ఏదైనా సాహసం లాంటి పనిని ఎవరైనా కంటి ఎదుట చేయగానే "ఓసోస్ ఈ మాత్రం నేను కూడా చేయగలను" అని అనుకోగలవాడు ఎవడైనా ఉంటాడా అంటే అది ఒక తెలుగు వాడు మాత్రమే. ఆ పనిని తరువాత చేయలేక చతికిల పడటం వల్లేనేమో, మన తెలుగువారికి 'ఆరంభ శూరుల'ని పేరు వచ్చింది. కానీ మనకుండే ఈ విశిష్ట లక్షణం వల్లనేనేమో తెలుగు వాడు ఎన్నో రంగాల్లో దూసుకు పోతుంటాడు. అంతర్జాలంలోని బ్లాగుల విషయంలో కూడా మన తెలుగు వారిదే ముందంజ. సాహిత్యాభిమానాన్ని ఈ బ్లాగుల ద్వారా విజయవంతంగా నిర్వహించి తెలుగు భాషని సజీవంగా నిలుప ప్రయత్నించిన ఎందరో బ్లాగరులలో సత్యసాయి కొవ్వలి గారూ ఒకరు. అయితే ఆ బ్లాగు లలో ఆయన రాసిన వ్యాసాలను ఒక సంకలనంగా ముద్రించి అంతర్జాలమనే లోకానికి దూరంగా ఉండే తెలుగు పాఠకులకోసం, సాహిత్యాభిమానులకోసం ముందుకు తీసుకువచ్చిన పుస్తకమే "నాకు తెలుగు చేసింది".
పుస్తకం పేరు పెట్టడంలోనే చమత్కారాన్ని చూపించిన సత్యసాయి గారు, పుస్తకంలోపల కూడా చమత్కారాలు చేయడనుకోవటం మన పొరపాటు. బ్లాగడం, టైపడం, టపా కట్టడం, బ్లాగాయణం, బ్లాగోపాఖ్యానం వంటి ఎన్నో సరదా పదాలు మనల్ని నవ్విస్తున్నా బ్లాగరుల కష్టనష్టాల్నీ అక్కడక్కడా మనకు అందిస్తూ సాగుతారు. ఈ పుస్తకం నిజానికి చదువుతున్నట్టుగా ఉండదు. సత్యసాయిగారు, మనమూ ఎదురెదురుగా కూర్చుని హాయిగా పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది. సరళమైన భాషలో పట్టువిడువని చమత్కారాలతో హాయిగా నవ్వుకుంటూ చదువుకునేలా ఉంటుంది. మామూలుగా మనం చదివి గుర్తుపెట్టుకోగలిగినవి చాలా తక్కువే, కానీ మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోగలిగినవే ఎక్కువ. కానీ వ్యాసాలని అలా సరదాగా చదివిస్తూ మనతో మాట్లాడగలగటం సత్యసాయిగారికే చెల్లింది. ఏదో ఒక విషయం మాత్రం మీదే కాక ఎన్నో విషయాలమీద వ్యాసాలుంటాయి. ముఖ్యంగా కొరియా కబుర్లు మనకు ఆ దేశాన్ని కంటి ముందుచుతాయి. ముంబై ముచ్చట్లతో ముంబాయి వీధుల గుండా ఓ ట్రిప్ మనతోనే వేయిస్తాడు రచయిత. శాస్త్రీయ సంగీతాన్ని అశాస్త్రీయంగా పాడటం కూడా తన వ్యాపకమే అని చమత్కారంగా చెప్పే సత్యసాయిగారు వ్యాస రచనలో మాత్రం అందె వేసిన చెయ్యి అనిపిస్తారు.
ఈ పుస్తకంలోని ఇంకో ప్రత్యేకత ఏమంటే, బ్లాగుల్లో టపా కట్టాక, ఎందరో ఔత్సాహిక పాఠకులు వారి అభిప్రాయాల్ని తెలియజేస్తుంటారు. ఇలాంటి పాఠకుల అభిప్రాయాల్లోని ముఖ్యమైన వాటినికూడా ప్రతీ వ్యాసానికీ చివర ఈ పుస్తకంలో మనకు దర్శనమిస్తాయి. బహుశా ఇదొక కొత్త వరవడి. తన వ్యాసాలకే కాక పాఠకుల అభిప్రాయాలకి కూడా పుస్తకంలో చోటు కలిగించటం నిజంగా హర్షణీయం. ఎంతటి సీరియస్ విషయాన్నయినా అలవోకగా అరటి పండు వొలచి నోట్లో పెట్టినట్టు చెప్పగల నిపుణత కలిగిన సత్యసాయిగారి "నాకు తెలుగు చేసింది" పుస్తకం, లీజర్ టైం లో సరదాగా గడుపుతూ కొంత జ్ఞానాన్ని కూడా బుట్టలో వేసుకోవాలనుకునే వారి బుక్ షెల్ఫ్ లో తప్పక ఉండవలసినది. పాఠకుడు అనేవాడు తినబోతూ రుచి అడగకూడదు కాబట్టి, ఈ పుస్తక పరిచయం నుండి పుస్తకంలోకి పోదాం.

No comments:
Post a Comment