విరించి ll బండి రా ll
............................
అతడెంత పిచ్చి వాడంటే..
విప్లవం తీసుకొస్తానంటూ
పూవుల్ని అమ్ముకుంటాడు
వేల నాలికల్ని ఒడిలో ఉంచుకుని
ఒక్క నాలికతో కేకలేస్తుంటాడు
తెలిసిన నగర వీధుల మీదుగా
కనీ విని ఎరుగని కొత్తవ్యక్తిలా
తెలుగుదనపు అస్థిత్వ ప్రశ్నల కింద
బండి రా ను ముందుకు తోసేసి
భాషలేని ప్రశ్నార్థకంలా మిగిలి పోతుంటాడు
చిరిగిన చొక్కా వేసుకుని
సప్నోంకా సౌదాగర్ ఔతుంటాడు.
ఒక పుస్తకం లోకి చూడమంటూ
లోకుల కళ్ళల్లో లోకాలు చూస్తుంటాడు
కవితలమౌదాం రమ్మంటూ
ఎడారిలో కోకిలలా వసంతాల్ని మోస్తుంటాడు
ఉదయాన్నే వేడి వేడి కాఫీ లా
మధ్యాహ్నానికి మామిడి కాయ పచ్చడిలా
సాయంత్రానికి సల్ల కలిపిన రాగి సంకటిలా
రాత్రికి వక్కా సున్నం కలిపిన తాంబూలంలా
కవిత్వాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటాడు.
ఈ పూలబండి కింద రాళ్ళు నలుగుతున్నపుడు
కడుపంత ఖాళీ గా తనబండి మారిపోయినపుడు
శతృవు ప్రాణ రహస్యమేదో అంతు చిక్కినట్టు
తేట తెల్లని తెలుగులా నవ్వుతుంటాడు
ఇంకో యుద్ధం కోసం మరో రోజుకి సాగుతుంటాడు.
(ఇతడు సాధకుడు అనే పదాన్ని సాధికుడు గా మార్చివేసిన వాడు
తోపుడు బండి సాదిఖ్ గారికి ఈ కవిత అంకితం)
16/3/15
............................
అతడెంత పిచ్చి వాడంటే..
విప్లవం తీసుకొస్తానంటూ
పూవుల్ని అమ్ముకుంటాడు
వేల నాలికల్ని ఒడిలో ఉంచుకుని
ఒక్క నాలికతో కేకలేస్తుంటాడు
తెలిసిన నగర వీధుల మీదుగా
కనీ విని ఎరుగని కొత్తవ్యక్తిలా
తెలుగుదనపు అస్థిత్వ ప్రశ్నల కింద
బండి రా ను ముందుకు తోసేసి
భాషలేని ప్రశ్నార్థకంలా మిగిలి పోతుంటాడు
చిరిగిన చొక్కా వేసుకుని
సప్నోంకా సౌదాగర్ ఔతుంటాడు.
ఒక పుస్తకం లోకి చూడమంటూ
లోకుల కళ్ళల్లో లోకాలు చూస్తుంటాడు
కవితలమౌదాం రమ్మంటూ
ఎడారిలో కోకిలలా వసంతాల్ని మోస్తుంటాడు
ఉదయాన్నే వేడి వేడి కాఫీ లా
మధ్యాహ్నానికి మామిడి కాయ పచ్చడిలా
సాయంత్రానికి సల్ల కలిపిన రాగి సంకటిలా
రాత్రికి వక్కా సున్నం కలిపిన తాంబూలంలా
కవిత్వాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటాడు.
ఈ పూలబండి కింద రాళ్ళు నలుగుతున్నపుడు
కడుపంత ఖాళీ గా తనబండి మారిపోయినపుడు
శతృవు ప్రాణ రహస్యమేదో అంతు చిక్కినట్టు
తేట తెల్లని తెలుగులా నవ్వుతుంటాడు
ఇంకో యుద్ధం కోసం మరో రోజుకి సాగుతుంటాడు.
(ఇతడు సాధకుడు అనే పదాన్ని సాధికుడు గా మార్చివేసిన వాడు
తోపుడు బండి సాదిఖ్ గారికి ఈ కవిత అంకితం)
16/3/15
No comments:
Post a Comment