Wednesday, 1 April 2015

విరించి ll గర్భగుడి  ll
.........................................
ఆ గర్భగుడిలో
ఆ రెండు కళ్ళూ తెరుచుకుని ఉన్నా
మూసుకునే కనిపిస్తాయి

మూసి వుంచిన ఆ పెదాలు
ఒక మాటైనా పలకనే లేదు

దేశమంతా తిరిగిన ఆ పాదాలు
ఒక అడుగైనా ముందుకు వేయనేలేదు

శతృ సంహారం చేసిన ఆ చేతులు
ఏ అస్త్రాన్నీ ఎక్కుపెట్టనే లేదు

బయటంతా గోలగా వుంది
అందరూ ఇది రాతి విగ్రహం మాత్రమే అంటున్నారు.

బయటంతా గొడవగా వుంది
అందరూ ఈ రాతి విగ్రహమే దేవుడంటున్నారు

బయటంతా రక్తంగా వుంది
రాళ్ళు గోడలనుండి రాలిపోతున్నాయి

విగ్రహం కదా అమాయకంగా కనిపించింది.
ప్రాణం లేనిది కదా నవ్వుతున్నట్టే అనిపించింది

నవ్వుతోంది కదా..నాలో ప్రాణం ఉందేమో అనిపించింది
దీనిలో ఏకంగా ఆత్మనే కనుగొందామనుకున్నాను
కానీ ఒకే ఒక చిన్న దీపం ఆ మూలలో వెలుగుతూ   కనిపించింది.

27/3/15

No comments:

Post a Comment