*కోరికల తులా భారంలో బతుకుదే పై చేయి కాబట్టి, ఎన్నో కోరికల్ని మనసు అదిమి ఉంచుకుంటుంది. అవి స్వప్నలోకాల్లో తీవ్రంగా బయటకు రావటానికి ప్రయత్నిస్తాయి. ఫ్రాయిడియన్ స్వప్న సందేశ సిద్దాంతాన్ని మరలా కవితలో చూస్తున్నట్టుగా అనిపించింది. స్వప్నం ఒక ఉద్గారంలా అయితే తప్ప, మనిషి తన సంయమనాన్ని కోల్పోకుండా ఉండలేడు కాబట్టి, కవయిత్రి ఆ ఆశని చాలా స్వేచ్ఛగా వ్యక్తీకరించటానికి వెనుకాడలేదు. మంచి కవిత.
*
కనిపించే ప్రతి విషయమూ మనకొక అద్దంలా పనిచేస్తూ, మనమేంటో చెబుతుంటుంది. ఈ కవితలో ఆ భిక్షకురాలు మన లోపలికి చూసుకోటానికి ఉపయోగపడింది. ఎంత చెట్టుకు అంత గాలిలానే మధ్య తరగతి బ్రతుకులు ఉండటం వల్ల, ఒక క్షణం, ఆమెతో కవి ఏకత్వాన్ని అనుభవిస్తూ సాగిపోతున్నాడు. మంచి కవిత. పుష్యమీ గారికి కృతజ్ఞతలు.
* కుల వృత్తులకూ, సంస్కృతికీ ఆచారాలకూ ఎంతటి సంబంధం ఉండిందో అంతర్లీనంగా చెబుతుందీ కవిత. పుట్టుక పెండ్లి చావు నుంచి అనేకానేక పండగలకూ, ఆచారాల రూపంలో వివిధ కులవృత్తుల వారికి పనిని కల్పంపచేసిన ఒకానొక సంస్కృతినికూడా ఈ కవిత ఎత్తి చూపుతోంది. ప్రపంచీ కరణతో సంస్కృతితో పాటు కుల వృత్తులూ కనుమరుగుతున్న తరుణం ఇది. కానీ ఆ వృత్తి లోని వివిధ పదాల్ని ఏర్చి, కవితను కూర్చడంలో కవి యొక్క నిబద్దత స్పష్టంగా కనిపిస్తోంది. కమ్మెచ్చు తీసిన ఉక్కు ముక్క, అయిరేణి కుండ, బోణం బాన, మూకుడు వంటి పదాలకి అర్థాల్ని కూడా గ్లోసరీలో చేర్చితే..ఇలాంటి అందమైన పదాల్ని కోల్పోకుండా ఉంటామని నా అభిప్రాయం. కవి గారికి వందనాలు.
* కంటి ముందు కదలాడే ఎన్నో నిర్లిప్త దృశ్యాలనూ, ఆంతరంగికంగా సాగే సంభాషణనూ, అందులోని జ్ఞాపకాలనూ ఒకే కవితలో కుట్టటానికి ప్రయత్నించారు. చాలా మంచి సబ్జెక్ట్ తో కొత్త శైలిలో వ్యక్తీకరించారు. కానీ మంచి శిల్పాన్ని సాధిస్తే.. అద్భుతమైన కవిత అవుతుంది. కొంత పరిశ్రమ చేసి ఉండాల్సింది అనిపించింది. అభినందనలు
* నేరం చేశాక, పోలీసులు కావాలనే కొంత సమయాన్ని వృథాచేస్తారట. దాని వల్ల నేరగాడు తన నేరాన్ని కనిపించకుండా చేసుకునే క్రమంలో ఇంకా ఎక్కువ నేరాలు చేయటానికి, అడ్డంగా తన వల్లో తానే పడిపోవటానికి కావలని చేసే ఒక ప్లాన్ లాంటిదిది. నేరమూ శిక్ష నవల్లో డాస్టోవయెస్కీ చెప్పిన సీక్రెట్ ఇది. అందులో ప్రొటాగొనిస్ట్ రాస్కోల్నికోవ్ మానసిక స్థితికి, చంద్రబాబు స్థితికీ కొంత సిమిలారిటీస్ కన్పిస్తున్నాయి. కాబట్టి ఒక కేసు పోయి, పది కేసులు మెడకు చుట్టుకుంటున్నారు తమకు తామే. ఎసీబీ గుడ్ గోయింగ్.
* ఈ మరుపును కోరుకోవటం నిజానికి ఏకాంతాన్ని కోరుకునే ఒక మానసిక స్థితిది. అపుడపుడూ ప్రపంచంతో పూర్తిగా సంబంధాన్ని కావాలనే కోల్పోవటం ఏకాంతం. ఒంటరి తనం లో ప్రపంచం మన వెంటే ఉండిపోతుంది, బాధిస్తుంది. కవి కోరుకునే ఈ ప్రశాంతతని ఈ కవితలో చెప్పారు.
* కవి సంగమం లో కవితలు వస్తూనే ఉన్నాయి ఈ విషయంలో. పోమాల గారు కవి సంగమం లోని కవితలను ఫాలో కావటం లేదనిపిస్తోంది. అంతేకాక ఇలారాయట్లేదేంటి మీరని వాపోయే బదులు, మీరూ ఒకటి రాసి, ఒక వరవడి తీసుకురావచ్చని నా అభిప్రాయం. సామెతలూ, జాతీయాలూ, తిట్లూ, శాపనార్థాలూ కవితలు కావని ఇలాంటి సందర్భాల్లో మేల్కొలిపే భావాలే కవితలౌతాయని మనం గుర్తించుకోవాలి.
* అసదుద్దీన్ ఒవైసీ ఆ మధ్య పాకిస్తాన్ కి వెల్లినపుడు ఇలాగే మాట్లాడాడు. మా దేశ ముస్లిం ల మీద మీరు దొంగ ప్రేమలు చూపించకండని, మా హిందూ సోదరులకు మాకూ మధ్య గొడవలుంటే అవి మేమే పరిష్కరించుకోగలమని ఆ దేశంలో చిందులేసి చీవాట్లు పెట్టి ఒచ్చాడు. ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రా ప్రాంత వాసులు ఇలాగే స్పందిచటం చాలా అవసరం. వారి ఆరిజిన్ ఎక్కడిదయినా ప్రస్తుతం వారు తెలంగాణ ప్రజలు. కాబట్టి వారిపుడు గొంతు విప్పాలి. అనవసరంగా తెరమీదకి లాగాలని చూసే వారికి బుద్ది చెప్పాలి.
* ఇది పోర్నోగ్రఫీకి అడ్డిక్టయిన ఇద్దరు అమాయకుల మీద జాలి చూపే కన్నా..ఆ అవస్థని మగ దురహంకారంగా సాగుతూ నడిచే కవిత. సైకాలజిస్ట్లు డెఫినైట్ గా ఆ పిల్లలు తలిదండ్రుల ప్రేమను కోల్పోయినవారిగానో..లేక చిన్న తనంలో సెక్సువల్ అబ్యూజ్ కి గురయిన వారిగానో గుర్తించగలిగే అవకాశం ఎక్కువ. సైకాలిజిస్ట్ లు ఈ పిల్లల్ని అబ్యూజ్డ్ చిల్డ్రెన్ గా గుర్తించగలరు. మారిపోతున్న సమాజాల్లో తల్లీదండ్రులు డబ్బుల సంపాదనలో మునిగి జీవితాన్ని ఉరుకుల పందెంలా చూసే క్రమంలో.., నెగ్లెక్డెడ్ చైల్డ్ హుడ్ కి నిదర్శనాలు ఈ ఇద్దరు పిల్లలు. ఆకలికి అంగాల్ని ప్రదర్శించుకుని ఆడవారు బతికే దేశాల్నుండి, పోర్నోగ్రఫీ చట్ట బద్దమై ప్రభుత్వాలకి ప్రధాన ఆదాయ మార్గాలైన దేశాల్నుండి వచ్చే పుంఖాను పుంఖాల మెటీరియల్..దాని వెనుక సాగే కోటాను కోట్ల డాలర్ బిజినెస్ మధ్యన ఈ పసి వారు జస్ట్ కన్ఫ్యూజ్డ్..నెగ్లెక్టెడ్ ఇన్నోసెంట్స్. మెదడు కణాల్లో తము కోల్పోయిన ప్రేమని పోర్నో ద్వార తృప్తి పరచుకుని అడిక్ట్ అయిపోయిన పాపం పసివాల్లు. అరుణ గారు, ఒక గంభీరమైన కవితని తెరమీదకు తెచ్చి మనముందుంచారు. కృతజ్ఞతలు.

No comments:
Post a Comment