ఆనందం- ఒక అన్వేషణ( part3)
____________________________
ప్రస్తుత ప్రపంచమంతా మధ్యే మార్గమును కనుక్కునే దశలో ఉన్నట్టున్నది. అటు అటూ కాక ఇటు ఇటూ కాక, మధ్యలో. ఇపుడు మనకు సోషలిజమూ వద్దు, కాపిటలిజమూ వద్దు. లిబెరల్ సోషలిజం కావాలి. మిక్స్డ్ ఎకానమీ కావాలి. మనకు మెజారిటీ గవర్నమెంటు వద్దు, మైనారిటీ గవర్నమెంటూ వద్దు. హంగ్ కావాలి. ఇటువంటి పరిస్థితి సమాజములో మూస పోత ఆలోచనలు కాక కొత్త ఆలోచనలు ఉత్పన్నమౌతున్నాయనడానికి ఉదాహరణ. ఉన్న అందరూ ఒకే రకంగా ఆలోచించి, ఒకే రకమైన పార్టీకో, ఆర్థిక పద్దతికో, జీవన పద్దతికో ముడివేసుకోవటం లేదు. అందరూ వేరు వేరుగా ఆలోచిస్తున్నారు కనుకనే వేరు వేరు భావజాలాలకు మద్దతు లభిస్తున్నది. ఉదాహరణకు ఎన్నికలను తీసుకుంటే, గెలిచినపార్టీకి, ఓడిన పార్టీకి ఈ మధ్య కాలంలో.ఓట్ల శాతంలో పెద్ద తేడా ఏమీ ఉండటం లేదు. థీసీస్ కి ఎంత బలం ఉంటున్నదో యాంటీ థీసీస్ కి కూడా దాదాపు అంతే బలం ఉంటున్నది. ఇది శుభ పరిణామమా కాదా అన్నది కాలమే తేల్చాలి. అయినా అందరూ ఒకేలా ఆలోచించాలి అనుకోవడంలో ఉండే లాజిక్ నిజానికంటూ ఏమీ లేదు. అందరూ ఒకేరకంగా ఆలోచించాలనుకోవటం పూర్తిగా ఇల్లాజికల్ అంశం. మనిషి ఒకపుడు ఒక రకంగా ఆలోచించి, ఆ తరువాత పూర్తిగా దానికి భిన్నంగా ఆలోచించటం మొదలు పెట్టినపుడే, ఈ రెండింటి సగటును ఆధారంగా చేసుకుని మధ్యే మార్గానికి రాగలుగుతాడు. మధ్యే మార్గం రెండు విభిన్న అంశాలు ఒకదానితరువాత ఒకటిగా పరిగణలోకి ఒచ్చినపుడే సాధ్యం అవుతుంది తప్ప, ఒక అంశం ఆధారంగా మధ్యే మార్గం అనేది రాదు. కాపిటలిజం ఒక చివర ఉన్నపుడు, సోషలిజం దానికి వ్యతిరేకంగా ఒచ్చినపుడే, ఆ తరువాత లిబెరల్ సోషలిజం అనేది వస్తుంది తప్ప, కాపిటలిజం తరువాత డైరెక్టుగా లిబెరల్ సోషలిజం ఉత్పన్నం కాదు. ఆ విధంగా చూసుకుంటే మానవ సమాజం అటువంటి విభిన్న ధృవాలను చూసి వచ్చి, ఇపుడు మధ్యే మార్గాలను అన్వేషించే పనిలో పడిపోయిందనుకుంటాను.
ఆనందాన్వేషణలో మనిషికి ఎంత జ్ఞానమవసరం, ఎంత అజ్ఞానమవసరమో మనం ఆలోచించుకోవాలి. అజ్ఞానమొక వరం అన్నారొకప్పుడు. నిజంగానే అజ్ఞానం వరమా?. అలాగే జ్ఞానం తోటే మోక్షమన్నారు. జ్ఞానం తోటే ఆనందమన్నారు. ఈ రెంటిలో సత్యం ఏది?. ఇక్కడ జ్ఞానమంటే వారి ఉద్దేశం పారమార్థిక జ్ఞానం అయ్యుండొచ్చు. లౌకిక జ్ఞానం కాకపోయి ఉండవచ్చు. కానీ జ్ఞానం పేరుతో ఈ రోజు మనం పొందుతున్నదంతా లౌకిక జ్ఞానమే. పారమార్థిక జ్ఞానం అంటూ ఒకటి ఉన్నదా. డోగ్మాటిక్ వాదనలు ఎన్నో మాదంటే మాదే అసలైన పారమార్థిక జ్ఞానాలని గొప్పలు చెప్పుకునే అవకాశం ఎప్పటికీ ఉండనే ఉంటుంది. అయితే తెలుసుకున్నదంతా జ్ఞానమేనా?. తెలుసుకున్న దానిలో జ్ఞానమేది అజ్ఞానమేదని తెలుసుకోవడం కూడా జ్ఞానమే. కానీ ప్రాగ్మాటిక్ స్పందనలు నశించి, డోగ్మాటిక్ భావనలు స్థిరీకరించబడిన తరువాత, తెలుసుకున్నదంతా మహా జ్ఞానమనే అజ్ఞానంలోకి పడిపోతుంటాం. మానవుడి ఆధునిక జీవనం, తెలుసుకోవడమనే ఒక ప్రక్రియను విపరీతమైన స్థాయిలోకి తీసుకుని పోయింది. ఏ స్థాయి అంటే, ఈ ప్రపంచంలో ఏ విషయాన్నయినా గూగుల్ లో మీటలు నొక్కి తెలుసుకునేటంతగా. ఉదాహరణకు ఈ మధ్య టిఫిన్ బాక్స్ బాంబులు పేల్చి కొంత మంది మరణానికి కారణమైన వాడు, టిఫిన్ బాక్స్ బాంబును ఎలా తయారు చేయాలనే విషయాన్ని గూగుల్ లో చూసి నేర్చుకున్నాడట. ఇది కూడా జ్ఞానమే కదా..? ఇపుడు దీన్ని కూడా జ్ఞానం కిందకే పరిగణించాలా?. తెలుసుకున్నదంతా జ్ఞానం అనటానికి వీల్లేదు. మానవ సమాజానికి కించిత్తూ ఉపయోగపడని విషయ సేకరణ అసలు జ్ఞానం కిందకు రాదు. అసలది అజ్ఞానం కూడా కాదు. ఆధునిక మానవుడు జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాననే భావనలో కేవలం విషయ సేకరణ, విషయ అవగాహన చేసుకుంటున్నాడు. అద౦తా కూడా అతనికిగానీ, మానవ సమాజానికి గానీ ఉపయోగపడే అవకాశమే లేని విషయ సంగ్రహం మాత్రమే.
మతాల డోగ్మాలలో కూడా ఇంటర్ రిలీజియస్ డోగ్మాలన్నింటినీ కంఠస్థం చేసి తమ మతానికనుకూలంగా, తమ మతాన్ని ఎక్కువ చేసుకుని చెప్పుకునే విధానం కూడా ఈ మధ్య పెరిగింది. గౌరవనీయులు డాక్టర్ జాకీర్ నాయక్ ఆధునిక మానవ సమాజం తయారు చేసుకున్న డోగ్మాటిక్ గ్లోసరీ రీడర్ గా మనముందుకొచ్చాడు. అతడి అపార పాండిత్యమంతా జ్ఞానం అనబడదు. పాండిత్యమనే అనబడుతుంది. అదేదీ అతనికిగానీ, సమాజానికిగానీ ఉపయోగపడే అవకాశం లేని విషయ సంగ్రహణ. "నిన్ను తెలుసుకో గలిగిన ఆ కొద్ది పాటి జ్ఞానమే నాకివ్వు, అది చాలు నాకు" అని రవీంద్రుడు భగవంతుడిని వేడుకుంటాడు, గీతాంజలిలో. ఆ కొద్ది పాటి జ్ఞానమైతే సరిపోతుంది నిజానికి మనిషికి. ఆనందంగా ఉండటానికి ఏమంత జ్ఞానమవసరమని?. శుష్క పాండిత్యం ఆనందమౌతుందా?. లేక మెదడు మీద అనవసర భారమౌతుందా?. మనిషి ఎన్నిటినో నేర్చుకుంటాడు తన జీవిత ప్రయాణంలో..కానీ ఎన్హింటినో అన్ లెర్న్ చేయాల్సిన అవసరముందనే విషయం మరచిపోతుంటాడు. లెర్నింగ్ అండ్ అన్ లెర్నంగ్ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని తెలియని అజ్ఞానంగా మలచుకోవడం లేదా అనవసర జ్ఞానాన్ని తొలగించుకోవడం నిజంగా సాధ్యమేనా? సాధ్యమయే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. మధ్యే మార్గమేదో ఒకటి ఉండిండాలి. ఏ విషయం తెలుసుకోవాలి, ఏది తెలుసుకుని వదిలేయాలి, లేదా ఏది అసలు తెలుసుకోనే కూడదు అనేది ముందుగా తెలుసుకోవాలి.
ది విలేజ్ అని ఒక హాలీవుడ్ సినిమా ఉంది. నైట్. జీ. శ్యామలన్ అనే భారతీయ సంతతికి చెందిన హాలీవుడ్ దర్శకుడు ఉన్నాడు. అతడు తీసిన సినిమాలలో ది విలేజ్ అనే సినిమా కూడా ఒకటి. శ్యామలన్ పేరు వినగానే మనం భారతీయులుగా ఆహా మనవాడేనోయ్ అనుకుంటామేమోగానీ, హాలీవుడ్ క్రిటిక్స్ అతడి సినిమాల్ని టిపికల్ న్యూ ఏజ్ క్రాప్ కింద కొట్టి పాడేస్తారు. "న్యూ ఏజ్ రిలీజియన్" అని పశ్చిమ దేశాల్లో ఒక కొత్త ప్రచ్ఛన్న మతమొకటి మొదలయింది. ఇది అన్నీగాకపోయినా కొన్ని మతాల కలగాపులగంలాగా ఉంటుంది. ప్రాణిక్ హీలింగ్లూ, ఆస్ట్రల్ ట్రావెల్లూ, UFO లూ, ఇల్ల్యుమినాటిలూ ఇత్యాదులన్నీ వీరి సృష్టే. లోబ్సాంగ్ రాంపా, దీపక్ చోప్రా ఇత్యాది వారంతా కూడా దీనికి పుట్టినవారే. ఆ విషయాన్ని పక్కన పెడితే అటువంటి విషయాల్ని తీసుకుని సినిమాలు తీసేస్తాడని ప్రతీతి. ది విలేజ్ సినిమాకూడా అటువంటి ఒక న్యూ ఏజ్ క్రాప్ అయినా, దీనిలో గమనించదగ్గ విషయాలున్నాయి. కథ విషయానికి వస్తే, పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక గ్రామం. ఆ గ్రామానికో అధికారి. గ్రామానికి చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో రాక్షసులుంటాయని గ్రామస్థులు నమ్ముతారు. ఎవరైనా గ్రామం వదిలి బయటకి వెల్లాలి అంటే అడవిని దాటాలి, కానీ అడవిలోకి ఎవరు ప్రవేశిస్తే రాక్షసులు వారిని చంపేస్తారు. అక్కడ గ్రామస్థులకూ రాక్షసులకూ ఒక ఒప్పందం ఏర్పడి ఉంటుంది. మీరు మా అడవిలోకి రాకండి, మేము మీ గ్రామంలోకి రాము అని. ఈ ఒప్పందం ప్రకారం గ్రామం తన పరిధిలో తాను సంతోషంగా ఉంటుంది. గ్రామ పెద్ద కూతురు పుట్టుగుడ్డి. కానీ లూసియస్ అనే ఒకతన్ని ప్రేమిస్తుంది. ఇంతలో ఈ ప్రేమ విషయాన్ని తెలుసుకున్న గ్రామంలోని ఒక పిచ్చోడు, లూసీయస్ ని కత్తితో పొడిచేస్తాడు. కత్తి పోటు గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి అనారోగ్యం పాలవుతాడు లూసియస్. హీరోయిన్ అతడిని ఎలాగయినా బతికించాలనుకుంటుంది. పక్కనున్న పట్నం వెల్లి మందులు కొనుక్కుని తెస్తే అతడు బతుకుతాడు. కానీ పట్నం వెళ్ళాలంటే అడవిని దాటాలి. అడవిలో రాక్షసుల బారిన పడకుండా పట్నం చేరడం జరగనిపని. ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో హీరోయిన్ తండ్రి, గ్రామ పెద్ద, ఆమెకొక సీక్రెట్ చెబుతాడు. నిజానికి సీక్రెట్ని రివీల్ చేస్తాడు. అసలు రాక్షసులుంటారనడం వొట్టి కట్టు కథ అని. నిజానికి గ్రామ పెద్ద ఒక బిలియనీర్. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్. అతడు కొంతమంది గ్రామ పెద్దల సహాయంతో ఈ రాక్షసులున్నారనే కట్టుకథను కల్పిస్తాడు. రాత్రులల్లో వాళ్లలోనే కొందరు రాక్షసులుగా వేషం కట్టి జనాలను భయభ్రాంతులుగా చేస్తుంటారు. కారణం ఏమంటే వారంతా కాపిటలిస్ట్ ప్రపంచం యొక్క డిగ్రేడేషన్, పతనాన్ని చూసి అనుభవించి ఉంటారు. ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టబోయే తమ తరువాతి తరం వారు కూడా అలాగే పతనం చెందకూడదని, వారిని ఆ ప్రపంచం నుండి కాపాడుకోవాలని ఈ కట్టుకథ అల్లుతారు. నిజానికి గ్రామస్థులు ఇరవైయ్యో శతాబ్దం లో నివసిస్తూన్నా, పంతొమ్మిదో శతాబ్దం లొనే నివసిస్తున్నట్టు గ్రామస్థులని నమ్మిస్తారు. కాపిటలిస్ట్ ప్రపంచం, ఓపెన్ ప్రపంచం, అందులో ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎపుడు ఏ అపాయం ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ వీళ్ళు క్రీయేట్ చేసిన ఈ గ్రామం ఒక మూసి ఉన్నప్రపంచం. ఇక్కడి వ్యక్తి యొక్క భవిష్యత్తంతా ఎలా ఉండబోతోందో ముందే స్పష్టంగా తెలుస్తుంది. ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకున్న తెలివయిన ఆ గ్రామ పెద్దలు వారి పిల్లల్లోని అజ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాపాడుకొనే ప్రయత్నం చేస్తారిక్కడ. ఇక్కడ గమనిస్తే, ఇగ్నోరాన్స్ అనేది మనిషికవసరం అంతేకాక అనవసర జ్ఞానం అనవసరం అని గ్రామ పెద్దలు అర్థం చేసుకున్నట్టు కనిపిస్తుంది. నిజానికి గ్రామం వారు భయపడే ఆ రాక్షసులు ఎవరోకాదు బయటి ప్రపంచంలో నివసించే కాపిటలిస్ట్ మనుషులే. దానిని సింబాలిక్ గా "అడవిలోని రాక్షసులు" అని చెబుతాడు దర్శకుడు. ఇక కథలలోకి వస్తే, ఆ అమ్మాయి మందులు తేవడం, అతడు బతకడమూ, ఈ ప్రక్రియలో గ్రామంలోని పిచ్చోడు చనిపోవడమూ, తద్వారా ఆ రాక్షసులు బలి తీసుకున్నారని నమ్మించటమూ జరిగిపోతాయి. బలి తీసుకున్నారని చెప్పడం ద్వారా, గ్రామస్థుల్లో ఉండే భయాన్ని మరలా రీ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. పిల్లల్లోని సహజమైన అజ్ఞానాన్ని, సహజమైన భయాన్ని కాపాడుకోవటం అవసరమా కాదా అనేదిపుడు మనం ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు ఉన్న ఆధునిక జీవనం, జ్ఞానం పేరుతో, విజ్ఞానం పేరుతో పిల్లలకుండే ఈ సహజ గుణాల్ని అందిస్తున్నదా?. జ్ఞానాన్ని ఎక్కడ అందించాలి, ఎక్కడ అజ్ఞానంగానే ఉంచేయాలి అనేదిపుడు మనం అన్వేషించాలి. ముందే అనుకున్నట్టు, జ్ఞాన అజ్ఞానాలకు మధ్యే మార్గాన్నొకదాన్ని కనుక్కోవాలి.

No comments:
Post a Comment