విరించి ll ఒకే పదం ll
.............................
నడి సముద్రంలో
అలకీ అలకీ మధ్యన
ప్రాణం ఊగిసలాడుతున్నపుడు
నీటి మీద తేలాడే నీ ప్రతిబింబం
నీకొక దయ్యంలా కనిపిస్తుంటుంది
ప్రాణాల్ని పీక్కు తింటూ
పెరిగి పెద్దదౌతుంటుంది
.............................
నడి సముద్రంలో
అలకీ అలకీ మధ్యన
ప్రాణం ఊగిసలాడుతున్నపుడు
నీటి మీద తేలాడే నీ ప్రతిబింబం
నీకొక దయ్యంలా కనిపిస్తుంటుంది
ప్రాణాల్ని పీక్కు తింటూ
పెరిగి పెద్దదౌతుంటుంది
చిమ్మ చీకటిలో
అడుగుకీ అడుగుకీ మధ్యన
నేలమీద పాకే దూరం
కొన్ని కిలో మీటర్లనిపిస్తుంటుంది
చీకట్లలోకి మాయమైపోయిన నీ నీడ
ఒక దేవతలా అనిపిస్తుంటుంది.
చిన్న వెలుగు రేఖని తోడు తీసుకుని
ప్రత్యక్షమైతే మొక్కాలనుంటుంది
అడుగుకీ అడుగుకీ మధ్యన
నేలమీద పాకే దూరం
కొన్ని కిలో మీటర్లనిపిస్తుంటుంది
చీకట్లలోకి మాయమైపోయిన నీ నీడ
ఒక దేవతలా అనిపిస్తుంటుంది.
చిన్న వెలుగు రేఖని తోడు తీసుకుని
ప్రత్యక్షమైతే మొక్కాలనుంటుంది
జన సమూహాల్లో
మనిషికీ మనిషికీ మధ్య
సారూప్యాన్ని గమనిస్తున్నపుడు
ప్రతి చిన్న భేదం పెద్దదిగా కనిపిస్తుంటుంది
భేదమనే సారూప్యమొక్కటే తెలుసుకున్నపుడు
ఒకేలా ఉండే మనుషులే లేరనిపిస్తుంది.
మనిషికీ మనిషికీ మధ్య
సారూప్యాన్ని గమనిస్తున్నపుడు
ప్రతి చిన్న భేదం పెద్దదిగా కనిపిస్తుంటుంది
భేదమనే సారూప్యమొక్కటే తెలుసుకున్నపుడు
ఒకేలా ఉండే మనుషులే లేరనిపిస్తుంది.
ఒంటరి తనంలో
మౌనానికీ మౌనానికీ మధ్య
కొన్ని మాటలు పెల్లుబికుతున్నపుడు
ప్రతి మాట కూడా మౌనంగానే వినిపిస్తుంటుంది
మౌనానికి మాటలు ప్రతిరూపాలనిపిస్తుంది.
మౌనానికీ మౌనానికీ మధ్య
కొన్ని మాటలు పెల్లుబికుతున్నపుడు
ప్రతి మాట కూడా మౌనంగానే వినిపిస్తుంటుంది
మౌనానికి మాటలు ప్రతిరూపాలనిపిస్తుంది.
కవితలో
పదానికీ పదానికీ మధ్య
భావాల్ని పేరుస్తున్నపుడు
ప్రతి పదమూ ఒక కవితలా అనిపిస్తుంటుంది
అక్షరాల్లో అర్థాల్ని నింపుకున్న ఒక కవిత
ఒకే పదంలా కనిపిస్తుంటుంది.
పదానికీ పదానికీ మధ్య
భావాల్ని పేరుస్తున్నపుడు
ప్రతి పదమూ ఒక కవితలా అనిపిస్తుంటుంది
అక్షరాల్లో అర్థాల్ని నింపుకున్న ఒక కవిత
ఒకే పదంలా కనిపిస్తుంటుంది.
6/4/15
No comments:
Post a Comment