విరించి ll హర 'గత'త్సు ll
హరోం హరోం హర
లైఫ్ లైన్ తొక్కి వస్తున్నా....
లైఫ్ ని ఫుల్లుగా తెస్తున్నా
పదాలు మోగే నా గుండెని నీ పాదమేమ్ చేస్తుందోయ్
వంతులుగా కూతల బేరమా..
నస పిట్టలా కూస్తానంటే ఒద్దంటామా...
హరోం హరోం హర
చల్ నీ సణుగుడు సణుగుడు..
చల్ చల్ నీ గొణుగుడు గొణుగుడు...
ఎడారిలో నివు రాజేసే అగ్గెంత
సముద్రంలో నివు పారించే ఉచ్చెంత
మీ తాతలు నేతులు నాకారు
మేము మీ మూతులు నాకుతాం అన్నట్టున్నది
ఆరు శాతం లేని అర్భకులు
అరవై శాతం మందిని తొక్కారా
ఇదేదో తేడా వ్యవహారమే
చప్పుడు కాక ఉప్పందించిన తప్పుడు సమాచారమే...
సహస్ర శీర్షా పురుషః
సహస్రాక్ష సహస్రపాత్
సమాజాన్ని విరాట్ పురుషుడిగా ఊహించినపుడు
వాడికి, తలేది, చేతులేవి, కాల్లేవి
అనే ప్రశ్న ఉదయించినపుడు
కవితాత్మకంగా ఉపమానాలు చెబితే
దాన్ని ఉప్పుపాతరేసి, పాతరోతలు దోసి
సొంత ఉప్పు తిని, పరాయి కప్పు చేరి
వక్ర బుద్దులు పూని, వక్ర భాష్యాలు పేని
వెటకారంగా నవ్వి వాగేస్తే
బూతని పదుగురు నవ్వి పోదురుగాక
తలకెత్తుకున్నది తలని కాదోయ్ ..పాదాల్ని
గీతదాటి చెప్పడంలేదు
గీతలోనే చెబుతా విను
బళ్ళు ఓడలవుతాయి ఓడలు బళ్ళవుతాయి
ఏదయినా బలవంతుడిదే బలహీనుడిపై చేయి
కూపస్థమండూకాలపై బ్రహ్మాస్త్రమెందుకు..?
అస్త్ర సన్యాసం చేసిన వారిపై
శస్త్ర విద్యల ప్రదర్శనలెందుకు..?
వృథా కాదా..?
లోకమంతా పచ్చగుందని అంటావెందుకు
పచ్చకామెర్ల గాగుల్స్ ఉన్నాయనేగా...
ఒకప్పటి నీ కష్టంలో
కండలై కదిలాం
ఇప్పటి నీ కష్టంలో
అండగై వుంటాం
నీ గుండెలో వుంటాం
ఏదయినా పంచుకుంటేగా తెలిసేది
ఒకసారి వెనుదిరిగి చూసుకో
నిను కదిలించింది
పెను నిద్దుర వదిలించింది
యెదల రక్తం ఎగదోసింది
వరదల వేగం అదిలించింది
పెన్ గన్ తో ప్రవచించింది
ఎవరని చూసుకో....
మేముకూడా ఉన్నాం నీతో...వెతుక్కో...
లేమంటావా.....
లేకుండానే ఇంత జనం పోగయ్యేవారా
శాంతి దూతల పర్వం కొనసాగేదా..?
ఎక్కడున్నావు బ్రొ..
శతాబ్దాల దుప్పటి కప్పుకుని..?
ఇపుడు కావాల్సింది బలిపశువుల సమాజం కాదు
బల పరువుల సమాజం
బల్ల పరుపుగ వ్యవహారం
బతుకు పండుగుల సమహారం...
రా...నా సవాల్..
కలిసి పనిచేద్దాం....కష్ట నష్టాల్ పంచుకుందం...
మన గుండెల నిండిన మన స్నేహం సాక్షిగా..
నవ సమాజం నిర్మిద్దాం..
అసమానతల్ని తరిమి కొడదాం...
హరోం హరోం హర
సణుగుడు గొణుగుడు
చెడుగుడు చెరుగుడు
వాగుడు పేలుడు ఆపేద్దం
చల్ గుడు గుడు గుడు...
హరోం హరోం హర
లైఫ్ లైన్ తొక్కి వస్తున్నా....
లైఫ్ ని ఫుల్లుగా తెస్తున్నా
పదాలు మోగే నా గుండెని నీ పాదమేమ్ చేస్తుందోయ్
వంతులుగా కూతల బేరమా..
నస పిట్టలా కూస్తానంటే ఒద్దంటామా...
హరోం హరోం హర
చల్ నీ సణుగుడు సణుగుడు..
చల్ చల్ నీ గొణుగుడు గొణుగుడు...
ఎడారిలో నివు రాజేసే అగ్గెంత
సముద్రంలో నివు పారించే ఉచ్చెంత
మీ తాతలు నేతులు నాకారు
మేము మీ మూతులు నాకుతాం అన్నట్టున్నది
ఆరు శాతం లేని అర్భకులు
అరవై శాతం మందిని తొక్కారా
ఇదేదో తేడా వ్యవహారమే
చప్పుడు కాక ఉప్పందించిన తప్పుడు సమాచారమే...
సహస్ర శీర్షా పురుషః
సహస్రాక్ష సహస్రపాత్
సమాజాన్ని విరాట్ పురుషుడిగా ఊహించినపుడు
వాడికి, తలేది, చేతులేవి, కాల్లేవి
అనే ప్రశ్న ఉదయించినపుడు
కవితాత్మకంగా ఉపమానాలు చెబితే
దాన్ని ఉప్పుపాతరేసి, పాతరోతలు దోసి
సొంత ఉప్పు తిని, పరాయి కప్పు చేరి
వక్ర బుద్దులు పూని, వక్ర భాష్యాలు పేని
వెటకారంగా నవ్వి వాగేస్తే
బూతని పదుగురు నవ్వి పోదురుగాక
తలకెత్తుకున్నది తలని కాదోయ్ ..పాదాల్ని
గీతదాటి చెప్పడంలేదు
గీతలోనే చెబుతా విను
బళ్ళు ఓడలవుతాయి ఓడలు బళ్ళవుతాయి
ఏదయినా బలవంతుడిదే బలహీనుడిపై చేయి
కూపస్థమండూకాలపై బ్రహ్మాస్త్రమెందుకు..?
అస్త్ర సన్యాసం చేసిన వారిపై
శస్త్ర విద్యల ప్రదర్శనలెందుకు..?
వృథా కాదా..?
లోకమంతా పచ్చగుందని అంటావెందుకు
పచ్చకామెర్ల గాగుల్స్ ఉన్నాయనేగా...
ఒకప్పటి నీ కష్టంలో
కండలై కదిలాం
ఇప్పటి నీ కష్టంలో
అండగై వుంటాం
నీ గుండెలో వుంటాం
ఏదయినా పంచుకుంటేగా తెలిసేది
ఒకసారి వెనుదిరిగి చూసుకో
నిను కదిలించింది
పెను నిద్దుర వదిలించింది
యెదల రక్తం ఎగదోసింది
వరదల వేగం అదిలించింది
పెన్ గన్ తో ప్రవచించింది
ఎవరని చూసుకో....
మేముకూడా ఉన్నాం నీతో...వెతుక్కో...
లేమంటావా.....
లేకుండానే ఇంత జనం పోగయ్యేవారా
శాంతి దూతల పర్వం కొనసాగేదా..?
ఎక్కడున్నావు బ్రొ..
శతాబ్దాల దుప్పటి కప్పుకుని..?
ఇపుడు కావాల్సింది బలిపశువుల సమాజం కాదు
బల పరువుల సమాజం
బల్ల పరుపుగ వ్యవహారం
బతుకు పండుగుల సమహారం...
రా...నా సవాల్..
కలిసి పనిచేద్దాం....కష్ట నష్టాల్ పంచుకుందం...
మన గుండెల నిండిన మన స్నేహం సాక్షిగా..
నవ సమాజం నిర్మిద్దాం..
అసమానతల్ని తరిమి కొడదాం...
హరోం హరోం హర
సణుగుడు గొణుగుడు
చెడుగుడు చెరుగుడు
వాగుడు పేలుడు ఆపేద్దం
చల్ గుడు గుడు గుడు...
No comments:
Post a Comment