విరించి ll మహా నగరం ll
.............................................
ఈ మహానగర నడి బొడ్డున
ఉరికంబాల్లా నిలబడిన ట్రాఫిక్ లైట్లముందు
సజీవ శవాలన్నీ వరుసగా నిలబడుతుంటాయి.
జీవ సంజ్ఞ ఒకటి కనబడగానే
పిండపు మెతుకులు దొరికిన కాకుల్లాగా
చెరోదిక్కుకి ఎగిరిపోతుంటాయి.
ఈ మహానగర శివార్లలో
రేడియం పూస్తేగానీ తెలియని ట్రాఫిక్ గుర్తుల్లాగా
సమాధులు మౌనంగా నిలబడి ఉంటాయి
ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో
కొంత ఆగి చూసి పొమ్మంటుంటాయి
ఈ మహానగర నడివీధుల్లో
నల్లటి రహదారుల మీద
రకరకాల నీడలు ఒకదానిపై ఒకటి
దొర్లి జారి పోతుంటాయి
నీడల్లో మాత్రమే కలిసే మనుషులకు
కనిపించని అడ్డు గోడలు దారి చూపుతుంటాయి.
ఇక్కడ ఆకాశ హార్మ్యాలే పర్వతాలు
నల్లటి తారు రోడ్లే సముద్రాలు
మురికి తూ ములు, పొంగిపొరలే జీవనదులు
సూర్యుడూ, ఆకాశం, చెట్లూ ఇక్కడ
విసిరి పారేసిన చెత్త పేపర్లు
కాకులూ, పిట్టలూ, కుక్కలూ, పిల్లులూ ఇక్కడ
ప్రకృతిలోని అణగారిన వర్గాలు
ప్రపంచమనే బయోలాజికల్ జంగల్ లో
ఈ నగరమొక కాడవారిక్ జంగల్
ప్రపంచమనే గోడమీది పటంలో
ఈ నగరమొక చెదిరి పోయిన చెమట చుక్క
పక్షుల్లా విహంగాలు
పాముల్లా రైళ్ళూ
చీమల్లా వాహనాలు
అలుపెరుగక తిరిగే ఈ మహానగరం
మనిషనే ఒక ఎక్సిస్టెన్షియల్ డైనోసార్
కట్టుకున్న స్టీవెన్స్పిల్బర్గ్ జురాసిక్ పార్క్
జీవితం ఒక ఆకస్మిక ఘటనైతే
ఆక్సిడెంట్ ఇక్కడొక
స్వేచ్చాయుత హత్య మరియు ఆత్మహత్య
జీవితం ఒక అనుచిత నటనైతే
వంచన ఇక్కడొక
అధిభౌతిక సత్యం మరియు మిథ్య.
25/3/15
.............................................
ఈ మహానగర నడి బొడ్డున
ఉరికంబాల్లా నిలబడిన ట్రాఫిక్ లైట్లముందు
సజీవ శవాలన్నీ వరుసగా నిలబడుతుంటాయి.
జీవ సంజ్ఞ ఒకటి కనబడగానే
పిండపు మెతుకులు దొరికిన కాకుల్లాగా
చెరోదిక్కుకి ఎగిరిపోతుంటాయి.
ఈ మహానగర శివార్లలో
రేడియం పూస్తేగానీ తెలియని ట్రాఫిక్ గుర్తుల్లాగా
సమాధులు మౌనంగా నిలబడి ఉంటాయి
ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో
కొంత ఆగి చూసి పొమ్మంటుంటాయి
ఈ మహానగర నడివీధుల్లో
నల్లటి రహదారుల మీద
రకరకాల నీడలు ఒకదానిపై ఒకటి
దొర్లి జారి పోతుంటాయి
నీడల్లో మాత్రమే కలిసే మనుషులకు
కనిపించని అడ్డు గోడలు దారి చూపుతుంటాయి.
ఇక్కడ ఆకాశ హార్మ్యాలే పర్వతాలు
నల్లటి తారు రోడ్లే సముద్రాలు
మురికి తూ ములు, పొంగిపొరలే జీవనదులు
సూర్యుడూ, ఆకాశం, చెట్లూ ఇక్కడ
విసిరి పారేసిన చెత్త పేపర్లు
కాకులూ, పిట్టలూ, కుక్కలూ, పిల్లులూ ఇక్కడ
ప్రకృతిలోని అణగారిన వర్గాలు
ప్రపంచమనే బయోలాజికల్ జంగల్ లో
ఈ నగరమొక కాడవారిక్ జంగల్
ప్రపంచమనే గోడమీది పటంలో
ఈ నగరమొక చెదిరి పోయిన చెమట చుక్క
పక్షుల్లా విహంగాలు
పాముల్లా రైళ్ళూ
చీమల్లా వాహనాలు
అలుపెరుగక తిరిగే ఈ మహానగరం
మనిషనే ఒక ఎక్సిస్టెన్షియల్ డైనోసార్
కట్టుకున్న స్టీవెన్స్పిల్బర్గ్ జురాసిక్ పార్క్
జీవితం ఒక ఆకస్మిక ఘటనైతే
ఆక్సిడెంట్ ఇక్కడొక
స్వేచ్చాయుత హత్య మరియు ఆత్మహత్య
జీవితం ఒక అనుచిత నటనైతే
వంచన ఇక్కడొక
అధిభౌతిక సత్యం మరియు మిథ్య.
25/3/15
No comments:
Post a Comment