తీరం దాటిన నాలుగు కెరటాలు.ll అనిల్ నరేష్ వర్ణలేఖ చైతన్యll ఒక అవగాహన.
...................................................................................................
సముద్రం ఒడ్డున ఇసుక తెన్నెల మీద కూర్చున్నపుడు కొన్ని కెరటాలు తీరాన్ని దాటి మన కాళ్ళ ని తాకాలని ప్రయత్నిస్తాయి. అవి అలా తాకినపుడు కొన్ని జ్ఞాపకాలు, కొన్న బాధలూ, కొన్ని సంతోషాలూ, కొన్ని ప్రశ్నలూ, కొన్ని సమాధానాలూ అన్నీ కలగాపులగమై మనల్ని చేరినట్టుంటుంది. అలా తాకే నాలుగు కెరటాలే ఈ పుస్తకంలోని నలుగురు కవులు. కెరటాలు సముద్రపు ఉప్పు నీటితో తయారు చేయబడ్డాయి. కన్నీరు కూడా ఉప్పగా ఉంటుంది. చమట కూడా ఉప్పగా ఉంటుంది. కలలూ, ఆశలూ, జీవితాలూ, శరీరాలు కూడా ఉప్పగానే ఉంటాయేమో. జీవాతపు రుచి కూడా ఉప్పగా ఉంటుందేమో..అందుకే కొంత కషాయంగా అనిపించినా, జీవితం కదా.. ఉప్పగానే కవితల్ని మనకందించి రుచి చూపిస్తారీ యువకవులు. చైతన్య, వర్ణ లేఖ, అనీల్ డ్యానీ, నరేష్కుమార్ లు. ఎవరి జీవితం వారిది, ఎవరి అనుభవం వారిది. కానీ స్నేహమనే అనుభవంలోకి, కలిసి నడుస్తూ నలుగరూ కలిసి ఒక పుస్తకమై మనమముందు ఒకరిలాగానే కనిపిస్తారు. ఒక్కటిగా, కలిసే కవితల్ని వినిపిస్తారు.
ఈ తరం యువకుల్లోని ఆశలూ, ఆశయాలు, జీవితాన్ని చూసే దృక్కోణమూ, ప్రేమ, ప్రేమ రాహిత్యమూ, సమాజమూ, సమాజములోని వ్యక్తుల జీవితమూ, భగవంతుడూ ఇలా చాలా విషయాలమీద వీరి కవితలు సాగుతాయి. జీవితం పట్ల ఒక నిరసన, అదే విధంగా ఒక సమ్మతమూ కనిపిస్తాయి. గుడ్డి నమ్మకాలకీ..అనుసరణలకీ తిలోదకాలిచ్చి, తమ బతుకును కొత్తగా బతికేందుకు ఉద్యుక్తులైన నలుగురు మనమముందు నిలుస్తారు. అసలు ఇలాంటి కవితా సంకలనాన్ని నలుగురూ కలిసి తీసుకురావటంలోనే వారిలో ఆధునికత కనిపిస్తుంది. ఒక పద్దతిగా ఒకరితర్వాత ఒకరి కవితల్ని పేర్చక పోవటంలోనే, సాంప్రదాయాల్ని కాదనే తత్వం అర్థమవుతుంది. తీరం యొక్క పరుధుల్లోనే ఎగిరి దూకలనే క్లాసికల్ కండీషనింగ్ నుంచి బయట పడ్డారు కాబట్టే, వారు తీరం దాటిన నాలుగు కెరటాలు. తీరం దాటిన కెరటానికి లక్ష్యం అంటూ ఏమీ ఉండదు. తన ఆనందం కోసం దాటేస్తుంది. తన పరిధిని దాటడంలో అది ఆనందాన్ని కనుగొంటుంది. సముద్రం ఒడ్డున కూర్చున్న మనం మన కాలికి తగిలిన కెరటాన్ని తప్పక ప్రేమించి తీరుతాము.
ఈ నలుగురిలో అనీల్ డ్యానీ కవితాత్మకంగా సున్నితంగా కనిపిస్తాడు. పరి పూర్ణంగా కనిపిస్తాడు. వేశ్యా వృత్తిలోని ఆకలిని చెబుతూ..నాకు తెలిసిన విద్య ఒకటే- మల్లెపూలని అన్నం మెతుకులుగా మార్చటం అంటాడు. వితంతువు జీవితాన్ని విశ్లేషిస్తూ..అకస్మాత్తుగా తెల్లటి చీర ఒంటిని చీకటిగా చుట్టుకుందని వర్ణిస్తాడు. బావిని ఊరి పెద్ద ముత్తైదువుగా పోల్చి, కామందు కామానికి బలయిన అమాయకురాలు బావిలో దూకినపుడు, బావిని కూడా వెలేసి, బావిని ముండమోపిగా చేసేశారేంటని ప్రశ్నిస్తాడు. దారి పక్కన నిద్రిస్తున్న ముదుసలిని చూసి మానవత్వాన్ని జేబులో వెతుక్కోవడం, కూడలిలో కుర్రాడు కారు అద్దంతో పాటు తన మనసునీ తుడిచాడనటం, జీవితాన్ని రోడ్డు చివరి బడ్డీ కొట్లో సిగరెట్ లకు తాకట్టు పెట్టాననటం, చెత్త కుప్పలు తల్లులవుతున్నాయనటం, అనీల్ డ్యానీ కవితా శక్తిని తెలియజేస్తాయి.
నరేష్కుమార్, చక్కటి పదగాంభీర్యంతో భిన్న అభివ్యక్తితో కనిపిస్తాడు. తనలోకి తాను చూసుకుంటున్నట్టు అనిపిస్తాడు. "దునియా సే హంనే లియా క్యా" అని అడుగుతున్నట్టుంటాడు. నిర్లక్యంగా, దుందుడుకుగా కనిపిస్తాడు. రోజుకి థీస్ రూపాయ్ సంపాదిస్తాండు, వాడేం నిరుపేద అని అడిగి సమాజంలో అంతకు మించిన బీదవాడు కూడా ఉన్నాడనే స్పృహని కలిగిస్తాడు. పోలిసన్న ని తోటి కార్మిక సోదరుడిగా గుర్తించి, నువ్వు నియమించబడ్డావు, నేను నిబద్దించబడ్డానని నక్సలైట్ గొంతుతో మాట్లాడతాడు. ఎలాగూ విడిపోతున్నాం కదా, ఈ ఎడబాటనే విషాదాన్ని చెరోవైపున్న మనం స్వేచ్చ అనే రంగేసుకుని బతికేద్దాం అని ఆధునిక జీవితమిచ్చే స్వేచ్ఛని, అందులోని డొల్లతనాన్నీ నిర్ద్వంద్వంగా ఈసడిస్తాడు. దేవుడు కూడా 'పాపపుణ్యాల్ని మీరు గ్రంధాల్లో రాసుకున్నారనీ, గుండెల్లోంచి గుడిలోకి మీరే వెలేసారని' తనతో గొడవ పెట్టుకున్నట్టు అద్భుతంగా ఊహిస్తాడు. కిటికీకి చంద్రుడు తనకు తాను కట్టేసుకున్నాడన్నా, నా గుండెకో కార్నియాని అతికించండి మనసులో అక్షరాలకి దారి చూపాలని అడిగినా, నాన్నయే తన అసలు హీరో అని ప్రకటించినా,నరేష్ యొక్క భావనా గాఢత మనకు అర్థం అవుతుంది.
వర్ణలేఖ కవితల గురించి చెప్పే కన్నా చదివితేనే బాగుంటుంది. మనకి కనిపించే వివిధ రకాల జీవితాల్లోకి తానూ దూకి, తానూ అందులో ఓ పాత్రలా మారి మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఫ్లోరైడు బారిన పడిన జీవితాల్నీ, రోడ్డు పక్కని ఛాయ్ కొట్టు నడిపే వారి జీవితాల్నీ, పక్కింటి శకుంతలనీ, తన అత్తగారింటి పయనాన్నీ, రోగాల బారిన పడ్డ బీదవాడి బతుకుల్నీ, వలస పోయిన కొడుకు కోసం ఎదురు చూసే తల్లినీ, ఇలా రకరకాల జీవితాల్ని, అందులోని బాధల్నీ వర్ణలేఖ మనముందుంచుతుంది. సంఘానికి భయపడి విడిపోయిన ప్రేమికులని సంఘం సమ్మతించి వుండింటే..మనమొక ప్రేమకావ్యమై ఉండేవారిమని బాధ పడుతుంది. డిస్క్రిప్టివ్ కవితలు కథను చెబుతున్నట్టుగా ఉంటాయి కనుక కవిత్వీకరించే సమయంలో ఇంకాస్త మెళకువలు పాటించి ఉంటే బాగుంటుందనిపిస్తుంది.
చైతన్య చాలామటుకు తను అనుభవించే ఒక ప్రేమ రాహిత్యాన్ని కవితల్లో మనముందుంచే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడక్కడా సమాజపు బోలు తనాన్ని ప్రశ్నిస్తాడు. నేను కవిని, 'క'నిపించని 'వి'కారాన్ని అని కవిలోని మిస్టర్ హైడ్ నీ, హిపోక్రసీనీ చూపిస్తాడు. అలాగే అద్దం ముందుకూడా మిస్టర్ హైడ్ అవమాన పడాల్సిందే అంటాడు. చనిపోయిన వాడి నవ్వెందుకు అంత స్వచ్ఛంగా వుంది, ఇంకెవడికోసం నటిస్తున్నాడని అడిగి నిజజీవితంలోని నటనని చూసి నవ్వేస్తాడు. చైతన్య కవిత్వం ఇంకా మెరుగులు దిద్దుకోవాలి. ప్రయత్నిస్తే ఇతడి భావుకత్వం కూడా పరిణతిని సాధిస్తుంది.
పుస్తకంలోని కవితలు హఫాజార్డ్ గా కనిపించటం వలన పాఠకుడు ఎవరి కవిత్వం ఏదనే సందిగ్ధతతకి లోనవుతాడు. ఏది ఏమైనా ఒక మంచి ప్రయత్నం. ఇంకాస్త మెరుగులతో ఈ యువ కవులు మరోసారి తీరం దాటి మనల్ని పలకరించాలని ఆశిద్దాం.
20/09/15

No comments:
Post a Comment