ఓటరు సణుగుడు
ఈ మధ్య చాలా విచ్చలవిడిగా వాడబడుతున్న పదాలు రెండున్నాయి. ఒకటి భక్తులు( కొద్దిగా వెటకారంగా బత్తులు), రెండు మేథావులు.
ప్రజాస్వామ్య దేశంలో ఎవరి మనోభావాలకనుగుణంగా వారు మాట్లాడే హక్కు ఉంటుంది గానీ, మరీ అయిందానికీ కానిదానికీ ఈ పదాలు ఉపయోగించేస్తూంటే అసలెవరు భక్తులో ఎవరు మేథావులో అర్థం కాని పరిస్థితి ఉంది.ప్రభుత్వం తీసుకునే ఏదైనా ఒక నిర్ణయాన్ని స్వాగతించే వాళ్లు అందరూ భక్తులు గానూ, వ్యతిరేకించే వారందరూ మేథావులుగానూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు నిర్వచించేస్తూ ఉన్నారనిపిస్తుంది.
ఇపుడుండే ప్రభుత్వం బీజేపీ పార్టీతో కూడిన ఎన్డీయే కూటమి కాబట్టి, ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా ఏ సందర్భంలోనైనా సమర్థిస్తే వారు అదే క్షణంలో భక్తులుగా అభివర్ణింపబడటం చూస్తున్నాం. అసలు భక్తులనే పదమే సరయినదికాదు. ఎన్నికల ద్వారా దేశంలోని మెజారిటీ ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజాస్వామ్య బద్ధంగా. ఇపుడా ఎన్నుకోబడిన ప్రభుత్వం నుండి తమ హక్కులను అవసరాలను పొందే ప్రజలు, ప్రభుత్వ విధానాలను సమర్థించినంత మాత్రాన వారిని భక్తులని హేళన చేయనవసరం లేదు. బీజేపీ కూటమిని ఏదో ఓ విషయంలో సమర్థించినంత మాత్రాన పక్కా హిందూ వాదులుగా, పరమ భక్తులుగా, తొత్తులుగా చిత్రించే ప్రయత్నాలు కనిపిస్తూంటాయి. ఇది ఒక వైపు మాత్రమే, ఇంకో వైపు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా జేజేలు పలికే వారు లేక కాదు. ఐతే సమర్థనలూ, వ్యతిరేకతలూ ఎపుడూ ఉండేవే..వారికో వెటకారమైన పేరు పెట్టడమే ఇపుడుండే ట్రెండ్.
ప్రజాస్వామ్యంలో పార్టీలుంటాయి. వాటికి ఎజెండాలుంటాయి. ప్రజలుంటారు. ప్రభుత్వాలని ఎన్నుకుంటారు. ఐతే ఎన్నుకునేది ప్రభుత్వాలను, అంతేగానీ పార్టీలను కాదనే విషయం పార్టీలు, లీడర్లు తెలుసుకోవాలి. ప్రభుత్వాలను పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం, ఏ పని చేసినా తమ పార్టీ గొప్పదనం వలననే సాధ్యమయిందన్న పోకడ కనిపించటం చూసినపుడు, అసలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా పార్టీని ఎన్నుకున్నామా అని సామాన్యుడు బుర్ర గోక్కోక తప్పదు. ఆ మధ్యన బీజేపీ పార్టీ అధ్యక్షుడు తెలంగాణా కు వచ్చి 'కేసీ ఆర్ అండ్ కంపనీ పాలన 'అంటూ ఏదో వెటకారాలు చేసి పోయాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు గానీ, కంపనీలను కాదు అని ఆ సదరు లీడరంగారికి తెలీదు అనుకోలేం. తెలిసినా తాత్కాలికంగా పడే చప్పట్లు, అయిదేండ్ల తర్వాత ఓట్లుగా మారకపొతాయా అనే దుగ్ధ. ఆయన లెక్క ప్రకారమే తీసుకుంటే, ఇపుడు కేద్రంలో 'మోడీ అండ్ కంపనీ' పరిపాలనలో ఉన్నట్టా?. రాజ్యాంగంలో ప్రభుత్వాలని ఎన్నుకోవాలని కదా ఉన్నది, ఈస్ట్ ఇండియా, సౌత్ ఇండియా కంపనీలను కాదు కదా..ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి చెందిన అధ్యక్షుడే ఇలాగున్నాడు మరి. ఇక సామాన్య నోటి దురుసు మనుషుల సంగతి చెప్పనేల?.
ఇక, ప్రజలుండగా, పార్టీలుండగా, ప్రభుత్వాలుండగా.. మధ్యలో ఈ మేథావులంటే ఎవరు?. ప్రభుత్వాన్ని ఆ విధానాల్ని విమర్శించే వారినందరినీ కట్టగట్టి మేథావులు అని వెటకారంగా అంటున్నారనటంలో ఎంత నిజం వుందో, ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే ప్రతీవాడూ తనను తానో మేథావి అని అనుకుంటుంటాడనటంలో అంతే నిజం ఉంది. నిజానికి మేథావులు అనే వారు పార్టీ సిద్ధాంత కర్తలు. వీరు రాజకీయాలకు ఒకింత దూరంగా ఉంటూ, సమాజాన్ని, రాజకీయాలను దగ్గరి నుండి పరీక్షిస్తూ, పరిశీలిస్తూ పార్టీ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు ఆ కాలానికి అనుగుణంగా రూపొందిస్తూ సూచనలిస్తూ ఉండేవారు. కమ్యూనిష్టు పార్టీకి ఈ సిద్ధాంత కర్తల బలమే అసలైన బలం. మిగితా పార్టీలకు అలాంటి సిద్ధాంత కర్తలున్నారని అనిపించదు. ఉన్నా, ఒక సిద్ధాంతం కోసం కాక ఎలక్షన్లలో పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఎలాంటి దందాలు చేయాలనే సలహాలిచ్చే వారుగా తప్ప ఇంకోలా ఉన్నట్టు అనిపించదు. పైగా కొన్ని పార్టీలకు కర్త భర్త కార్యకర్త సకలమూ ఆ పార్టీ అధ్యక్షుడే. అంతే కాక ఆ అధ్యక్షుడి కొడుకు, కొడుకుకి కొడుకు, ఇలా ఆ ఇంట్లో పొరపాటున పుట్టిన ప్రతి వాడు ఆటోమేటిక్ గా అధ్యక్షుడు అయ్యుంటాడు. వయసొచ్చి తల నెరిసినా చోటా భీం ఆటలు ఆడుకునే వాడైన సరే..ఆ ఇంట్లో పుట్టిన మహానుభావుడిగా సర్వమూ తానే కావాల్సిందే. ఇపుడు "సిద్ధాంత రాజకీయాలు" అనే మాటే వినిపించటం లేదు. ఆ పదాన్నే మరచిపోయాం. "ఓటు బ్యాంకు రాజకీయాలు" అనే మాటే వింటుంటాం. ఓటు బ్యాంకు కోసం పనిచేసే వారిని మేథావులు అనగలమా?. చివరికి కమ్యూనిస్టు పార్టీ వారు కూడా అవసరానికనుగుణంగా పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటూ సైద్ధాంతిక మేథావులను బలహీన పరిచేసరికి, మేథావులనే పదం చాలా నీచంగా వెటకారంగా తయారై కూర్చుంది. అందువల్ల ఏదైనా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా, సామాన్య మానవుడైనా కొంత వ్యతిరేకించగానే మేథావి ఐపోతుంటాడు.
చివరగా, ఓటరు అనే సామాన్యుడు కొన్ని విషయాల్లో ప్రభుత్వం తనకు నచ్చినది చేసిందని సంతోష పడతాడు, ఇంకొన్ని విషయాల్లో ఇదేంటి ఇలా చేసిందని బాధపడతాడు. వాడు భక్తుడూ కాడు, మేథావీ కాదు. ఓటరు ఓటరే. సామాన్యుడే.
విరించి విరివింటి

No comments:
Post a Comment