విరించి ll ఫ్యాషన్ షో ర్యాంప్ ll
.......................................
ఆ చివరిదాకా నడిచి పోవాలంటేనే
నాకు భయం.
ఆకలిని ఆలింగనం చేసుకున్న నడుము వంపులూ
స్త్రీత్వపు సహజత్వాన్ని,
చెమట రంధ్రాలతో సహా కప్పేసే మేకప్ లూ
పొగచూరుని అద్దుకున్న కనురెప్పలూ
ప్లాస్టిక్ నవ్వల్ని పులుముకున్న పెదవులూ
ఈకలూ, టోపీలూ, బికినీలూ
సాక్స్ లూ, స్టాకింగ్ లూ
హై హీల్ చెప్పులూ, గోల్డ్ సెక్విన్ స్వెట్టర్ లూ
నావంటూ ఏవీలేని నా వంటి మీది దుస్తులూ
బలవంతపు అనోరెక్సియాలతో మిగిలిన
బలహీనపు బొమికలూ, కండలూ..
ఒక నగ్నత్వపు సిల్హట్ లాగా
ఒక కరడు గట్టిన బానిస లాగా
ఒక్క స్త్రీగా తప్ప అన్ని విధాలుగా కనిపిస్తూ..
ఫ్యాషన్ షో ర్యాంపు మీద
అడుగులో అడుగు వేసుకుంటూ
ఈ మొదలు నుండి ఆ చివరి దాకా
నడిచిపోవాలంటేనే నాకు భయం.
చర్మపు పై పొరల్ని కూడా చొచ్చుకు పోలేని కళ్ళు
నాలో అందాల్ని అమాయకంగా వెతుకుతున్నపుడు
ప్రాణ మానాలు లేని కెమెరా లెన్స్ లు
నాలో అందాల్ని అతిశయంగా పట్టుకుంటున్నపుడు
ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్యన ఎందరి కళ్ళో మెరుస్తున్నపుడు
నా మనసొక్కటే ఎందుకనో మసిబారి వుంటుంది
శ్మశానంలా పడివున్న ర్యాంప్ మీద
ఒకరి తరువాత ఒకరు కాలిపోయే
మాంసపు ముద్దలు
అందాల్ని నటిస్తున్నపుడు
నిజ జీవితపు అందాలన్నీ
శిలువెక్కిన క్రీస్తుల్లాగా ప్రవచిస్తాయి
వేసిన ప్రతి అడుగు వెనుక
మూసుకు పోయిన ద్వారాలెన్నో వెక్కిరిస్తాయి
ఖరీదయిన వలువలన్నిటినీ
ఒక అద్దం ముందు విప్పేసినపుడు
విలువల జీవితం ఒకటి నగ్నంగా
రోదిస్తూ కనిపిస్తుంటుంది
సహజంగా కనబడే ముఖమూ
అమాయకంగా కనిపించే ప్రతి అవయవమూ
అమ్ముడు పోయిన యవ్వనాన్ని
కోల్పోయిన జీవితాన్నీ
తాగిన సిగరెట్ ముక్కనీ
పీక్కుపోయిన దేహాన్నీ
ఇవన్నీ ఎందుకని ప్రశ్నిస్తాయి
కానీ అందమనే ఫ్యాక్టరీలో
శరీరాన్నీ మెదడునీ
ఫ్యాషన్ యంత్రానికి కుట్టేసుకున్న
పిడికిలెత్తని ప్రతీ శ్రామికురాలికీ తెలుసు
ఫ్యాషన్ షో ర్యాంప్ చివరి అంచే
తన చివరి మజిలీ అని.
ఎన్ని అడుగులు ముందుకు వేస్తే
అన్ని అడుగులు వెనుకకి వేయక తప్పదని.
ఆ చివరి అంచు
ఏదో ఒక రోజు కిందకు తోయక తప్పదని
అందుకే...
ఆ చివరిదాకా నడిచి పోవాలంటేనే
నాకు భయం.
12/5/15
.......................................
ఆ చివరిదాకా నడిచి పోవాలంటేనే
నాకు భయం.
ఆకలిని ఆలింగనం చేసుకున్న నడుము వంపులూ
స్త్రీత్వపు సహజత్వాన్ని,
చెమట రంధ్రాలతో సహా కప్పేసే మేకప్ లూ
పొగచూరుని అద్దుకున్న కనురెప్పలూ
ప్లాస్టిక్ నవ్వల్ని పులుముకున్న పెదవులూ
ఈకలూ, టోపీలూ, బికినీలూ
సాక్స్ లూ, స్టాకింగ్ లూ
హై హీల్ చెప్పులూ, గోల్డ్ సెక్విన్ స్వెట్టర్ లూ
నావంటూ ఏవీలేని నా వంటి మీది దుస్తులూ
బలవంతపు అనోరెక్సియాలతో మిగిలిన
బలహీనపు బొమికలూ, కండలూ..
ఒక నగ్నత్వపు సిల్హట్ లాగా
ఒక కరడు గట్టిన బానిస లాగా
ఒక్క స్త్రీగా తప్ప అన్ని విధాలుగా కనిపిస్తూ..
ఫ్యాషన్ షో ర్యాంపు మీద
అడుగులో అడుగు వేసుకుంటూ
ఈ మొదలు నుండి ఆ చివరి దాకా
నడిచిపోవాలంటేనే నాకు భయం.
చర్మపు పై పొరల్ని కూడా చొచ్చుకు పోలేని కళ్ళు
నాలో అందాల్ని అమాయకంగా వెతుకుతున్నపుడు
ప్రాణ మానాలు లేని కెమెరా లెన్స్ లు
నాలో అందాల్ని అతిశయంగా పట్టుకుంటున్నపుడు
ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్యన ఎందరి కళ్ళో మెరుస్తున్నపుడు
నా మనసొక్కటే ఎందుకనో మసిబారి వుంటుంది
శ్మశానంలా పడివున్న ర్యాంప్ మీద
ఒకరి తరువాత ఒకరు కాలిపోయే
మాంసపు ముద్దలు
అందాల్ని నటిస్తున్నపుడు
నిజ జీవితపు అందాలన్నీ
శిలువెక్కిన క్రీస్తుల్లాగా ప్రవచిస్తాయి
వేసిన ప్రతి అడుగు వెనుక
మూసుకు పోయిన ద్వారాలెన్నో వెక్కిరిస్తాయి
ఖరీదయిన వలువలన్నిటినీ
ఒక అద్దం ముందు విప్పేసినపుడు
విలువల జీవితం ఒకటి నగ్నంగా
రోదిస్తూ కనిపిస్తుంటుంది
సహజంగా కనబడే ముఖమూ
అమాయకంగా కనిపించే ప్రతి అవయవమూ
అమ్ముడు పోయిన యవ్వనాన్ని
కోల్పోయిన జీవితాన్నీ
తాగిన సిగరెట్ ముక్కనీ
పీక్కుపోయిన దేహాన్నీ
ఇవన్నీ ఎందుకని ప్రశ్నిస్తాయి
కానీ అందమనే ఫ్యాక్టరీలో
శరీరాన్నీ మెదడునీ
ఫ్యాషన్ యంత్రానికి కుట్టేసుకున్న
పిడికిలెత్తని ప్రతీ శ్రామికురాలికీ తెలుసు
ఫ్యాషన్ షో ర్యాంప్ చివరి అంచే
తన చివరి మజిలీ అని.
ఎన్ని అడుగులు ముందుకు వేస్తే
అన్ని అడుగులు వెనుకకి వేయక తప్పదని.
ఆ చివరి అంచు
ఏదో ఒక రోజు కిందకు తోయక తప్పదని
అందుకే...
ఆ చివరిదాకా నడిచి పోవాలంటేనే
నాకు భయం.
12/5/15
No comments:
Post a Comment