్మల్ని కలాలు పట్టుకోమని ఎవరు నిర్ణయించారు, మీరే నిర్ణయించారు.. "అని అన్నపుడు, ప్రజల్ని కలాలు పట్టుకోమని ఇంకెవరు నిర్ణయించాలబ్బా అని నేను ఆలోచనలో పడ్డాను. మీరు రాయాలి, మీరు రాయకూడదు అని నిర్ణయించేవారున్నారా ఎవరైనా..? నాకైతే తెలియదు. వారెవరో చెబితే అసలు నేను రాయవచ్చో రాయకూడదో తెలుసుకుంటాను.

No comments:
Post a Comment