విరించి ll మనం ll
............................................
కనులముందు నిరంతరం కదిలిపోయే
వేల పగటి చిత్రాలకన్నా
మౌనంగా నిలబడిపోయిన ఒక్క రాతిరిలో
నక్షత్రాల్ని లెక్కిస్తూ ఆనంద పడిపోతాం
మొరటుగా తాకే కౌగిలి గ్రీష్మాల్లో
చెమటలై అలసిపోయేకన్నా
మన చలి పెదవులకు తాళాలు బిగించి
గంటల్ని దుప్పటిలా కప్పేసుకుంటాం
విరహంతో రగిలి పోయే పగటి కలల్లో
ప్రణయాలెంత పరవళ్ళు తొక్కినా
గాఢ నిద్రలో మనం కలుసుకున్న పిచ్చి కలను
జీవితమంతా నెమరేసుకుంటాం
అలవాటుగా మార్చుకున్న జీవితంలో
నెరవేరాల్సినవేవీ కనబడకున్నా
గుడ్డిగా మిగిలిపోయిన చివరి మలుపులో
కనపడనివాటి కోసం వెతుకుతుంటాం
జీవితమంటే ఇంతేకదా..
నవ్వుకీ అనందానికీ పెద్ద తేడా లేదనుకునే మనం
ఆనందాన్ని నటించలేమని తెలుసుకున్నపుడు
అలవోకగా ఓ నవ్వు నవ్వేస్తుంటాం.
25/2/15
............................................
కనులముందు నిరంతరం కదిలిపోయే
వేల పగటి చిత్రాలకన్నా
మౌనంగా నిలబడిపోయిన ఒక్క రాతిరిలో
నక్షత్రాల్ని లెక్కిస్తూ ఆనంద పడిపోతాం
మొరటుగా తాకే కౌగిలి గ్రీష్మాల్లో
చెమటలై అలసిపోయేకన్నా
మన చలి పెదవులకు తాళాలు బిగించి
గంటల్ని దుప్పటిలా కప్పేసుకుంటాం
విరహంతో రగిలి పోయే పగటి కలల్లో
ప్రణయాలెంత పరవళ్ళు తొక్కినా
గాఢ నిద్రలో మనం కలుసుకున్న పిచ్చి కలను
జీవితమంతా నెమరేసుకుంటాం
అలవాటుగా మార్చుకున్న జీవితంలో
నెరవేరాల్సినవేవీ కనబడకున్నా
గుడ్డిగా మిగిలిపోయిన చివరి మలుపులో
కనపడనివాటి కోసం వెతుకుతుంటాం
జీవితమంటే ఇంతేకదా..
నవ్వుకీ అనందానికీ పెద్ద తేడా లేదనుకునే మనం
ఆనందాన్ని నటించలేమని తెలుసుకున్నపుడు
అలవోకగా ఓ నవ్వు నవ్వేస్తుంటాం.
25/2/15
No comments:
Post a Comment