kitiki kavitha pai vachina vimarsha
...........................................................
జీవితం పరులకు పంచడానికి, కాకపోతే ప్రయోజనకరం కావడానికి మాత్రమేనని ఆయన చెప్పదలుచుకున్నారు. ఒక్కో ప్రతీకను తీసుకుని వాటి ప్రయోజన రాహిత్యాన్ని, ప్రయోజనకరంగా మార్చాల్సిన అవసరాన్ని చెబుతూ జీవిత ప్రయోజకత్వాన్ని కవి చెప్పాడు. పుస్తకం స్థితిని మొదటి స్టాంజాలో చెప్పిన విరించి ఆ తర్వాత ఒక్కో స్టాంజాలో ఒక్కో స్థితికారకాన్ని తీసుకుని వాటిని ప్రయోజనకరంగా మార్చాల్సిన తీరేమిటో వివరిస్తూ వెళ్లాడు. కాకి ఈకలు ఒక్క నెమలి కన్నుతోనైనా ఎగిరితే ఆనందదాయకంగా ఉంటుందని కూడా అంటాడు. రాల్చేసిన జీవితం జ్ఞాపకాల శవయాత్ర కాదంటూ వైరాగ్యాన్ని తోడుగా పంపే శ్మశానానికి ఒక్క కిటికీగానైనా మారాల్సింది అంటూ చెప్పి కవితను ముగిస్తాడు. వెలుగులు నింపడానికి కావాల్సిన ప్రతిక్రియలను ఆయన కవితలో చెబుతూ వెళ్లాడు. ఏ జీవితమైనా సరే, సమాజానికి వెలుగును ప్రసాదించాలనే ఆకాంక్షతో రాసిన కవిత. - కాసుల ప్రతాప రెడ్డి
Read more at: http://telugu.oneindia.com/sahiti/kavitha/kvisangamam-poet-virinchi-window-150068.html
-----------------------------------------------------------------------------------------------------------------------------------

!!సెలెక్టెడ్ వన్ !! విశ్లేషణ
_____________పుష్యమి సాగర్
_____________పుష్యమి సాగర్
ఈ మధ్య విరించి గారు రాసిన "ఈరోజే తెలిసింది"కవిత ను చదివాను. బాల్యం లైంగిక దాడుల్లో పడి ఎలా చచ్చిపోతుంది అన్న అంశం మీద చాలా బాగా చెప్పగలిగారు . ఈ కవిత ను రాయడానికి ప్రేరణ ఇండస్ మార్టిన్ గారు ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పడం నిజంగా గొప్ప విషయము ..నేను కూడా వారి కవిత ను చదివాను ...చాల అద్భుతం గా తెరకెక్కించారు ...వారి స్ఫూర్తి తో నే నేడు చిన్నారుల పై జరుగుతున్నా అత్యచారులను ఎండగడుతున్నారు, వారు తమ పై జరిగిన అత్యాచారాన్ని బయిటికి చేపుకోలేక దిక్కులు చూసిన అమాయకత్వాన్ని విరించి గారు మనసు ద్రవించేలా చెప్పారు
"కామానతురణం ..న లజ్జ ...న భయం " కామానికి వావి వరసలు లేని పశు ప్రవృత్తి ని వంట బట్టించుకొని ఎలా మృగం గా మారుతారో ఓ వాక్యం లో చెప్తారు ఇలా
ముందు వెనుకలు వావి వరుసలు లేని అగాధాల్లోకి//చెక్క బొమ్మగ చేసి అతడు నన్ను తోసేస్తున్నపుడు
అంతే కదా మనవాడు అనుకున్నవాడే కాటేస్తే ...? ఇంకెవరికి చెప్పాలి ...

ఉమ్మాల్సిన ఎంగిలిని తడి ఆరని నా అంగాలకు//అంగలార్చి ఆబగా అంటిస్తున్నపుడు...// మన దగ్గరి బందువులు ముద్దు చేసే నెపం తో ఎక్కడ ఎక్కడ తడి చేస్తారో కదా frown emoticon ....
మొత్తం కవితలో చిన్నతనం నుంచి ఎదిగే క్రమం లో (ముఖ్యం గా ఆడపిల్లలు ) వారికి తెలియకుండా ఎలా అన్యాయానికి బలి అవుతున్నారు ..ఎదిగే పసితనం మీద కామం పంజా ఎలా విసిరిందో ..కదా..
చిట్టి పొట్టి దుస్తుల మడతల మధ్య//
పెద్దరికపు తడులు చారలుగా ముడతలు విప్పుకుంటున్నపుడు.
పై వ్యాక్యం లో puberty నుంచి ఎదుగుతున్న క్రమం లో జరిగిన దుర్ఘటనకు బాధ్యులు ఎవరు కింది లైన్ లో నే ముడి విప్పుతారు

ఇంటికొచ్చిన పెంకులా...కిరాణా కొట్టు అంకులా//పావుసేరు మెంతులా..ప్రైవేట్ ట్యూషన్ పంతులా సో వీరి లో ఎవరో ఒకరు బలాత్కారానికి గురి చేసారు కాని ఆ విషయము చెప్పలేక పాపం దిక్కులు చూపిస్తుంది ..
//చూపుడు వేలుని ఆకాశానికి మిగిలిన వేళ్ళని పది దిక్కులకీ //
//గుంభనంగా మాడిపోయిన గాయాలే
మా అమ్మ లాలి పాటలయ్యాయి//..అవును గాయాలే పాట లు గా మారి స్వాంతన ఇస్తాయి ..తను ఇప్పుడు గాయపడిన లేడి పసి కూన

//ఈ మొగతనపు బలహీనత నా ఆడదనం మీదేనని సర్ది చెప్పుకున్న నాకు
బాల్యపు బలహీన స్వరానికి లింగ బేధం లేదని ఈనాడే తెలిసింది.//

మగవాడు ఆడతనపై నా అత్యాచారాల పాల్పడతాడ....లేదు మృగం లా మారి లింగ భేదం లేకుండా తన కోరిక తీర్చుకుంటాడు అని ఇప్పుడే తెలిసింది .అత్యాచారానికి పాల్పడటానికి కి లింగ భేదం ఉండదు ..అది మగ అయిన, ఆడ అయిన తేడ ఉండదు ...బాధ ఒక్కటే రూపం వేరు కావొచ్చు మరి పాపం పసి వాళ్ళ పై అది కూడా బలహీనుల పై అత్యాచారాలు చేస్తుంటే మనసు ప్రశ్నించకుండా ఉంటుందా ...?
//అభం శుభం తెలియని నా ముద్దల కన్నయ్య
బెంచిమీద ఒక మూలకి గూనిగా ఒదిగిపోతున్నపుడు
అటో కాలు ఇటో కాలేసి నడిస్తే దొడ్డికాళ్ళోడని గేలిచేసినపుడు
దిక్కులు చూస్తూ పిచ్చి గీతలు గీసి తిక్కలోడనిపించుకున్నపుడు
ప్రోగ్రెస్ కార్డ్ మీద ఎర్రింకు సున్నాలు వెక్కిరిస్తున్నపుడు...
కాపాడుకోలేని నా రెండు చేతుల్ని నిలువునా చీల్చేసుకోవాలని వుంది.//

పై వాక్యాలలో ఒక వేదన వున్నది ...తన పై జరిగిన దారుణాన్ని ఎవరకి చెప్పుకోలేక పిచ్చి చూపులతో ...దిక్కులు చూస్తూ ఏమి చేయ్యలక పిచ్చివాడు అన్న ముద్ర వేసుకునప్పుడు, ఈ బాధ ను ఎవ్వరికీ చెప్పుకోలేక తనను తాను నిందించుకొని చేతులను నరకాలని అనుకుంటున్నాడు నా కన్నయ్య ...పాపం నిజమే ...పెద్ద వారు అయితే చెప్పగలరు మరి చిన్న వారి స్థితి ఏంటి ...?
//తొలిపొద్దు సింధూరాలకు బలత్కార బంధువుల బాధలు
ఏకరువు పెడితే కరవు రాని ఏరులై పారుతాయని ఈరోజే తెలిసింది.//
చాల వరకు ఇలాంటి అమానుషం జరిగేది దగ్గరి బందువులు వలెనే ...మనం ఎంతో మంచివారు అనుకున్నప్పుడు వారు మరో రూపాన్ని (మృగము ) చూపించి జీవితాన్ని చిన్నా బిన్నం చెయ్యగలరు ...అదే తోలి పొద్దుకి బలాత్కార నికి గురి అయి బందువుల కు బాధలు విన్నవిస్తే కన్నీళ్ళు కూడా రావు కదా...

విరించి గారు కొత్త గా కవిత్వం రాస్తున్న వాళ్ళలో బిన్నం గా ఉండటానికి యత్నిస్తారు ..వారు తీసుకునే వస్తవు లు ..శైలి అంతా కూడా ఓ క్రమ పధ్ధతి లో సాగుతుంది ...వారు తీసుకునే వస్తవు కూడా సామాజిక అంశం తో నే ముడి పడి వుంటాయి ....వారు మరిన్ని మంచి కవితలు రాసి అలరిస్తారు అని ఆశిస్తూ ...
సెలవు
01/02/2015
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నాకు నచ్చిన కవిత.....!!!! by C.V.SURESH
A Poem by virinchi….
చూసావా నేస్తం..
సమాజాన్ని నీవొకవైపూ నేనొకవైపూ నిలబడి
చిలికితే ఎంతటి విషం ఒలికిందో....
యుగాల కొక్కాలకి గంటల గడియారాలు వ్రేలాడదీసుకుని
నోళ్ళ చివర పళ్ళూ
వేళ్ళ చివర గోళ్ళూ
ఎంతగా పదును చేసుకున్నాం..
ముఖ స్తుతి కోసం ముఖంగా మిగిలిన అస్థి పంజరాలం
చచ్చిపోయిన దేహంలో బిగిసిన పిడికిలిని విప్లవమనుకున్నాం
చిన్న మెదడు మొదళ్ళనుండి చితికినా
చితిమంటల్లో బ్రహ్మ రంధ్రం పగిలినా
అహం బ్రహ్మమని అహరహం అరిచినాం..
మానవత్వపు మేడ కింద
అడ్డొచ్చిన ప్రతీ మెడకీ కత్తులు పెట్టాం
తెలుసుకదా..
అమీబా పరిమాణమే ప్రమాణం
మనదాకా సాగిన పరిణామానికి
హైడ్రోజన్ పరమాణువే పరమార్థం
మనం పారించబోయే ప్రళయానికి
కాలపు కొండలనుండి దూకే చరిత్ర ఈనాటి వరకూ
ఒక్క మనిషిగానైనా పుట్టలేకపోయింది
సముద్ర బాల్కనీ ముక్కల్లో కరడు గట్టిన రక్తం
సరిహద్దుల కంచె మీద శిథిలాలై ఎండిపోయింది
అయినా..ఒక టేబుల్ మీద సర్దేయగల జీవితానికి
ఒక టేబుల్ కింద చుట్టేయగల మరణానికి
ఎన్ని లేబుల్స్ కట్టేసామో చూసావా...?
మనం మారే అవకాశంకోసం
మారణాయుధాలే మిగిలుంటాయేమో..
ప్రళయానంతర నిశ్శబ్దంలో
పేలని శతఘ్నులు అపుడపుడూ పేలుతుంటాయేమో...
సముద్ర తుఫానులు మనల్ని మోసుకుపోతుంటే
ఎడారి తుఫానులు మన శవాలకి సమాధులు కడతాయేమో...
ఏమో...మనమిపుడేం చేద్దాం చెప్పు...!
మన మధ్యన దూరానికి నిచ్చెన వేద్దామా లేక వారధి కడదామా!
….................................................@@@@ ...................................................
Poets are unacknowledged legislators of mankind…. Shelly
డాక్టర్ రాధేయ గారన్నట్లు..... కవిత్వ౦ మనిషి అనుభూతులపై ఆధారపడి ఉన్న కళ. . నిజమే! ఈ అద్భుతమైన మానవ స౦బ౦దాలు విర౦చి కవిత్వ౦లో.. అభివ్యక్తి. గాఢత తో కనిపిస్తు౦ది మె౦డుగా...!!!
ఎ౦దుకో తెలియదు కానీ,
విర౦చి ఒక నిర్లిప్త శూన్య౦ లో ను౦డి కొన్ని శబ్ధాలను సృష్టి౦చాలనుకొ౦టాడు. ఒక మ౦చుగా మారిన నదిలో కొన్ని ప్రవాహాలను ప్రవహి౦ప చేయగలనన్న ధీమా అతనిది... విచలిత మనసుల్లో ను౦డి కాసి౦త ప్రేమనో, అనురాగాన్నో తోడుకోవాలనుకొ౦టాడు.. మానవ స౦బ౦దాలను సునిశితమైన తివాచిపై నడిపి౦చాలనే తపన అతనిది. కవిత్వమనేది బ౦ధాలను ఛేది౦చుకొని ఏటవాలుగా పడే కిరణాల గు౦డా ప్రవహి౦చేదే అ౦టాడు. హిపోక్రసి అనుబ౦ధాలను అక్షరాలతో తునాతునకలు చేసే ఒక మారణాయుధాన్ని కవిత్వ౦ లొ ని౦పే మనస్థత్వ౦ అతనిది. ఒక తర్క౦ ఒక తత్వ౦ .. ! క్రొత్త ఫిలాసఫి కి తెర లేపుతాడు.. కవిత్వ౦ అ౦తా చిక్కగా అల్లుతాడు.. ఒక్కొ చోట మానవత్వపు పరిమళాన్ని.. మరోచోట అతని అ౦తర౦గ ఘోషని , ఇ౦కో చోట కొ౦త తడిని.. కొ౦త నిర్లిప్తతను.. అద్దుతాడు. ఒక యూనీక్ కవిత్వ౦ అతనిది..

కవిత్వమ౦టేనే పదాల పొదుపు. పొదుపుగా వాడే పదాల్లో అ౦చనాలను మి౦చిన అర్థాలను ఇమిడి౦ప చేయడ౦. జీవితాన్ని అలా ఉ౦డగా చుట్టి ఒక్క క్షణ౦లో మాయ౦ చేస్తాడు. మరో క్షణ౦లో సృష్టి౦చే మ్యజిషియన్..! ఈ వాఖ్యలు చదివిన మరుక్షణమే.... పాటకుడికి " అ౦తేకదా? జీవిత౦" అని నిర్వేదపు ఛాయలను అక్షరాల ను౦డి తోడుకొ౦టాడు.. ఎలా హిపోక్రసి నడ్డుపెట్టుకొని జీవితాన్ని నటిస్తున్నాడో? అని అర్థ౦ చెప్తాడు.. విరి౦చి..!

చచ్చిపోయిన దేహంలో బిగిసిన పిడికిలిని విప్లవమనుకున్నాం//
ఎ౦త బేలతనమో కదా మనిషిది ? అని అనుకొనే లోగానే, హిపోక్రసిని తునాతునకలు చేసే అర్థమేదో మనసులో జొరబడుతు౦ది. ఇ౦తలో వేదా౦త ధోరణి లీలగా కనిపిస్తు౦ది.. ఆ పదాల్లోనే తత్వాన్ని చూడగల౦.. పదల దగ్గర నిలబడి వాటితో మాట్లాడాలనిపిస్తు౦ది. వాటిని జాలిగానో ప్రేమగానో.. తల నిమర బుద్దవుతు౦ది.. అద్భుత మైన ఫిలాసఫి పిల్ల తెమ్మెరలా ఆ పదాలపై వీస్తు౦ది. పదాల్లో కొన్ని వేల అర్థాలను వెతుక్కొనేలా చేస్తాడు విర౦చి...
కవి లోని భావాలను, ఆవేశాలను... ఆలోచనలను ఒక క౦ప్రెస్డ్ ఫార్మ్ లో పాటకునికి అ౦ది౦చేది కవిత్వ౦. కవిత్వాని కు౦డవలసిన బేసిక్ స్ట్రక్చర్ ఇమాజినరి...పదాల కలియక.. మరియు బాష..! ఇవన్నీ విర౦చి కవిత్వ౦లో మన౦ ఏరుకొవచ్చు..
ఒక స్నేహితుడితో స౦బాషణలాగా సాగే ఈ కవిత లో.....జీవిత మర్మాన్ని అతి పొయటిక్ గా చెప్పుకొ౦టూ వెళ్తాడు. నీవనుకొ౦టూ భ్రమిస్తూ, ఉరకలేస్తూ ఎక్కడో మునిగి ఐహిక సుఖాల్లొ మునిగి తేలుతున్నావేమో? అది కాదు.. అ౦తా ఒక బ్రమ అని లోతైన తత్వాన్ని వెల్లడి౦చేది కవిత...!
ఏదో పాటకుడికి తెలియని దేదో చెప్పాలాన్న తపన విర౦చిది.. !
తెలుసుకదా..
అమీబా పరిమాణమే ప్రమాణం
మనదాకా సాగిన పరిణామానికి
హైడ్రోజన్ పరమాణువే పరమార్థం
మనం పారించబోయే ప్రళయానికి
కాలపు కొండలనుండి దూకే చరిత్ర ఈనాటి వరకూ
ఒక్క మనిషిగానైనా పుట్టలేకపోయింది
ఏకకణ జీవిగా పుట్టి .. పరిమాణ క్రమ౦లో మనిషిగా పుట్టిన మనము.. చివరకు అణుబా౦బు విస్పోటాల లో ముగిసిపోవాల్సి౦దే.. అని అద్భుత మ్యూజికల్ ఫార్మ్ అ౦డ్ సౌ౦డ్ లో రిథమిక్ గా చెప్పడ0 విశేష0, చరిత్ర మొత్త౦ తరచి చూసినా... మనిషి తత్త్వమే కనిపి౦చలేదన్న అర్థాన్ని చాలా లోతైనా భావనలో వివరి౦చాడు.. ఒక్కొ స్టా౦జా లో ఒక్కో రకమైన ఫిలాసఫి ని తెర పైకి తెస్తాడు. ఆయన తన పదాలకు గొ౦తుక నిస్తాడు.. పాటకునితో వాటినే మాట్లాడమ౦టాడు..!

ఏమో!!!!
ఒక క౦ప్లీట్ డిఫరె0ట్ ఫార్మాట్.. అ౦త నిర్లిప్తతను .. జీవిత౦ ఏమి లేదు అ౦తా క్షణిక కాలమే అని చెప్తూ వచ్చా విర౦చి .. ఇక్కడ ఇ౦కో క్రొత్త తనానికి నా౦ధి పలుకుతాడూ.. "మన౦ మారే అవకాశ౦కోస౦" అనే పద౦ మళ్ళీ ఆశావాదాన్ని.. చైతన్యతత్వాన్ని.. ప్రొగ్రెసివ్ థాట్ ను పాటకుడికి అ౦దిస్తాయి.. అయితె,... వె0టనే.. ఇ౦కేదో ఫిలాసఫి.. మళ్ళా విధ్య్వ౦సపుా చర్యలనే ప్రస్తావిస్తాడు. ఇక్కడ నేను కవినే అడిగి తెలుసుకోవాలనుకొ౦టున్నాను..! ఒక క్రొత్త అర్థాన్ని వెతికిస్తాడెమో చూడాలి.. !
చివరగా.... మళ్ళా ఒక ప్రశ్నను పాటకుడికి వదులుతాడు..
"మనమిపుడేం చేద్దాం చెప్పు...!
మన మధ్యన దూరానికి నిచ్చెన వేద్దామా లేక వారధి కడదామా!" వాహ్! మనుషుల మధ్య దూరాలు సృష్టి౦చే హలాహలాన్ని మొదటి స్టా౦జాలో చెప్పి. ... చివరగా... ఇన్ని చెప్పాను కదా... ఏదో ఒక విధ౦గా మన౦ కలిసి పొదా౦.. మనిషిగా మిగులుతా౦ ! అనే స్లొగన్ ను అ౦తర్లీన౦గా ప౦పుతాడు. ఇ౦కో రక౦గా ప్రప౦చ పట౦పై .. దేశాల మద్య పెరుగుతున్న దూరాలతో వైషమ్యాలతో జరుగుతున్న నష్టాలను కూడా సృజి౦చాడేమో? ఒక అర్థవ౦తమైన పొయమ్. ఎక్కడ ప్రార౦భి౦చబడి౦దొ... అక్కడే అ౦త౦ చేశాడు... మ౦చి పొయమ్!!!
@ సి.వి. సురేష్

No comments:
Post a Comment