విరించి ll prostitute ll
...................................
ఆ గదిలో
ఆత్రంగా అల్లుకునే వొళ్ళు విరుపులు
మౌనంగా రోదించే కొన్ని అరుపులు
అభావంగా పలకరించే ఆ గది కప్పు కింద
భావప్రాప్తిని మించిన ముభావంతో
కొన్ని నీడలు ఎక్కి దిగుతుంటాయి
దిండ్ల గలేబులు మాటిమాటికీ
బిగిసి జారుతుంటాయి
గచ్చు నేలమీద కడుపులు కాలుతున్నప్పుడు
ఆ వెలుగుల్లో..
కొన్ని ఊరటలు నాట్యం చేస్తుంటాయి
స్పందనలుడిన దారుల్లో చీకట్లు కారుతున్నప్పుడు
ఆ ఇరుకు సందుల్లో..
కొన్ని ముళ్ళ మూటలు బరువులు దించుకుంటాయి
అందుకేనేమో..
అలవాటుగా పంటి వెనుక వినిపించే నవ్వులు..
గ్రహపాటుగా గుండె వెనుక మాయమయ్యే మాటలు..
చేష్టలుడిగిన గట్లమీద
చెదురు మదురుగా చెలరేగే అలలు..
ఒక్కొక్కరుగా
కొన్ని ఖాళీ నిమిషాల్ని అప్పుడప్పుడూ విసిరేస్తూ...
నీడల్ని చూస్తూ నేను
కళ్ళ జీరల్ని చల్లారుస్తూ వాళ్ళు
గుల్కన్ అంతా జుర్రుకుని
గోడకి ఉమ్మేసిన స్వీట్ పాన్ లా మరకనైనపుడు
అనిపిస్తుంటుంది..
ఆకలి తీరిందెవరికి
ఆకలి మిగిలిందెవరికని...
16/2/15
...................................
ఆ గదిలో
ఆత్రంగా అల్లుకునే వొళ్ళు విరుపులు
మౌనంగా రోదించే కొన్ని అరుపులు
అభావంగా పలకరించే ఆ గది కప్పు కింద
భావప్రాప్తిని మించిన ముభావంతో
కొన్ని నీడలు ఎక్కి దిగుతుంటాయి
దిండ్ల గలేబులు మాటిమాటికీ
బిగిసి జారుతుంటాయి
గచ్చు నేలమీద కడుపులు కాలుతున్నప్పుడు
ఆ వెలుగుల్లో..
కొన్ని ఊరటలు నాట్యం చేస్తుంటాయి
స్పందనలుడిన దారుల్లో చీకట్లు కారుతున్నప్పుడు
ఆ ఇరుకు సందుల్లో..
కొన్ని ముళ్ళ మూటలు బరువులు దించుకుంటాయి
అందుకేనేమో..
అలవాటుగా పంటి వెనుక వినిపించే నవ్వులు..
గ్రహపాటుగా గుండె వెనుక మాయమయ్యే మాటలు..
చేష్టలుడిగిన గట్లమీద
చెదురు మదురుగా చెలరేగే అలలు..
ఒక్కొక్కరుగా
కొన్ని ఖాళీ నిమిషాల్ని అప్పుడప్పుడూ విసిరేస్తూ...
నీడల్ని చూస్తూ నేను
కళ్ళ జీరల్ని చల్లారుస్తూ వాళ్ళు
గుల్కన్ అంతా జుర్రుకుని
గోడకి ఉమ్మేసిన స్వీట్ పాన్ లా మరకనైనపుడు
అనిపిస్తుంటుంది..
ఆకలి తీరిందెవరికి
ఆకలి మిగిలిందెవరికని...
16/2/15
No comments:
Post a Comment