* బేస్ లెస్ పోస్ట్. వైదిక మతంలో స్త్రీకి అత్యున్నత స్థానం ఇవ్వబడింది. మాతృత్వాన్ని డివినైజ్ చేసిన ఏకైక మతం ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది కేవలం హిందూ మతం. వేదాల్లో కానీ పురాణేతిహాసాల్ల ో కానీ భారత సమాజంలో స్త్రీకిచ్చిన స్థానం మహోన్నతమైనది. ఎపుడైతే బౌద్దిజం ఇక్కడున్న రాజ్యాలను నిర్వీర్యం చేసిందో అపుడు స్త్రీ అంటే ఒక సెక్స్ ఆబ్జెక్ట్ అనుకునే పరాయి సంస్కృతులు మన దేశంలోకి ప్రవేశించాయి. చరిత్ర ఏమాత్రం తెలుసుకోకుండా కాటమరాయుడికి కుంభకర్ణుడికీ లింకు పెట్టి రాసే రాతలు కొంత మంది భజన రాయుల్ల చేత భజన చేయించుకోడానికి తప్ప ఎందుకూ పనికి రావు. ఇపుడు అధికమౌతున్న స్త్రీ వివక్షతకానీ, రేప్ ల సంస్కృతి కానీ, చెలరేగి పోతున్న విదేశీ సంస్కృతుల పుణ్యమే కానీ, భారతీయత ఎంత మాత్రమూ కాదు.
* మనుస్మృతిని మీరొక పవిత్ర గ్రంధం అనుకుని దానికేసి తలలు బాదుకుంటే చేసేదేమీ లేదు. ఫ్రెడ్రిక్ నీషే బైబిల్ మూసేసి మను స్మృతి తెరవండి అన్నంత మాత్రాన దినికో ప్రత్యేకత ఇచ్చేసి, ఇదే ఫైనల్ అని మీరనుకుంటే చేసేదేమీ ఉండదు . డా.అంబేద్కర్ గారు మను స్మృతి ఇండియాలో బౌద్దిజం వ్యాప్తి జరుగుతున్నపుడు, దానిని అరికట్టడానికి, దానికి వ్యతిరేకంగా రాయబడినదని చెప్పారు. అంతే కానీ ఇదే హిందూ ఇజం అని చెప్పలేదు. మను స్మృతిని మనం డూస్ అండ్ డోంట్ డూస్ వంటి కోడ్ ఆఫ్ కండక్ట్ అని అనుకుంటే, ఆ కాలంలో ఈ కోడ్ అఫ్ కండక్ట్ని తూచా తప్పకుండా పాటించిన రాజ్యాల దాఖలాలు కూడా కావాలి. గ్రీకు వాడొచ్చినపుడో ఇంకొకపుడో మాత్రమే ఆసేతు హిమాచలమూ భారతదేశమేనన్న సంగతి గుర్తించని రాజ్యాలు, ఎవరో భృగువనే మహర్షి రాసిన మను స్మృతిని తమ కోడ్ ఆఫ్ కండక్ట్ గా మార్చుకుని ఉంటాయని అనుకోనేలేము. పురాణేతిహాసాలు వేదాన్ని ప్రతిపాదించినా, మను స్మృతి వేదాన్ని ప్రతిపాదించినట్ టు మనకు కనిపించదు. దాన్ని అవైదికమనే అనుకోవాలి. వేదాల్ని నెత్తినెట్టుకున ్న దయానందుడు మనుస్మృతిని హత్తుకోవడం పిచ్చి పీక్స్ అనుకోవచ్చు. ఒక లా బుక్ లాంటి దాన్ని, మొత్తం భారత సాహిత్యంలో ఒక అత్యంత చిన్న భాగమైన దాన్ని పట్టుకుని ఇదే హిందూమతము చూడగ రారండి అని పాడుకుంటామంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.
* బలము చేతనే బలమొస్తుంది, బలహీనతల్ని హైలైట్ చేయటం వల్ల రాదు. ఇపుడు బైబిల్ లో కానీ, ఖురాన్ లో కానీ స్త్రీ స్థానం ఏంటి అని అడగవచ్చు మనం. ఆ మతాలు ఆ ఒక్క పుస్తకాల్లోకే ఇమిడిపోతాయి. ఆ గ్రంథాల్ని ఆయా మతాలకు ప్రామాణికాలుగా వారే ప్రతిపాదించుకున ్నారు. హిందూఇజం కి అలా ప్రతిపాదించుకోవ టానికి ఏ గ్రంథమూ లేదు. ఇదే ఫైనల్ వర్డ్ ఆఫ్ గాడ్ అని ఎవరూ ప్రతిపాదించలేదు . ఈయనే నిఖార్సయిన దైవదూత అని ఎవరూ అనలేదు. చలన శీలమైన కాలంలో మహానుభావులు పుడుతూనే ఉంటారు, దిశా నిర్దేశం చేయగలిగిన అలాంటి మహానుభావులు సాక్షాత్తూ దైవసమానులని అనుకుంటాం కనుకనే మనకు జీసస్ కానీ అల్లాకానీ రాముడు కానీ కృష్ణుడు కానీ సాయిబాబా కానీ ఇంకొకరు కానీ దైవసమానులే , దైవాలే అయ్యారు. భగవద్గీతలో కూడా ఇదే నమ్మకాన్ని మానవాలికి ఇచ్చారు. సంభవామి యుగే యుగే అని. హిందూ ఇజం ఒక చలన శీలమైన జీవన విధానం. దానికి ఫిక్స్డ్ రూల్స్ ఏమీలేవు. దేశకాల పరిస్థితులను బట్టి మార్చుకోగలిగినం త ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. అందుకే అది ఒక జీవన విధానం అన్నారు. ఇపుడు అసలు సమస్య ఏమిటంటే కొన్ని ఫిక్స్డ్ రూల్స్ ఉన్న ఆర్గనైజ్డ్ మతాలు, తమ కల్లద్దాలతో ఫ్లెక్సిబిలిటి ఉన్న ఒక జీవన విధానాన్ని విమర్శించ ప్రయత్నించటం. దానికి కొన్ని పోతలు పోయ ప్రయత్నించటం. ఇకడ అదే జరుగుతుంది.
* Manu smriti lo...2700 slokas లో కేవలం 1500మాత్రమే ఒరిజినల్ టెక్ట్ అనీ, మిగితావి ప్రక్షిప్తాలనీ, ఈ ప్రక్షిప్తాల్లో నే స్త్రీలను కించపరిచే విధంగా ఉందని భారతీయ చరిత్రకారులే కాక యూరోపియన్ స్కాలర్స్ కూడా అంగీకరించిన విషయం. కాథోలిక్ ఎన్సైక్లో పీడియా కూడా ఆ ప్రక్షిప్తాలని వదిలేస్తే ఎథికల్ గా మను స్మృతి అత్యంత అద్భుతమైన పుస్తకమని కొనియాడింది. కాథోలిక్ మత ఉద్భోధల్లో కూడా మనుస్మృతి యొక్క ప్రభావం ఉందనేది అక్కడివారు చెప్పినదే. ఒక మంచిని గ్రహించడానికి మత సంస్కరణవాదులు ముందువరుసలో ఉంటారు. అది ఏదేశంలో అయినా అంతే. కృష్ణుడు భాగవతంలో ధర్మ శాస్త్రాలు ఒక వ్యక్తిని భగవంతుని వైపు తిప్పటానికి మాత్రమే పనికి వస్తాయని చెప్పాడు కదా. ఆయనే భగవద్గీతలో అన్ని ధర్మాలను వదిలివేసి, భగవంతుని శరణు జొచ్చమన్నపుడు ఆయనంతటి వాడి దృష్టిలో ధర్మ శాస్త్రాల స్థానం ఎట్టిదో తెలుసుకోవచ్చు. సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కృష్ణుడంతటి వాడికే వాటిమీద చిన్న చూపు ఉన్నపుడు, అత్యున్నత జీవితాన్నే మనిషినుండి కోరుతున్నపుడు, మనం కాలం చెల్లిన సూత్రాల్ని పట్టుకుని తలలు బాదుకోవడం, దానికో అభ్యుదయమని దొంగ పేరు మాటున హిందూఇజాన్ని తిట్టడమూ..లేకిత నానికీ, అజ్ఞానానికీ పరాకాష్ట.
* సర్ అంటరానితనం ఎందుకు మన సొసైటీలోకి వచ్చిందో ఇదమిత్తంగా తెలియదు. చాలా కారణాలు అయ్యుండొచ్చు. మనకు బుద్దిస్ట్ టీచింగ్స్ ఒచ్చేవరకు చరిత్రని లిఖించిన దాఖలాలు లేవు. వేదాల్లోని పురుష సూక్తంలో మొదట చాతుర్వర్ణాల్ని వివరించారు. అసలు పురుష సూక్తము కూడా ప్రక్షిప్తమే అనే మహానుభావులు, హిందూయిజంని అంటరానితనంతో ముడిపెడుతున్నార ు కనుక తప్పించుకునే వ్యవహారం ఒకటి కనిపెట్టడానికి దాన్ని కూడా ప్రక్షిప్తమని డిఫెన్సులో పడివుండొచ్చు. అయితే పురాతన సివిలైజేషన్స్ మొత్తంలో సింబాలిజం, కవిత్వం అద్భుతంగా సమ్మిలితం అయి కన్పిస్తాయి. ఈ మధ్యే వొచ్చిందనుకుంటు న్న బైబిల్ లోని సింబాలిజంకే కవులు ఆశ్చర్య పోతున్నపుడు, ఇంకా పురాతనమైన సివిలైజేషన్స్ అనుకునేవి ఎంత సింబాలిక్ పోయెట్రీని క్రియేట్ చేసి ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. లాంఫ్రీ అనే ఫ్రెంచ్ తత్వవేత్త, హిస్టోరియన్, ఒక సమాజం ఏవిధంగా సైకిల్స్ గా సింబాలిక్ స్టేజ్ నుంచి మొదలై, టైపల్, కన్వెన్షనల్, ఇండివిడ్యువలిస్ టిక్ కాలాల ద్వారా సాగుతుందో వివరించారు. ఆయన వివరణా మన సత్యద్వాపరత్రేత ాకలియుగాల వర్ణనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కాలానికి సంబంధించి, ఇలాంటి ఊహే యుక్తేశ్వర్ గిరి గారూ చేశారు.
పురుష సూక్తంలో కనిపించే సింబాలిజం సమాజాన్ని దేవునిగా ఊహించి చేసినది. దేవునికి ముఖమేదీ అంటే, సమాజంలోని విజ్ఞులే ముఖమని, బాహువులు సమాజాన్ని కాపాడే వారుగా, తొడలు సమాజాన్ని నిలబెట్టేవారిగా , కాల్లు సమాజాన్ని నడిపించేవారిగా చేసిన సింబాలిక్ భావన.
అదే ఋగ్వేద కాలంలో, మానాన్న మేథావి, మా తాత పశువుల కాపరి, మా అమ్మ వస్త్ర వ్యాపారి అన్నట్టుగా వివిధ వృత్తులని చేపట్టేవారు ఒకే కుటుంబంలో ఉన్నట్టుండే వివరణలు ఎన్నో ఉన్నాయి. దీన్ని బట్టి పురుష సూక్తంలోని వివరణని కేవలం సింబాలిక్ పోయెట్రీగానే చూడాలి అనేది స్పష్టం. సరే తలనుండే తాము ఒచ్చాము అనుకున్న బ్రాహ్మణులు భగవంతుడి తలను కాక పాదాల్నే కొలిచి ఉండటం కూడా బ్రాహ్మణులు కావాలనే తమకు అనుకూలంగా రాసుకున్నారనే వాదం ఒట్టి తలా తోకా లేని వాదం అని అర్థం అవుతుంది
తరువాత రాయబడిన మనుస్మృతిలో ఈ అవగాహనని ఎలా తీసుకున్నారో మనకు తెలుసు. అంబేద్కర్ అన్నట్టు, ఇది ఒక మతాన్ని ఖండించటానికి రాసుకున్న టెక్ట్స్ కాబట్టి, చాతుర్వర్ణాల్ని తమకు అనుకూలంగా ఇంకో మతాన్ని ప్రతిపాదించడాని కి కొన్ని రిజిడ్ సూత్రాలతో దాన్ని తయారు చేసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే మన పాలిట శాపం. వివేకానంద కూడా, బౌద్దిజం భారతదేశానికి చేసిన నష్టం ఏ మతమూ చేయలేదనే అన్నాడు.
అప్పటి బ్రాహ్మణులనబడే పూజారి వర్గం వారు తమ ఆధిపత్యం నిలుపుకోవటానికే ఈ వర్గీకరణ చేసి ఉంటారనుకోవడం రాజుల అండదండలు లేకుండా ఇది సమాజంలో పారే ఎత్తుగడ అనుకోవటం కూడా మన తొందరే అవుతుంది. ఇది బలహీనులైన పూజారి వర్గం కంటే అధికారమూ బలమూ కలిగిన రాజుల ఎత్తుగడ అయివుండే అవకాశం ఎక్కువ.
Always my stand is very clear. The scriptures we, the human beings made, were always to give a light to the society at that point of time. Wheather its Bible, Khoran or Geetha. For this newer society they act only as a road side signs. They direct us which way we have to go and which way we should not go. All mishappenings in religions are due to their mis interpretations .
Agian, in this newer age whats the fun in mis interpretating them?. We have seen enough of mis interpretations and their worst results. Being educated, being scientific ..whats the fun in criticizing one and creating differences amomg people. Why we are not in a stage to accept if some one shouting all religions are one and same, and all paths leads to one God.
* మనుస్మృతిని మీరొక పవిత్ర గ్రంధం అనుకుని దానికేసి తలలు బాదుకుంటే చేసేదేమీ లేదు. ఫ్రెడ్రిక్ నీషే బైబిల్ మూసేసి మను స్మృతి తెరవండి అన్నంత మాత్రాన దినికో ప్రత్యేకత ఇచ్చేసి, ఇదే ఫైనల్ అని మీరనుకుంటే చేసేదేమీ ఉండదు . డా.అంబేద్కర్ గారు మను స్మృతి ఇండియాలో బౌద్దిజం వ్యాప్తి జరుగుతున్నపుడు,
* బలము చేతనే బలమొస్తుంది, బలహీనతల్ని హైలైట్ చేయటం వల్ల రాదు. ఇపుడు బైబిల్ లో కానీ, ఖురాన్ లో కానీ స్త్రీ స్థానం ఏంటి అని అడగవచ్చు మనం. ఆ మతాలు ఆ ఒక్క పుస్తకాల్లోకే ఇమిడిపోతాయి. ఆ గ్రంథాల్ని ఆయా మతాలకు ప్రామాణికాలుగా వారే ప్రతిపాదించుకున
* Manu smriti lo...2700 slokas లో కేవలం 1500మాత్రమే ఒరిజినల్ టెక్ట్ అనీ, మిగితావి ప్రక్షిప్తాలనీ,
* సర్ అంటరానితనం ఎందుకు మన సొసైటీలోకి వచ్చిందో ఇదమిత్తంగా తెలియదు. చాలా కారణాలు అయ్యుండొచ్చు. మనకు బుద్దిస్ట్ టీచింగ్స్ ఒచ్చేవరకు చరిత్రని లిఖించిన దాఖలాలు లేవు. వేదాల్లోని పురుష సూక్తంలో మొదట చాతుర్వర్ణాల్ని
పురుష సూక్తంలో కనిపించే సింబాలిజం సమాజాన్ని దేవునిగా ఊహించి చేసినది. దేవునికి ముఖమేదీ అంటే, సమాజంలోని విజ్ఞులే ముఖమని, బాహువులు సమాజాన్ని కాపాడే వారుగా, తొడలు సమాజాన్ని నిలబెట్టేవారిగా
అదే ఋగ్వేద కాలంలో, మానాన్న మేథావి, మా తాత పశువుల కాపరి, మా అమ్మ వస్త్ర వ్యాపారి అన్నట్టుగా వివిధ వృత్తులని చేపట్టేవారు ఒకే కుటుంబంలో ఉన్నట్టుండే వివరణలు ఎన్నో ఉన్నాయి. దీన్ని బట్టి పురుష సూక్తంలోని వివరణని కేవలం సింబాలిక్ పోయెట్రీగానే చూడాలి అనేది స్పష్టం. సరే తలనుండే తాము ఒచ్చాము అనుకున్న బ్రాహ్మణులు భగవంతుడి తలను కాక పాదాల్నే కొలిచి ఉండటం కూడా బ్రాహ్మణులు కావాలనే తమకు అనుకూలంగా రాసుకున్నారనే వాదం ఒట్టి తలా తోకా లేని వాదం అని అర్థం అవుతుంది
తరువాత రాయబడిన మనుస్మృతిలో ఈ అవగాహనని ఎలా తీసుకున్నారో మనకు తెలుసు. అంబేద్కర్ అన్నట్టు, ఇది ఒక మతాన్ని ఖండించటానికి రాసుకున్న టెక్ట్స్ కాబట్టి, చాతుర్వర్ణాల్ని
అప్పటి బ్రాహ్మణులనబడే పూజారి వర్గం వారు తమ ఆధిపత్యం నిలుపుకోవటానికే
*
Virinchi Virivinti
ఛండాలుడంటే ఎవరు అనేది మనం తెలుసుకోకుండా, ఛండాలుడు అని మనల్నే అంటున్నారు బ్రాహ్మణులు అనుకోవడం మనకే చెల్లింది. ఒక అన్నా చెల్లెలికీ, ఒక మనిషికీ జంతువుకీ, వివాహేతర సంబంధం వల్ల పుట్టిన వాన్నీ, ఉన్నతకుల స్త్రీకి నిమ్న కుల పురుషుడికీ కలిగిన సంతానాన్నీ ఇలాంటి వారిని ఛండాలుడు అన్నారని ఉంది. అలాంటి వాడికి ఏవో కొన్ని కఠిన శిక్షలు కూడా రాశారు. అయితే ఆ శిక్షలు అమలు పరిచేకన్నా, సమాజంలో అబ్నార్మల్ సెక్సువాలిటీని ఎంకరేజ్ చేయకూడదనె ఉద్దేశమే కనిపిస్తుంది. నిర్భయ ఉదంతం, సగటు మానవుడు వారిని బహిరంగంగా చంపాలి అనుకోవడానికి లేదా అఘమేఘాల మీద నిర్భయ చట్టాల్ని చేయడానికి ఎలా ఊతం ఇచ్చి వుందో ఛండాలుణ్ణి నిర్వచించడానికి అలాంటి ఉదంతాలేవో ప్రేరణగా ఆనాడు నిలిచుండాలి. అలాంటి ఛండాలుడు సైతం భగవంతుని అంశే అని ఆది శంకరులు కాల్లు పట్టుకోవడం, ఏకీశ్వరవాదం ఫిలాసఫికల్గా ఎంత బలంగా ఉండిందో చెబుతుంది. కానీ ఆచరణాత్మకంగా విఫలమవటానికి మనుషుల చైతన్య రాహిత్యమే తప్ప ఇంకేమీ కాదు. ఉటోపియన్ సోసైటీని ఎకనామికల్ గా సృష్టంచిన మార్క్సిజం మనకు ఎంత ఆదర్శమో అదే ఉటోపియన్ సొసైటిని మత పరంగా నిర్వచించిన ఏకీశ్వరవాదం కూడే అంతే ఆదర్శం. కానీ రెండూ ఫిలాసఫికల్ గా అత్యున్నతాలే అయినా, ప్రాక్టికల్ గా ఫెయిల్యూర్ కావటానికి, మనుషులం గా మనం ఆ చైతన్య స్థాయిల్ని అందులేకపోవటమే. మార్కిస్ట్ లని అడిగినే ఈ విషయమే గా చెదుతారు.
* లా గారూ, నాకంత అవసరం లేదు. చాలా అసమానతలు వేరియేషన్స్ ఉన్నదె హిందూయిజం. అదే అర్థం చేసుకోవాలి అంటున్నా. ఒక ఫిక్స్డ్ దేవుడు ఒక ఫిక్స్డ్ పుస్తకమూ ఉండి, నమ్మని వారినంతా చంపేసేయండి అని చెప్పే సూత్రాలు లేవు. నమ్మని వారికి స్వర్గం దక్కదని చెప్పుకోవాల్సిన ంత అపనమ్మకాలుగల జనాభా మన దేశంలో ఎపుడూ లేదు. నమ్మిన వారికి సర్టిఫికేట్స్ ఇచ్చి స్వర్గానికి ఎంట్రీ టికెట్ అని చనిపోయిన శవాల పక్కన సర్టిఫికేతట్ని కూడా పాతిపెట్టిన పూజారి వర్గం మనకులేరు. కాఫిర్ లనీ, సైతాన్ మనుషులనీ మనం నిర్వచించుకోలేద ు. వారిని ఇంక్విజిషన్ పేరులతో చంపుకోలేదు. బ్రాహ్మణులు తమ ఉనికి అస్థిరత్వానికి గురయినపుడు, రాసిన పిచ్చి రాతలు మీరనుకునే బ్రాహ్మణీయ వ్యవస్థ అయివుండాలని కోరుకుంటాను.
* యూరోపియన్ దేశాల్లో కానీ అమెరికాలో కానీ అనదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కనిపిస్తుంది. అతి ఫ్రీడం. ఫ్రీడం అనేది ఎగిరే గాలిపటం లాంటిది. ఎంత పైకి ఎగిరినా దాని తాడును కింద ఒకరు పట్టి ఉంచాలి. అలా పట్టి ఉంచ గలిగిందే సంస్కృతి. అక్కడి మిత్రుల వల్ల తెలిసినదేమంటే ఈ అతి ఫ్రీడం వల్ల తాడు తెగిన గాలి పటంలా ఆడవారి జీవితాలు తయారయ్యాయని.. పదేల్లకే పిల్లలు తలిదండ్రులు లేక రోడ్లమీద పడటం జరుగుతోందని. బలమైన కుటుంబ వ్యవస్థల్ని మన వివాహ వ్యవస్థలు కల్పింప చేయటం, అతి ఫ్రీడంకి కాక ఫ్రీడంని మన సంస్కృతి కల్పించటం వల్ల మనకా పరిస్థితులు లేవనే చెప్పాలి.
* ఇక్కడ ఇంత చర్చకి కారణం, మీరెంచుకున్న సబ్జెక్ట్ మాత్రమే కాక దాన్ని సపోర్ట్ చేసుకోడానికి మీరు హిందూఇజాన్ని పావులా వాడుకోవాలనుకోవడ ం. మీ బాధ స్త్రీ వివక్షే అయితే, ప్రస్తుత సమాజంలో మీరు సినిమాల మీద, పెరుగుతున్న పబ్ కల్చర్ మీద అటాక్ చేయాల్సింది. కాలం చెల్లిన పుస్తకాల్ని ఉటంకిస్తూ ఇవే కారణాలు అని చూపించ ప్రయత్నించటం వృథా ప్రయాసే అవుతుంది. సినిమాల్లో ఈ రోజుకి కూడా ఆడవారు హీరోలతో డాన్స్ లు చేయటానికి తప్ప మిగతా అంతా డమ్మీలే. వుమన్ రిప్రెజెంటేషన్ పెరిగిన సీరియల్స్ లో వుమెన్ ని విలన్లుగా చూపిస్తున్నారు. మీరనే ఏ పురాణాల్లోను వుమన్ విలన్లు లేరు. హాలీవుడ్ లో కూడా వుమన్ రిప్రెజెంటేషన్ ప్రాపర్ గా లేదని బాచ్డెల్ టెస్ట్ లాంటి వాటిని ప్రవేశ పెట్టారు. పురాణాలు స్త్రీల చుట్టే తిరిగాయి. ఆ కథలకన్నిటికీ ప్రోటాగోనిస్ట్ లు స్త్రీలే. వారి రిప్రెజెంటేషన్ ఆ కాలంలోనే ఎక్కువ. ఇతర మత గ్రంథాల్లో ప్రొటాగొనిస్ట్ లు మగవారే. ఆడవారు ఏ వ్యభిచారులుగానో దీనులుగానో చూపబడతారు. ప్లస్ పురాణాలు మత గ్రంథాలు కావు. అవి ఆ కాలములోని ఒక చారిత్రక సాంస్కృతిక వాతావరణాన్ని మనకు అందిస్తాయి. ఆ వెలుగు ద్వారా ప్రస్తుత మన దిశను నిర్దేశించుకునే లా స్పేస్ ని అవి కల్పిస్తాయి.
* ణ గారూ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మీరు మీ ఒరిజినల్ పోస్ట్ లో హిందూమతం గురించి చెబుతూ, స్త్రీ పూజింపబడిన చోట....ఇలా జరుగుతోంది అని రాశారు. రెండు నాల్కల ధోరణి అని మీరు హిందూఇజాన్ని అన్నారా, అందులో ఉండే మహా మేధావుల్ని అన్నారా అనే సంశయం కలిగింది. మీరు అందులో ఉండే మహానుభావలనే కనుక అని ఉంటే నేనూ మీతో కలుస్తాను. కలిసి ఉతికి ఆరేద్దాం. కానీ తరువాత జరిగిన డిస్కషన్ లోమీరు హిందూఇజం ఈస్ ఫుల్ ఆఫ్ డబుల్ స్టాండార్డ్స్ అన్నారు. అక్కడే కదా వివాదం. ఒక వేల మీరు మీ ఒరిజినల్ పోస్ట్ లో హిందూఇజాన్ని అన్నారనే అనిపించటంతో ఇంత డిస్కషన్. నిజానికి మీకు ఒక మతాన్ని కాక, అందులో మహానుభావులని అనే ఉద్దేశమే కనుక ఉండింటే...మిమ్మ ల్ని అర్థం చేసుకోవటంలో నా విజ్ఞత దారుణంగా ఫెయిల్ అయిందన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు
* Mam..meeru educated gurinchi antha neerasinchi povanavasaram ledu. And Fb is a partial medium to understand each other. Nenu cheppindi meeru mis understand chesukodaniki entha avakasam undo...meeru cheppindi nenu mis understand chesukodaniki anthe avakasam undi. We are not talking here face to face. This communucation atleast opens some doors, hopefully in a positive way, if the participants are empathetic.
Always my stand is very clear. The scriptures we, the human beings made, were always to give a light to the society at that point of time. Wheather its Bible, Khoran or Geetha. For this newer society they act only as a road side signs. They direct us which way we have to go and which way we should not go. All mishappenings in religions are due to their mis interpretations
Agian, in this newer age whats the fun in mis interpretating them?. We have seen enough of mis interpretations
* చెవిటోడి ముందర,శంఖం ఊదినట్టు అనిపిస్తుంది మహాశయా మీ అభిప్రాయం. మనుస్మృతిని నేను సమర్థించినట్టు మీకు కనబడటం, మీ గుడ్డితనం, లేదా అర్జంటుగ నన్ను ఛడామడా తిట్టేసి గర్వంగా భుజాలెగిరేసుకోవ ాలనే మీ తొందరితనం. విషయమేమంటే మీ అప్రోచ్ లో కూడా కొత్తదనమేమీలేదు . శతాబ్దాలుగా ఒక మతాన్నీ ఇంకో మతము తిట్టుకోవడమూ చంపుకోవడమూ చూస్తూనే ఉన్నాం. మీ అప్రోచ్ వల్ల అస్థిరత్వం ఇంకా ఇంకా పెరుగుతుందే తప్ప సైంటిఫిక్ యుగంలో క్రాస్ కల్చరల్ అండర్స్టాండింగ్ లతో మంచిని మాత్రమే స్వీకరిస్తూ చెడును కాలరాసే వ్యవస్థ అసలు ఉత్పన్నమే కాదు. మీలాంటి చదువుకున్న మేధావులు కూడా కాలం చెల్లిన పుస్తకాలకేసి తలలు బాదుకుని అందులో ఉండే లేకితనాన్ని బయటకి తీసి గొప్ప మేధావులమని సంకలు గుద్దుకుంటామంటే ..ఇక మీ ఇష్టం. లోకం పురోగమనం వైపు, ఏకత్వం వైపు పరుగులు తీస్తుంటే..హే మాన్ నీ మతమంతా తప్పు తెలుసా అనే అలగా పనులకి మీరు జై కొడతామంటే..మీ ఇష్టం . ఇక్కడ నా పోస్ట్ లు కనీసం ఒకింత డిస్ హార్మోనీ క్రియేట్ చేసి, మన మధ్య డిఫెరెన్సెస్ ని ఇంకా పెంచేదిగా ఉన్నట్టయితే ఇంక ఇక్కడ ఉండాల్సిన పని నాకు అసలు లేనే లేదు. తిట్టాలి, మిస్ ఇంటర్ ప్రీట్ చేయాలి, దానితో లభించే ఒక,మానసిక ఆనందానికి మాత్రమే మన జీవితాల్ని అంకితం చేసుకోవాలనుకునే వారికి ఇక్కడ కొదవే లేదు. మీరు వారి తలకాయల్లోకి మీ తలకాయ దూర్చుకోగలరు. థ్యాంక్యూ.
No comments:
Post a Comment