1. మతం ఒక పజిల్, పద్మవ్యూహం.
పరమపద సోపానంలో ఉన్నట్లు ఇందులో విషనాగులుంటాయి, మెట్లూ ఉంటాయి.
వీటన్నింటినీ దాటూకుంటూ సత్యాన్ని చేరటమే ఆధ్యాత్మిక సాధన
------------------
2- చైనాలో ఆడపిల్లకు పెళ్ళి చేసి, భర్త తో పంపించేటపుడు, అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి కొన్ని సుద్దులు చెబుతూ ఉంటారు మన దేశంలో లాగే.
ఆ సుద్దుల్లో ముఖ్యంగా చెప్పే అంశం "ఇంటి నిప్పు బయటకు పోనీయకు, బయటి నిప్పు లోపలికి రానీయకు" అని.
నిప్పు అంటే మాట అని అర్థం. నిజంగా మాట నిప్పువంటిదే, దానిని సరిగా ఉపయోగించుకోక పోతే అది తప్పకుండా కాల్చేస్తుంది.
ముఖ్యంగా సంసారానికి సంబంధించిన విషయాల్లో, చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.
ఇపుడు బతుకు జట్కాబండి వంటి ప్రోగ్రాంలలో ఇంటి నిప్పును తీసుకొచ్చి అందరి ముందరా ఆరేస్తున్నట్టుగా అనిపిస్తూంటుంది.
డబ్బులకు నటించే నటీమణులు, కౌన్సిలర్ల అవతారం కాదు, ఏ అవతారం ఎత్తమన్నా ఎత్తుతారు.
డబ్బులకు ఆశపడే టీవీ ఛానల్స్ అడ్డమైన ప్రతీ ఆలోచననూ ప్రోగ్రాంలాగా మలుస్తూ ఉంటారు, క్రియేటివ్ జీనియస్ లు మరి.
ఈ సదరు ప్రోగ్రాంలను స్పాన్సర్ చేసే కంపనీలు, ఏ చెత్త ప్రోగ్రాంకైనా స్పాన్సర్ చేసేస్తారు డబ్బుల కోసం.
కాబట్టి ఈ నటీనటులనూ, టీవీ ఛానల్స్ నూ, ఆ స్పాన్సరర్లనూ అంతకు మించి గొప్పగా ఊహించడం కష్టం.
అందుకే, డబ్బులకోసం గడ్డితినమన్నా తినే గాడిదల మధ్యకు పచ్చని సంసారాన్ని తీసుకెల్లడం ఎంతవరకు అవసరమో, ఆ ప్రోగ్రాంలకు వెళ్ళే ప్రజలు నిర్ణయించుకోవాలి. చదువుకున్న లాయర్లు, కౌన్సిలర్లు కూడా, ఈ టీవీ ప్రోగ్రాంలకు ఎగబడటం కొంత ఇబ్బంది కలిగించే విషయమే.
ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక లాయర్ దగ్గరికో, ఒక డాక్టర్ దగ్గరికో,ఒక పర్సనల్ కౌన్సిలర్ దగ్గరికో వెళ్ళినపుడు, పూర్తి ప్రైవసీని కలిగించడం ఆ సదరు ప్రొఫెషనల్స్ ల యొక్క మినిమం కర్టసీ. తమ బాధను చెప్పుకోవటానికి వచ్చిన వారితో పరాచకాలూ, పరిహాసాలూ చేయటం ఆ ప్రొఫెషన్ కే కళంకం. బయట ఎందరో తమ బాధను చూసి నవ్వుతారని నొచ్చుకునే కదా మనం వారి దెగ్గరకు వెళ్ళేది. ఇంక వాళ్లు కూడా ఆ మినిమం ప్రైవసీని కాదని గేలి చేయటానికీ, పదుగురిలో నవ్వుల పాలు చెయ్యటానికి తమ ప్రొఫెషన్ ని ఉపయోగించుకుంటే ఆ బాధాతప్త హృదయులకు దిక్కెవరు?. ఇలాంటి చెత్త ప్రోగ్రాములకు వెళ్ళే ప్రొఫెషనల్స్ ఈ విషయమై పునరాలోచించుకోవాలి.
కుటుంబాల్లో సమస్యలు ఉండవని కాదు. వాటిని పరిష్కరించుకునే మార్గాలు ఈ రచ్చకె్క్కడాలు కాదు. తమ తమ హ్యూమన్ డిగ్నిటీని కోల్పోకుండా సమస్యలను పరిష్కరించుకోలాల్సిన అవసరం ఉంటుంది. చదువుకోక పోవటం వలననో, బీదరికం వలననో ఇంకెవరో తమ సమస్యలను తీరుస్తారని అనుకున్నపుడు చిత్త శుద్ధిలేని యాంకరమ్మలు కూడా కొడదామని చేతులెత్తడాలు చూస్తున్నాం. వీరికెవరిచ్చారీ కొట్టే అధికారం. ప్రోగ్రాంకి వచ్చిన వారంటే అంత అలుసా?. అయినా ఇంకొకరి ప్రాబ్లంని పబ్లిక్ గా చూపిస్తూ డబ్బులు సంపాదించాలనుకోవడం, ఎంత లేకితనం!!. టీవి ఛానల్సనీ ఆపలేం, బాధల్లో పరిష్కారాల కోసం వెతికే తోటి మనుషులనూ ఆపలేం, కానీ గౌరవ ప్రదమైన ప్రొఫెషన్స్ లో ఉండే లాయర్లూ, కౌన్సిలర్లూ, హ్యూమన్ డిగ్నిటీని కించపరిచే ఇటువంటి ప్రోగ్రాంలకు దూరంగా ఉంటారని ఆశిద్దాం.
3. రాజకీయాల్లో పదాల మార్పులు
1."ప్రతిపక్షం" అనడంలోనే, ఆ పదంలోనే దాన్ని తీసి పక్కన పడేయడం ఉంది.
ప్రతిపక్షం పదాన్ని "ప్రత్యామ్నాయ పక్షం" అనాలని మనం డిమాండ్ చేయాలి...మీరేమంటారు??.
2.దక్షిణ పక్షం అనే పదమే లేనపుడు, "వామ పక్ష"మనే పదమెందుకు వచ్చింది?. ఇది కూడా పక్కకు తోసేసే ప్రయత్నమే.
ఉదయించే సూర్యుడు సింబాలిక్ కాబట్టి "తూ రుపు పక్షం" లేదా "అరుణ పక్షం" అనాలని మనం డిమాండ్ చేయాలి....మీరేమంటారు?.
4. స్వచ్ఛ భారత్ వీధి నాటకంలో చీపురు పట్టుకుంది వీధి ఊడవటానికి కాదట!!
విద్యార్థుల్లో స్పూర్తి నింపి వీధంతా ఊడిపించటానికట
విరించి విరివింటి

No comments:
Post a Comment