మతమూ, ఆధ్యాత్మికత రెండూ ఒకటేనా?.
పవిత్రతని కొంతమంది తమ హక్కుగా భావిస్తారు. తమ చేతుల్లోనే పవిత్రత అంతా ఉందనీ, తాము చెప్పిందీ చేసింది మాత్రమే పవిత్రమైనదనీ నమ్మబలుకుతారు. ఫలానాది పవిత్రమనీ, ఫలానాది అపవిత్రమనీ, అపవిత్రమైనదాన్ని పవిత్రం చేయటానికే తాము దిగివచ్చామని పలుకుతుంటారు. కానీ పురాతన మానవుడికి ఈ పవిత్రత అపవిత్రతల గోల లేదు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రకృతిని గొప్పగా, అందంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా చూసి అనుభూతి చెందే ఒక అమాయక స్వచ్ఛమైన స్థితిలో అతడున్నాడు. జీవితమే ఒక అద్భుత విషయంలా కనిపించిందతనికి. గెలుపూ ఓటముల్ని బేరీజుచేసుకుని, జీవితమొట్టి నిస్సారమైనదనీ, పనికిరాని చెత్త అనీ అనుకోవడానికి అతడికి ఎట్టి అవకాశమూ లేదు. పురాతన మానవుడు ప్రపంచంలో ఎక్కడ ఏమూలలో ఉన్నా ఇలాగే ప్రపంచాన్ని అనుభూతి చెంది వుంటాడని అతని ఆలోచనల్ని మనకు అందించే అతడి సాహిత్యం మనకు తెలియజేస్తుంది. ఈ చరాచర ప్రపంచంలో తను చూసినదాన్ని అనుభూతి చెందిన దాన్ని ఆనందంగా పాడాలని అతడు అనుకున్నాడు. అది అతని కవిత్వమయ్యింది. ఋగ్వేద ఋక్కులయినా, ఓర్ఫిక్, ఎల్యూసీనియన్ మంత్రాలయినా, అప్పటి మానవుడి ప్రపంచ దృక్కోణాన్ని అతడు ప్రపంచాన్ని అనుభూతి చెందిన విధానాన్ని తెలుపుతాయి. అతడికి ఏ మతమూ లేదు. ఏ మత అధికారీ లేడు. మనసులో స్వచ్ఛత ఉంది. మరలా మరచిపోకుండా ఉండేందుకు తన పాటలకి తానే ఒక రాగం సమకూర్చుకున్నాడు. శబ్ద సౌందర్యాన్ని పట్టి ఉంచుకునేలా దానికో ఛందస్సు ఏర్పరుచుకున్నాడు. పది మందికీ తన పాటని వినిపించుకున్నాడు. తన కవిత్వంలో తనను తాను తెలుసుకుంటూ, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, దానిలోని రహస్యాల్ని ఛేదించుకుంటూ ముందుకు సాగాడు. సృష్టిలోని అద్భుతాల్ని, ఆనందాల్ని, భయాల్నీ చూసి అదంతా ఎవరికీ అర్థంకాని ఒక దివ్య శక్తి అనీ, దైవమనీ అనుకున్నాడు. అదే అతడి అదిభౌతిక ఊహాగానాల కి నాంది అయ్యింది. అది అతడి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జీవనమయ్యింది. అప్పటిదాకా మతమన్నదేదీ లేదు.
భారతదేశంలో అలా పురాతన మానవుడు పాడినదాన్ని తరువాత వచ్చిన వారు వేదం అన్నారు. తరువాత వచ్చిన మతకారులు, అదంతా పవిత్రమన్నారు, అదంతా వారి గొప్పతనమనే చెప్పుకున్నారు. ఇంకో అడుగు ముందుకేసి దేవుడే రాసాడు అన్నారు. వేదాలు అపౌరుషేయాలని అబద్ధాలు చెప్పారు. కానీ అవి పురాతన మానవుని ఆధ్యాత్మిక అన్వేషణ, జీవిత శోధన ఫలితాలని చెప్పకుండా భగవంతుడే రాశాడని చెప్పుకున్నారు. వాటికో పవిత్రత ఆపాదించారు. వీరు చెప్పే పవిత్రత వేదాల్లో నిజంగా దాక్కుని వున్న ఆధ్యాత్మిక పసిబాలుని స్వచ్ఛత కాదు. వీరిది మత పవిత్రత. వాటిని ముట్టుకోరాదని ఎవరంటేవారు చదువుకోరాదని ఆంక్షలు పెట్టారు. భూమి మీద ఆకాశం కింద ఒక దేవుడొచ్చి ఒక విషయాన్ని ఎందుకు రాయాలి?. భగవంతుడనేవాడు ఎపుడు రాశాడు, ఎందులో రాశాడు?. రాసి ఎవరికిచ్చాడు?. ఎందుకిచ్చాడు?. సమాధానాలు హేతువుకి దొరకవు. అహేతుకమైన నమ్మకాల మీద మతాలు నిర్మింపబడతాయనే విషయం వేదానికి సంబంధించిన వివిధ వాదాలు వింటే తెలిసిపోతుంది. ఒక ఉదాహరణ చెప్పుకుందాం.
ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం
హోతారం రత్న ధాతమం
ఋగ్వేదంలో మొట్ట మొదటి ఋక్కు. "ఓ అగ్నీ..! నేను నిన్ను పూజిస్తున్నాను". అని మొదలవుతుంది. 'నేను' ఎవరు ఇక్కడ?. వేదాలు అపౌరుషేయమయితే 'నేను' అనేది ఎందుకు వస్తుంది. భగవంతుడే రాస్తే 'నేను అగ్నిని పూజిస్తున్నానని' ఎందుకంటాడు?. అక్కడ చెప్పిన 'నేను' అనేవాడు ఒక ఋషి. ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక అన్వేషకుడు. అగ్నిని ఆశ్చర్యంగా కీర్తించాడు, సూర్యుడినీ, పర్జన్యుడినీ( మేఘం ), ఉషోదయాన్నీ అద్భుత కవిత్వంతో ఊహించాడు. అతడికి కనిపించే ప్రతీదీ ఒక అద్భుతమే. ఒక దైవమే. ఈ దైవాలతనికి అతని వ్యావసాయక జీవనానికి భౌతికమైన పనులని చేసి పెట్టేవి. అప్పటికింకా దైవాలకి పూర్తి మానసిక ఆంతరంగిక పనులు అప్పగింపబడలేదనే చెప్పాలి. తరువాత వచ్చిన బ్రాహ్మణాలు ఉపనిషత్తులూ వేదిక్ దైవాలకు ఆంతరంగిక వ్యవహారాలను నియంత్రించే శక్తిని కనుగొన్నాయి. ఇదొక పరిణామ క్రమానికి మించిన ఆధ్యాత్మిక అవసరమైయ్యింది. ఉదాహరణకు విశ్వామిత్రుడు అందించిన గాయత్రీ మంత్రంలో సూర్యుడు మనిషిలోని జ్ఞానానికి అధిదేవతగా చెప్పబడటం కనిపిస్తుంది. ఈషోపనిషత్తులో సూర్యుడి పని వల్లనే జ్ఞానం ద్యోతకమౌతుందని సూర్యునికి మనిషిలోని ఆంతరంగిక చైతన్యానికీ సంబంధం ఏర్పరచటం కనిపిస్తుంది. అలాగే ఇదే ఉపనిషత్తులో అగ్నిని అన్నింటినీ పవిత్రం చేసేవాడిగా, దివ్య మార్గాన్వేషణలో ఆత్మకు అధికారిగా వివరించబడింది. వేదాలనుండి ఉపనిషత్తులకు వచ్చేసరికి ఈ పరిణామం కనిపిస్తుంది. ఇటువంటి అవసరమే మనకు గ్రీకు దేవతల విషయంలోనూ కనిపిస్తుంది. కానీ గ్రీకు దేవతలు మొదటినుంచే వారి వారి కార్యాలకు అధిష్టాన దేవతలుగా కీర్తించబడ్డారు. సన్ గాడ్ 'అపోలో' కవిత్వానికి ప్రవచనానికీ అధిష్ఠాన దేవతయ్యాడు. ఉషోదయ దేవత 'అథీనీ' జ్ఞానానికి దేవతయ్యింది.
ఇటువంటి వేదాల్ని ఒక పురాతన మానవుని నిర్మలమైన ఆధ్యాత్మిక గీతంగా అర్థం చేసుకున్న పాశ్చాత్యులు అవి అపౌరుషేయాలనో, భగవంతుని వాక్యాలనో అనుకోలేదు. ఇంకా అడవులల్లో బట్టలు లేకుండా తిరుగుతున్న కాలంలో భారతదేశంలోని పురాతన మానవుడు ఇటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఊహాగానాల్ని చేస్తూ ఎంతగా పరిణతి చెందాడోనని ఆశ్చర్య పోయారు. కానీ మత అధికారులు వేదాన్ని మతం చేయటం కనిపిస్తుంది. వైదిక ఊహగానాలు తరువాత ఉపనిషత్తులుగా, పురాణాలుగా అభివృద్ధి చెందుతూ ఎన్నో పరిణామాలకి లోనయ్యాయి. ఒక్కోసారి వేదానికి పూర్తి విరుద్ధమైన పోకడలూ పుట్టాయి. ఋగ్వేదంలో దేవాధిదేవుడిలా కీర్తించబడిన ఇంద్రుడు, రామాయణంలో రాముడిని ఇంద్రుడంతటి వాడిగా పోల్చిబడిన ఘన కీర్తి కలిగిన ఇంద్రుడు, తరువాతి పురాణాల్లో స్వర్గాధీశుడుగా చిన్న ఉద్యోగంతో సరి పెట్టుకోవలసి వచ్చింది. పైగా ఋషుల తపస్సులను భగ్నపరిచేవాడిగా, అభాండాలు మోయవలసి వచ్చింది. ఇదంతా స్థిరీకరించటానికి ఒక వ్యవస్థీకృత మతం ఏర్పడింది. దానికి కొన్ని శాస్త్రాలు ఏర్పడ్డాయి. వాటన్నిటికీ వేదమే ఆధారమని నమ్మబలికాయి. వేద బాహ్యమైనదేదీ ఉండకూడదంటూనే ఇంద్రుడినీ వరుణున్నీ పర్జన్యున్నీ చిన్న చిన్న దేవతలను చేశాయి. ఈ శాస్త్రాలిపుడు అన్నిటినీ నియంత్రిస్తాయి. వేదాల్ని దేవతల్నీ మనుషుల్నీ అందరినీ. ఇలా కాకుండా దేవుడు ఇంకో రకంగా ఉండటానికి వీల్లేదని కారు కూతలుకూస్తాయి. ఇలా కాకుండా మనిషి ఇంకోరకంగా ప్రవర్తించటానికి వీల్లేదని ప్రవచిస్తాయి. వేదమెంత విశాలమో ఈ భావాలంత సంకుచితం. వేదంలో ప్రతీదీ దైవమే. ఏకం సత్. ఇక్కడ శాస్త్రం చెప్పిందే దైవం. పైగా ఇదంతా ఆధ్యాత్మికమంటాయి. విచిత్రం. ఇందులో మతం తప్ప ఆధ్యాత్మికత ఎక్కడుంది. మనిషి తనను తాను తెలుసుకుంటూ, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అంతరాంతరాల్లోని ప్రపంచాన్నీ ఆశ్చర్యంతో చూసుకుంటూ అవగాహన చేసుకుంటూ, అనుభూతి చెందుతూ ఆధ్యాత్మిక సాహస యాత్ర చేసిన వేద ఋషుల స్ఫూర్తి ఇందులో, ఈ శాస్త్రాల మతంలో ఎక్కడుంది?. గంగిరెద్దుల్లాగా తలలూపే మనుషుల్ని తయారు చేసి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని లోపలి అన్వేషకున్నీ నిర్ధాక్షిణ్యంగా చంపేసి, స్వచ్ఛమైన ఋషి వీరులను తాయారు చేయటానికి బదులుగా సొంత పరివారజనాల్ని వెంటేసుకు తారిగే శాస్త్ర కారులు తాము ఆధ్యాత్మికతను ఎంత నలిపేస్తున్నారో తెలుసుకోగలిగే అవకాశం లేదు కాబట్టి, ఎవరికి వారీమి వేద ఋషుల స్ఫూర్తిని రగిలించుకుంటే తప్ప ఆధ్యాత్మిక శిఖరాల్ని స్పృశించలేం. అందుకు వేదాల్ని చదవాలి. అది పవిత్రమనో భగవంతుని మాటలనో చదవకూడదు. మన పూర్వీకులు రాసి దాచిపెట్టుకున్న డైరీల్లాగా వాటిని చదవాలి. జీవితంలో వారు చేసిన సాహసోపేతమైన ఆధ్యాత్మిక ఆంతరంగిక యాత్రని తెలుసుకోవటానికి వాటిని చదవాలి. మతమూ ఆధ్యాత్మికత రెండూ ఒకటి కాదని ప్రత్యక్షంగా అనుభూతి చెందటానికి ఆ నిర్మలమైన భావాల్ని ఒకసారైనా చదవాలి.
27/5/16

No comments:
Post a Comment