విరించి ll అజ్ఞాత అవశేషం ll
................................................
సముద్రపు అలలు నీ పాదాన్ని తాకినపుడు
అజ్ఞాతంగా మిగిలిపోయేదేంటో తెలుసా..
కొంత నురగ, కొంత ఇసుక
పారిన నీరు ఎప్పటికీ నిలవదు
కాసింత తడి తప్ప
అక్కడ ఇక నీ పాదం కూడా నిలబడలేదు
పాదపు గుర్తు తప్ప
చలిగాలి తెమ్మెర నీ వొంటిని తాకినపుడు
అజ్ఞాతంగా మిగిలి పోయేదేంటో తెలుసా..
కొంత చెమట, కొంత చలువ
వీచిన గాలి ఎన్నటికీ నిలవదు
కాసింత ప్రాణం తప్ప
అక్కడ ఇక నీ వొళ్ళు కూడా నిలబడలేదు
వొంటి పరిమళం తప్ప
పున్నమి వెన్నెల నీ మనసును తాకినపుడు
అజ్ఞాతంగా మిగిలిపోయేదేంటో తెలుసా..
కొంత వెలుగు, కొంత చీకటి
కాచిన చంద్రుడు ఎప్పటికీ నిలవడు
కలువ కన్నుల్లో తప్ప
అక్కడ నీ మనసు కూడా నిలబడలేదు
మనసులోని భారం తప్ప.
ఒక జీవితం మన రోజుల్ని ఆక్రమించినపుడు
అజ్ఞాతంగా మిగిలి పోయేదేంటో తెలుసా..
ఒక నీవు, ఒక నేను.
ప్రవహించే జీవితం ఎన్నటికీ ఆగదు
కొన్ని జ్ఞాపకాలు తప్ప
అక్కడ మనమిద్దరమూ కూడా నిలబడలేము
సమాధుల మీది పేరుగా తప్ప.
24/3/15
................................................
సముద్రపు అలలు నీ పాదాన్ని తాకినపుడు
అజ్ఞాతంగా మిగిలిపోయేదేంటో తెలుసా..
కొంత నురగ, కొంత ఇసుక
పారిన నీరు ఎప్పటికీ నిలవదు
కాసింత తడి తప్ప
అక్కడ ఇక నీ పాదం కూడా నిలబడలేదు
పాదపు గుర్తు తప్ప
చలిగాలి తెమ్మెర నీ వొంటిని తాకినపుడు
అజ్ఞాతంగా మిగిలి పోయేదేంటో తెలుసా..
కొంత చెమట, కొంత చలువ
వీచిన గాలి ఎన్నటికీ నిలవదు
కాసింత ప్రాణం తప్ప
అక్కడ ఇక నీ వొళ్ళు కూడా నిలబడలేదు
వొంటి పరిమళం తప్ప
పున్నమి వెన్నెల నీ మనసును తాకినపుడు
అజ్ఞాతంగా మిగిలిపోయేదేంటో తెలుసా..
కొంత వెలుగు, కొంత చీకటి
కాచిన చంద్రుడు ఎప్పటికీ నిలవడు
కలువ కన్నుల్లో తప్ప
అక్కడ నీ మనసు కూడా నిలబడలేదు
మనసులోని భారం తప్ప.
ఒక జీవితం మన రోజుల్ని ఆక్రమించినపుడు
అజ్ఞాతంగా మిగిలి పోయేదేంటో తెలుసా..
ఒక నీవు, ఒక నేను.
ప్రవహించే జీవితం ఎన్నటికీ ఆగదు
కొన్ని జ్ఞాపకాలు తప్ప
అక్కడ మనమిద్దరమూ కూడా నిలబడలేము
సమాధుల మీది పేరుగా తప్ప.
24/3/15
No comments:
Post a Comment