విరించి ll కొన్ని క్షణాలు ll
కొన్ని క్షణాలుంటాయి
శతాబ్దాల నిశ్శబ్దాల్ని తలంటు పొసుకున్నట్టుగా..
గంటల చిటికెన పుల్ల,
నిముషాల చిర్ర,
దరువేయలేక దండోరా మీద
తిత్తిరి పాటనైనా కట్టలేనట్టుగా..
పిడిపట్టు సడలిన గొడ్దళ్ళు
గడ్డపారల్ని దుంగల్లో దాచినట్టుగా..
ముని వేళ్ళ మీద మ్రోగే వేణువులు
పిల్లగాలి గొంతుల్ని తమ గొంతుల్లో నలిపేస్తున్నట్టుగా...
ఉభయసంధ్యల ఉభయాద్రుల నడుమ
పిల్లకాలువ జీవితం మట్టి పాయలై ఇంకిపొతున్నట్టుగా..
నిప్పుల వాగుల్లో పూసే నాజూకు నాల్కల్లో
వెక్కిరింతలు నిప్పుకోళ్ళై తల దాచుకున్నట్టుగా...
కానీ..
అది కవి హృదయం కదా..
క్షణాల ప్రమాణాల్లో యుగాల లోలకం కదా...
ఇలాంటి క్షణాలు బహు కొన్నే కదా...
17/1/15

No comments:
Post a Comment