విరించి ll ఆన్ ది రాక్స్ (on the rocks) ll
.................................
మిత్రమా..!
కురవబోయే ఆకాశంలా నీవు
దోసిలి పట్టబోయే భూమిలా నేను
మన మధ్యన ఒక బల్లా, రెండు గిలాసలూ
ఒక మద్యం సీసా..
కొంత మామిడికాయ కారం స్టఫ్ఫూ...
అటూ ఇటూ కుర్చీల్లో
ఆకాశంలా ఒక వైపు నీవు
భూగోళం లా ఇంకో వైపు నేను
మన చుట్టూ అనంత కోటి ప్రపంచాలూ..
వాటి అంతులేనంత చెత్తా..
అదంతా వదిలించుకోవడానికే
మన కళ్ళ మధ్య పారే ఈ ఆన్ ది రాక్స్...
నీ కథ చెబుతూ నీవు
నీ కథలో నాకథ చూసుకుంటూ నేను
మధ్య మధ్య లో విషంలా
గొంతు దిగుతున్న మద్యం
కడుపులో మంటలా జ్వలిస్తున్న లోకం
బండ బూతు ఇచ్చే ఆనందంలా నాలిక మీద
నలుగుతున్న మామిడికాయ కారం
చల్...మనుషుల్నీ ప్రపంచాల్నీ అవతలకు విసిరేద్దాం
మనసులతో కాసేపు మాట్లాడుకుందాం
కొన్ని గంటల్ని కొన్ని క్షణాలుగా నలిపేద్దాం
పెట్టలేని మంటల్ని రగిలిద్దాం
ఆర్పలేని మంటల్ని ఆర్పేద్దాం
ఆనందంగా తాగే వాడొక
చుక్కల్లో చంద్రుడే కావచ్చు
బాధలో తాగేవాడు మనలా
మండుతున్న సూర్యుడే కదా...
మద్యం సీసాని చివరిదాకా తాగేద్దాం
అట్టడుగున ఇంకా రెండు కన్నీటి చుక్కలుంటాయేమో
తలకిందులుగా వొంచైనా
తలకిందులుగా వొంగైనా
ప్రతీ చుక్కనీ నాకేద్దాం
తడబడుతూ మనం వేసే అడుగుల్లో
ఈ వీధులు కూడా ప్రేమగానే పలకరిస్తాయి
బాల్యం విరబూసిన పూవులమని
ఆప్యాయంగా ఒడిలో చోటిస్తాయి.
తాగి వీధిలో పడిపోయినా, ఇంట్లో పడుకున్నా
నిన్నూ నన్ను తాకేవారెవరూ ఉండరు నేస్తం
మన మనసులతోనే మనం శ్వాసించాలి
మరుసటి రోజుకి మొదలయ్యే
భార్య ఈసడింపులూ
పిల్లల తిట్లూ
తాగని పుణ్యాత్ముల నీతి బోధలూ
మన బీదరికకాలూ
హాంగోవర్ లూ
మనం తాగి బతికి వున్నందుకుదుకు
లోకం వేసే శిక్షే బ్రదర్..
థూ..దీనమ్మ జీవితం
మనిషికీ మనసుకీ మధ్యన మద్యం
ఒక అనామక.........................(dash dash)
ఇదేమీ అందమైన కవిత కాదు
జీవితం ..మద్యం..
అలవాటుగా మారిన విషం..
పో..నీ ఇష్టం ఉన్నది రాస్కోపో..
1/5/15
.................................
మిత్రమా..!
కురవబోయే ఆకాశంలా నీవు
దోసిలి పట్టబోయే భూమిలా నేను
మన మధ్యన ఒక బల్లా, రెండు గిలాసలూ
ఒక మద్యం సీసా..
కొంత మామిడికాయ కారం స్టఫ్ఫూ...
అటూ ఇటూ కుర్చీల్లో
ఆకాశంలా ఒక వైపు నీవు
భూగోళం లా ఇంకో వైపు నేను
మన చుట్టూ అనంత కోటి ప్రపంచాలూ..
వాటి అంతులేనంత చెత్తా..
అదంతా వదిలించుకోవడానికే
మన కళ్ళ మధ్య పారే ఈ ఆన్ ది రాక్స్...
నీ కథ చెబుతూ నీవు
నీ కథలో నాకథ చూసుకుంటూ నేను
మధ్య మధ్య లో విషంలా
గొంతు దిగుతున్న మద్యం
కడుపులో మంటలా జ్వలిస్తున్న లోకం
బండ బూతు ఇచ్చే ఆనందంలా నాలిక మీద
నలుగుతున్న మామిడికాయ కారం
చల్...మనుషుల్నీ ప్రపంచాల్నీ అవతలకు విసిరేద్దాం
మనసులతో కాసేపు మాట్లాడుకుందాం
కొన్ని గంటల్ని కొన్ని క్షణాలుగా నలిపేద్దాం
పెట్టలేని మంటల్ని రగిలిద్దాం
ఆర్పలేని మంటల్ని ఆర్పేద్దాం
ఆనందంగా తాగే వాడొక
చుక్కల్లో చంద్రుడే కావచ్చు
బాధలో తాగేవాడు మనలా
మండుతున్న సూర్యుడే కదా...
మద్యం సీసాని చివరిదాకా తాగేద్దాం
అట్టడుగున ఇంకా రెండు కన్నీటి చుక్కలుంటాయేమో
తలకిందులుగా వొంచైనా
తలకిందులుగా వొంగైనా
ప్రతీ చుక్కనీ నాకేద్దాం
తడబడుతూ మనం వేసే అడుగుల్లో
ఈ వీధులు కూడా ప్రేమగానే పలకరిస్తాయి
బాల్యం విరబూసిన పూవులమని
ఆప్యాయంగా ఒడిలో చోటిస్తాయి.
తాగి వీధిలో పడిపోయినా, ఇంట్లో పడుకున్నా
నిన్నూ నన్ను తాకేవారెవరూ ఉండరు నేస్తం
మన మనసులతోనే మనం శ్వాసించాలి
మరుసటి రోజుకి మొదలయ్యే
భార్య ఈసడింపులూ
పిల్లల తిట్లూ
తాగని పుణ్యాత్ముల నీతి బోధలూ
మన బీదరికకాలూ
హాంగోవర్ లూ
మనం తాగి బతికి వున్నందుకుదుకు
లోకం వేసే శిక్షే బ్రదర్..
థూ..దీనమ్మ జీవితం
మనిషికీ మనసుకీ మధ్యన మద్యం
ఒక అనామక.........................(dash dash)
ఇదేమీ అందమైన కవిత కాదు
జీవితం ..మద్యం..
అలవాటుగా మారిన విషం..
పో..నీ ఇష్టం ఉన్నది రాస్కోపో..
1/5/15
No comments:
Post a Comment