విరించి ll మచ్చ. ll story
రాత్రి ఒంటిగంటకి కాశువాల్టీ నుండి ఫోను. "సర్ మీ ఫ్రెండు సుధీరట. అర్జంటుగా మిమ్మల్ని కలవాలంటున్నాడు". బయట కుండపోతగా వర్షం. ఈ వర్షానికి పేషంట్లే రారనుకుంటే, వాళ్ళతో పాటు బయటి బురద కూడా. కింద కాసువాలిటీ కి దిగాను. "నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను బ్రతికించు అంటాడు" . ఏమయిందిరా అని అడిగితే ఏడుపు తప్ప మాట రాదు. ఇలా కాదని ఒక ఛాయ్ తాగించి నా రూంకి తీసుకెల్లాను. కాసేపు పిచ్చి చూపులు చూసాక "ఇవాల పేపరు చూశావా?" అన్నాడు. పేపర్ లో సవా లక్ష రాస్తారు అవి చూసి ఏడుస్తామా .కొంపదీసి ఇపుడు పేపర్ చూసి ఏడవమంటాడా..? .."చూశావా?.... " గట్టిగా అడిగాడు. చూడలేదంటే చంపేసేలా ఉన్నాడు. మందేసుకొచ్చాడేమో.. చూశానని చెబితే ఏమి చూశావంటాడు..చూడలేదని చెబితే ఎందుకు చూడలేదంటాడు..అర్ధ రాత్రి ఈ ఇంటరాగేషన్ ఏంటో.."టైం దొరకలేదు" అన్నాను..తల పట్టుకుని నేలను చూస్తూ కూర్చున్నాడు. నేను వాడిని చూస్తూ...!! చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండు. సినిమాలంటే ఆసక్తి.. కథ చెప్పడంలో మహా దిట్ట. కంటిముందే చూపిస్తాడు. ఇపుడేమో కల్లు కిందికేసాడు. బయట చినుకుల హోరు. లోపల దోమల జోరు. తప్ప ప్రపంచం లో మాటలు చచ్చిపోయాయన్నంత నిశ్శబ్దం. "ఈ రోజు డిష్ట్రిక్ట్ ఎడిషన్ లో గుర్తు తెలియని ఒక అమ్మాయి శవం గురించి రాశారు. ఆమె ని చంపింది నేనే" అన్నాడు సీరియస్ గా ఎక్స్ ప్రెషన్ లేకుండా...నాకు ఫ్యూజులు ఎగిరి పోయాయి. అప్పుడే దగ్గర్లో పిడుగు పడింది. ఫ్యూజులు ఎగిరినట్టున్నాయి, కరెంటు పోయింది. వాడి ఏ ఎక్స్ ప్రెషనూ నాకు కనిపించకుండా..చీకటి తమాషాలాడుతుంది. "జోకా..?" అడిగాను. "కాదు సీరియస్..నిజంగా నిజం" అన్నాడు. ఇంతలో జనరేటర్ ఆన్ అయింది...ఏడుస్తున్నాడు..గట్టిగానే..జనరేటర్ సౌండూ, వాడి ఏడుపూ తప్ప ప్రపంచం అంతా నిదురపోతున్నట్టుంది. దగ్గరికి వెళ్ళి ఓదార్చాను. "ఏమైందిరా....!!" అని. నాకు నీ ఓదార్పు వద్దు. హెచ్ ఐ వీ టెస్ట్ చెయ్ మామా.. వెళ్ళిపోతాను అన్నాడు. "సీను సీను కీ సీటీ కొడతానులే గానీ ఏమయిందో చెప్పరా..." కొద్దిగా నవ్వాడు. అది నవ్వు అనేకన్నా ముఖంలో ఒకవైపు కనిపించే నిస్త్రాణ అనుకోవచ్చు.
"నిన్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. చూపులు కలిపింది. నవ్వింది. టైం అడిగింది..మాట కలిపింది. ఒక మాట ఒక మాట కలిపి కథ చేసింది. ఒక చినుకు ఒక చినుకు కలిపి సముద్రం చేసింది. నవ్వుల వెన్నెల్ని నా మనో ఫలకం మీద ఆరబోసింది. బస్సులొస్తున్నాయ్ ...పోతున్నాయ్..మనుషులొస్తున్నారు పోతున్నారు...కాలం ఆమె మాటలతో మరచిపోయింది. ఎవరో తెలియదు... ఎవరివని అడిగాను....అడగొద్దన్నది..ఏ ఊరన్నాను...చెప్పనన్నది...ఏం చేస్తుంటావన్నాను...తంతానన్నది...నాతో ఎందుకు మాటాడుతున్నావన్నాను ..తెలియదన్నది.. ఏం ఆశిస్తున్నావని అడగలేక పోయాను. ఏమీ లేదంటుందేమోనని..సిటీ చివర ఉన్న చిన్న బస్టాప్ అది. చిన్న మాట మాత్రమే చెప్పింది నాకు అర్థమయ్యేది..మనిషిగా బ్రతకాలనుందని. అందుకు నేనేమి చెయ్యాలని అడిగాను...మనిషిగా గుర్తించమన్నది. అక్షరాల్ని కథలుగా మలిచే నాకు, కథల్ని అక్షరాలుగా వొలిచే అమ్మాయి...పూవుల గురించి , వాటి రెక్కల గురించి, వాగుల గురించి, గుట్టల గురించి..దొంగల గురించి, దయ్యాల గురించి..కనబడిన వాటి మీద కామెంట్స్ కనపడని వాటిమీద అర్థంకాని కమిట్మెంట్స్..ఒక విషయం నుండి మరో విషయానికి.....ఒకొ సారి మౌన నిలయం..మరో సారి మాటల ప్రళయం..ఇంకో సారి అంతా లయం...ఆనందం..బాధ..కప్పేస్తూ..ముఖంలో అందం...ఎన్ని భావాలు పలికిస్తుందో ఆమె. కానీ ఆ భావాన్ని ఆస్వాదించే లోపు నక్షత్రంలా జారిపోతోంది. దూరం నుండి నక్షత్రం ఎంత చిన్నది..కానీ దగ్గరికెళ్ళి చూస్తే దానికదే మరో ప్రపంచం..మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్యపు చిక్కుదారులు..శ్రీ శ్రీ గుర్తుకొచ్చాడు.
సాయంత్రం సడెన్ గా ఎటైనా పొదామా అన్నది...ఎటు పోదామని అడిగాను. నీవే చెప్పు..నన్ను ఎటు తీసుకు వెలతావని అడిగింది...అయోమయంలో నేను. సమాధానం ఇచ్చేలోపు..అలా పంట పొలాల్లోకి అన్నది..సరేనన్నాను...ఎందుకని అడిగాను...కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. సమాధానం లేదు. "నేను ముందు పోతుంటాను..నీవు నా వెనుకే రా" అన్నది. ఆమె ముందు. నేను వెనుక. వెనుక వుండి నేను తీసుకెల్తున్నానా..? ముందు వుండి ఆమె నన్ను అనుసరిస్తుందా..? అపుడపుడూ వెనుకకి తిరిగి చూస్తోంది..నవ్వుతోంది...ముందుకి సాగిపోతోంది...చిన్న ఊరొచ్చింది..ఆమె వెంట్రుకలు పిల్లగాలికి రేగుతున్నాయి..చిన్న దారులొచ్చాయి..ఆమె నడుము అందం గా ఊగుతోంది..చిన్న కోనేరొచ్చింది...ఆమె జడ నడుం మీద ఆడుతోంది..ఊరు దాటిపోయింది..పచ్చని పంట పొలాలొచ్చాయి..ఒక గులాబీని తెంపింది....నా కిచ్చింది ..విసురుగా కొంత దూరం నడిచింది ...మళ్ళీ గులాబీని తీసేసుకుంది...కోపంగా బుంగమూతి పెట్టింది...మళ్ళీ నవ్వింది...ఒక చోట చున్నీ పరిచింది..నా ఒడిలో పడుకుంది...మళ్ళీ బరువులేని మాటలు..నన్ను తన ఒడిలో పడుకోమంది...మళ్ళీ ఎటూ తేలని మాటలు...పిచ్చిది కాదు కదా....? చీకటయ్యింది...నాతో ఒకటయ్యింది...
అపుడు మాట్లాడింది. తనకు బాల్యం లేదని. దొంగిలించబడ్డదట. ఆమె జీవితం కొందరి చేతుల్లో పావట. ఆమె ఎందరికో ఆటబొమ్మట. కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంది. తనకి ఇష్టం లేనిదంతా తన జీవితంలో నిండిందట.. చదువు లేదు. మంచం డబ్బులిచ్చింది. అందం మచ్చలనిచ్చింది. జీవితం అడగని లంచాన్నిచ్చంది. బలి పశువుని చేసింది. కడుపు ఎన్నడూ నిండలేదు. అందం తన కడుపెపడూ పండనీయదు.."తను శవమై ఒకరికి వశమై...తను పుండై ఒకడికి పండై"...అలిశెట్టి ప్రభాకర్ ఆర్తి కళ్ళ ముందు కనిపించింది. తనకి సర్వైకల్ కాన్సర్ అట. ఎక్కువ కాలం బ్రతకదట. తను శవమయ్యే వరకు తనువు ఇంకొకరి తపన తీర్చాల్సిందేనట. అందుకే ఆ కూపం నుంచి పారిపోయి వచ్చిందట. గట్టిగా నవ్వేసింది. నవ్వులో ఏడ్చేసింది. "సుధీర్ ...ఈ రోజు నేను మనిషినయ్యాను మొదటిసారి. నాకంటూ ఒక మిత్రుడున్నాడు. నా మాటలు విన్నాడు. నా అల్లరి కన్నాడు. నాతో కబుర్లు చెప్పాడు. నాకంటూ ఒక లవరున్నాడు..నా వెంట పడ్డాడు...నన్ను వెంబడించాడు... నాకు గులాబీనిచ్చాడు...నన్ను ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. నా ఒడిలో పడుకున్నాడు..నన్ను వశపరుచుకున్నాడు..నేను వశపరుచుకున్నాను...నాకంటూ జీవితం ఉందని నిరూపించావు సుధీర్....నేను నీకు ఏమివ్వగలను. ఏమిచ్చినా పోగొట్టుకుంటావు." నేనేమీ చిన్న పిల్లాడినా పోగొట్టుకోవడానికి అన్నాను. "కాలం ఏదీ మిగలనీయదు సుధీర్..అన్నీ పోవాల్సిందే" ..సడన్ గా నా చేయి తన చేతిలోకి తీసుకుని పంటితో చేయి మీద గట్టిగా కొరికింది. నొప్పయింది. రక్తం కారింది. ఏంటిదని అడిగాను. "మచ్చల నా జీవితం" అని నవ్వేసింది. "నేనెన్ని గాయాలు మోసాను, ఆ గాయాలతోనే పోతాను సుధీర్..నా కోసం ఈ ఒక్క గాయం నీవు మోయి...నీ కోసం కాదు...నాకోసం మోయి. ఇది నీకు నా శిక్ష. మీ మొగ జాతికి నా శిక్ష. నీ మీదే నా సంతోషం తీర్చుకున్నాను..నీ మీదే నా కోపం చూపించాను..నన్ను క్షమించు సుధీర్ .." అని లేచి పరిగెత్తుతూ చీకట్లో కలిసి పోయింది. నేను వెతికినా లాభం లేకపోయింది. అంతా కలలా జరిగి పోయింది".
షర్ట్ చేతుల్ని పైకి మడిచి మచ్చ చూపించాడు. సాక్షంగా. ఇది వీడల్లిన సినిమా కథ కాదని అప్పుడే నమ్మాను.
మా మధ్య మాటలు స్ట్రైక్ చేస్తున్నాయి. కరెంటొచ్చింది. జనరేటర్ సౌండు ఆగిపోయింది. పొద్దునయింది అప్పటికి.
లాబ్ తెరిచి వుంటారు అన్నాను. "వొద్దురా...ఆ అమ్మాయి మంచిది ..లోకం చెడ్డది...ఆమె నాకు ద్రోహం చేయదని నమ్ముతున్నాను". అన్నాడు.
అవును లోకం చెడ్డదని అపుడే వార్తలొస్తున్నాయి. గుర్తు తెలియని మహిళ పై పది మంది అమానుషం ..ఆపై హత్య.
మచ్చలేని సుధీర్ మనసులో ఏర్పడిన మచ్చ తన చేతి మచ్చని చిన్నదిగ చేసింది.

No comments:
Post a Comment