విరించి ll equality condemned ll
.......................................
వాళ్ళంటారు
ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు
శిఖరం ఎక్కేటపుడు వీపుమీద మోసిన బ్యాగ్ లో
సానిటరీ ప్యాడ్స్ కూడా ఉంటాయని
వాళ్ళంటారు
యుద్ధంలో శత్రువు తో పోరాడినందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు
బుల్లెట్ తగిలిన గాయం నుంచి మాత్రమే
రక్తస్రావం జరగలేదని
వాళ్ళంటారు
చదువుల్లో రాంకులు సాధించినందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ,వాళ్ళకు తెలియదు
చదవించటంలో వివక్షతని చూసినప్పుడల్లా
చీకటిలో మౌనంగా కన్నీరొలికేదని
వాళ్ళంటారు
బస్సులు విమానాలు నడుపుతున్నందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు
డ్యూటీలో చంటి పిల్లలు గుర్తొచ్చినపుడుల్లా
స్థనాలు రెండూ బరువెక్కుతాయని
వాళ్ళంటారు
ఉద్యోగాల్లో క్రీడల్లో ముందున్నందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు
బయటివారి చూపుల అవమానాలకి
భర్తగారి అనుమానాలేమీ తీసిపోవని
వాళ్ళంటారు
మనసుకు నచ్చినవాణ్ణే చేసుకున్నందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకి తెలియదు
పదో సారి ప్రదర్శన గొర్రె గా నిలబడటానికి
ఫోటో షాప్ చేసిన చిత్తరువే కారణమయిందని
వాళ్ళంటారు
ప్రేమనేదాన్ని వ్యక్త పరుస్తున్నందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు
యాసిడ్ లో కాలిన చర్మపు తొడుగుల కింద
జీవచ్చవం కూడా బతికుండొచ్చని
వాళ్ళంటారు
సైన్స్ చదివిన మోడెర్న్ హ్యుమన్ అయినందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకి తెలియదు
ముట్టినవన్నీ పసుపు నీళ్ళతో కడుగుతున్నపుడు
అనామకంగా నా కళ్ళు నేలని చూస్తుంటాయని
కానీ సగ భూభాగంలో నాతోపాటు సహజీవనం చేసే ఓ మగవాడా...!!
నెల నెలా నా కడుపులో గుండ్రాళ్ళలా పేగులు పరిగెత్తినపుడు
పూజలకూ కార్యాలకూ ప్రిమోల్టన్ మాత్రలు ముందుగానే మింగినపుడు
oc pills తెరల మాటున శరీరాన్నొక మోతమోగించినపుడు
అద్దంలోని ప్రతిబింబం బలవంతపు అబార్షన్ తో కడుపులో ముక్కలైనపుడు
పది తలల రావణుడు నిర్భయంగా ఇరవై చేతులై నను చిదిమేసినపుడు
ఇల్లనే రంగస్థలం మీద పది పాత్రల్ని స్వకాయ ప్రవేశం చేసుకున్నపుడు
నవమాసాలు కనిపించని నా కాళ్ళని రెండు చిట్టి చేతులు తాకుతున్నపుడు
వేల కత్తులు పొత్తిళ్ళలో గుచ్చినట్టుండే పురిటినొప్పిని చేతి పిడికిలిలో బంధించినపుడు
ముర్రు పాలు పంచుతున్న సమయాన మురిపాలకోసం ఒకడు కాచుకున్నపుడు...
అపుడు...అదిగో సరిగ్గా అపుడు
స్త్రీత్వం నా వొంటినిండా పులుముకున్నపుడు
ఆ గర్వం మనసునిండా పొంగుతున్నపుడు
తల పైకెత్తి, నీ గల్లా పట్టుకుని అడగాలని వుంటుంది
"నేను నీతో ఎట్టా సమానం రా....!!!?" అని.
6/3/15

No comments:
Post a Comment